Saturday, January 26, 2013

House wife home needs ?,ఇల్లాలి హోమ్‌ నీడ్స్ అంటే ఏమిటి ? అవి ఏవి ?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఇల్లాలి హోమ్‌ నీడ్స్ అంటే ఏమిటి ? అవి ఏవి ? 

జ : వంటగది లో అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు యుద్ధభూమిలో ఆయుధాలు లేని యోధురాలు వంటిదైపోతుంది. ఆ వస్తువులనే "ఇల్లాలి  హోమ్‌ నీడ్స్ " అంటాము అని అనుకుంటాను. . అవి ->
 1. రెఫ్రిజిరేటరు , 
 2. వాషింగ్ మిషన్‌,
 3. మైక్రోవేవ్ ఒవెన్‌, 
 4. వ్యాక్యూమ్‌ క్లీనర్ , 
 5. గీజర్ , 
 6. వాటర్ ప్యూరిఫైయర్ , 
 7. జ్యూస్  - మిక్షర్ - గ్రైండర్ , 
 8. ఫుడ్ ప్రొసెసర్ , 
 9. ఓవెన్‌-టోస్టర్ -గ్రిల్లర్ , 
 10. కాఫీ మేకర్ , 
 11. డిస్ వాసర్ , 
 12. ఎయిర్ కండిషనర్ ,
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How long can we withhold breath?,మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మనుషులు ఊపిరిని ఎంత సమయము బిగబట్టగలౌ ?

జ : ఎంతో సాధన చేసినా మనిషి రెండు నిమిషాల కన్నా ఊపిరి బిగబట్టలేడు  . ప్రతిక్షణము ఊపిరిసాగితేనే మనిషి జీవిస్తాడు . సాధారణముగా 30 సెకెండ్లు ఊపిరి ఆపుకోగలం . అది దాటిందా మెదడు స్పందించడం మొదలు పెడ్తుంది. , కళ్ళు తిరిగి నట్లు అవుతాయి.  నీటమునిగి ఈత కొట్టేవారు సాధన ద్వారా కొంచం ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి ఉండగలరు .

ఊపిరి బిగపట్టడము మంచిది కాదు ... మెదడుకి రక్తం సరఫరా తగ్గి దెబ్బతింటుంది.
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 22, 2013

What are the five items of meal?-పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పంచభక్ష్య భోజనము అంటే ఏమిటి?

జ : 1.భక్ష్యము , 2.భోజ్యము ,3.చోష్యము, 4.లేహ్యము , 5.పానీయము ...ఈ 5 విధాలైన పదార్ధాలతో కూడిన భోజనమే " పంచభక్ష్యభోజనము " . అంటే 

 • 1.భక్ష్యము = నమిలి తినేది,
 • 2.భోజ్యము = చప్పరిస్తే కరిగిపోయేది,
 • 3.చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది,
 • 4.లేహ్యము = నాక్కుంటూ తినదగినది,
 • 5.పానీయము = త్రాగేది,
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, January 11, 2013

Sunrise & Sunset is reddish why?,ఉదయపు సాయంత్రపు సూర్యకాంతి ఎరుపేల?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుడు ఉదయం సాయంత్రం ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటి?

జవాబు : భూమ్మీద ఒకచోట సూర్యోదయం జరుగుతున్న సందర్భంలో మరోచోట అది మధ్యాహ్నం కావచ్చు, ఇంకో చోట అస్తమయం, వేరోచోట అర్థరాత్రి కూడా కావచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యబింబం ఎర్రగా లేదా నారింజ రంగులో కనిపించడానికి ప్రధాన కారణం భూ వాతావరణమే. చంద్రుడి మీద నిలబడి సూర్యాస్తమయం, సూర్యోదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా ఒకే విధంగా (దాదాపు తెల్లగా) కనిపిస్తుంది.ఉదయం సాయంత్రం సమయాల్లో భూ వాతావరణంలో ఎక్కువ దూరం సూర్యకాంతి ప్రసరించి మనల్ని చేరుతుంది. మధ్యాహ్నం సమయంలో తక్కువ దూరం ప్రసరిస్తుంది. దీనికి కారణం భూమి, దాని వాతావరణం, గోళాకృతి (spherical shape) లో ఉండడమే. కాంతి తరంగాలు పదార్థాలగుండా ప్రయాణించే క్రమంలో కొంత మేరకు పరిక్షేపణం (scattering)కావడం ఒక ధర్మం. ఈ పరిక్షేపణం తక్కువ తరంగ ధైర్ఘ్యం (wavelength)ఉన్న ఊదా, నీలం, ఆకుపచ్చ రంగులకు ఎక్కువగాను తరంగదైర్ఘ్యం ఎక్కువగానున్న ఎరుపు, నారింజ రంగులకు తక్కువగా ఉంటుంది. అందువల్ల సౌరకాంతి వాతావరణంలో దూసుకెళుతున్న సందర్భంలో ఎరుపు, నారింజ రంగులు తక్కువే పరిక్షేపణం చెందడం వల్ల ఎక్కువ దూరం వరకు కొంతలో కొంత చేరగలవు. కానీ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిలో మార్గమధ్యంలోనే పరిక్షేపణం బాగా చెంది మనల్ని చేరేలోగానే అంతరించిపోతాయి. ఈ ఘటన తక్కువ దూరమే ప్రయాణించే పరిస్థితి ఉన్నా మధ్యాహ్నం తటస్థపడదు. అందువల్ల అన్ని రంగులూ, వెరసి తెల్లని కాంతిగల సూర్యుణ్ని మధ్యాహ్నం పూట, కేవలం ఎరుపు, నారింజ రంగులే అధికంగా గల సూర్యకాంతిని ఉదయం, సాయంత్రం చూస్తాము.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 08, 2013

Roten egg floats on water why?,కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర: కుళ్ళిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది ?

జ : పాడైన గుడ్లు మాత్రమే కాదు , ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటి్లో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకి , కుళ్ళిపోయిన గుడ్డుకి సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణము . సాధారణముగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా వుంటుంది . ఈ కారణముగా అది నీటిలో మునుగుతుంది . కుళ్ళిపోయిన గుడ్డుకూడా అదే పరిమాణములో ఉన్నప్పటికీ దానిలో నుండి కొన్ని  బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్ళిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

ఎదైనా ఒక వస్తువు యొక్క ఘన పరిమాణము తగ్గకుండా , దాని ద్రవ్యరాశి మాత్రం  తగ్గిందీ అంటే దానర్ధము ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే . ఉదాహరణము .. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బందించామనుకుందాం . అప్పుడు  ఆ పాత్ర సాంద్రత కేవలము 5-6 కోట్ల గాలి కణాలను మాత్రమే బందించామనుకుందాం . పాత్ర అలాగే ఉన్నప్పటికీ , లోపలి గాలి తీసేస్తే .. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్ళిన గుడ్డు విషయములోనూ ఇలాగే జరుగుతుంది . కుళ్ళిన గుడ్డుసాంద్రత నీటి సాంద్రత కన్న తక్కువగా వుండటం వల్ల అది నీటిలోతేలుగుంది. . ఈ సందర్భముగా మనము మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి .ఒకవేళ కోడిగుడ్డుని చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా వుండె కారణముగా మనము నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా , పాడైనదైనా అది ఉప్పునీటిలో తేలుగుంది.

 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, January 05, 2013

Who was Joseph Pulitzer?-జోసెఫ్ పులిట్జర్ ఎవరు ?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పత్రికారంగములొ ఒకవ్యక్తి  ప్రజల్ని ఉత్తేజితులను చేసిన మహానుభావుడు " పులిట్జర్ " ఆయన గురించి తెలియజేయ ప్రార్ధం!

జ : జోసెఫ్ పులిట్జర్ అమెరికన్‌ . ఇతని తండ్రి ధాన్యము , గోధుమల వర్తకము చేసేవాడు . పులిట్జర్ హంగేరిలో జన్మించి అమెరికాలోని పత్రికా ప్రపంచం  లో ప్రత్యేక స్థానము పొందాడు . దిన , వార పత్రిక అని ప్రచురించిన ఖ్యాతి ఈయనకి దక్కింది. తన దిన పత్రికలో అవినీతి గురించి చాలా ఘాటుగా విమర్శించి అక్షరయుద్ధం చేసిన మహనీయుడు .

పత్రికల్లో కాస్తంత హాస్యము , పాఠకులలో కుతూహలమురేపే  విషయాలు , సెన్సేషనల్ న్యూస్ - ఇలా దిన పత్రికలలో కొత్త వరవడికి శ్రీకారము చుట్టిన వ్యక్తి . పులిట్జర్ పత్రికలతో మమేకమై , పత్రికా వృత్తిని విపరీతముగా ప్రేమించాడు . నోబుల్ ప్రైజ్ కి ధీటుగా పులిట్జర్ ప్రైజ్ ఏర్పాటుచేసాడు.  పత్రికా సంపాదకునికో , సాహసవంతమైన విలేఖరుకో , ఏటా పులిట్జర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. నోబుల్ పైజ్ కు ఉన్నంత ఖ్యాతి , గౌరవం , విలువ ఈ పులిట్జర్ ప్రైజ్ కీ ఉన్నది.
 • 'పులిట్జర్' పురస్కారం
అమెరికాకు చెందిన ప్రచురణ కర్త జోసెఫ్ పులిట్జర్... పులిట్జర్ బహుమతిని నెలకొల్పాడు 'పులిట్జర్' బహుమానం అనేది ఒక అమెరికా పురస్కారం. ఈ పురష్కారాన్ని వార్తాపత్రికలు మరియు ఆన్‌లైను పత్రికారచన, సాహిత్యం మరియు సంగీత స్వర రచన రంగాలలో విశేష కృషి చేసినవారికి ప్రధానం చేస్తారు. అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు.
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-