Sunday, September 28, 2014

అసలు కళ్లకు సైట్‌(చత్వారం)ఎందుకు వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొందరు సైట్‌ (చత్వారం) ఉందని కళ్లద్దాలు పెట్టుకుంటారు. అసలు కళ్లకు సైట్‌ ఎందుకు వస్తుంది?

జవాబు: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకు కలిగే సర్వ పరిజ్ఞానానికి ప్రధాన అవయవాలు కళ్లు. కన్ను సంక్లిష్టమైన నిర్మాణం. అందులో భాగాలు ప్రధానమైనవి. ఒకటి కంటిపాప (pupil). ఇందులో నుంచే కాంతి కంటి లోపలికి చేరుకుంటుంది. రెండోది కంటి కటకం (eye lens). ఇది పారదర్శక కండర నిర్మాణం. కంటిపాప నుంచి లోనికి వచ్చే కాంతిని సంపుటీకరించే శంఖాకార కటక లక్షణం దానికి ఉంది. ఇక మూడోది నేత్ర పటలం. లేదా రెటీనా. మనం చూసే వస్తువుల నిజమైన బింబాలు (true images) ఈ తెరలాంటి నిర్మాణం మీద తలకిందులుగా పడేలా కంటి కటకం కాంతిని కేంద్రీకరిస్తుంది. కంటికి సైటు కంటిపాపలో సమస్యల వల్ల రావడం చాలా అరుదు. సాధారణంగా కంటికి సైటు కంటి కటకపు వ్యాకోక సంచోచాలు సక్రమంగా లేనపుడు వస్తుంది. లేదా ఆ కటక పారదర్శకత లోపించడం వల్ల వస్తుంది. ఈ పరిస్థితిని తెల్లగుడ్డు (cateract)అంటారు. రెటీనాలో కాంతిని గ్రహించే జ్ఞాన కణాలు ఉంటాయి. సూర్యుడి కాంతిని, ఇతర ప్రకాశవంతమైన కాంతిని ఎక్కువ సేపు చూడ్డం వల్ల గానీ ఎ విటమిన్‌ లోపం వల్ల గానీ రెటినా పొర సరిగా పనిచేయకపోతే సైటు శాశ్వతంగా వస్తుంది. దీనికి చికిత్స దాదాపు కష్టం. కానీ కటకపు సంకోచవ్యాకోచాలు సరిగాలేనపుడు వస్తువుల బొమ్మ రెటీనా కన్నా ముందే (హ్రస్వదృష్టి) లేదా అవతలో (దూరదృష్టి) పడుతుంది. కళ్లద్దాలు వాడి ఈ సమస్య నుంచి బయటపడతారు. తెల్లగుడ్డు సమస్యవస్తే ఆపరేషన్‌ చేసి నయం చేయగలరు. కంటికలక వచ్చినపుడు కూడా దృష్టి మాంద్యం కలుగుతుంది.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================

సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

జవాబు: మామూలుగా సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ అత్యంత దూరాలు పయనిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే 'అమెరికన్‌ మోనార్క్‌' బటర్‌ఫ్త్లెలు ఉత్తర అమెరికా నుంచి శరత్‌కాలంలో (autumn)లో బయలు దేరి మెక్సికోను చేరుకొని అక్కడ శీతాకాలమంతా జీవనం సాగిస్తాయి. ఈ కీటకాలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో పయనిస్తాయి. ఇవి రోజుకు సరాసరి 70 కిలోమీటర్ల దూరం పయనించగలవు. గాలివాటం అవి పయనించే దిశకు అనుకూలంగా ఉంటే రోజుకు 300 కిలోమీటర్ల దూరం కూడా పయనించగలవు. అవి తమ ప్రయాణంలో ఆకాశంలో ఉండే సూర్యుడు ఉండే స్థానాన్ని మార్గ నిర్దేశకంగా ఉపయోగించుకుంటాయి. శీతాకాలం చివరలో అవి మరలా తమ స్వస్థలాలకు బయలుదేరక ముందే గుడ్లనుపెట్టి, వాటిలోని ఆడకీటకాలు చాలామటుకు, మగకీటకాల్లో కొన్ని మరణించడంతో, మిగిలిన సీతాకోకచిలుకలు వాటి సంతతితో తమ స్వస్థలాలకు చేరుకొంటాయి.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌ 
  • ========================

టెలిస్కోపు విశ్వంలోని సుదూరాలను ఎలా చూపగలుగుతుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టెలిస్కోపు విశ్వంలోని సుదూరాలను ఎలా చూపగలుగుతుంది?

జవాబు: గెలీలియో మొట్టమొదట టెలిస్కోపు (దూరదర్శిని)ని నిర్మించిన సంగతి తెలిసిందే. అదే కాలంలో జీవించిన ఐజాక్‌ న్యూటన్‌ కూడా మరో విధమైన టెలిస్కోపును రూపొందించారు. ఇప్పుడు మనం వాడే కెమెరాలలోనూ, నక్షత్రశాలలో, బైనాక్యులార్స్‌లలో టెలిస్కోపు సూత్రాలు ఉంటాయి. సాధారణ గెలీలియో టెలిస్కోపు, లేదా సాధారణ న్యూటన్‌ టెలిస్కోపులలో విధిగా రెండు దృక్సాధనాలు ఉంటాయి. అయితే గెలీలియో టెలిస్కోపులలో ఉన్నవి రెండూ కుంభాకార కటకాలు కానీ న్యూటన్‌ టెలిస్కోపులో ఒకటి కుంభాకార కటకం కాగా రెండోది పుటాకార దర్పణం.

గెలీలియో టెలిస్కోపులో వస్తువు వైపు ఉన్న కటకానికి ఎక్కువ నాభ్యంతరం (focal length), కంటివైపు ఉన్న కటకానికి తక్కువ నాభ్యంతరం ఉంటుంది. సుదూరంలో ఉన్న వస్తువు నుంచి వెలువడిన కాంతి వస్తు కటకం (object lense) ద్వారా వక్రీభవనం చెంది కంటి కటకపు నాభ్యంతరం లోపల కేంద్రీకరణ అవుతుంది. కంటి కటకం భూతద్దంలాగా పనిచేయడం వల్ల ఆ వస్తువును మనం స్పష్టంగా చూడగలం. సాధారణ కెమెరాలు, సెల్‌ఫోన్‌ కెమెరాల్లో ఉన్న సూత్రం ప్రధానంగా ఇదే. న్యూటన్‌ దూరదర్శినిలో దూరపు వస్తువు కాంతి వెళ్లి టెలిస్కోపులో ఓ చివర ఉన్న పుటాకార దర్పణం మీద పరావర్తనం చెంది ఏటవాలుగా ఉన్న మరో సమతల దర్పణం మీద మళ్లీ పరావర్తనం చెంది కంటి కటకపు నాభ్యంతరం లోపల కేంద్రీకృతమవుతుంది. నేటి ఆధునిక టెలిస్కోపులలో కటకాల బదులు రేడియో తరంగాలని, ఎక్స్‌ కిరణాలని కూడా చూడగల యాంటీనాలు కాంతి సాధనాల వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర రాశుల్ని కూడా మనం చూడగలుగుతున్నాం.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

వజ్యానికి ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : వజ్రము బొగ్గు(కార్బన్‌) నుండి పుట్టినదని అంటారు మరి ఆ వజ్రానికి  ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి?

జ : అనేక లక్షల సంవత్సరాల క్రితము భూమి చల్లబడినపుడు శిలాద్రవము భూమిలోపలి పొరల్లో వుండిపోయింది అని ... కాలక్రమములో ఉష్ణోగ్రత , ఒత్తిడుల ప్రభావాన కార్బన్‌ పార్టికిల్స్ ఒకదానికొకటి చేరి స్పష్టమైన స్పటికల్లా ఏర్పడి ఉండవచ్చుననని అంటారు . అవే స్పచ్చమైన కార్బన్‌ స్పటికలు . సాధారణ స్థితిలో వాటికి మెరుపులు ఉండవు . దొరికిన వజ్రాన్ని రెండుగా కోసి ... వచ్చిన రండుముక్కలను రెండు గుండ్రని రూపములోకి తెస్తారు. ఆ తర్వాత వజ్రాన్ని సానపడతారు. అలా సానబట్టగా వచ్చినటువంటి వజ్రముఖ కోణాలనుండి కాంతి మిగిలిన పదార్ధాలకన్నా మెరుగా వెలుపలికి పంపుతుంది.. . . కాబట్టి వజ్రము మెరుస్తుంది. 
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, September 22, 2014

కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది.చెట్ల నీడల్లో ఆ తేడాలెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది ఎందుకు?

జవాబు: దాదాపు అన్ని చెట్ల కింద నీడ ఉన్నట్లయితే వేసవి కాలంలో మనకు చల్లని అనుభూతి కలుగుతుంది. చెట్ల ఆకుల పరిమాణాన్ని బట్టి, శాఖల గుబురును బట్టి, దట్టమైన నీడ లేదా పలుచని నీడలు ఏర్పడతాయి. వేర్వేరు చెట్ల కింద వేర్వేరు స్థాయుల్లో చల్లదనాన్ని పొందడాన్ని నీడ తీవ్రతే కాకుండా ఆ చెట్ల ఆకులు మన తల మీద ఎంత ఎత్తులో ఉన్నాయన్న అంశం, ఆ చెట్లకు అందిన నీటి పరిమాణం కూడా ప్రభావితం చేస్తాయి. ఆకుల మధ్యలో, శాఖల మధ్యలో సందులు బాగా ఉన్నట్లయితే నీడ తీవ్రత తగ్గి చల్లదనం తక్కువగా ఉన్నట్లు భావిస్తాం. తలపై చెట్ల ఆకులు చాలా ఎత్తులో ఉన్నట్లయితే, నీడ బాగానే ఉన్నా చుట్టు పక్కల ఉన్న వేడిగాలి మనల్ని పదేపదే తాకుతూ ఉండటం వల్ల మనకు చల్లదనం భావన తక్కువగా కలుగుతుంది. ఒకవేళ చెట్ల ఎత్తు తక్కువగా ఉంటే చల్లదనం భావన బాగా ఉంటుంది. ఇక చివరగా ఆ చెట్లకు అందే నీటి పరిమాణం ఏవిధంగా చల్లదనాన్ని నిర్ణయిస్తుందో గమనిద్దాం.

వేసవిలో ప్రతి చెట్టు నీటిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల వాటి ఆకుల్లో సాధారణంగా జరిగే బాష్పోత్సేక ప్రక్రియ (transpiration)తగ్గిపోతుంది. తద్వారా వాటి కింద ఉన్న గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది. కానీ నీటి అవకాశం బాగా ఉన్నట్లయితే ఆ విధమైన ఆకుల్లో బాష్పోత్సేకం బాగా జరగడం వల్ల వాటి ఆకుల, శాఖల ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. వాటి మీదుగా వీస్తున్న గాలి కూడా చల్లగా ఉండి మనకు హాయిగా అనిపిస్తుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,--శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల మధ్య తేడా ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల మధ్య తేడా ఏమిటి?

జవాబు: నక్షత్రాలు వాటంతటవే వాటి వాయు అంతర్భాగాల్లో అత్యంత ఉష్ణోగ్రత గల శక్తిని ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల అవి స్వయంగా వెలుగును వెదజల్లుతాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కానీ, భూమికి దగ్గరగా ఉండటం వల్ల అతి పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన సూర్యుడికి తప్ప మరే ఇతర నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు నిర్ధరణ కాలేదు. ఇటీవలే సూర్యుని చుట్టే కాకుండా మనకు దగ్గరగా ఉండే సుమారు 100 నక్షత్రాల చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

గ్రహాలు స్వయంగా కాంతిని ప్రసరింపచేయలేవు. అవి తాము పరిభ్రమిస్తున్న నక్షత్రాల వెలుగును మాత్రమే పరావర్తనం చెందించగలవు. మనం సూర్య కుటుంబంలోని గ్రహాలను మాత్రమే చూడగలగడానికి కారణం అవి సూర్యుని నుంచి వెలువడే కాంతిని మాత్రమే పరావర్తనం చెందించడం. అందువల్ల ఆకాశంలోని ఒక గ్రహం ప్రకాశం దాని పరిమాణాన్ని బట్టి కాకుండా అది సూర్యునికి ఏ దిశలో ఉందో, ఎంత దూరంలో ఉందో, అది సూర్యకాంతిని ఎంత ప్రతిభావంతంగా పరావర్తనం చెందిస్తుందో అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

చివరగా ఉపగ్రహాలు (చందమామలు) నక్షత్రాల చుట్టూ కాకుండా, గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. మన భూమి చుట్టూ ఒక చందమామ తిరుగుతుంటే, మిగతా గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య అంతకన్నా ఎక్కువే. మన సూర్యకుటుంబంలోని దాదాపు 140 ఉపగ్రహాలలో కొన్ని గ్రహాల కన్నా పెద్దవి. ఉదాహరణకు గురుగ్రహం చుట్టూ తిరిగే అతి పెద్ద ఉపగ్రహం 'గానిమేడ్‌' వ్యాసం 5262 కిలోమీటర్లు. అంటే, ఆ ఉపగ్రహం పరిమాణం 4880 కిలోమీటర్ల వ్యాసం ఉండే బుధగ్రహం కన్నా ఎక్కువన్నమాట.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఎడారిలో ఒయాసిస్ లోకి నీరెలా చేరుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : ఎడారిలో ఒయాసిస్ లోకి నీరెలా చేరుతుంది?.

జ : వర్షమే పడని ఎడారిలో ఒకచోట ఒయాసిస్సు ఉండి మనుషులను , ఒంటెలను ఆదుకోవడము ఆశ్చర్యమే.  ఒయాసిస్సు లోని నీరు అక్కడిది కాదు . ఎక్కడో కురిసిన వర్షపు నీరు భూమిలోనికి ఇంకడము జరిగి ఒకచోట ఆగిపోయి భూమికి సమాంతరముగా ప్రవహిస్తుంది. అలా ఖాళీలను బట్టి భూమి లోపల నీరు చేసే ప్రవాహము వందల  కి.మీ.లు ఉండవచ్చును.అలా ప్రవహించే నీరు ఏదో ఒక ప్రదేశములో అక్కడి భూమి పొర ఎగుడు- దిగుళ్ళను బట్టి పైకి తన్నుకు వచ్చే అవకాశము ఉంటుంది. . . అలా పైకి వచ్చి ఎడారిలో ఏర్పడిన నీటి ప్రదేశమే   ఒయాసిస్సు  గా పిలువబడుతున్నది.

  • ========================

visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

జవాబు: నిల్చున్న వ్యక్తి ముందుకు కదలాలంటే అతని ఒక కాలును వంచి గట్టిగా నేలను కొంత బలంతో తన్నాలి. అలా కాలితో నేలపై బలాన్ని ప్రయోగించడాన్ని చర్య అంటారు. న్యూటన్‌ మూడో గమన సూత్రం ప్రకారం ప్రతీ చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. ఆ సూత్ర ప్రకారం వ్యక్తి తన కాలితో నేలపై ఎంత బలం ప్రయోగిస్తాడో, అంతే బలాన్ని నేల అతని కాలిపై ప్రయోగిస్తుంది. ఈ ప్రతి చర్య వల్ల ఆ వ్యక్తి ముందుకు కదులుతాడు.

ఇసుక నేలలో ఇసుక పొరలుపొరలుగా ఉంటుంది. దీనిపై నడుస్తున్న వ్యక్తి తన పాదంతో కలిగించే బలం ముందుగా ఇసుకలో పైనున్న పొరపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పొర ఆ బలాన్ని తన కింద పొరపై చూపిస్తుంది. ఆ విధంగా వ్యక్తి ప్రయోగించే బలం ఇసుకలో ఉన్న అట్టడుగున ఉన్న పొరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ బలంతో కొంత బలాన్ని ఇసుక పొరలు శోషించుకుంటాయి. అందువల్ల ఇసుకపై వ్యక్తి పాదం కలిగించే బలం కన్నా ప్రతి చర్యగా ఇసుక పొరలు అతడి పాదంపై కలిగించే బలం తక్కువగా ఉంటుంది. పైగా ఆలస్యం కూడా జరుగుతుంది. అదే గట్టిగా ఉండే నేలపై కాలితో చర్య కలిగించిన తక్షణమే దానికి సమానమైన ప్రతిచర్య కాలిపై కలుగుతుంది. ఆ విధంగా ఇసుకపై నడక అంత సులభంగా సాగదు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

నీళ్లలోని వస్తువుల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది.ఎందువల్ల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నీళ్లలోని వస్తువుల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది.ఎందువల్ల?

జవాబు : తాను నీళ్లలో మునిగినపుడు తన బరువు తగ్గినట్లనిపించడాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దపు గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ ఓ సూత్రాన్ని కనిపెట్టాడనే విషయం తెలిసిందే. ఏదైనా ఓ వస్తువు ఓ ద్రవంలో మునిగిందంటే అర్థం ఆ వస్తువుకున్న ఘనపరిమాణం మేరకు ఆ ద్రవ భాగాన్ని పైకి నెట్టి ఆ ద్రవంలో అది ఆక్రమించి నట్టేకదా! ఆ వస్తువు ఆ ద్రవంలో కరగకుండా కేవలం మునిగే ఉందంటే అర్థం ఏమిటంటే ఆ ద్రవానికి ఆ వస్తువును తనలో ఉంచుకోవడం అభిమతం కాదని, తనలోకి భూమ్యాకర్షణ ద్వారా చొచ్చుకుని వస్తున్న వస్తువును తన శక్తిమేరకు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేక దిశలో ఆ వస్తువును నెట్టివేసి తాను కోల్పోయిన తన ద్రవ భాగాన్ని తనలో నింపుకొవడానికి ప్రయత్నం చేస్తుంది.

ఈ బలాన్నే బయాన్సీ అంటాం. దీని పరిమాణం వస్తువు ఘన పరిమాణానికి సరిపడినంత ఘన పరిమాణం గల ఆ ద్రవపు బరువు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. వస్తువు మీద భూమ్యాకర్షణ వల్ల కలిగే బలాన్నే బరువు అంటాం. ఇది భూమి వైపు ఉంటుంది. బయాన్సీ భూమికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే వస్తువు బరువు బయాన్సీ మేరకు తగ్గిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఓ వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు ఘనపరిమాణం ఎంత ఉందో అంతే ఘనపరిమాణం గల ద్రవపు బరువు మేరకు బయాన్సీ ద్వారా తన బరువును కోల్పోతుంది. దీనినే 'ఆర్కిమెడిస్‌' సూత్రం అంటారు. ఆర్కిమెడిస్‌ సూత్రం నిత్య జీవితంలో మనకు చాలాసార్లు అవగతానికి వస్తుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, September 20, 2014

పక్షులు ఆహారాన్ని ఎలా పసిగడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పక్షులు ఆహారాన్ని ఎలా పసిగడతాయి?

జ : ఆకాశము లో ఎంతోఎత్తున ఎగురుతున్న గద్ద ... కింద ఎక్కడో కదులుతున్న ఎలుక , పాము లను పసిగట్టి ఒక్కసారిగా దిగివచ్చి పట్టుకుంటాయి. రాబందులు కూడా ఆకాశము నుండే ఎక్కడో  ఉన్న కళేబరాలను గుర్తిస్తాయి.

పక్షులది తీవ్రమైన కంటిచూపి. కంటినిర్మాణము లో కంటిబాగాలకు అధిక శక్తి నందించేందుకు టెలిస్కోపిక్ లాంటి దువ్వెన రూపములో ఉండే ఒక ప్రత్యేక నిర్మాణము ఉంటుంది. వీటి ఫలితముగా కంటిచూపును సవరించుకోవడము , ఆహారపు వస్తువులను జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవడము సాధ్యమవుతుంది.ఎంతో ఎత్తున ఉన్నందున ఎక్కువ విస్తీర్ణము మీద పక్షులు కన్నేసి ఉంచగలవు .
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, September 13, 2014

మనం ఆవులించినపుడు. నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం ఆవులించినపుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాగే నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్లు వస్తాయి. ఎందుకు?

జవాబు: భావోద్వేగాల(emotions)కు ముఖంలోని అన్ని భాగాల కన్నా కళ్లే ప్రతిబింబాలు. భావోద్వేగాలకు లోనైనపుడు కాంతి కణితె భాగం కింద ఉన్న కన్నీటి గ్రంధులు కన్నీటిని స్రవిస్తాయి. ఏడ్చినపుడు, నవ్వినపుడు కన్నా మానసికంగా ఎక్కువ ఉద్వేగానికి, భావ ప్రకటనకు లోనవడం వల్ల ఏడ్చినపుడు ఎక్కువగా ఈ గ్రంధులు స్రవిస్తాయి. నవ్వినపుడు కన్నా ఆవలించినపుడు బాగా తక్కువగా స్రవిస్తాయి. కన్నీళ్లు లేకుంటే మన కనుగుడ్లు బాగా ఎండిపోయి పనికిరాకుండా ఉండేవి. కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే కన్నీళ్లు ఎప్పుడూ స్రవిస్తుంటాయి. ఆ కన్నీళ్లు కనురెప్పల కిందకు చేరుకున్నాక కను గవ్వలు ఒక కుంచెలాగా ఆ కన్నీటి ద్రవాన్ని ఓ కందెనలాగా మన కంటి పొరమీదకు నేర్పుతుంది. తద్వారా దుమ్ముధూళికి తారసపడిన కనుగుడ్లు ఎండిపోకుండా రక్షణ పొందుతున్నాయి.

నవ్వినపుడు ఏడ్చినపుడు ఈ కన్నీటి స్రావం ఎక్కువ కావడం వల్ల కళ్లు, ముక్కు కలిసేచోట ఉండే కన్నీటి కోశాలు నిండిపోయి కన్నీరు కారుతుంది. సినిమాలలోనూ, కథల్లోనూ గుండెకు హత్తుకునే సన్నివేశాలను చూసి చలించినపుడు విపరీతమైన భక్తి, కృతజ్ఞత భావాలు ముంచేసినపుడు, పగలబడి నవ్వినపుడు, దుఃఖంతో ఏడ్చినపుడు, అలసిపోయి ఆవులించినపుడు భావోద్వేగాలు పెరుగుతాయి. ఆ సమయంలో నాడీ తంత్రుల ద్వారా మెదడు కన్నీటి గ్రంధుల్ని ప్రేరేపించడం వల్ల కన్నీళ్లు మామూలు స్థితుల్లో కన్నా అధికంగా స్రవిస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

భూమి నుంచి మార్స్‌(అంగారకుడు)కు పయనించడానికి ఎంత కాలం పడుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: భూమి నుంచి మార్స్‌కు పయనించడానికి ఎంత కాలం పడుతుంది?

జవాబు: ప్రస్తుతం మన శాస్త్రజ్ఞులు ప్రయోగిస్తున్న రాకెట్‌ల ద్వారా మనకు సమీపాన ఉన్న మార్స్‌ (అంగారకగ్రహం) చేరుకోవడానికి 6 నుంచి 7 నెలల కాలం పడుతుంది. అదీ రాకెట్‌ను ప్రయోగించేటపుడు మార్స్‌, భూమి సరైన సమలేఖనం (alignment) లో ఉంటేనే. ఈ కారణంగానే మార్స్‌కు మానవసహిత రాకెట్‌ను పంపడానికి కొంత సమస్య ఎదురవుతూ ఉంది. ఈ సమస్యను అధిగమించి మార్స్‌ను మానవుడు చేరుకున్నా, మరల తిరిగి రావడానికి ఈ సమలేఖనం మళ్లీ ఏర్పడాలంటే, ఆ గ్రహంపై మరో 18 నెలలపాటు వేచి ఉండాలి.

అంటే మార్స్‌కు మానవసహిత రాకెట్‌ను ప్రయోగించి తిరిగి భూమికి చేర్చడానికి కనీసం రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. ఈ ప్రయాణకాలాన్ని శక్తిమంతమైన న్యూక్లియర్‌ ఇంజన్‌ను వాడటం ద్వారా కొంత మేర అంటే రెండు నెలల వరకు తగ్గించవచ్చు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================

పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు.ఇదెలా సాధ్యం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఈ మధ్య అక్కడక్కడ పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే.

మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది.

మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్యాలెన్సు చెడిపోకుండా పట్టకారు లాంటి క్లాంపులను బిగించి ఒకే విధమైన ఎత్తుకు నేల నుంచి పైకి లేపుతారు. ఏ విధమైన ఎగుడు దిగుడులేని విశాలమైన రోడ్డు మీద ఎక్కువ చక్రాలు, ఎక్కువ స్థిరత్వం, ఎక్కువ దృఢత్వం ఉన్న వాహనం మీద ఈ నిర్మాణాన్ని అదే విధంగా నిలకడగా ఉంచి మరోచోటికి తరలిస్తారు. మునుపు భూమిలో ఉన్నట్టు గానే రెండో చోట భూమిలో పాదులు, పునాదులు తీసి భవనాన్ని నిలుపుతారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

Monday, September 08, 2014

మేఘాలకు భిన్న రంగులుంటాయెందుకు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మేఘాలకు భిన్న రంగులుంటాయెందుకు?

జ : మేఘాలు తెల్లగా , నీలంగా , నల్లగా కనిపిస్తూవుంటాయి. ఆ రంగులు రావడానికి కారణము మేఘాలలోని పదార్ధాలు సూర్యరశ్మి లోని ఏదో ఒక రంగుకిరణాలను వెలువరించడమే.
  • సూర్యరశ్మి  ని పూర్తిగా పరావర్తనము చెందించే మేఘాలు తెల్లగా ఉంటాయి.
  • మేఘాలలో తేమ పెరిగి , వర్షింపబోయే మేఘాలు ఏ రంగు కిరణలను పరావర్తనము చెందించనందున అవి చూడడానికి నల్లగా కనిపిస్తాయి. 
  • మేఘాలు సూర్యరశ్మిలోని ఏ రంగుకిరణాలను వెదజల్లితే అదేరంగులో మనకు కనిపిస్తాయి.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, September 06, 2014

బట్టలపై పడే రక్తం మరకలు వదలవేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: బట్టలపై పడే రక్తపు మరకలు తీసివేయడం కష్టం. ఎందువల్ల?

జవాబు: రక్తపు మరకలే కాదు, చెర్రీ పండ్లు, మద్యం మరకలు బట్టలపై పడినపుడు వాటిని మామూలు డిటర్జెంట్లతో తీసేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పదార్థాలలోని అణువులు డిటర్జెంట్‌లోని అణువులతో కలిసి కరిగిపోవు. ముఖ్యంగా రక్తపు మరకలను వెంటనే జలీకరణం (dilute)చేసి ఉతకకపోతే రక్తపు అణువులు పొడిబారి బట్టలలోని పోగుల మధ్య చిక్కుకుపోతాయి. కొన్నిసార్లు ఇళ్లలో ఉండే ఆస్పిరిన్‌, ఉప్పు, ఇథైల్‌ ఆల్కహాల్‌, ప్రత్యేకంగా తయారైన డిటర్జెంట్‌లు కొంతమేర రక్తపు మరకలను తొలగించినా అవి పూర్తిగా పోవు. ఆ మరకలలో 42 డిగ్రీల సెల్సియస్‌ వద్ద రక్తం గడ్డకట్టే ప్రొటీన్‌ అణువులు ఉండడంతో వాటిని తొలగించడానికి వేడినీటిని వాడితే అవి బట్టలకు మరీ దృఢంగా అంటుకుపోతాయి. కానీ ఆ మరకలను కొన్ని స్టెయిన్‌ రిమూవర్స్‌తో కనబడకుండా చేయవచ్చు. ఈ పదార్థాలు అత్యంత ప్రతిభావంతమైన రసాయనిక చర్యలను జరిపే ఆక్సిజన్‌ అణువులను విడుదల చేయడం వల్ల అవి మరకలలోని అణువులతో కలిసి వాటిని ఏ రంగూ లేని వాటిగా మారుస్తుంది. అందువల్ల ఆ ప్రాంతంలో బట్టల రంగు కొంత మేర తగ్గుతుంది. ప్రాచీన కాలంలో మరకలు పోవడానికి బట్టలను తడపకుండా ఆరుబయట ఎండబెట్టేవారు. సూర్యరశ్మిలోని తక్కువ తరంగదైర్ఘ్యం గల వికిరణాలు ఆ మరకలలో ఉండే ఆక్సిజన్‌ అణువులను విడుదల చేయడంతో కొన్ని రకాల మరకల గాఢత తగ్గేది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

లెట్రిన్లలో మల-మూత్ర విసర్జన కీ-ఆరు బయట మల-మూత్ర విసర్జన కీ తేడా ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆరు బయట మల, మూత్ర విసర్జన చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయంటారు. మరి ఇంట్లో లెట్రిన్లలో చేసినా అది ఎలాగోలా బయటికే పోతుంది కదా? మరి ఇబ్బంది లేదా?

జవాబు: ఆరు బయట మల విసర్జన చేస్తే విసర్జన చేసిన వ్యక్తికి అప్పటికే ఏమైనా జబ్బులున్నట్లయితే ఆయా జబ్బులకు కారణమైన క్రిములు లేదా వాటి గుడ్లు ఆ మలంలో ఉంటాయి. ఒక వేళ ఆ వ్యక్తికి జబ్బులు ఏమీ లేకున్నా మలాన్ని ఆశించి గాల్లో ఉన్న ఎన్నో సూక్ష్మ జీవులు ఆ మలంపై నిమిషాల్లోనే తమ స్థావరాల్ని ఏర్పర్చుకొని అవాంఛనీయమైన రసాయనాల్ని, తమ గుడ్లను విడుదల చేస్తాయి. అలాంటి వ్యర్థ పదార్థాల మీద పోగైన క్రిములు, గుడ్లు గాలి ద్వారా గానీ, వివిధ వస్తువుల ద్వారా ఆహారంలో కలవడం ద్వారా గానీ మన శరీరాల్ని చేరతాయి. చేరాక పొట్టలోనో, పేగుల్లోనో ఆ గుడ్లు పగిలి అనారోగ్యకారకమైన రసాయనాల్ని, జీవుల్ని విడుదల చేస్తాయి.

నులిపురుగులు, ఏలిక పాములు పడటం, టైఫాయిడ్‌, కలరా, హెపటైటిస్‌, ఇతర పచ్చకామెర్లు, విరేచనాలు వంటి జబ్బులకు కారణం మల సంబంధ పదార్థాలు లేదా సూక్ష్మజీవులు ఆహారం ద్వారాగానీ, తాగునీరు ద్వారా గానీ శరీరంలో చేరడమే.

మూత్రవిసర్జన వల్ల జబ్బులు పెద్దగా రాకున్నా అందులో ఉన్న యూరియా, యూరికామ్లాలు కొన్ని సూక్ష్మ జీవులకు విడిదిని ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా దుర్గంధాన్ని కలిగిస్తాయి. కానీ ఇళ్లలోని పాయిఖానాల్లో విసర్జించిన మలమూత్రాదులు మొదట ఇళ్లలో ఉన్న సెప్టిక్‌ ట్యాంకులోకి వెళతాయి. అక్కడ గాలి సరిగా ఉండకపోవడం వల్ల నిర్వాత ప్రక్రియ (anaerobic process) ద్వారా మల పదార్థాలు ఛేదించబడతాయి. ఆ పదార్థాలు మనం తీసుకొనే ఆహారంలోకి, తాగునీరులోకి కలవడానికి అవకాశాలు తక్కువ. ఒక వేళ నిండిపోయినా అది ప్రత్యేక సెప్టిక్‌ పైపుల ద్వారా డ్రెయినేజీ కాలవల గుండా నివాస ప్రాంతాల బయటికి నెట్టి వేయబడుతుంది. కాబట్టి ఆరుబయట మల మూత్రాదులకున్నంత విపత్కర పరిస్థితులు ఉండవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

రోదసిలో మొక్కలు తొందరగా పెరుగుతాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: రోదసిలో మొక్కలు నాటితే అవి భూమ్మీదకంటే ఎక్కువ ఎత్తుగా, తొందరగా పెరుగుతాయని విన్నాను. నిజమేనా?

జవాబు: కోట్లాది సంవత్సరాల పరిణామక్రమంలో ప్రకృతి కలిగించే గడ్డు పరిస్థితుల్ని అధిగమించి సజావుగా జీవించేందుకు వీలుగా వివిధ రకాల మొక్కల, జంతువుల జన్యుస్మృతి జీవుల కణాల్లో ఏర్పడింది. ఈ జన్యు స్మృతి శిలాశాసనం లాగా ఒక జీవికి సర్వకాల సర్వావస్థల యందు స్థిరంగా లేకున్నా కొన్ని వందల, వేల సంవత్సరాల కాలవ్యవధిలో దాదాపు మారనట్లే ఉంటుంది. జీవుల స్వరూపం, రంగు, ఎత్తు, అవయవ నిర్మాణం ఇలాంటి లక్షణాల్ని ఆయా జీవుల జన్యు స్మృతి నిర్ధారిస్తుంది. చెట్లు నేల మీదున్నా, ఆకాశంలో ఉన్నా వాటి జన్యుస్మృతి కణాల్లోను, విత్తనాల్లోను, నిక్షిప్తమై ఉండటం వల్ల కొన్ని ధర్మాల్లో మార్పుండదు. సరైన మోతాదులో నీరు, కార్బన్‌డయాక్సైడ్‌, ఇతర లవణాలు భూమ్మీద దొరికినట్టే అంతరిక్షంలో కూడా దొరికినట్లయితే చెట్లు అంతరిక్షంలో కూడా సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరపగలవు. శ్వాసక్రియ చేయగలవు. సాధారణంగా మనకున్న అభిప్రాయం ఏంటంటే చెట్లు భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో పెరగడం వల్ల తమ ఇష్టానుసారం పెరగలేవనీ, వాటి ఎత్తును భూమ్యాకర్షణ బలం నిలువరిస్తుందనీ తద్వారా కొంత ఎత్తుకు మించి పెరగవనీ అనుకుంటాం. ఇలాంటి భూమ్యాకర్షణ అంతరిక్షంలో ఉండదు కాబట్టి చెట్లు ఇక అడ్డూ అదుపూ లేకుండా అమాంతం పెరుగుతూనే ఉంటాయని సూత్రీకరిస్తాం. భూమ్యాకర్షణ ఒక్కటే నిర్దేశిత ధర్మం అయితే భూమ్మీద అన్ని చెట్లకూ ఒకే ఆకర్షణ కాబట్టి అన్ని చెట్లూ ఒకే ఎత్తుకు ఎదగాలి. అంటే గడ్డి మొక్కలు, కొబ్బరి చెట్లు ఇలా అన్నీ ఒకే ఎత్తు ఎదగాలి. అలా జరగట్లేదు కదా! జన్యుస్మృతి కూడా నిర్దేశించుతుంది. వ్యోమ శకటంలో పెంచిన చెట్లు మామూలు ఎత్తు వరకు పెరుగుతాయని పరిశోధనలు రుజువు చేశాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?

జవాబు: మనం వాడే వంటనూనె ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుందో, ఏ ఉష్ణోగ్రత వద్ద పెనం మీద వేసిన తర్వాత మండే స్థితికి చేరుకుంటుందో ఆ తర్వాత ఆక్సిజన్‌తో కలిసి ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంత త్వరగా ద్రవరూపం పొందుతుందో అనే విషయాన్ని ఆ నూనెలో ఉండే కొవ్వు పదార్థ శాతం నిర్ణయిస్తుంది. ఆలివ్‌ నూనెలో ఈ కొవ్వు పదార్థం 4/5 వ వంతు ఉంటుంది. కాబట్టి ఈ నూనె వంటల్లో ముఖ్యంగా కూరల వేపుడుకు ఎంతో అనువైనది. ఈ నూనె సుమారు 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద చక్కగా, తన ధర్మం కోల్పోకుండా నిల్వ ఉంటుంది. అదే రెఫ్రిజరేటర్‌లో ఉంచితే, శూన్య ఉష్ణోగ్రతకు చేరుకుని పెచ్చులు పెచ్చులుగా, మసకబారి అస్పష్టంగా మారుతుంది. మరలా ఉష్ణోగ్రత హెచ్చే వరకూ అలాగే ఉంటుంది. దాంతో దాని రుచి, వాసనలో కూడా మార్పు వస్తుంది. ఆలివ్‌ నూనే కాకుండా కొవ్వు పదార్థ ఆమ్లాలు, ఎక్కువ శాతం ఉండే వంట నూనెలు ఉష్ణానికి, ఆక్సిజన్‌కు ప్రభావితం అవుతాయి కాబట్టి వాటిని ఎక్కువ కాలం వాటి ధర్మాలు కోల్పోకుండా నిల్వ ఉంచడానికి చల్లని, చీకటి ప్రదేశాలలో నల్లని రంగుల్లో ఉండే సీసాల్లో ఉంచడం మంచిది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

తాబేళ్లకు ఆయువు ఎక్కువ ఉంటుందా? ఇదెలా సాధ్యం?-How Tortoise live 100 yrs above?,తాబేళ్లు వందేళ్లకుపైగా ఎలా బతకగలవు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తాబేళ్లు వంద సంవత్సరాలకు పైగా బతుకుతాయనీ, భూమ్మీద ఎక్కువ కాలం జీవించే జంతువని విన్నాను. నిజమేనా? ఇదెలా సాధ్యం?

జవాబు: మొక్కల్లో 5000 ఏళ్లకు పైగా జీవించేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో ఉన్న బ్రిసిల్‌కోన్‌ పైన్‌ వృక్షం వయస్సు సుమారు 5063 సంవత్సరాలు. ఇలా ఎన్నో కొనిఫెరస్‌ చెట్లు వేలాది ఏళ్లు పెరుగుతూనే ఉండగలవు.

కానీ జంతువుల విషయానికి వస్తే పొరిఫెరా వర్గానికి చెందిన కొన్ని స్పాంజీలు పదివేల సంవత్సరాల తరబడి బతికేవి ఉన్నాయి. ఇవి వెన్నెముక లేని జీవులు. అయితే వెన్నెముక ఉన్న జీవుల్లో అత్యంత వయస్సు, అధిక ఆయుర్దాయం ఉన్న జంతువు తాబేలే. సాధారణంగా నీళ్లలో ఉండే తాబేళ్లు, నేలపై తిరిగే తాబేళ్లు వేర్వేరు ప్రజాతులు అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకే తరహా జీవులే. 2007 సంవత్సరంలో సుమారు 250 ఏళ్లు జీవించి చనిపోయిన భారతదేశపు తాబేలు 'అద్వైత' అత్యంత అధిక వయస్సు ఉన్న జంతువుగా అభివర్ణిస్తున్నారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

8888888888888888888888888888888888888888888888888888888

ప్రశ్న: తాబేళ్లు వందేళ్లకుపైగా ఎలా బతకగలవు?

జవాబు: ఒక జీవి సగటు ఎత్తు, జీవితాయుర్దాయం, ఆహార సేకరణ, సంతానోత్పత్తి, శ్వాస ప్రక్రియ వంటి ఎన్నో జీవన కార్యకలాపాలు, లక్షణాలు ఆయా జీవుల్లో ఉండే జన్యు స్మృతి (genetic code) ని బట్టి నిర్ధారితమవుతుంది. సాధారణంగా పెరుగుదలలోనూ, జీవి భౌతిక చర్యల వేగంలోనూ హడావిడిలేని జీవుల ఆయుర్దాయం ఎక్కువ. 'నిదానమే ప్రధానం' అన్న సామెతను తాబేలు నడకకే కాకుండా తాబేలు జీవన కార్యకలాపాలకు కూడా అన్వయించుకుకోవచ్చు. తాబేలు కార్యకలాపాలు మందకొడిగా ఉంటాయి. తద్వారా కణాలకు అలసట, క్షయం అనేవి తక్కువ. తాబేలు ఎంత మందకొడి అంటే దాని తలను పూర్తిగా తీసేసినా అది సుమారు నెలరోజులు బతుకగలదు. పైకి వచ్చి ఒకసారి గాలిపీల్చుకుంటే నీటి అడుగున కొన్ని గంటలపాటు ఉండగలదు. తాబేలు డిప్పమీద ఉన్న పెంకుల్లోని వలయాలనుబట్టి దాని రమారమి వయసును అంచనా వేయగలము. శరీరం కింద, పైన గట్టి పెంకుల్లాంటి డిప్పలు ఉండడం, ప్రమాదం సంభవించే క్షణాల్లో శరీరాన్ని మొత్తంగా లోపలికి ముడుచుకోవడం, నెమ్మదైన జీవితం, సాధారణంగా శాకాహార జీవనం తాబేళ్ల అధిక ఆయుర్దాయానికి కారణాలు. ప్రాథమిక కారణం జన్యు స్మృతిదే. తాబేళ్లే కాకుండా కోయి అనే చేపలు కూడా వంద సంవత్సరాలకుపైగా బతకగలుగుతున్నాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

గాజు ఏ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉంటుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : గాజు ఏ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉంటుంది?

జవాబు : పదార్థమేదైనా మన కంటికి పారదర్శకంగా ఉందా అనే విషయం, ఆ పదార్థం గుండా కంటికి కనిపించే కాంతి (400 నుంచి 700 నానోమీటర్లు ఉండే విద్యుదయస్కాంత వికిరణాలు) దానిగుండా ప్రసరిస్తున్నాయా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ కాంతి కిరణాలు ఆ పదార్థంపై పడినపుడు పరావర్తనం చెందడం కానీ, చిందరవందరగా చెదరడం కానీ జరగకుండా, అవి ఆ పదార్థం గుండా చొచ్చుకు పోవాలి. అంటే, ఆ కాంతి తరంగాలు ఆ పదార్థంలోని పరమాణువులపై జరిపే పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది.

క్లుప్తంగా, ఒక పదార్థం పారదర్శకమా కాదా అనే విషయం ఆ వస్తువులోని అణువుల నిర్మాణం, దానిపై పడే కాంతి తరంగధైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గాజులో 'ఏంటిమోనీ' లాంటి మూలకాల అణువులు ఉంటే, అవి కాంతి తరంగాల పురోగతిని పూర్తిగా అడ్డుకోవడంతో ఆ గాజు కాంతి నిరోధకంగా కనపడుతుంది.

కంటికి కనపడే కాంతి కొన్ని గాజు పదార్థాల విషయంలో పారదర్శకమైనా, పరారుణ, అతినీలలోహిత కిరణాల విషయంలో నిజం కాదు. ఉదాహరణకు పరారుణ కిరణాలు 'సిలికాన్‌' గుండా చొచ్చుకొనిపోగలవు. అలాగే x- కిరణాలు మానవ శరీరంలోని అంతర్భాగాలను కూడా చూడగలవు. రేడియోతరంగాలు దృఢమైన ఇటుక గోడల గుండా కూడా చొచ్చుకుపోగలవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  •  ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పెట్రోలు బావుల్లో వూరుతుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: బావుల్లో నీళ్లు వూరినట్లే పెట్రోలియం బావుల్లో పెట్రోలు కూడా వూరుతుందా?

జవాబు: నీళ్ల బావుల్లో నీరు వూరినట్టు పెట్రోలియం బావుల్లో పెట్రోలు వూరితే ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆందోళన ఉండేది కాదు. నీటికి జలచక్రం ఉంది అంటే సముద్రాలలో వేసవిలో ఆవిరయిన నీరు మేఘాలుగా మైదాన ప్రాంతాలకు వెళ్లి వర్షించడం, ఆ వర్షపు నీరు నదుల ద్వారా అధిక భాగం తిరిగి ప్రత్యక్షంగా సముద్రాల్లో కలవడం కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల అవి బావుల్లో వూరడం జరుగుతుంది. తర్వాత ఆ నీటిని సాగు నీరుగా, తాగు నీరుగా వాడుతున్న క్రమంలో అది పరోక్షంగా తిరిగి సముద్రాన్ని చేరడం వంటి వలయం నీటికి ఉంది. కానీ పెట్రోలియం బావుల్నించి తీసిన పెట్రోలు మరో పదార్థంగా మారుతూ ఉండటమే పెట్రోలు వినిమయం.

నీటిని నీటిగానే ఉపయోగించి నీరుగానే వదిలేస్తాం. కాబట్టి వలయం పూర్తయ్యింది. కానీ పెట్రోలును పెట్రోలుగా తీసుకుని పెట్రోలుగా వదలం. కార్బన్‌డయాక్సైడ్‌, నీటి ఆవిరి తదితర వ్యర్థ పదార్థాలుగా మార్చి వదిలేస్తాం. కాబట్టి పెట్రోలు వలయం లేదు. కేవలం కొన్ని దశాబ్దాల వరకు మాత్రమే పెట్రోలు బావుల్లో పెట్రోలు వూరుతుంది. ఆ వూట క్రమేపి తగ్గిపోయి అవి ఎండు బావుల్లాగా మారే గడ్డురోజులు తొందర్లోనే ఉన్నాయి.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వెదురు వృక్ష జాతికి చెందిందా లేక గడ్డిజాతికి సంబంధించిందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వెదురు వృక్ష జాతికి చెందిందా లేక గడ్డిజాతికి సంబంధించిందా?

జవాబు: అనేక రకాల వెదురు దట్టమైన గొట్టాల రూపంలో ఉంటుంది. కొన్ని రకాలు 40 మీటర్ల పొడవు, 80 సెంటి మీటర్ల చుట్టు కొలతతో పెరిగినా, ఆ మొక్కల మధ్య భాగాన్ని కాండం అంటారే కానీ, బోదె అని అనరు. నిజానికి వెదురు 'పొయాసియా' అనే గడ్డి జాతికి సంబంధించిన మొక్క.మిగతా గడ్డి మొక్కల వలె వెదురు కాండాలు కాలం గడిచే కొలదీ మందంగా ఎదగవు. నేలలో నుంచి ఒకే మందంతో నేరుగా, పైవైపు పెరుగుతాయి. ఈ భూమిపై వెదురు కొన్ని నెలల వ్యవధిలోనే ఎంతో ఎత్తుకు అతి త్వరగా పెరిగే గడ్డి మొక్క. మిగతా చెట్ల దుంగలలో నిండా ఉండే కొయ్య పదార్థంతో కాకుండా, వెదురు ఎంత పొడవు పెరిగినా వాటి మధ్య భాగం బోలుగా ఉండి, బొంగుల రూపంలో ఉంటుంది.

- ప్రొ|| ఈ. వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

హిమనీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: హిమనీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?

జవాబు: ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వల్ల గాల్లో ఉన్న తేమ మంచు బిందువులు కింద పడతాయి. అవన్నీ పేరుకుపోయి కొండల మధ్య ఉన్న లోయల్ని బావుల్లో నీళ్లు నింపినట్టుగా మంచు బిందువులతో నింపుతాయి. అక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడుకన్నా తక్కువ ఉండడం వల్ల, పీడనం కూడా తక్కువగా ఉండి మంచు బిందువులు ఘనీభవిస్తాయి. ఇలా నెలల తరబడి కొండల మధ్య పేరుకుపోయిన మంచు బిందువులు ఒక దిమ్మలాగా బల్లపరుపుగా కొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆక్రమిస్తాయి. ఇటువంటి మంచు దిమ్మలు విశాలమైన గాజు పలకలాగా కనిపిస్తాయి. దీనిపైన ఆసక్తి ఉన్నవాళ్లు ఐస్‌ స్కేటింగ్‌ వంటి శీతాకాలపు క్రీడలను ఆడుతుంటారు. ఇలాంటి మంచుతో కూడుకున్న విశాలమైన ఘనీభవించిన మంచు మైదాన ప్రాంతాలనే గ్లేషియర్‌హిమనీ నది అంటారు. వేసవి రాగానే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ మంచు కరిగి స్వచ్ఛమైన నీరులాగా పర్వతాల కిందివైపునకు ప్రవహిస్తుంది. ఇలా అనేక పాయలు కలిసి నదులుగా ఏర్పడతాయి. అలా హిమాలయ పర్వతాల నుంచి గంగా, యమునతో పాటు ఎన్నో నదులు ఏర్పడ్డాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,--శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మందులు పురుషుల్లో-స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం వాడే మందులు పురుషుల్లో, స్త్రీల్లో వేర్వేరుగా పనిచేస్తాయా?

జవాబు: మనం వాడే మందులు మన దేహంపై ఎంత ప్రభావితంగా పనిచేస్తాయి అనే విషయం, ఆ మందు ఎంత త్వరగా దేహంలో కలిసిపోతుంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మందులు దేహంలోని కాలేయంలో ఉండే ఎన్‌జైములచే విడగొట్టబడి దేహానికి అందజేస్తాయి. ఈ ఎన్‌జైములను ఉత్పన్నం చేసే జన్యువులక్రియాశీలతస్థాయి మగ, ఆడవారిలో వేర్వేరుగా ఉంటుంది. అంటే ఒకే మోతాదులో తీసుకొన్న ఒక మందు పురుష, స్త్రీ రోగులలో వేర్వేరుగా పనిచేస్తుంది. ఆ మందువల్ల కలిగే దుష్పరిణామాలు (side effects) కూడా ఒకే రకంగా ఉండవు. ఉదాహరణకు ఆస్పిరిన్‌ పురుషులకు గుండె వ్యాధుల విషయంలో ఎక్కువ రక్షణ ఇస్తే, కొన్ని సమయాలలో ఆ మందు స్త్రీలపై అంత ప్రభావం చూపదు.

స్త్రీ పురుషులలో హార్మోన్‌ సమతుల్యత, దేహంలో కొవ్వు, కండరాల కణజాలం వ్యాపనం ఒకే విధంగా ఉండకపోవడంతో వారి దేహాలపై మందుల ప్రభావం ఒకేరకంగా ఉండదు. అందుకే డాక్టర్లు ఎవరికి తగిన మోతాదులో వారికి మందులను ఇస్తారు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, September 05, 2014

Penguin feet not sticking to ice why?-పెంగ్విన్‌ పాదాలు మంచు గడ్డలకు అంటుకోవేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మంచు ప్రదేశాల్లో నివసించే పెంగ్విన్‌ పక్షుల పాదాలు అక్కడి మంచు గడ్డలకు ఎందుకు అంటుకోవు?

జవాబు:
మంచు గడ్డలు పరుచుకొని ఉండే ప్రదేశంపై మనం నడిస్తే ఒత్తిడి వల్ల, మన దేహ ఉష్ణోగ్రత వల్ల మన కాళ్ల కింద మంచుగడ్డ కరుగుతుంది. ఆ ఒత్తిడిని కొంత సడలించగానే కరిగిన ఆ మంచు మరల గడ్డకట్టడంతో మన పాదాలు మంచు గడ్డకు అంటుకుంటాయి. కానీ పెంగ్విన్‌ పక్షుల విషయంలో అలా జరగదు. పెంగ్విన్ల దేహ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నా, వాటి కాళ్లు ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. అవి మంచుగడ్డపై కలిగించే ఒత్తిడి తక్కువే. అందువల్ల అవి మంచు గడ్డలున్న ప్రదేశాలల్లో ఉన్నా వాటి పాదాలకు మంచుగడ్డల మధ్య మంచు కరిగిన నీరు ఏర్పడదు. ఆ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. పెంగ్విన్ల పాదాలు ఎల్లవేళలా చల్లగా ఉండడానికి కారణం వాటి కాళ్లలో ప్రవహించే రక్తం నియంత్రించబడి ఉండడమే. వాటి కాళ్లలో ఉండే రక్తనాళాలు, ధమనుల చుట్టూ ఉండే కండరాల అమరిక వల్ల వాటి పాదాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్‌ కన్నా కొంచెం ఎక్కువగా మాత్రమే ఉండేటట్టు రక్తం అతి తక్కువగా ప్రవహిస్తుంది. ఇలా జరగడం వల్ల చల్లబడిన రక్తం మరలా దేహంలోకి తిరిగి వచ్చి అక్కడ ఉండే అనేక వెచ్చని రక్తనాళాలు, ధమనుల గుండా ప్రవహించి వేడెక్కుతుంది. అంటే తిరిగి తొలి ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. ఆ విధంగా పెంగ్విన్‌ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • = ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Gold and platinum donot get rusted why?-బంగారం-ప్లాటినం లోహాలు తుప్పు పట్టవేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

జవాబు: సూర్యుడి లాంటి నక్షత్రాల్లో కేవలం వాయువులే ఉన్నా భూమిలాంటి గ్రహాల్లో వాయువులతోపాటు ద్రవాలు, ఘనపదార్థాలు ఉన్నాయి. వీటి అంతర నిర్మాణాన్ని బట్టి మూలకాలు, లేదా సంయోగ పదార్థాలు అనే రెండు కోవలకు చెందుతాయి. మూలకాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు అల్యూమినియం లోహంలో ఉన్నవన్నీ అల్యూమినియం పదార్థంతో కూడిన పరమాణువులే. కానీ సంయోగ పదార్థాలు, కొన్ని మూలకాలు కలవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో వేర్వేరు రకాలైన పరమాణువులు బృందాలుగా ఉంటాయి. ఈ బృందాలను అణువులు అంటాం.

సాధారణంగా మూలకాల కన్నా సంయోగ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండడమంటే రసాయనికంగా మార్పును నిరోధించడమే. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం పదార్థాలు మారడానికి కారణం వాటిలో ఉన్న అంతరంగిక శక్తి తగ్గడమే. ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు తక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి ఆ లోహాలు తుప్పుపట్టడాన్ని ఆమోదిస్తాయి. కానీ బంగారం, ప్లాటినం, స్టెయిన్‌లెస్‌ స్టీలు వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు ఎక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి అవి తుప్పు పట్టవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

చేపలు నిద్రపోతాయా?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

పశ్న : చేపలు నిద్రపోతాయా?

జవాబు : చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి గాఢనిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, September 03, 2014

కప్పలు ఎందుకు అరుస్తాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : కప్పలు ఎందుకు అరుస్తాయి?

జ : కప్ప శరీరానికి పాముచే కరవబడి దెబ్బతిన్నప్పుడు అరిచే శబ్దము మూలుగుతూ ఉన్నట్లు ఉంది ... ఆ అరుపు ఆడ మగ రెండూ చేస్తాయి. వానజల్లు రావడముతో ఒక్క మగకప్పలే అరుస్తాయి. గొంతుభాగములో మగకప్పలకుండే గాలితిత్తులలోకి గాలిని తీసుకొని ఒత్తిడితో బయటకు పంపడము వల్ల ఆ అరుపులు వస్తాయి. ఈ అరుపులు ఆడ కప్పలను ఆకట్తుకునేందుకు చేసే శబ్దాలు . అందుకే ఒక్కొక కప్పజాతి అరుపు ఒక్కోలా ఉంటుంది . ఆడకప్ప ఆకర్షింపబడి దగ్గరకు వచ్చేసరికి ఆ అరుపు తీరు మారుతుంది.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, September 02, 2014

Do leaves change colors?,ఆకులు రంగులు మారుస్తాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఆకులు రంగులు మారుస్తాయా?

జ : చెట్ల ఆకులు రంగులు మార్చవు . అప్పుడే పుట్టిన ఆకులు(చిగురాకులు) లేత ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆ తర్వాత పూర్తి ఆకుపచ్చగా మారుతాయి. అయితే ఇది రంగు మార్చుకోవడము కాదు . లేత ఆకు తన మీద కీటకాలు దాడిచేసి తినకుండా వుండేందుకు చేసుకున్న ఏర్పాటు . ఆ ఎరుపు రంగును కీటకాలు గుర్తించలేవు . లేత ఆకుల్లో ఉండేటటువంటి  ఒక రకమైన రసాయనము దానిని రుచిలేని ఆకుగా మారుస్తాయి. పైగా లేత ఆకుల్లో పత్రహరితము కాక " ఎంథోసైనిన్‌ " అనే వర్ణకము అధికముగా ఉండి ఎరుపు రంగును ఇస్తుంది. ఈ వర్ణకము సూర్యుడి ఎండతీవ్రతకు లేత ఆకు మాడకుండా రక్షిస్తుంది.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-