Showing posts with label బండివేగంగావెళ్లేప్పుడుచక్రాలువెనక్కుతిరుగుతున్నట్లుకనిపిస్తాయి. Show all posts
Showing posts with label బండివేగంగావెళ్లేప్పుడుచక్రాలువెనక్కుతిరుగుతున్నట్లుకనిపిస్తాయి. Show all posts

Saturday, May 07, 2011

సినిమాల్లో బండి వేగంగా వెళ్లేప్పుడు చక్రాలు వెనక్కు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి, ఎందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: సినిమాల్లో బండి వేగంగా వెళ్లేప్పుడు చక్రాలు వెనక్కు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి, ఎందుకు?

-మణి, వివేకానంద పబ్లిక్‌ స్కూలు, ఐలేశ్వరం

జవాబు: సినిమాల్లో జట్కాబళ్లు, ఎడ్లబళ్లు, కార్ల చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్టు కనిపించడం దృష్టి భ్రమ (optical illusion)కి ఒక ఉదాహరణ. సినిమాల్లో దృశ్యాలన్నీ ఫిలిం రీలులో విడివిడి బొమ్మలుగా ఉంటాయనేది తెలిసిందే. వీటినే ఫ్రేములు అంటారు. ఒక సెకనులో 16 ఫ్రేముల కన్నా ఎక్కువగా తెరపై దృశ్యాలు పడేంత వేగంగా ఫిలింరీలు తిరిగేప్పుడు అవి ఒకదాని వెంట ఒకటిగా మారడాన్ని మనం గుర్తించలేము. ఎందుకంటే ఇది మన కంటికి ఉన్న పరిమితి. అందువల్లనే తెరపై పడే విడివిడి ఫ్రేములు కలిసిపోయి కళ్ల ముందు ఒకే దృశ్యంగా కనిపిస్తాయి. ఇప్పుడు సినిమాలో పరిగెడుతున్న జట్కాబండిని తీశారనుకుందాం. దాన్ని చిత్రీకరించే సమయంలో జట్కాబండి చక్రం తిరిగే వేగం కన్నా, ఆ దృశ్యాలున్న ఫిలిం రీలు వేగంగా తిరుగుతుంది. అంటే బండి చక్రంలో ఒక భాగం ముందుకు తిరిగేలోపే ఫిలిం రీలులో ఫ్రేము మారిపోతుందన్నమాట. అందువల్ల సినిమాలో మిగతా దృశ్యం సహజంగానే కనిపించినా, బండి చక్రం కేసి చూసినప్పుడు మాత్రం అది వెనక్కి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక-- ్బారావు, హైదరాబాద్
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.