Sunday, September 28, 2014

అసలు కళ్లకు సైట్‌(చత్వారం)ఎందుకు వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: కొందరు సైట్‌ (చత్వారం) ఉందని కళ్లద్దాలు పెట్టుకుంటారు. అసలు కళ్లకు సైట్‌ ఎందుకు వస్తుంది?

జవాబు: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకు కలిగే సర్వ పరిజ్ఞానానికి ప్రధాన అవయవాలు కళ్లు. కన్ను సంక్లిష్టమైన నిర్మాణం. అందులో భాగాలు ప్రధానమైనవి. ఒకటి కంటిపాప (pupil). ఇందులో నుంచే కాంతి కంటి లోపలికి చేరుకుంటుంది. రెండోది కంటి కటకం (eye lens). ఇది పారదర్శక కండర నిర్మాణం. కంటిపాప నుంచి లోనికి వచ్చే కాంతిని సంపుటీకరించే శంఖాకార కటక లక్షణం దానికి ఉంది. ఇక మూడోది నేత్ర పటలం. లేదా రెటీనా. మనం చూసే వస్తువుల నిజమైన బింబాలు (true images) ఈ తెరలాంటి నిర్మాణం మీద తలకిందులుగా పడేలా కంటి కటకం కాంతిని కేంద్రీకరిస్తుంది. కంటికి సైటు కంటిపాపలో సమస్యల వల్ల రావడం చాలా అరుదు. సాధారణంగా కంటికి సైటు కంటి కటకపు వ్యాకోక సంచోచాలు సక్రమంగా లేనపుడు వస్తుంది. లేదా ఆ కటక పారదర్శకత లోపించడం వల్ల వస్తుంది. ఈ పరిస్థితిని తెల్లగుడ్డు (cateract)అంటారు. రెటీనాలో కాంతిని గ్రహించే జ్ఞాన కణాలు ఉంటాయి. సూర్యుడి కాంతిని, ఇతర ప్రకాశవంతమైన కాంతిని ఎక్కువ సేపు చూడ్డం వల్ల గానీ ఎ విటమిన్‌ లోపం వల్ల గానీ రెటినా పొర సరిగా పనిచేయకపోతే సైటు శాశ్వతంగా వస్తుంది. దీనికి చికిత్స దాదాపు కష్టం. కానీ కటకపు సంకోచవ్యాకోచాలు సరిగాలేనపుడు వస్తువుల బొమ్మ రెటీనా కన్నా ముందే (హ్రస్వదృష్టి) లేదా అవతలో (దూరదృష్టి) పడుతుంది. కళ్లద్దాలు వాడి ఈ సమస్య నుంచి బయటపడతారు. తెల్లగుడ్డు సమస్యవస్తే ఆపరేషన్‌ చేసి నయం చేయగలరు. కంటికలక వచ్చినపుడు కూడా దృష్టి మాంద్యం కలుగుతుంది.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...