Monday, September 27, 2010

ఉన్ని దుస్తులలో ఎందుకా తేడా? , Why is that difference in woolen wearప్ర : జంతురోమాలతో చేసే ఉన్నిదుస్తులు తడిసినప్పుడు ముడుచుకుపోతుంటాఆయి . కాని అవే రోమాలు జంతువుల మీద ఉన్నప్పుడు తడిసినా ముడుచుకు పోయినట్లుగా అవవు . కారణమేమిటి ?

: గొర్రెల చర్మం లో నుండి వెలువడే తైలము ఆ రొమాల నిర్మాణము లో ఉండే భాగాలకు ఒక రకమైన జుడ్డు రూపము లో తడి అంటకుండా యేర్పాటు జరుపుతూ రోమాల మధ్య ఒక బంధాన్ని కల్పిస్తుంది .
జంతువుల రోమాలను తీసి ద్ర్స్తులుగా నేసేటప్పుడు వాటిని దువ్వే తీరువల్ల రోమాల మధ్య ఉండే కొక్కాల బంధం తెగిపోతుంది . అందువల్ల తడవగానే ముడుచుకుపోయినట్లవుతాయి . జంతు శరీరం మీద ఉన్నప్పుడు అలా జరుగదు .

 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ స్టీలు సంగతేంటి? , What is about that Steel in watches?

ప్రశ్న: ఇన్‌వార్‌ స్టీలు అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?

-కె. చంద్రమౌళి, 9వ తరగతి, చిన్నగంజాం (ప్రకాశం)

జవాబు: ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్‌ వాచీలు, బ్యాటరీ గడియారాలు వస్తున్నాయి కానీ, అంతకు ముందు స్ప్రింగ్‌లు, లోలకాలతో తయారయ్యే గడియారాలు ఉండేవి. వీటి లోపలి భాగాలను లోహాలతో తయారు చేయడం వల్ల, పరిసరాల ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల ఇవి వ్యాకోచించడమో, సంకోచించడమో జరిగేది. ఫలితంగా అవి చూపించే సమయాలు కచ్చితంగా ఉండేవి కావు. ఒకో రుతువులో ఒకోలా ఉండేవి. అలాగే దూరాన్ని కొలిచే టేపులను కూడా ఇనుము, స్టీలు లోహాలతో చేయడం వల్ల సంకోచవ్యాకోచాల కారణంగా కొలతలు మారుతుండేవి. అందువల్ల ఉష్ణోగ్రత మార్పులకు పెద్దగా ప్రభావితం కాని లోహం కోసం అన్వేషించారు. అదే ఇన్‌వార్‌ (Invar) స్టీలు. దీన్ని స్టీలు, నికెల్‌లను 64:36 నిష్పత్తిలో మిశ్రమించి తయారు చేస్తారు.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, September 25, 2010

ఆవిరి కావడంలో తేడాలేల , Differences in Evaporation Why?ప్రశ్న: గాలిలో పెట్రోలు త్వరగా ఆవిరైపోతుంది. నీరు అంత త్వరగా ఆవిరి కాదు. ఎందుకని?

-సాయి కిరణ్‌, చౌహాన్‌, శ్రీవాగ్దేవి ఉన్నత పాఠశాల, నిర్మల్‌

జవాబు: ఏదైనా ఒక ద్రవం ఆవిరయ్యే సమయం దాని అంతర్గత అణునిర్మాణం, పరిసరాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ద్రవాల్లో అణువుల మధ్య ఉండే బంధాల బలాలు, అణువుల ద్రవ్యరాశి కూడా ప్రభావం చూపిస్తాయి. అణువుల మధ్య బంధం ఎంత బలంగా ఉంటే ఆ ద్రవం అంత స్థిరంగా ఆవిరి కాకుండా ఉంటుంది. అసలు ఆవిరి కావడం అంటే అణువులు తమ మధ్య ఉండే బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా వాతావరణంలో కలవడమే. అలాగే అణువుల ద్రవ్యరాశి ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా ఆవిరవుతాయి. ఇప్పుడు నీటి విషయానికి వస్తే అణువుల మధ్య ఉండే బంధ బలం ఎక్కువ. కానీ పెట్రోలు అణువుల మధ్య బంధాలు బలహీనంగా ఉంటాయి. పెట్రోలు అణువుల భారం కన్నా, నీటి అణువుల భారం తక్కువే అయినా ఇక్కడ బంధ బలమే ప్రభావం చూపుతుంది. అలాగే పరిసరాల్లోని వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత కూడా ద్రవాలు ఆవిరయ్యే వేగాన్ని, తీరును ప్రభావితం చేస్తాయి. పెట్రోలు సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఆవిరయిపోతుంది.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మిలమిల మెరిసే మిణుగురు చేపలు కథ ఏమిటి? , Florocent Fish story What?చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!

అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా? నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా. మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పలకొచ్చని అంచనా. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.

 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, September 23, 2010

ప్లాస్టిక్‌ తయారయ్యేదెలా? , How is plastic made ?జవాబు: ప్లాస్టిక్‌ అనే మాట ప్లాస్టికో నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఈ పదానికి మూసపోయడం అని అర్థం. ప్లాస్టిక్‌ను ఆర్గానిక్‌ రసాయనిక పదార్థాల నుంచి తయారు చేస్తారు. దీన్ని తొలిసారిగా అలెగ్జాండర్‌ పార్క్స్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త తయారు చేశాడు. ఆ రోజుల్లో కొన్నాళ్లు దీన్ని ఆయన పేర 'పెర్కిసైన్‌' అని పిలిచేవారు. నూనె, కర్పూరంతో నైట్రో సెల్యులోజ్‌ను మెత్తగా చేస్తే ప్లాస్టిక్‌ తయారవుతుంది. వ్యాపార పరమైన ప్లాస్టిక్‌ను మొదట ఫినాల్‌ మరియు ఫార్మాల్డిహైడ్‌ నుంచి తయారు చేశారు. తర్వాత వివిధ రసాయనిక పదర్థాలతో తయారు చేసే పద్ధతులను కనిపెట్టారు. ఇక ప్లాస్టిక్‌ ఇప్పుడు ఎంత విరివిగా ఉపయోగపడుతోందో తెలిసిందే. విమానం తలుపులు, కటకాల దగ్గర్నుంచి ఇంట్లో వాడుకునే బకెట్ల లాంటి వస్తువులు, పాలిథీన్‌ సంచులు, టెరిలీన్‌ వస్త్రాలు లాంటి ఎన్నో పరికరాల తయారీలో ఇది ఉపయోగపడుతోంది.

ప్రశ్న: ప్లాస్టిక్‌ను ఎలా తయారు చేస్తారు?

జవాబు: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్‌ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్‌'. ప్లాస్టిక్‌ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్‌ ఆయిల్‌). ప్లాస్టిక్‌ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్‌ ఆయిల్‌'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్‌ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్‌ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్‌' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్‌ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, September 22, 2010

ఆ తెరల్లో తేడాలేంటి? , What is the differece in display of TV and Computer


 • - [T.V.jpg]ప్రశ్న: టీవీ తెరను దగ్గరగా చూడకూడదంటారు. కంప్యూటర్‌ని మాత్రం దగ్గరగానే చూస్తారు. ఈ రెండు తెరల్లో తేడాలున్నాయా?

-కె.ఎన్‌. మౌనిక, సెయింట్‌ అగస్టిన్‌ పాఠశాల, అమరావతి

జవాబు: ఈమధ్య వస్తున్న LED(Light Emitting Diode),LCD (Liquid Crystal Display) తెరల (మానిటర్ల) విషయాన్ని వదిలేస్తే, కేవలం CRT (Cathode Ray Tube) తెరల విషయంలోనే ఈ ప్రశ్న తలెత్తుతుంది.

టీవీల్లో ఉండే ఈ తెరల వైశాల్యంతో పాటు శక్తి స్థాయి కూడా కంప్యూటర్లతో పోలిస్తే ఎక్కువ. సీఆర్‌టీ తెరల వెనుక భాగమంతా ఓ గాజు బల్బులాగా ఉంటుంది. దానికి వెనుక భాగాన ఎలక్ట్రాన్లను విడుదల చేసే ఫిలమెంట్‌ (కాథోడ్‌) ఉంటుంది. రంగు మానిటర్లలో ఇలాంటివి మూడు ఉంటాయి. వీటి దగ్గర విడుదలయ్యే ఎలక్ట్రాన్లు మనకి కనిపించే తెర వెనుక భాగం మీద పడుతుంటాయి. ఆ ఎలక్ట్రాన్లు ఆ భాగంలో పూత పూసిన ఫ్లోరోసెంట్‌ పదార్థం పడడం వల్ల కాంతి వెలువడుతుంది. ఆ కాంతి వ్యత్యాసాలే తెర ఇవతలకి దృశ్యాలుగా కనిపిస్తాయి. టీవీ ఎక్కువ మంది చూడ్డానికి ఉద్దేశించినది కాబట్టి వాటిలో ఎలక్ట్రాన్లు తీవ్ర శక్తితో తెర వెనుకభాగాన్ని ఢీకొంటాయి. అప్పుడు కొంత అతినీలలోహిత కిరణాలు (ultraviolet rays) విడుదలవుతాయి. అందువల్ల దూరం నుంచి చూడ్డం మంచిది. కంప్యూటర్‌లో ఎలక్ట్రాన్లు తక్కువ వేగంతో వస్తాయి కాబట్టి ప్రమాదం ఉండదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మనిషి శ్వాసలో మర్మమేమిటి? , What is the Secrete of human respiration?ప్రశ్న: మనిషి శ్వాస ద్వారా లోపలికి తీసుకునే ఆక్సిజన్‌ ఖర్చయిపోతే, మరి నిశ్వాసంలో వదిలే కార్బన్‌డయాక్సైడులో ఆక్సిజన్‌ ఎందుకుంది? హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల సమ్మేళనమైన నీటిలో మునిగితే ఎందుకు ఊపిరి ఆగుతుంది?

-వి. శ్రీనివాసరెడ్డి, సూర్యాపేట

జవాబు: జీవన ప్రక్రియలో ఒక పదార్థాన్ని వాడుకోవడమంటే పూర్తిగా ద్రవ్యరాశి నశించడమని అనుకోకూడదు. వాటిలోని రసాయనిక శక్తిని వాడుకోవడమే. గాలిలో ఉండే ఆక్సిజన్‌ (02)కి, కార్బన్‌ డయాక్సైడు (CO2)లో ఉండే ఆక్సిజన్‌కి రసాయనికంగా తేడా ఉంది. ఈ తేడా రసాయనిక శక్తి రూపంలో ఉంటుంది. అలాగే గాలిలోని ఆక్సిజన్‌కి, నీటిలో (H2O) రూపంలో ఉండే ఆక్సిజన్‌కి చాలా తేడా ఉంది. గాలి ద్వారా మనం పీల్చుకునే ఆక్సిజన్‌తో పోషక పదార్థాలు చర్య జరిపి శక్తినిస్తాయి. నీటిలో ఉండే ఆక్సిజన్‌ ద్వారా అలా జరిగే వీలు లేదు. ఇక నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను గ్రహించే అవయవాలు లేనందున మనిషి మునిగితే చనిపోతాడు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ గోడను ఎందుకు కట్టారు? , Great Wall of China Constructed Why?

ప్రశ్న: 'గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా'ను ఎందుకు నిర్మించారు?

-కె. బద్రి, 9వ తరగతి, గుంటూరు

జవాబు: గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ప్రపంచంలోకెల్లా పొడవైన గోడ. దీని పొడవు సుమారు 8851 కిలోమీటర్లు. ఈ గోడను క్రీస్తుపూర్వం 221 సంవత్సరంలో నిర్మించడం మొదలు పెట్టారు. పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టింది. రాళ్లతో, ఇటుకలతో కట్టారు. మంగోలియన్ల దాడి నుంచి చైనాను రక్షించడానికి దీన్ని నిర్మించారు. ఒకప్పుడు చిన్నచిన్న రాష్ట్రాల రూపంలో విడివిడిగా ఉండే చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చిన చక్రవర్తి షిహూయాంగ్‌ దేశ రక్షణ కోసం ఈ గోడను నిర్మించాడు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. ఆ గోడ అనేక చోట్ల పగిలిపోవడంతో మంగోలియన్లు చైనాపై అనేక దండయాత్రలు చేశారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌ • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, September 15, 2010

కార్కును చేసేదెలా? , How did cork make?ప్రశ్న: కార్కును ఎలా తయారు చేస్తారు? దాని వల్ల ఉపయోగాలేంటి?

-కె. జయప్రకాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు

జవాబు: కార్క్‌ (cork) అనేది ఓక్‌ చెట్టు బెరడు. ఈ చెట్లు స్పెయిన్‌, పోర్చుగల్‌లో ఎక్కువగా ఉంటాయి. మనదేశం, పశ్చిమ అమెరికాలో కూడా కొద్దిగా ఉంటాయి. ఆరు నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్ల కాండం మందం ఒక మీటరు వరకూ ఉంటుంది. మెరిసే ఆకుపచ్చ రంగులో ఉండే ఈ చెట్టుకు 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మొదటి సారిగా దాని బెరడును వలుస్తారు. ఇందువల్ల చెట్టుకు ఏ హానీ జరగదు. ఈ బెరడు లోపలి వైపు భాగం నుంచే కార్క్‌ను తయారు చేస్తారు. సుమారు వందేళ్లు బతికే ఈ చెట్ల నుంచి ప్రతి తొమ్మిదేళ్లకోసారి బెరడు వలుస్తారు. కార్క్‌ను సీసాల బిరడాలు చేయడానికి, నీటిలో ఈదేవారికి లైఫ్‌ సేవర్ల తయారీకి ఉపయోగిస్తారు. అలాగే కార్క్‌ను పొడి చేసి దాన్ని జిగురుతో కలిపి పైపుల్లోని రంధ్రాలు పూడ్చడానికి, ఆటోమొబైల్‌ గాస్కెట్ల తయారీకి, సినిమా, టీవీ స్టూడియోలలోని విశాలమైన గదులను సౌండ్‌ప్రూఫ్‌గా చేయడానికి, ఫ్రీజర్‌ గదుల్లో, రెఫ్రిజిరేటర్లలో, గిడ్డంగుల్లో ఇన్సులేషన్‌ మెటీరియల్‌గా కూడా వాడతారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వాటి రంగుల్లో తేడాలేల? , Their colors are different Why?ప్రశ్న: గొంగళి పురుగు ఒక రంగులో ఉంటే, దాని గూడు నుంచి వచ్చే సీతాకోకచిలుక రెక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. కారణమేంటి?

-ఎం.మురళీధర్‌, కాకినాడ, తూ||గొ జిల్లా

జవాబు: చాలా కీటక(insect) జాతి జంతువుల్లో జీవిత చక్రం (life cycle)ఉంటుంది. కొన్ని దశల్లో వాటి రూపాల్ని మార్చుకుంటూ ఎగురుతాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇలా దేహ రూపాల్ని మార్చుకునే విధానాన్ని మెటామార్ఫసిస్‌ (metamorphosis) అంటారు. ఒక్కో కీటకం తొలిదశ రూపం (డింభకం) ఒక్కో విధంగా ఉంటుంది. అది క్రమేపీ కోశస్థ (ప్యూపా) దశగా మారి ఆ తర్వాత ప్రౌఢ (adult) జీవిగా మారుతుంది. ఇక సీతాకోక చిలుక రెక్కలపై ఎలాంటి రంగులుంటాయనే విషయం ఆయా జీవుల జన్యు నిర్మాణం(genetic code)పై ఆధారపడి ఉంటుంది.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎడారి ప్రాణుల జీవనమెలా? , How the creatures live in Desert?
ప్రశ్న: ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి?

-ఎమ్‌. కౌశల్య, 9వ తరగతి, రాజమండ్రి

జవాబు: నీరు అత్యల్పంగా దొరికే ఇసుక నేలలతో కూడిన ఎడారుల్లో జీవనం కష్టమని అనిపించినా, ఆ పరిసరాలకు అనుగుణంగా బతికే మొక్కలు, జీవులు ఉంటాయి. ఎడారుల్లో ఎక్కువగా నత్తలుంటాయి. వీటితో పాటు బల్లులు, పాములు, ఎలుకలు, తొండలు, గుడ్లగూబలు, కీటకాలు ఉంటాయి. ఇలాంటి ఎడారి జీవుల్లో చెమట, మూత్రం ఎక్కువగావెలువడని శరీర నిర్మాణం వల్ల వాటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కలైన ముళ్లపొదలు, కాక్టస్‌లాంటి మొక్కలకు ఆకులు తక్కువగా ఉండడం వల్ల వాటిలోని నీరు త్వరగా ఆవిరి కాదు. అరుదుగా వర్షాలు పడినా ఇవి ఆ నీటిని కాండాల్లో నిల్వ చేసుకోగలుగుతాయి. ఇక ఎడారి ఓడగా పేరొందిన ఒంటె అక్కడి ముళ్లపొదల్ని మేయగలదు. దీని మూపురంలో కొవ్వు పదార్థం పేరుకుని ఉండి శక్తినిస్తూ ఉంటుంది. ఒంటె ఒకేసారి 25 గ్యాలన్ల వరకూ నీరు తాగి దాన్ని శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎడారి జీవుల్లో ఎక్కువ బొరియల్లో జీవించేవి కావడం వల్ల అత్యధికమైన వేడి వాటిని బాధించదు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమిలోపల బొగ్గు ఎలా ఏర్పడుతుంది?, How does charcoal forms under grounds?
బొగ్గు నేడు మనకు ముఖ్య ఇంధనము . భూమి లోపల పరల నుండి తవ్వి బొగ్గును బయటికి తీస్తారు . ఈ బొగ్గు జీవులనుండే ఏర్పడింది . కోట్లాది సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలోకి కుంగి పోయిన వృక్షాలు తునకలై లోపలి పొరల్లోని వేడి , ఒత్తిడి కి గట్ట్పడి బొగ్గుగా మారుతాయి . దట్టమైన పొరలుగా ఏర్పడిన ఆపదార్ధలనే జాగ్రత్తగా తవ్వి బయటకు తీస్తారు . . . మన గని కార్మికులు . ఇలా బొగ్గు నిక్షిప్తమై ఉంటుంది .
 • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 12, 2010

గంటకు 60 నిముషాలే ఎందుకు? , Sixty minutes for one hour Why?నిముషానికి అరవై సెకండ్లు , అరవై నిమిషాలు కలిస్తే ఒక గంట . ఈ పద్దతిని ' సుమేరియన్‌ సంసృతి వారు ఆరంభించారు . చేతివేళ్ళ మీద ఉండే కణుపు గీతలు లెక్కపెట్టడమే వారికి చేతనయినది . ఒక చేతిలోని నాలుగు వేళ్ళ(బొటనవేనిని మినహాయించి) కణుపుల (phalanges) మొత్తము 4*3 = 12 . రెండు చేతులు కలిపితే 24 గంటలుగా , వాటిలో ఒకటి పగలు గాను ఒకటి రాత్రి గాను చేసారు .
ఇక 4 చేతివేళ్ళకణుపులను బొటనవేని సంఖ్య 5 చే గుణించగా 4*3*5 = 60 ని గంటకు నిముషాలుగాను , నిమషానికి 60 సెకనులు గాను ఊహాతీతం గా ఆదారము గా తీసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞుల నమ్మకము .
 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, September 11, 2010

దీపావళికి కాల్చే బాణసంచా వెలుగుల్లో రకరకాల రంగులెలా వస్తాయి? , Diwali crackers give colors How?

ప్రశ్న: దీపావళికి కాల్చే బాణసంచా వెలుగుల్లో రకరకాల రంగులెలా వస్తాయి?
-ఎ. రామచంద్ర, హైదరాబాద్‌
జవాబు: బాణసంచా కాల్చినప్పుడు వెలువడే రంగులకు కారణం రకరకాల రసాయన పదర్థాలే. బాణసంచాను సాధారణంగా పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌, బొగ్గు పొడి మిశ్రమంతో తయారు చేస్తారు. ఇవి చాలా వరకు ధ్వనులను ఉత్పన్నం చేస్తాయి. ఇక లోహలవణాలైన స్ట్రాంషియమ్‌, బేరియం రంగులను వెదజల్లుతాయి. ఈ లవణాలను పొటాషియం క్లోరేట్‌తో కలుపుతారు. బేరియం లవణాలు ఆకుపచ్చ రంగును, స్ట్రాంషియమ్‌ కార్బొనేట్‌ పసుపు వర్ణాన్ని, స్ట్రాంషియమ్‌ నైట్రేట్‌ ఎరుపు రంగును వెదజల్లుతాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా బాణసంచాకు ఖర్చు చేసే మొత్తం అక్షరాలా 5000 కోట్ల రూపాయలు!
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ప్రపంచంలోనే అతి పెద్ద వినాయక విగ్రహం ఎక్కడ? , Where is the biggest Ganesh Statue?

ఇళ్లల్లో, వీధుల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి కదా! మరి ఆ విగ్రహాలన్నింటిలో ప్రపంచంలోనే అతి పెద్దది ఎక్కడుందో తెలుసా! ముంబయిలోని కొల్హాపూర్‌లో. దాని పేరు 'చిన్మయా గణాధిష్‌ విగ్రహం' 66 అడుగుల ఎత్తున్న ఈ వినాయకుణ్ని 24 అడుగుల ఎత్తున్న గద్దెపై కూర్చోపెట్టారు. కాంక్రీటుతో కట్టిన దీని బరువు 800 మెట్రిక్‌ టన్నులు. దీనిని కట్టడానికి 50 మంది పనివాళ్లకి 18 నెలలు పట్టింది. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎవరు కట్టించారో తెలుసా? చిన్మయా మిషన్‌వాళ్లు. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని 2001లో కట్టించారు.
* మన రాష్ట్రానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి వినాయకుని 11,000 విగ్రహాల్ని, 14,000 చిత్రపటాల్ని, 1094 పోస్టర్లని, 157 కీచైన్‌లని, వంద ఆడియో, వీడియో కేసేట్లని సేకరించి లిమ్కాబుక్‌లోకి ఎక్కారు.

* మారిషస్‌ దేశ ప్రభుత్వం ఈ పండుగను జాతీయ సెలవుదినంగా ప్రకటించింది. అక్కడ ఎక్కువశాతం ఉండేది హిందువులే.

* పారిస్‌లో వినాయక చవితి రోజు వినాయకుని గుడి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కడుగుతారు. వినాయకుడు నడిచేందుకన్న మాట.
కొల్హాపూర్‌లోనే మరో ప్రసిద్దమైన వినాయక ఆలయం ఉంది. దాని పేరు బికాంబి గణేశ్‌ మందిర్‌. ఆ ఆలయాన్ని స్తంభాల్లేకుండా 1882లో నిర్మించారు. ఓసారి ఆ ప్రాంతంలో నుయ్యిని పూడిక తీస్తుంటే చిన్న రాతి వినాయక విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం చుట్టే ఈ గుడిని కట్టారు. ఈ ఆలయం కట్టిన తీరు ఎంతో అద్బుతంగా ఉంటుంది. అందుకే దీనిపై పరిశోధనలు చేయడానికి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి పురాతత్వ శాస్త్ర విద్యార్థులు ఇక్కడికి వస్తారు.
వీధుల్లో వినాయకుణ్ని పెట్టి పూజలు చేసే విధానం ఎవరి వల్ల మొదలైందో తెలుసా? బాలగంగాధర తిలక్‌. ఆయనే మొదట 1893లో వినాయక పటాల్ని వీధుల్లో పెట్టి పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది.

ముంబయిలోని లాల్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న వినాయకుడి గుడికి, విగ్రహానికి బీమా చేయించారు. ఎంతో తెలుసా? సుమారు రెండుకోట్ల 65 లక్షలకి ఒకటి, కోటి రూపాయలకి మరోటి. ఈ గుడికి ఏటా కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.
వినాయక విగ్రహాల్ని మట్టితో తయారుచేసినవి వాడితేనే మంచిది. కాని మనం ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారుచేసినవి వాడుతున్నాం. ఈ కృత్రిమ పదార్థం ఎంత ప్రమాదకరమైందో తెలుసా?. దీనిని జిప్సమ్‌ నుంచి ఉత్పత్తి చేసిన కాల్షియం సల్ఫేట్‌ హెమి హైడ్రేట్‌తో తయారు చేస్తారు. విగ్రహాల్ని చెరువులో కలిపేటప్పుడు ఈ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ అంత తొందరగా నీటిలో కరగదు. అంతేకాదు మెల్లగా కరిగేటప్పుడు విషపూరితమైన పదార్థాల్ని కూడా విడుదల చేస్తుంది. రంగుల్లో ఉండే రసాయనాలు పాదరసం, కాడ్మియం వంటివి నీటిలో కలిసి చేపలు, ఇతర జీవులు చనిపోతాయి. దీని వలన జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.
 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, September 07, 2010

పిడుగులతో ప్రమాదాలు ఎలా? , Thunderbolt cause dangers how?
మేఘాలు ఒరిపిడివల్ల వాటిలో విద్యుదావేశం పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల వాటిమీద విద్యుత్ పీడనం బాగా పెరిగిపోతుంది. ఇది నేలమీదకు దూకాలంటే గాలి అడ్డుగా నిలుస్తుంది. ఈ విద్యుత్ పీడనం అనేక వందల కోట్ల వోల్టులకు పెరగడంతో గాలి పరమాణువుల మీది ఎలక్ట్రానులను పీకేస్తుంది. దానితో గాలి అయాన్లు తయారై తనగుండా విద్యుత్‌ను ప్రవహించేందుకు అనుకూలతను కల్గిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి గాలి సన్నని దారిని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ దారిగుండా విద్యుత్ అనేక లక్షల ఆంపియర్ల బలం గలది ప్రవహిస్తుంది. ఫలితంగా దారిలోని ఉష్ణోగ్రత 15వేల నుండి 20వేల డిగ్రీల సెలిసియస్‌కు పెరిగిపోతుంది. దీనివల్ల మెరుపులు వస్తాయి. ఈ వేడివల్ల గాలి వ్యాకోచించి బాంబు పేలినంత చప్పుడవుతుంది. ఈ వేడికి చెట్లు కాలిపోతాయి. ఇళ్లు కూలిపోతాయి. జంతువులు ఈ విద్యుత్ ప్రవాహపు షాకుకు చచ్చిపోతాయి. దీనినే మనం పిడుగు అని పిలుస్తాం.
పిడుగు విద్యుత్ ప్రసారంలో ఒక విలక్షణమని తొలిసారిగా గ్రహించినది బెంజిమిన్ ఫ్రాంక్లిన్. పిడుగులు ఎత్తయిన కొండలు, గోపురాలు, చెట్ల మీద పడతాయని ఫ్రాంక్లిన్ చెప్పాడు. పిడుగులు ప్రతి సెకనుకు 100సార్లు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట పడుతూ ఉంటాయని సైంటిస్టుల అంచనా. పిడుగుపాటువల్ల ఒక్కొక్కసారి అడవుల్లో మంటలు బయలుదేరి కారుచిచ్చుగా మారి పూర్తిగా అడవినే దహించి వేస్తుంది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్‌లలో ప్రధాన భాగం మెరుపులనుండి ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ మీద మానవ చర్యల ప్రభావాన్ని కూడా పునఃపరిశీలించాల్సి వచ్చింది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్‌లలో 50 లక్షల టన్నులు మెరుపులవల్ల, 240 లక్షల టన్నులు ఇంధనాల దహనాలవల్ల, 80 లక్షల టన్నులు అడవులను కాల్చడంవల్ల ఏర్పడుతోందని గతంలో భావించేవారు. నిజానికి 150 లక్షల టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్‌లు మెరుపులవల్లనే ఏర్పడుతున్నాయని, ట్రోపోస్పియర్‌లో నైట్రోజన్ ఆక్సైడ్ మొత్తంలో అధిక శాతం ఇలా ఏర్పడిందేనని ఇటీవల శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది.
మెరుపు వచ్చినప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రత, పీడనాల కారణంగా గాలిలో వున్న నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు విచ్ఛిన్నమై తరువాత రెండూ కలిసి నైట్రోజన్ ఆక్సైడ్‌లుగా రూపొందుతాయి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. గ్లోబల్ వార్మింగ్‌లో ఓజోన్ వాయువు ముఖ్య పాత్ర వహిస్తుందన్న విషయం తెలిసిందే. నేలను చేరే పిడుగుల్లో విద్యుత్ 36 కిలో ఆంపియర్ల వరకు ఉండవచ్చునని మూడింట రెండొంతులు మెరుపులు ఉష్ణమండల ప్రాంతాల్లోనే సంభవిస్తాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఉత్తరార్థ గోళంలో భూభాగం అధికంగా ఉండడంవల్ల పిడుగుపాట్లు ఉత్తరార్థంలోనే ఎక్కువ. దక్షిణార్థ గోళంతో పోలిస్తే ఉత్తరార్థ గోళంలో పిడుగుపాట్లు రెండింతలు ఉంటాయి. ఉత్తరార్థ గోళంలో నైట్రోజన్ ఆక్సైడ్‌లు అధికంగా ఉండడానికి కారణం మానవ చర్యలని గతంలో భావించేవారని, నిజానికి సహజంగా ఏర్పడే పిడుగులే ప్రధాన కారణమని ఇప్పుడు శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. పిడుగుపాటు నుండి భవనాలకు, ఇతర నిర్మాణాలకు రక్షణ కల్పించేందుకు ‘కాపర్ లైట్నింగ్ కండెక్టర్’ను ఏర్పాటుచేయడం తెలిసిన విషయమే. అయితే పిడుగుపాటువల్ల ఏర్పడ్డ అపారమైన విద్యుత్ ప్రవాహం, కండక్టర్ చుట్టూ బలమైన పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల సమీపంలోని విద్యుత్ కేబుల్స్‌లో వోల్టేజ్ మార్పులు కల్గుతాయి. కంప్యూటర్ వ్యవస్థలు, టెలివిజన్స్ దెబ్బతింటాయి. అగ్నిప్రమాదాలు సూచించే అలారమ్స్ మోగుతాయి. రైల్వే సిగ్నలింగ్ దెబ్బతింటుంది. అదృష్టవశాత్తు విమానాల నిర్మాణంలో విద్యుత్ వాహకమైన అల్యూమినియం ఎక్కువగా వాడడంవల్ల లోపలి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలకు రక్షణ ఉంటుంది. అయినప్పటికీ పిడుగువల్ల ఏర్పడే విద్యుత్ ప్రవాహంవల్ల విమానాలకు రంధ్రాలు పడవచ్చు. స్కార్కులవల్ల ఇంధన ట్యాంకులు అంటుకునే ప్రమాదం ఉంటుంది. విమానాన్ని పిడుగు తాకినపుడు విమాన దేహం చుట్టూ విద్యుత్ వలయం వ్యాపిస్తుంది. దీనివల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం తాత్కాలికంగానైనా విమానం పొడవునా వున్న కేబుల్సులో వోల్టేజ్ మార్పులు కల్గిస్తుంది. ఈ ప్రమాదాలనుండి రక్షణ పొందేందుకు శాస్తవ్రేత్తలు ఇప్పుడు ‘లైట్నింగ్ స్ట్రైక్ స్టిమ్యులేటర్’ను రూపొందించారు.

- సి.వి.సర్వేశ్వర శర్మ
 • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, September 05, 2010

గబ్బిలాలు చీకట్లో చూడగలవా?, Bats can fly in nights how?
ప్రశ్న: గబ్బిలాలు రాత్రి పూటనే ఎందుకు సంచరిస్తాయి? పగలు కన్నా రాత్రి బాగా కనిపిస్తుందా?

-బి. వరలక్ష్మీదేవి, బోదెమ్మనూరు (కర్నూలు)

జవాబు: పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు. అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు.

గబ్బిలాలు నోటితో అతిధ్వనులను (ultrasonic sounds) చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి. ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర (nocturnal) జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS

Saturday, September 04, 2010

కాలమానము- ఎలా తెలుసు కుంటాము ? , Telugu Calendar Calculation - how?

తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది తెలుసుకుందాం

ఉగాది అనగా సంవత్సరాది అనగా కొత్త సంవత్సర ప్రారంభం. మనము ప్రస్తుతము ఈ ఉగాది పండుగను చైత్ర మాస శుద్ధ పాఢ్యమి నాడు వేడుకగా జరుపుకుంటున్నాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి అనేది ఎట్లా వచ్చినది అని తెలుసుకొనుటకు చాల పూర్వ చరిత్ర కలదు. ఆ చరిత్రకు మూలము - ఆది మానవుడు. ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మొదలుగునవి.

ఆది మానవుడు తన జీవితగమనములో కొంత సమయము వెలుగుతోను కొంత సమయము చీకటిలోను వుండుటను, అదే పరిస్ధితి మరల మరల జరుగుటును గమనించెను. వెలుగులో ఆకసము నందు తీక్షణమైన కాంతితో ఒక పెద్ద బింబమును, చీకటి సమయంలో ఆకసము నందు ఏవో మిళుకు మిళుకు మనునవి అనేకములు, తెల్లని కాంతితో ఒక బింబము కొన్ని సమయములలో పెరుగుతూనూ, ఇదే విషయము మరల మరల జరుగుటను గమనించెను.

ఈ విధమైన గమనములో కొంత బుద్ధి వికాసము కలిగి మానవుడు వెలుగు సమయమును పగలు అని, చీకటి సమయమును రాత్రి అని, పగలు కనపడిన బింబమును సూర్యుడు అని, రాత్రి బింబమును చంద్రుడు అని, మిళుకు మిళుకు మను వాటిని నక్షత్రములని గుర్తించాడు.

ఈ గుర్తింపుతో కాలమును లెక్క కట్టుట అనేదాన్ని నేర్చాడు. ఆ విధంగా

1. ఒక పగలు.. ఒక రాత్రి కలిసి ఒక రోజు అని...
2. చంద్రుని కాంతి తరుగుదల 15 రోజులని , పెరుగుదల మరో 15 రోజులని మొత్తంగా 30 రోజులు ఈ విధంగా జరిగి మరల యిదే జరుగుతున్నదని... కావున ఈ 30 రోజుల సమయానికి నెల లేక మాసము అని పేరు పెట్టెను.

ఆ తరువాత పరిశీలనలో 12 మాసములు. చంద్రునికి దగ్గరగా ఉండే ప్రధాన నక్షత్రాలను, చంద్రుడు ఆ నక్షత్రములను సమీపించుటతో ప్రకృతి లో కలుగుతున్న మార్పులను పరిశీలించెను మానవుడు. అట్టి నక్షత్ర మండలమునకు పేర్లు పెట్ఠి, ఆ మండలములో చంద్రుడు ప్రవేశించినపుడు ఆయా నెలలకు ఆయా నక్షత్రముల పేర్లతో వచ్చు పేర్లను పెట్టారు. అదెట్లన పూర్ణ చంద్రుడు ఉన్న నక్షత్రం పేరుతో అనగా పూర్ణ చంద్రుడు చిత్త నక్షత్రముతో వున్నపుడు చైత్ర మాసమని, ఆ విధంగా...

1. చిత్త తో వున్న........చైత్రమాసము
2. విశాఖ తో వున్న........వైశాఖ మాసము
3. జ్యేష్ట తో వున్న........జ్యేష్ట మాసము
4. పూర్వాషాడ లేక ఉత్తరాషాడ........ఆషాడ మాసము
5. శ్రవణం తో వున్న........శ్రావణ మాసము
6. పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర తో వున్న........భాద్ర పద మాసము
7. అశ్వని తో వున్న........ఆశ్వయుజ మాసము
8. కృత్తిక తో వున్న........కార్తీక మాసము
9. మృగశిర తో వున్న........మార్గశిర మాసము
10. పుష్యమి తో వున్న........పుష్యమాసము
11. మఘ తో వున్న........మాఘ మాసము
12. పూర్వఫల్గుణి లేక ఉత్తర ఫల్గుణి తో వున్న........ఫాల్గుణ మాసము.

ఈ 12 మాసములు పేర్లు వచ్చాయి. అట్లాగే చంద్రుని తరుగుదల, పెరుగుదల రోజులకు కూడా వరుసగా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ (వృద్ధి చంద్రుడు) / అమావాస్య ( క్షీణ చంద్రుడు) అని పేర్లు పెట్టారు. వీటినే తిధులు అంటారు. ఈ 15 తిధులు కలసి ఒక పక్షము అవుతుంది.

* 1. వృద్ధి చంద్రుడు........శుక్ల/శుద్ధ పక్షము
* 2. క్షీణ చంద్రుడు........కృష్ణ / బహుళ పక్షము (కృష్ణ శబ్దమునకు నల్లనిది అని అర్ధం).

ప్రకృతి లోని ఎండలు, వానలు, చలిగాలులు మొదలగు మార్పులను గమనించి ప్రతి రెండు నెలలకు ఒక మార్పు జరుగుతూండటాన్ని చూచి, ఆ మార్పులకు అణుగుణంగా 12 నెలలకు 6 ఋతువులను ఏర్పరచి, వాటికి పేర్లు పెట్టాడు. ఆ ఆరు ఋతువులు వసంత, గ్రీష్మ ,వర్ష, శరద్,హేమంత , శిశిర ఋతువులు.

ఈ ఆరు ఋతువులకాలమును ఒక సంవత్సరముగా పిలుచుకోటం మొదలు పెట్టాడు. వసంత ఋతువు నుండి శిశిర ఋతువు అయి పోయి మరల వసంత ఋతువు ప్రారంభం కాగానే క్రొత్త సంవత్సరము ప్రారంభమైనట్లు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి - క్రొత్త సంవత్సరం ఆరంభం. దాన్నే ఉగాది అని జరుపుకుంటాము.


 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

సా ఫిష్‌ సంగతేమిటి ? , What about sawfish?రంపం లాంటి ముక్కు... అటూ ఇటూ పదునైన పళ్లు... 23 అడుగుల పొడవు... ఇదొక చేప! పేరు సా ఫిష్‌!

చెక్కల్ని కోసే రంపం తెలుసుగా? పదునైన పళ్లతో కసాకసా కోసేస్తుంది. అచ్చం అలాంటి ముక్కుతో ఉండే చేపే 'సా ఫిష్‌' (saw fish). రంపానికి ఒకవైపే పళ్లుంటే, దీని ముక్కుకి మాత్రం రెండు వైపులా పదునే. అటూ ఇటూ కలిసి దాదాపు 35 కొనదేలిన పళ్లు ఉంటాయి. ఎంత పదునైన ముక్కుంటేనేం? పాపం... ఇవి ఇప్పుడు ప్రమాద పరిస్థితిలో పడ్డాయి. త్వరలో అంతరించిపోయే జీవుల జాబితాలో చేరాయి. అందుకే ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వీటిని పరిరక్షించే చర్యలు చేపట్టారు.

ఇంతకీ దీనికెందుకింత ముక్కు? ఇది దానికెంతో ఉపయోగపడుతుంది. ముక్కుపై చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలుంటాయి. అవి విద్యుత్‌ తరంగాల ఆధారంగా చిన్న శబ్దాల్ని కూడా గ్రహిస్తాయి. సముద్రపు అడుగున ఇసుకలో దాక్కుని ఉన్న ప్రాణి గుండె కొట్టుకునే శబ్దాన్ని కూడా ఇది పసిగట్టేస్తుంది. దీని కంటిచూపు అంతంత మాత్రమే. అంటే ముక్కే దానికి దారి చూపిస్తుందన్న మాట. దాక్కుని ఉన్న ఆహారాన్ని ముక్కుతోనే తవ్వి తింటుంది. ఏ శత్రుజీవో దాడికి దిగితే ముక్కుతోనే పోరాడుతుంది.

వీటిల్లో 7 రకాల జాతులున్నాయి. అన్నింటి కంటే చిన్నది సుమారు 5 అడుగులు పెరిగితే పెద్దవి 23 అడుగుల పొడవు వరకు ఉంటాయి. సుమారు 2వేల కిలోల బరువు తూగుతాయివి. ఓ ఆంగ్ల రచయిత 1927లో 31 అడుగుల పొడవున్న సా ఫిష్‌ని చూసినట్లు ఒక పుస్తకంలో రాశాడు. అట్లాంటిక్‌, ఇండో-పసిఫిక్‌ సముద్రాలలో కనిపించే ఇవి పగలంతా నీటి అడుగున రాళ్ల మధ్య పడుకుని రాత్రుళ్లు వేటకి బయల్దేరతాయి.

సుమారు 30 ఏళ్ల పాటు బతికే వీటిని అధికంగా వేటాడేయడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతోంది. రంపం ముక్కు, మొప్పలు, ఊపిరితిత్తుల కోసం దీన్ని వేటాడుతున్నారు. వీటి మొప్పల్ని చాలా ఖరీదైన ఆహారంగా తింటారు. ఊపిరితిత్తుల నుంచి తీసే నూనెను మందుల తయారీలో వాడతారు. కొందరైతే వీటి ముక్కుల్ని కోసేసి మళ్లీ సముద్రంలో వదిలేస్తారు.


 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పిల్లి ఎక్కువగా నాలుకనే ఎందుకు వాడుతుంది ?, Cat uses its tongue frequenty why ?పిల్లి తన శరీరాన్ని ముఖ్యం గా కాళ్ళను నాలుకతో నాకుతూ కనిపిస్తుంది . అది దాని శరీర శుభ్రతకు , శుచికి , ఆరోగ్యానికి సంబంధించిన విషయము . తిన్న ఆహారము తాలుకు అవశేషాలను నోటిదగ్గర వుండన్వ్వదు . అలా నిలిచి వుంటే నాటిమీద సూక్ష్మజీవులు చేరి అనారోగ్యము రావచ్చు . . . అందువల్ల పిల్లి పెదవులను , మీసాలను నాకి శుభ్రం చేసుకుంటుంది . ఉష్ణోగ్రత అధికం గా ఉన్నప్పుడు శరీర భాగాలను నాకి చల్లపరచుకోవడం కుడా ఈ ప్రయత్నం లో భాగమే .


 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS

Friday, September 03, 2010

బాల్‌పెన్‌ కక్కనేల? , Ball pen emits ink why?ప్రశ్న: ప్రయాణంలో ఉన్నప్పుడు బాల్‌పాయింట్‌ పెన్నులు ఇంకును కక్కుతాయి. ఎందుకు?
-సాయి ప్రీతమ్‌, హైదరాబాద్‌
జవాబు: ప్రయాణం చేసే ప్రతి సారీ కాకపోయినా సాధారణంగా వేసవిలో ఈ సమస్య కనిపిస్తుంది. వేసవిలో బయటకు వెళ్లినప్పుడు పరిసరాల్లోని వేడిమికి పెన్ను గురవుతుంది. పెన్ను పైభాగం, రీఫిల్‌ మొదలైనవి ఘనపదార్థాలైనా, ఇంక్‌ మాత్రం ద్రవ పదార్థమని తెలిసిందే. ఉష్ణోగ్రతకు గురయినప్పుడు ఘనపదార్థాల కన్నా, ద్రవ పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. కాబట్టి పెన్ను పైభాగాల కంటే రీఫిల్‌లో ఉండే ఇంకు ఎక్కువగా వ్యాకోచిస్తుంది. వ్యాకోచించిన ద్రవానికి సరిపడ స్థలం రీఫిల్‌లో లేకపోతే అది సన్నని సందుల ద్వారా బయటకి వస్తుంది. పలుచని సిరాతో పనిచేసే ఫౌంటెన్‌ పెన్నులు కూడా ఇలాగే కక్కుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కనురెప్పలార్పడమేల? , Eye lids blinks frequently- why?
ప్రశ్న: కనురెప్పలను తరచు ఆర్పడం మూలంగా ఉపయోగమేంటి?
-ఆరెస్సార్‌ మీనాశ్రీ, విజయవాడ
జవాబు: కంటి రెప్పలను ఆర్పడమనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. సున్నితమైనది. రెప్పలు తరచు ఆర్పడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిముల నుంచి కంటికి రక్షణ కలుగుతుంది. కంటి రెప్ప పడినప్పుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటి లోపల ఉండే చిన్న గ్రంథుల్లో నుంచి స్రవించే ఈ నీటినే మనం కన్నీరు అంటాం. ఈ నీటితెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. కంటి మీదకు పడే సూక్ష్మమైన అవాంఛిత కణాలను కంటి కలికిలోకి చేరే విధంగా కంటి కదలికలు తోడ్పడుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, September 02, 2010

కరంటు తీగలు ఎందుకు వదులుగా ఉంటాయి ? ,Electric line wires are loosely tied why?రెండు కరంటు స్థంభాల మధ్య ఉండే వైర్లు వదులుగా ఉండి కాస్త కిందికి వేళ్ళాడుతుంటాయి . వాట్నిని గట్టిగా బిగించి కట్టరు . కారణము ఏమిటి ?
కరంటు తీగలు లోహము తో తయారు చేయబడతాయి . ఇనుము లేదా అల్యూమునియం తో తయారైన ఆ తీగలు ఎండ వేడి్మికి వ్యాకోచించి , చలికి అంకోచిస్తాయి . తక్కువ ఉష్ణోగ్రత సమయం (కాలము) లో సంకోచించినా స్థంభాలు లాగినట్లు అవకుండా ఉండేందుకు ఈ వదులు సరిపోతుంది . అందుకని వాటిని అలా వదులుగా వేళ్ళాడే విధంగా ఏర్పాటు చేస్తారు .

 • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.