Showing posts with label రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?. Show all posts
Showing posts with label రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?. Show all posts

Saturday, September 06, 2014

రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లో ఆలివ్‌ నూనెను పెట్టకూడదంటారు ఎందుకు?

జవాబు: మనం వాడే వంటనూనె ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుందో, ఏ ఉష్ణోగ్రత వద్ద పెనం మీద వేసిన తర్వాత మండే స్థితికి చేరుకుంటుందో ఆ తర్వాత ఆక్సిజన్‌తో కలిసి ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంత త్వరగా ద్రవరూపం పొందుతుందో అనే విషయాన్ని ఆ నూనెలో ఉండే కొవ్వు పదార్థ శాతం నిర్ణయిస్తుంది. ఆలివ్‌ నూనెలో ఈ కొవ్వు పదార్థం 4/5 వ వంతు ఉంటుంది. కాబట్టి ఈ నూనె వంటల్లో ముఖ్యంగా కూరల వేపుడుకు ఎంతో అనువైనది. ఈ నూనె సుమారు 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద చక్కగా, తన ధర్మం కోల్పోకుండా నిల్వ ఉంటుంది. అదే రెఫ్రిజరేటర్‌లో ఉంచితే, శూన్య ఉష్ణోగ్రతకు చేరుకుని పెచ్చులు పెచ్చులుగా, మసకబారి అస్పష్టంగా మారుతుంది. మరలా ఉష్ణోగ్రత హెచ్చే వరకూ అలాగే ఉంటుంది. దాంతో దాని రుచి, వాసనలో కూడా మార్పు వస్తుంది. ఆలివ్‌ నూనే కాకుండా కొవ్వు పదార్థ ఆమ్లాలు, ఎక్కువ శాతం ఉండే వంట నూనెలు ఉష్ణానికి, ఆక్సిజన్‌కు ప్రభావితం అవుతాయి కాబట్టి వాటిని ఎక్కువ కాలం వాటి ధర్మాలు కోల్పోకుండా నిల్వ ఉంచడానికి చల్లని, చీకటి ప్రదేశాలలో నల్లని రంగుల్లో ఉండే సీసాల్లో ఉంచడం మంచిది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-