Saturday, September 06, 2014

తాబేళ్లకు ఆయువు ఎక్కువ ఉంటుందా? ఇదెలా సాధ్యం?-How Tortoise live 100 yrs above?,తాబేళ్లు వందేళ్లకుపైగా ఎలా బతకగలవు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: తాబేళ్లు వంద సంవత్సరాలకు పైగా బతుకుతాయనీ, భూమ్మీద ఎక్కువ కాలం జీవించే జంతువని విన్నాను. నిజమేనా? ఇదెలా సాధ్యం?

జవాబు: మొక్కల్లో 5000 ఏళ్లకు పైగా జీవించేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో ఉన్న బ్రిసిల్‌కోన్‌ పైన్‌ వృక్షం వయస్సు సుమారు 5063 సంవత్సరాలు. ఇలా ఎన్నో కొనిఫెరస్‌ చెట్లు వేలాది ఏళ్లు పెరుగుతూనే ఉండగలవు.

కానీ జంతువుల విషయానికి వస్తే పొరిఫెరా వర్గానికి చెందిన కొన్ని స్పాంజీలు పదివేల సంవత్సరాల తరబడి బతికేవి ఉన్నాయి. ఇవి వెన్నెముక లేని జీవులు. అయితే వెన్నెముక ఉన్న జీవుల్లో అత్యంత వయస్సు, అధిక ఆయుర్దాయం ఉన్న జంతువు తాబేలే. సాధారణంగా నీళ్లలో ఉండే తాబేళ్లు, నేలపై తిరిగే తాబేళ్లు వేర్వేరు ప్రజాతులు అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకే తరహా జీవులే. 2007 సంవత్సరంలో సుమారు 250 ఏళ్లు జీవించి చనిపోయిన భారతదేశపు తాబేలు 'అద్వైత' అత్యంత అధిక వయస్సు ఉన్న జంతువుగా అభివర్ణిస్తున్నారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

8888888888888888888888888888888888888888888888888888888

ప్రశ్న: తాబేళ్లు వందేళ్లకుపైగా ఎలా బతకగలవు?

జవాబు: ఒక జీవి సగటు ఎత్తు, జీవితాయుర్దాయం, ఆహార సేకరణ, సంతానోత్పత్తి, శ్వాస ప్రక్రియ వంటి ఎన్నో జీవన కార్యకలాపాలు, లక్షణాలు ఆయా జీవుల్లో ఉండే జన్యు స్మృతి (genetic code) ని బట్టి నిర్ధారితమవుతుంది. సాధారణంగా పెరుగుదలలోనూ, జీవి భౌతిక చర్యల వేగంలోనూ హడావిడిలేని జీవుల ఆయుర్దాయం ఎక్కువ. 'నిదానమే ప్రధానం' అన్న సామెతను తాబేలు నడకకే కాకుండా తాబేలు జీవన కార్యకలాపాలకు కూడా అన్వయించుకుకోవచ్చు. తాబేలు కార్యకలాపాలు మందకొడిగా ఉంటాయి. తద్వారా కణాలకు అలసట, క్షయం అనేవి తక్కువ. తాబేలు ఎంత మందకొడి అంటే దాని తలను పూర్తిగా తీసేసినా అది సుమారు నెలరోజులు బతుకగలదు. పైకి వచ్చి ఒకసారి గాలిపీల్చుకుంటే నీటి అడుగున కొన్ని గంటలపాటు ఉండగలదు. తాబేలు డిప్పమీద ఉన్న పెంకుల్లోని వలయాలనుబట్టి దాని రమారమి వయసును అంచనా వేయగలము. శరీరం కింద, పైన గట్టి పెంకుల్లాంటి డిప్పలు ఉండడం, ప్రమాదం సంభవించే క్షణాల్లో శరీరాన్ని మొత్తంగా లోపలికి ముడుచుకోవడం, నెమ్మదైన జీవితం, సాధారణంగా శాకాహార జీవనం తాబేళ్ల అధిక ఆయుర్దాయానికి కారణాలు. ప్రాథమిక కారణం జన్యు స్మృతిదే. తాబేళ్లే కాకుండా కోయి అనే చేపలు కూడా వంద సంవత్సరాలకుపైగా బతకగలుగుతున్నాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...