Monday, May 23, 2011

ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది. ఎందుకు?,Apple cut changes color-Why?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది. ఎందుకు?జవాబు: ఆపిల్‌ పండులో 'టానిక్‌ యాసిడ్‌' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్‌ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్‌ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్‌ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్‌ బ్రౌన్‌ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్‌ ముక్కలు ఆ రంగులోకి మారతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండులో ఉండే టానిక్‌ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గ్రహ గతులు అంటే ఏమిటి ?, What is ment by Graha gatulu?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.విశ్వమంతా గోళాకారంలో ఉన్నపుడు 360 డిగ్రీలకంటే మించిన కోణం ఉండే సావకాశం లేదని గుర్తించిన పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞులు, దీనిని 12 విభాగాలు చేశారు. ఒక్కో విభాగానికి 30 డిగ్రీలు (కోణం) కలిగినపుడు, దీనిని ఒక రాశి అన్నారు. ఆ రాశుల పేర్లు దాదాపుగా మనకూ, పాశ్చాత్యులకూ సమానంగానే ఉన్నాయి. 1. మేషం 2.వృషభం 3. మిథునం 4.కర్కాటకం 5.సింహం 6. కన్య 7.తుల 8. వృశ్చికం 9.ధనుస్సు 10. మకరం 11. కుంభం 12. మీనం.

1 .మనం ఉన్న స్థలంనుండి (భూగోళంనుండి) గ్రహాలను పరిశీలిస్తే ఏ కోణంలో కనబడుతుందో, దానిని బట్టి, (ఆ కోణంలో) ఆ రాశిలో ఫలానా గ్రహం సంచరిస్తోందని గుర్తిస్తూ, గ్రహగతులను గణిస్తున్నారు. వీటిని బట్టే నెలలు ఏర్పడుతున్నాయి.
2.ఇలా సూర్యుడు 360 డిగ్రీలు (కోణాలు) (అంటే 12 రాశులలో) సంచరించగా ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. సూర్యగతిని బట్టి, చంద్రగతినికూడ సమన్వయ పరుస్తూ కాలాన్ని కొలుస్తారు .
3.సంచరించేటపుడు, ఒక రాశిని దాటడానికి గ్రహాలకు పట్టే కాలం - సూర్యుడు (30 రోజులు), చంద్రుడు (రెండున్నర రోజులు), కుజుడు 11 న్నర రోజులు, బుధుడు (ఒక నెల), గురువు (ఒక సంవత్సరం), శుక్రుడు (ఒక నెల), శని (రెండున్నర సంవత్సరాలు), రాహు కేతువులు (ఒకటిన్నర సంవత్సరాలు). ఒక రాశినుండి, పై రాశిలోకి మారే కాలాన్ని సంక్రమణం అంటారు.
4.గ్రహ సంచారాల వల్ల మారే స్థితులను బట్టి, మనుష్య జీవనంలో కలిగే ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఆ నాటి, ఆ నెల, సంవత్సరపు స్థితిలో మేలు, కీడు చేయగలిగిన గ్రహాలనూ, కాలాలనూ గుర్తించారు. గ్రహము మనకు కనబడితే ఉదయించినదనీ, కనబడకపోతే అస్తమించినదనీ అంటారు.
5.మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు)
6.కాబట్టి, పుట్టినప్పటినుండి 60 సంవత్సరాలను లెక్కించేందుకై, ప్రతిసంవత్సరాన్ని ఒక నామంతో వ్యవహారం చేయడం భారతీయుల విశేషత.
7.అబ్దం అనగా సంవత్సరమే. సంవత్సర గణనంలో మరో ముఖ్యమైన కొలబద్ద యుగాలు. ఒక ముఖ్యమైన ఘటన, లేదా పుణ్యపురుషుడి జన్మను బట్టి, ఆయా శకాలను గణిస్తారు. ప్రస్తుతం కలియుగ ప్రారంభాన్ని బట్టి కలియుగాబ్దాలు, శాలివాహన చక్రవర్తి కాలాన్ని బట్టి శాలివాహన శకం, శంకరాచార్య శకం ఇలా రకరకాలుగా గణనం లోక వ్యవహారంలో ఉన్నది. (పాశ్చాత్యులు క్రీస్తుజీవిత కాలం ప్రాతిపదికగా, సంవత్సరాలు గణిస్తున్నారు.

 • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

షష్టి పూర్తి ఎందుకు జరుపుకుంటారు ? , Why do SASTI PURTI celebrate ?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు.

షష్టి పూర్తి మహోత్సవము లో జ్యోతి శాస్త్ర రహస్యం ఉన్నది ... "ఉగ్రరధ" అనే భయంకర దోషము అరవై నిండగానే మనిషి కి ఆవహిస్తుంది . దానివల్ల భయంకర శోకము ను మానవులు పొందుదురు . అందువల్ల షష్టి పూర్తి కార్యక్రమము లో భాగంగా ' ఉగ్రరధ ' దోషనివారణ కార్యక్రమనూ జరుపుకుంటారు .

మనది ఎంతో పవిత్రమైన, ఆదర్సవంతమైన సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టి తో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారములను, సంస్కారములను మనకు చెప్పియున్నారు. అట్టి సంస్కారములలో ఒకటి ఈ షష్టి పూర్తి మహోత్సవము.

షష్టి పూర్తి అనగా అరువది సంవత్సరములు ఆయువు పూర్తి అయిన పిదప మరల అరువది సంవత్సరముల ఆయువును ప్రసాదించమని భగవంతును కోరుచూ చేయు ఉత్సవము. దీనినే షష్టి పూర్తి మహోత్సవం అని అంటారు. ఈ షష్టి పూర్తి మహోత్సవం నే అమృతోత్సవం అని కుడా అందురు. అమృత + ఉత్సవం అమృతము అనగా మోక్షము . ఉత్సవం అనగా ఆనందమును పుట్టించు శుభకార్యము. మోక్షమును, అమితానందమును కలిగించమని ఆ భగవంతుని కోరుకోనుచు చేయు శుభకార్యమే" అమృతోత్సవము ".

ఈ ఉత్సవమును అరువద్ది సంవత్సరములు పూర్తి అయిన తల్లితండ్రులకు వారి సంతానము చేయదగినట్టిదే ఈ మహోత్సవం. ఇందు ఆయుష్కామన యజ్ఞము కూడా జరిపించబడును. అనగా ఆయు: + కామన + యజ్ఞము - ఆయు: అనగా ఆయువు, కామన అనగా కోరి, యజ్ఞమనగా శ్రేష్టమైన, పవిత్రమైన మరియు భగవంతునికి ప్రేతి పాత్రమైన శుభకర్మ. దీనిద్వారా నిండు నూరేళ్ళు ఆయువును ప్రసాదించమని పరమాత్మను కోరుకోనుచు చేయు శ్రేష్టమైన కర్మే " ఆయుష్కామన యజ్ఞ " మందురు. ఈ ఉత్సవమును యజ్ఞము ద్వారా శాస్త్రజ్ఞానము కలిగిన బ్రాహ్మణుల ద్వారా జరిపించుట శ్రేష్టము. ఇది కడు ఉత్తమోత్తమైన సత్కర్మ. ఈ కార్యక్రమము జరుగుచుండగా ఆ తల్లితండ్రులు పొందు ఆనందానుభూతిని వర్ణించలేము. అది స్వయముగా చూడవలయును. మన ప్రత్యక్ష - సాకార దేవతల పూజ అంటే ఇదే. ఇది ఎంతో పుణ్యం చేసుకున్న గుణవంతులైన సంతానమునకు మాత్రమె లభించును. ఇట్టి సేవ, పూజ కొన్ని లక్షలు, కోట్లు గుమ్మరించినా ఈ ఫలము లభించదు. ఈ సంస్కారమునే సాకార - ప్రత్యక్ష దేవతల పూజ అనియు అంటారు.
 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, May 22, 2011

పంచ కన్యలు అంటే ఎవరు?హిందూ పురాణాలలో, Who were the five Virgins in Hindu Epics?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


పంచ కన్యలు అంటే ఎవరు?హిందూ పురాణాలలో, Who were the five Virgins in Hindu Epics?

నేటి తరం బాలలకు పాత తరం విషయాలు : హిందూపురాణాలలో కొంతమంది దేవతా స్త్రీలు వరము వలనో , శాపము వలనో మానవ జన్మ ఎత్తి ధర్మ పరిరక్షణ , దుష్ట శిక్షణ చేయు నిమిత్తము వారి అసలు శరీరము దేవలోకములో విడిచి మాయాశరీర ధారియై మానవులుగా జన్మించిన వారిలో ఈ పంచకన్యలు ముఖ్యమైనవారు . మాయా విధ్య మహత్యము వలనే వారు కన్యలు గానే పురాణాలు , పురాణ పురుషులు , మునీశ్వరులు చే చెప్పబడినారు . వీరినే పురాణ పతివ్రతలు అని కూడా అంటారు .

 • 1. తార
 • 2. అహల్య
 • 3. మండోదరి
 • 4. కుంతి
 • 5. ద్రౌపది

1.తార --వానర రాజైన వాలి భార్య. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది. వీరి కుమారుడు అంగదుడు.సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి రామలక్ష్మణుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని
చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.-source : Tara in wikipedia

2.అహల్య---ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి. బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు
చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు. -source : Ahalya3.మండోదరి--మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.-- Source : Mandodari

4.కుంతీదేవి --- మహాభారతం లో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు.-- Source : Kuntidevi


5.ద్రౌపది-- దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. మహాభారతంలొ అతిముఖ్య పాత్రదారి.--source : Draupathi
 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, May 21, 2011

అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా?, Do all bacteria spread from one to another?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి కదా! మేలు చేసేవి కూడా ఇలా సంక్రమిస్తాయా?

- బి. ప్రణీత్‌ రెడ్డి, గుత్తి (అనంతపురం)

జవాబు: హాని కలిగిస్తున్నామా, మేలు చేస్తున్నామా అనే విషయం ఆయా సూక్ష్మజీవులకు తెలీదు. వాటి మానాన అవి జీవిస్తుంటాయి. ఇక ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది వాటి జీవన విధానంలో ఒక భాగమే. సాధారణంగా మనం ప్రమాదాన్నే గుర్తిస్తాము కానీ మేలును కాదు. పెరుగు తింటున్నప్పుడల్లా మనం ఈస్ట్‌ బ్యాక్టీరియాను తలుచుకోము. ఏ దగ్గో, జ్వరమో వస్తే అందుకు కారకమైన సూక్ష్మజీవుల గురించి ఆరా తీస్తాము. మొత్తానికి హానిచేసేవైనా, మేలు చేసేవైనా అవి ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, May 19, 2011

బ్రష్‌ నీటిలో విచ్చుకుంటుందేం?,Paint brush widen in water why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: పెయింట్‌ బ్రష్‌ను నీళ్లలో ముంచితే దాని వెంట్రుకలు అన్నివైపులకు విచ్చుకుంటాయి. నీటిలో నుంచి బయటకు తీస్తే అవన్నీ ఒకదానితో ఒకటి అంటుకుపోతాయి. ఎందుకని?

- కె. రాజీవ్‌, 10వ తరగతి, యానాం

జవాబు
: పెయింట్‌ బ్రష్‌ వెంట్రుకలు నీటిలో విచ్చుకోడానికి, బయటకు తీసినప్పుడు అతుక్కుపోడానికి కారణం నీటికి ఉండే తలతన్యత (surface tension) అనే భౌతిక ధర్మమే. దీని ప్రకారం నీటి ఉపరితలం, నీటి పొరలు సాగదీసిన రబ్బరు పొరలలాగా స్థితిస్థాపకత (elasticity), తన్యత (tension) కలిగి ఉంటాయి. వీటికి స్వేచ్ఛనిస్తే అవి కనిష్ఠ ఉపరితల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

పెయింట్‌ బ్రష్‌ను నీటిలో ముంచినప్పుడు దాని వెంట్రుకల మధ్య చేరిన నీరు సాగదీసిన పొరల రూపంలో ఉండడంతో వెంట్రుకలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరిగి నీటిలో పరుచుకుంటాయి. బ్రష్‌ను నీటిలో నుంచి బయటకి తీసినప్పుడు, ఆ పొరలకు స్వేచ్ఛ లభించి వాటి ఉపరితల వైశాల్యం కనిష్ఠ పరిమాణం పొందడానికి ప్రయత్నిస్తాయి. దాంతో బ్రష్‌ వెంట్రుకలు ఒకదానికొకటి దగ్గరై అంటుకుని పోతాయి.

ఈతకొట్టే వ్యక్తి తల వెంట్రుకలు నీటిలో చెదిరిపోయి, నీటిలోంచి లేవగానే తలను అంటుకు పోవడానికి కూడా ఇదే కారణం.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?, There are no hair growth on palm why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?

- జి. హరీష్‌, పెన్నమహాబిలం

జవాబు
: చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి. వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?, Does the Sun loosing weitht daily?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?

-కె. స్వప్న, 9వ తరగతి, మహబూబ్‌నగర్‌

జవాబు:
సూర్యునిలో ప్రతి సెకనుకు 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. ఫలితంగా కాలం గడిచే కొద్దీ సూర్యుని ద్రవ్యరాశి (mass) తగ్గి తేలికవుతాడు. సూర్యుని అంతరాల్లో జరిగే కేంద్రక సంయోగ చర్య (nuclear fusion) ద్వారా నాలుగు హైడ్రోజన్‌ పరమాణువులు ఒక హీలియం పరమాణువుగా మారుతుంటాయి. ఈ ఒక్క హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్‌ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ.అంటే హైడ్రోజన్‌ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి శక్తిగా మారుతోందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన E=mc సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతి వేగం. ఆ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవిత కాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌.

 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఖుజురహో సంగతులేమిటి ?, What about Khujuro in Indiaఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

భారతీయ శిల్పకళ , సంగీతం , నృత్యం , కామకళ తో సహా ఇతర కళలన్నింటినీ సజీవం గా మలచిన దేవాలయాల నియలం ఖుజురహో . 10 వ శతాబ్దం లో ' చండేలా రాజ వంశస్థులు " నిర్మించారని చరిత్ర చెబుతోంది . మొత్తం 85 మందిరాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నా నేడు మిగిలినవి 20 మందిరాలే . మిగతావి శిధిలమై పోయి ఉంటాయి . ఇవి శైవ , వైష్ణవ , జైన , తాంత్రిక మందిరాలు . చండేలా రాజ వంశ పతనం తర్వాత ఆ ప్రాంతం వదలివేయబడినది . . ఆ దేవాలయాల చుట్టు అడవులు పెరిగి కనిపించకుండా పోయాయి .
అటువంటి దేవాలయాలు తిరిగి బ్రిటిష్ పాలనలో ఒక ఇంజనీర్ కంటపడి వెలుగు చూసాయి . నాటినుండి ఖజురహో శిల్పాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ శిల్ప కళలను కామసూత్ర ఆధారము గా మలిచారనిపిస్తుంది . ఆ విధం గా భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని అన్నిదేశాలవారూ కొనియాడారు . ఖజురహో వచ్చిన విదేశీయులు , యాత్రికులు వెయ్యేళ్ళ క్రితమే భారతీయ సంస్కృతి ఇంత ముందున్నదా ! అని ఆశ్చర్యపోతుంటారు . దేవాలయాల గోడలపైన అటువంటి లైంగిక శిల్పాలు ఎందుకు చెక్కిఉంటారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కావడంలేదు . వారు ఎందుకోసము చేసినా నేడు మనకు కనువిందు చేస్తుంటాయి ... అందుకే ఖజురహో ఒక్కసారైనా తిలకించాలి
ఖజురహో నేటి మధ్యప్రదేశ్ రాస్ట్రం లో పలు పర్యాటక క్షేత్రాలలో ముఖ్యమైనది గా చెప్పుకోబడుతున్నది . ఢిల్లీ నుండి వారణాసి వెళ్ళే విమానాలు ఖజురహో లో ఆగి వెళ్తాయి. రైల్ లో వెళ్ళేవారు ఝాన్సీ, లేదా సాత్నా రైల్ స్టేషన్‌ దిగి బస్ లో ఖజురహో వెళ్ళవలసి ఉంటుంది .
 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, May 18, 2011

హెల్మెట్" ఎందుకు వాడతారు?,Why do byke riders use Helmet?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

హెల్మెట్" ఎందుకు వాడతారు?,Why do byke riders use Helmet?

మొదట హెల్మెట్ ను ఆటలలో ఉదా: ఫుట్ బాల్ , హాకీ ఆటగా్ళ్ళు తలకు దెబ్బలు తగకుండా 19 వ శతాత్భం మొదటనుండే ఉపయోగించేవారు . కాలక్రమేనా అది మోటారు వాహన పందేలలో తలను కాపడేందుకు ముఖ్యము గా వాడడం మొదలు పెట్టేరు .

చరిత్రలో మొటార్ సైకిల్ ను 1885 లో " Gottlieb Daimler" అనే వ్యక్తి కనిపెట్టగా అది ఎన్నోవిధాలుగా మార్పులు చెంది నేటి అధునాతన మోటార్ బైక్ గా తయారైనది .
1931 -1953 సం.మధ్య కాలములో మోటారు సైకిల్ పందేలలో జరిగే ప్రమాదాలనుండి రక్షణ పొందేందుకు అమెరికా 'సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటి' ప్రొఫెషర్ " Red" Lombard ఆలోచనా ఫలితమే ఈ మోటార్ సైకిల్ హెల్మెట్ . 1953 లో పేటెంట్ హక్కులు పొందిన లొంబార్డ్ -- హెల్మెట్ ని ఎన్నో విధాలుగా డిజైన్‌లు మార్చి ప్రపంచానికి అందించారు .
-- భారతదేశం లో పురాతన రాజుల కాలమునుండే యుద్ధకాలములోనూ, సైనికులు , రాజులు తలను రక్షించుకునే నేపద్యములో హెల్మెట్ ను వాడేవారు . దీనిని ' శిరశ్రానము ' అనేవారు . రామాయణం , మహాభారతం లోనూ ఈ శిరశ్రాణం ధరించే ఆచారము , అవసరము అయిన చరిత్ర ఉన్నది . అనేక రకాల లోహాలతోనూ, చైన్‌ల తోనూ తయారుచేసేవారని ... కొంతమంది రాజులు బంగారము తోనూ తయారైనవి ధరించేవారని ప్రస్తావన ఉన్నది .

ఉపయోగాలు :
హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనం నడపడం చాలా మందికి నచ్చదు . జుట్టు చెరిగిపోతుందనో , తలకు ఉక్కపోస్తుందనో , వెంట్రుకలు పాడవుతాయనో , అదో శిరోభారం అనుకునో హెల్మెట్ ధారణకు " నో " చెప్పేస్తుంటారు . అది మంచి ఆలోచన కాదు .

శరీరంలోని అన్ని అవయవాలకంటే కూడా తలకు విశిష్టమైన స్థానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తలలో భద్రంగా ఉండే మెదడు అన్ని శరీర భాగాల చేత పని చేయిస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. ఏదేని ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలితే, తగిలిన చోట ఉన్న మెదడు కణాలు (న్యూరాన్లు) నశిస్తాయి.

శరీరంలో ఉన్న మిగతా కణాలకు, న్యూరాన్లకు స్వల్పమైన తేడా ఉంది. శరీరంలో నశించిన న్యూరాన్ల స్థానంలో కొత్తవి తయారు కావు, కానీ కణాలు మాత్రం కొత్తవి తయారవుతాయి. న్యూరాన్లు నశించటంతో అప్పటివరకూ ఆజమాయిషీ చేస్తోన్న అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

దెబ్బ తీవ్రతను బట్టి కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడటం, జ్ఞాపకశక్తిని కోల్పోవటం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి... తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి టూవీలర్స్‌ను నడిపేవారు హెల్మెట్‌ను ధరిస్తారు. ఈ హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది.

మెదడుకు తగిలే గాయాలనుండే కాకుండా సెర్వైకల్ స్పైన్‌ గాయాలనుండి హెల్మెట్ రక్షిస్తుంది .

 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, May 14, 2011

పలురకాల పత్రాలు ఉన్నాయంటారు.అవి ఏమిటి , What are the meanings of patramu in telugu?.ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పలురకాల పత్రాలు ఉన్నాయంటారు.అవి ఏమిటి , What are the meanings of patramu in telugu?.

ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా విద్య, వ్యాపారము, సినిమా, నాటకము.. ఇలా దేని గురించైనా నలుగురికి తెలియ జేయటానికి 'కరపత్రాల వాడకం విస్తృతంగా ఉంది. కరపత్రము అనేదాన్ని ఇంగ్లీషులో 'పాంఫ్లెట్‌ అంటారు.
మరి తెలుగులో 'పత్రము అనేదాని గురించి తెలుసుకుందాం.

పత్రం అంటే ఆకు, ఉత్తరం, బాణము, చురకత్తి, పక్షిరెక్క, పుస్తకంలోని కాగితం, వాహనము, వ్యవహారార్థం రాసుకున్న కాగితం వంటి అర్థాలున్నాయి. కాగా ఆకు, పట్టకము, పతనము, పత్తిరి, పర్ణము, ఛాదనము వంటి ఎన్నో పర్యాయ పదాలున్నాయి.
పత్రము అనే పదాన్ని ఆకు అనే అర్థంలో తీసుకుంటే పచ్చని ఆకును హరితపత్రము అని చిరిగిన ఆకును శీర్ణపత్రము అని అంటారు. ఎండిన ఆకును జీర్ణపత్రము అని అంటారు. ఒకప్పుడు కవిత్వాన్ని తాటాకులపై రాసేవారు.

ఆ తాటాకులను తాళ పత్రములు అనేవారు. శ్రీకృష్ణుడు పడుకున్న ఆకు వటపత్రము. అందుకే అతణ్ని వటపత్రశాయి అని అంటారు. చెవి తమ్మెను, చెవికి పెట్టుకునే ఆభరణాన్ని (నగను) కర్ణపత్రము అని అంటారు. ఎండ ాకాలంలో, వానా కాలంలో మనకు ఎంతో అవసరమైన గొడుగును ఆతపత్రము అని అంటారు. ఇంక పూలలో ఒకటయిన ప్రసిద్ధమైన తామర పూవ్ఞను సహస్రపత్రము, చిలుక, తామర, నెమలి వంటి వాటిని శతపత్రము అని అంటారు. ఎన్నో కథలకు మూలమైన బాణాన్ని కంకపత్రము అని అంటారు.

పత్రిక, మాసపత్రిక మున్నగు వాటిపైన ఉండే కాగితాన్ని (కవర్‌పేజిని) ముఖపత్రము అంటారు. ప్రభుత్వం తాము చేసే పనులు, విధానాలు, మున్నగు వాటి గురించి ప్రచురించే పత్రాన్ని శ్వేతపత్రము అంటారు. మెట్ట తామర, భూర్జవృక్షాన్ని ఛత్ర పత్రము అంటారు.
పత్రాలు రాసుకున్నారా, పత్రాల మీద సంతకాలు పెట్టారా అని అడగటం మనం వింటుంటాం. ఇక్కడ పత్రము అంటే కాగితం అని అర్థం. ఆకుల నీడ అని అనటానికి పత్రచ్ఛాయ అంటారు.
ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన భరతుడు అనే చక్రవర్తి తల్లి అయిన శకుంతల తన భర్త అయిన దుష్యంతునికి తామరాకు మీద (పత్రంమీద) ఉత్తరం రాసిందట. రుక్మిణి తన మనసులోని మాటను పత్రంమీద రాసి శ్రీకృష్ణుడికి పంపిందట. అలాటి ఉత్తరాలను వాచకపత్రాలు అంటారు. లత్తుక రసం, గోరింటాకుతో స్త్రీలు చేతులు, చెంపలు మున్నగు వాటిపై మకరికా పత్రాలను చిత్రించుకునే వారట. ఈరోజుల్లో ఉద్యోగ ప్రవేశపత్రము, ఉద్యోగ విరమణ పత్రము వంటి పదాలు వాడుకలో ఉన్నాయి.
దేవ్ఞడిపూజకు ఫలమో, పత్రమో, పుష్పమో ఉపయోగించాలని పెద్దలు చెపుతారు. వినాయక చవితినాడు చేసే పూజలో 21రకాల పత్రాలతో పూజచేస్తాం.

చూశారా పదం ఒక్కటే, దాన్ని ఎన్ని విధాలుగా, ఎన్ని అర్థాలలో ఉపయోగిస్తున్నామో మన తెలుగు పదసంపద ఎంత గొప్పదో తెలుసు కుని దాన్ని సొంతం చేసుకోవాలి. దానిలోని తీయదనాన్ని అనుభ వించాలి.

 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, May 10, 2011

అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?, Why is the Day starts with midnight only?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీ అత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?, Why is the Day starts with midnight only?

జ : అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థరాత్రి జన్మదినోత్సవాలు, ఇలా అర్థరాత్రితోనే మనరోజు ఎందుకు ప్రారంభమవుతుందీ అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అదేమిటి పిచ్చి ప్రశ్న అని కొట్టెయ్యకుండా, అది ఇంగ్లీషువారి పద్ధతిలే అని దాటెయ్యకుండా ఆలోచిస్తే ఒక కొత్త విషయం బయటకు వస్తుంది!

నిజానికి ఏ తెల్లవాడికైనా అర్థరాత్రి తోనే రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? విద్యుత్తు దీపాలు కూడా లేని నాడు, కనీసం గడియారాలు కూడా లేని నాడు, అర్థరాత్రికి ఎవడూ మేలుకుని వుండని నాడు, దానితో రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది?

వైదీకకాలంలో అంటే బౌద్ధమతానికి కూడా పూర్వకాలంలో ప్రపంచంలో మతం అన్న మాట కూడా లేని కాలంలో, ఒకే ఒక ధర్మం వుండేదట. అదే భారతీయ లేక వైదీక సనాతనధర్మం. అది భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతటా వ్యాపించి వుండేదిట. భారతదేశం ఈ వైదీకసంస్కృతికి ఒక రకంగా నాయకత్వం వహించేది అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ, జైన మతాలవంటివి పుట్టి అమిత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆదిశంకరుడు మళ్ళీ మన మతాలను ఉద్ధరించి సనాతనధర్మాన్ని పునఃస్థాపితం చేసాడు. ఆ తరువాత ఇంకా అనేక మతాలు విడివిడిగా జన్మించి, అలా ఒక్కొక్కరికి ఒక మతం వచ్చేసాక, ఇక ఈ వైదిక ధర్మాన్ని ఏమని పిలవాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు, అదే కాలంలో భారతీయులని హిందూ దేశస్తులని పర్షియన్లు పిలవడం మొదలు పెడితే, అదే పేరుని పెట్టి మన మతాన్ని కూడా పిలవడం మొదలు పెట్టారు. అలా మనకు హిందూమతస్తులని పేరు పడిపోయింది కానీ, వైదీక సనాతనధర్మానికి నిజంగా పేరు లేదు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సనాతనధర్మం వల్ల భారతదేశం ప్రపంచానికి ఒక సాంస్కృతికరాజధానిగా వుండేది. అలా ఆ కాలంలో అందరూ వైదీకకాలమానాన్ని అనుసరించేవారు. భారతీయ సంస్కృతిని గౌరవించి పాటించేవారు అని చెప్పుకోవచ్చు.

ఇలా వైదీక పద్ధతిని అనుసరించడానికి ప్రపంచం కట్టుబడి వుండేదన్న విషయం అంగీకరిస్తే, దినారంభం గురించి ఆలోచించడానికి పునాది సిద్ధమైందన్నమాట. -- ఇందాక చెప్పుకున్నట్లు సూర్యోదయమైతేగానీ, భారత పంచాంగం ప్రకారం రోజు మొదలవ్వదు. సామాన్యంగా భారతదేశంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అంటే యూరప్ దేశవాసులు మంచి నిద్రలలో ఉంటారన్నమాట. అంటే గడియారాలు గట్రా లేని కాలంలో ... " ఎప్పుడో అర్థరాత్రికి వైదీకదినం మొదలవుతుందిలే" ... అని అనుకునేవారు. అంటే మన పంచాంగ పట్ల, లేక భారతీయ సంస్కృతిపట్ల వున్న అభిమానంతో, భారత దేశంలో రోజు ఎప్పుడు మొదలు అయితే, అప్పుడే యూరోపియన్లు కూడా తమ రోజును అదే సమయానికి, …. అంటే అది అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా, …. … అదే సమయానికి తమతమ రోజులను మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారన్న మాట. ఈ విధంగా ఇలా అర్థరాత్రికి వారి దినం మొదలు పెట్టుకునే సాంప్రదాయాన్ని అలవరుచుకున్నట్లుగా కనపడుతున్నది. మనపంచాంగం ప్రకారం స్థానికకాలమానంతో సంబంధంలేకుండా ఎక్కడైనా తిథులను ఇలాగే ఒకే సమయంలో అమలు పరుచుకోవడం కూడా సాంప్రదాయమే. దానినే వీరు దినారంభానికి కూడా వర్తించినట్ట్లు తెలుస్తోంది.
 • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, May 07, 2011

సినిమాల్లో బండి వేగంగా వెళ్లేప్పుడు చక్రాలు వెనక్కు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి, ఎందుకు?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: సినిమాల్లో బండి వేగంగా వెళ్లేప్పుడు చక్రాలు వెనక్కు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి, ఎందుకు?

-మణి, వివేకానంద పబ్లిక్‌ స్కూలు, ఐలేశ్వరం

జవాబు: సినిమాల్లో జట్కాబళ్లు, ఎడ్లబళ్లు, కార్ల చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్టు కనిపించడం దృష్టి భ్రమ (optical illusion)కి ఒక ఉదాహరణ. సినిమాల్లో దృశ్యాలన్నీ ఫిలిం రీలులో విడివిడి బొమ్మలుగా ఉంటాయనేది తెలిసిందే. వీటినే ఫ్రేములు అంటారు. ఒక సెకనులో 16 ఫ్రేముల కన్నా ఎక్కువగా తెరపై దృశ్యాలు పడేంత వేగంగా ఫిలింరీలు తిరిగేప్పుడు అవి ఒకదాని వెంట ఒకటిగా మారడాన్ని మనం గుర్తించలేము. ఎందుకంటే ఇది మన కంటికి ఉన్న పరిమితి. అందువల్లనే తెరపై పడే విడివిడి ఫ్రేములు కలిసిపోయి కళ్ల ముందు ఒకే దృశ్యంగా కనిపిస్తాయి. ఇప్పుడు సినిమాలో పరిగెడుతున్న జట్కాబండిని తీశారనుకుందాం. దాన్ని చిత్రీకరించే సమయంలో జట్కాబండి చక్రం తిరిగే వేగం కన్నా, ఆ దృశ్యాలున్న ఫిలిం రీలు వేగంగా తిరుగుతుంది. అంటే బండి చక్రంలో ఒక భాగం ముందుకు తిరిగేలోపే ఫిలిం రీలులో ఫ్రేము మారిపోతుందన్నమాట. అందువల్ల సినిమాలో మిగతా దృశ్యం సహజంగానే కనిపించినా, బండి చక్రం కేసి చూసినప్పుడు మాత్రం అది వెనక్కి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక-- ్బారావు, హైదరాబాద్
 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మెదడులో ఏ భావాలెక్కడ?, Do you know Brain feeling Centers?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: మెదడులోని ఏయే ప్రదేశాల్లో భావోద్వేగాలు, ఉద్రేకాలు ఉత్పన్నమవుతాయి?

- కె. ఫణిరాజారావు, ఇంటర్‌, కర్నూలు

జవాబు: మెదడు క్రియాశీలతను పరిశీలించి అధ్యయనం చేయడానికి అయస్కాంత అనునాద చిత్రీకరణ (మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ అండ్‌ ఇమేజింగ్‌) లాంటి ఆధునిక పద్ధతులు శాస్త్రవేత్తలకు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనల ద్వారా మెదడులోని ఏయే ప్రదేశాలు మానవుల భావోద్రేకాలను నియంత్రిస్తాయో తెలుసుకోగలుగుతున్నారు. భయం, కోపం లాంటి ప్రాథమిక భావోద్వేగాలు మెదడులోని 'ఎమిగ్డాలా' (Amygdala) అనే ప్రదేశంలో కలుగుతాయి. అప్రియమైన భావాలు కార్టెక్స్‌ ముందు భాగంలో మొదలవుతాయి. పరిశోధకులు ఈమధ్య మానవులకు ఉండే 'ఆరవ జ్ఞానం' (సిక్త్స్‌ సెన్స్‌) మూలాలను కూడా కనుగొన్నామని ప్రకటించారు. ఇది మెదడును కుడి, ఎడమ భాగాలుగా విభజించే గోడల వెంట ఉండే 'ఏంటీరియర్‌ సింగులేట్‌ కార్టెక్స్‌' నుండి కలుగుతుంది. ప్రేమలాంటి సంక్లిష్ట భావనల విషయంలో మెదడులోని ఎమిగ్డాలా, హార్మోన్లను నియంత్రించే హైపోథాల్మస్‌, జ్ఞాపకశక్తి నిక్షిప్తమై ఉండే హిపోకాంపస్‌, జ్ఞానేంద్రియాల ప్రభావాలను వడబోసే థాలామస్‌ లాంటి వివిధ ప్రదేశాల సమైక్య ప్రమేయం ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
 • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, May 02, 2011

మెర్సీ కిల్లింగ్(కారుణ్య మరణము)అంటే ఏమిటి ,What is Mercy Killing?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మెర్సీ కిల్లింగ్(కారుణ్య మరణము)అంటే ఏమిటి ,What is Mercy Killing?

ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుంది. 'అబ్బ...ఎంత దౌర్భాగ్యం ఈ జీవితం. నరకయాతన పడుతున్నా కనీసం చావుకైనా కనికరం కలగలేదే...'
చివరి దశలో కొంత మంది వ్యక్తులు నయం కాని జబ్బులతో నరకయాతన పడుతుంటారు. ఉదాహరణకు కేన్సర్ వ్యాధి ముదిరిన తర్వాత రోగులు చెప్పుకోలేని విధంగా ప్రాణ సంకటం అనుభవిస్తుంటారు. వీరికి పెయిన్ కిల్లర్స్, సెడిటివ్స్ పనిచేయవు. పైగా ఇవి వ్యసనంలా తయారవుతాయి. ఈ సమయంలో మెర్సీ కిల్లింగ్ - అంటే కారుణ్య మరణమే మంచిది. తలకు తగిలిన తీవ్రగాయాలతో కొంత మంది జీవితాంతం మంచాన ఉండిపోతారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. స్పందనలు ఉండవు. వెజిటేటివ్ బ్రెయిన్ అంటారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్‌తో కొంతమంది బయటిప్రపంచంతో సంబంధం లేకుండా మంచాన అచేతనంగా ఉండిపోయి, మందులకు కూడా స్పందించకుండా, నయం కాని జబ్బులతో దీర్ఘకాలం బాధపడుతుంటారు. ఇటువంటి వారి విషయంలో కారుణ్య మరణమే పరిష్కారం. భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ అంటే- కారుణ్య మరణాలకు అనుమతిస్తే దుర్వినియోగమవుతుందనే అపోహలు ఉండవచ్చు. కాని ఇందులో నిజం లేదు. ఏ విధానంలోనైనా ఎక్కువ శాతం సమాజానికి ఉపయోగం ఉంటుందా అనే కోణంలో చూడాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇండిపెండెంట్ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇందులో వైద్య నిపుణులు, న్యాయ కోవిదులు, సామాజిక కార్యకర్తలు, ఎన్‌జివో సంఘాల నేతలు ఉండాలి. ఆసుపత్రి యాజమాన్యం, రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఈ బోర్డులో ఉండరాదు. వారు నిర్ణయం మేరకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి. కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చే ముందు కుటుంబ సభ్యులు సమ్మతిని తీసుకోవాలి. ఈ తరహా విధానంతో చట్టాన్ని రూపొందించాలి. ఏళ్లతరబడి నయం కాని వ్యాధులతో, నిరంతరం బాధపడే రోగుల వల్ల ఆర్ధికంగా కుటుంబం చిన్నాభిన్నమవుతుందనే సున్నిత మైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. వెంటిలేటర్లపై మనం కొంత మంది రోగులను పెడుతుంటాం. ఎంత కాలమని దాని ద్వారా రోగులు జీవించగలరు. చట్టాలను దుర్వినియోగం చేయకుండా పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయాలి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేస్ టు కేస్ స్టడీ చేసి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి లోపాలకు తావులేకుండా మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల వైద్యం అందించిన తర్వాత రోగి కోలుకోని దశలో, లోకంతో సంబంధంలేని స్ధితికి రోగి చేరుకున్నప్పుడు, కారుణ్య మరణం ఒకటే ప్రత్యామ్నాయ మార్గం. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యపరంగా అన్ని మార్గాలు మూసుకునిపోయిన తర్వాత కారుణ్య మరణం విషయాన్ని వైద్యులు, రోగి బంధువులు పరిశీలించాలి. కారుణ్య మరణాలకు అనుమతి ఇచ్చే విషయమై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎన్‌జివో సంఘాలు విస్తృత స్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి. మనదేశంలో చాలా మందికి మెర్సీ కిల్లింగ్ గురించి తెలియదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణగా చట్టాలను రూపొందించే ముందు ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరం.

కరుణ లేని మరణం

మరణం అతి బాధాకరమైనది- మరీ ముఖ్యంగా మృతుల దగ్గరివారికి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల జీవితమూ అత్యంత బాధాకరంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో చావే నయం అనిపిస్తుంది కూడా. కానీ ఇటు జీవితంపై ఆశ, దగ్గరివారి ప్రేమ, వైద్యుల సేవలూ జీవితాన్ని కొనసాగనిస్తుంటాయి. కానీ బాధ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి పడే దుర్భర వేదన చూసిన వాళ్లందర్నీ కదిలిస్తుంది. కలచివేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా చేయగల సహాయం ఏదైనా ఉంటే అది ఆ వ్యక్తికి మరణాన్ని ప్రసాదించడమే! కనీసం ఆ వ్యక్తికి వేదనను తగ్గించిన వారమయ్యామనే భావన ఉంటుంది. కానీ మరణాన్ని 'ప్రసాదించడం' ఎలా? మరణాన్ని ఏ రకంగా కలిగించినా అది అమానుషమే కదా. హత్యే కదా. ఘోరమే కదా? అయితే ఇక్కడ మనం గమనించవలసింది అవతలి బాధితుడు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడన్నది. శారీరక, తద్వారా మానసిక వేదనకు గురైనప్పుడు, ఆ వేదనను మానవ ప్రయత్నాలు తగ్గించలేనప్పుడు, మరో దారి లేనప్పుడు, బాధతో జీవించడమా, బాధైనా మరణించడమా అన్న మీమాంసలో మరణమే మంచిదని కొందరి వాదన.

హిపోక్రటీస్‌ ఏమన్నాడు?

''నా అంతట నేను గానీ, రోగి కోరినా గానీ, మరెవరైనా సలహా ఇచ్చినా గానీ నేను ఎవరికీ ప్రాణాంతకమైన మందును ఇవ్వను''

వైద్యశాస్త్రం చదివిన వారు చేసే హిపోక్రటీస్‌ ప్రతిజ్ఞ లోని ఒక వాక్యం ఇది. క్రీస్తుకు పూర్వం 400 ఏళ్ల క్రితమే వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రటీస్‌ రూపొందించిన ప్రతిజ్ఞ ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు వారి బాధ్యతలను గుర్తుచేసే దిక్సూచి.

అయితే ప్రాచీన రోమన్లు, గ్రీకుల అభిప్రాయం వేరుగా ఉందేది. వారి దృష్టిలో జీవించడం ఇష్టంలేని వారికి, మరణం కోరుకున్న వారికి మరణాన్ని 'ఇవ్వడం' మంచిదే. కానీ పధ్నాలుగవ శతాబ్దంలో ఆత్మహత్య, లేదా ఆత్మహత్యకు తోడ్పడడం నేరాలుగా పరిగణించబడ్డాయి. న్యూయార్కులో 1828లోనే యుథనేసియా (మంచి మరణం)కి వ్యతిరేకంగా చట్టం చేయబడింది.

యుథనేసియాలో రెండు రకాలున్నాయి. స్వచ్ఛందంగా వ్యక్తి కోరే మరణం. మరోటి ఆ వ్యక్తికి వేదన తగ్గించే ప్రయత్నంగా ఇతరులు కలిగించే మరణం. పంతొమ్మిది వందల ముప్ఫయ్యవ దశకంలో హిట్లరు రెండవ రకపు యుథనేసియాని విరివిగా అవలంభించాడు.

'యాక్షన్‌ టి4' అనే పేరుతో నాజీలు ''జీవించడానికి తగని జీవితాన్ని'' నిర్మూలించే కార్యక్రమం చేపట్టారు. హిట్లరు స్వయంగా ఆ పనికి ఆదేశించాడు. తొలుత వారి దృష్టి పసిపిల్లలపై ఉండేది. బుద్ధిమాంద్యం, అవిటితనం వంటి లక్షణాలున్న పిల్లల్ని చంపేసేవారు. ఆ తరువాత దీర్ఘకాల వ్యాధులతో నయం కాని జబ్బులతో ఉన్న వారిని కూడా 'అతి జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత' 'కారుణ్య' మరణాన్ని ప్రసాదించవలసిందని హిట్లరు ఆదేశాలు జారీ చేశాడు. 1945 కల్లా సుమారు మూడు లక్షల మంది జర్మన్లు ఆ విధంగా 'చనిపోయారు'.

ఎవరీ అరుణా శాన్‌బాగ్‌?

అరుణా రామచంద్ర శాన్‌బాగ్‌ ముంబై లోని కె.ఇ.ఎమ్‌ ఆసుపత్రిలో పనిచేసే ఉపచారిక. నవంబరు 27, 1973 రాత్రి అదే ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న సోహన్‌ లాల్‌ వాల్మీకి ఆమెను కుక్క గొలుసుతో గొంతు బిగించి, అత్యాచారం జరిపాడు. మెడకు బిగిసిన చెయిన్‌ మెదడుకు ప్రాణవాయువు సరఫరా తగ్గించిన కారణంగా ఆమె సంపూర్ణంగా నిర్వీర్యమైపోయింది. అప్పటి నుండి అరుణ ఆసుపత్రి మంచానికే అంకితమైపోయింది. నోటి ద్వారా మెత్తని భోజనం పంపడం నుండి సకల సపర్యలూ మంచం మీదనే. ఆహారం తీసుకోవడం అన్న ఒక్క అంశం మినహా ఆమె ఏ కోణంలోనూ మానవ జీవితం అనుభవించడం లేదన్నది పింకీ విరానీ అనే జర్నలిస్టు వాదన. ఆ కారణంగా అరుణకు కారుణ్య మరణం ప్రసాదించమని ఆమె కోర్టును కోరింది. గత ఏడాది డిసెంబరు 17న ఈ కేసును స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ నెల ఏడున పింకీ విరానీ అభ్యర్ధనను తోసిపుచ్చింది.

అయితే ప్రాణాలు హరించే దిశగా మందులు ఇచ్చేకన్నా కీలకమైన మందులు, వైద్యం, ఆహారం వంటివి ఆపేయడం ద్వారా (పాజిటివ్‌) మరణాన్ని ఇవ్వవచ్చన్న తీర్పు సంచలనం రేపింది.

ఇంతకాలం అరుణను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమె సహోద్యోగులు ఈ తీర్పుతో ఆనందం వెలిబుచ్చారు. ''అరుణ ఒక చంటిపాపలా ఉంది. మాలాగే ఆమెకీ వయసు పెరుగుతోంది. ఆమె మాకేమీ భారం కాదు. ఇబ్బందీ కాదు. ఆమెకు సపర్యలు చేయడం మాకెంతో సంతోషం. ఆమె ప్రాణాలు తీయడానికి మేం ఒప్పుకోం. కోర్టు ఈ కేసు కొట్టేసినందుకు సంతోషం' అంటున్నారు.

కొసమెరుపు : ఒక నిండు జీవితాన్ని 27 ఏళ్లపాటు నిరర్థకంగా ఉండిపోవడానికి కారణమైన సోహన్‌లాల్‌ వాల్మీకికి పడిన శిక్ష ఏడేళ్లు. శిక్షకి కారణం దోపిడీ, హత్యాయత్నం!!

చట్టబద్ధం చేసిన దేశాలు

కారుణ్య మరణాలపై భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయి. గత శతాబ్దపు ముప్ఫయ్యవ దశకాల్లోనే యుథనేసియాకి అనుకూలంగా కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆస్ట్రేలియాలో 1995లో అనుకూలంగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అది 1996లో అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి ఏడు నిషేధించబడింది! అమెరికాలో 1998లో ఓరిగాన్‌ రాష్ట్రంలో యుథనేసియా చట్టబద్ధం చేయబడింది. రెండు వేల సంవత్సరంలో నెదర్లాండ్‌ యుథనేసియాని చట్టబద్ధం చేసి, అలా చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈనాడు బెల్జియం, లక్సెంబర్గ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలు కూడా నెదర్లాండ్‌ సరసన చేరాయి. అమెరికాలో ఓరిగాన్‌ సరసన వాషింగ్టన్‌ రాష్ట్రం చేరింది.

మన దేశంలో...

మన దేశంలో కొన్ని వారాల క్రితం వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు 'సాత్విక' (పాజిటివ్‌) కారుణ్య మరణాన్ని అవలంభించ వచ్చని చెప్పింది. అయితే సదరు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు అలాగే ఉంటాయి. ఆ బిల్లు వచ్చిన తర్వాత ఏదో రకంగా కారుణ్య మరణాలని చట్టబద్ధం చేసిన దేశాల క్రమంలో మన దేశమూ చేరుతుంది.

కారుణ్య మరణాలు ఎంత వరకు సమంజసం అన్నది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న. ఒక మూడు నాలుగు దశాబ్దాల కిందట 'అబార్షన్‌' అనేది తల్లి ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే అవసరమైన ప్రక్రియగా వాదించేవారు. కానీ ఇప్పుడు 'తొందరపాటు' గర్భాలనీ, అవాంఛనీయ (ఆడశిశువులైతే) గర్భాల్నీ తొలగించుకోవడానికీ అబార్షన్లు సాధారణమైపోయాయి. తోటి మనిషి బాధలో ఉంటే ఆ బాధ తొలగించే ప్రయత్నాలు చేయడం మానవీయత. ఆ ప్రయత్నాలు విఫలమైతే, ఆ బాధ ప్రకోపిస్తే, ఆ బాధితుడు కోరితే అతనిని ఆ బాధ నుండి, ఆ జీవితం నుండి విముక్తుణ్ణి చేయడం కూడా మానవీయతే అంటారు కొందరు. అసలు ప్రాణాలు తీసే హక్కు వైద్యులకు ఎవరిచ్చారంటారు ఇంకొందరు. వైద్యం ఉన్నది బాధితులకు సుఖాన్నివ్వడానికే. అంటే బాధను తొలగించడానికే. ఆ తొలగింపు మరణం వల్లనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు ఆ మరణాన్ని త్వరితం చేసి వేదనను తగ్గించడం మంచిదే కదా అన్నది కొందరి సూచన.

ఈ సమస్య ఇలా ఎప్పటికీ జటిలంగానే ఉంటుంది. కారణం నిర్ణయాధిక పేషెంటు కోరినంత మాత్రాన చంపేయవచ్చా? 'తీవ్రమైన బాధ'ను నిర్ణయించేది ఎవరు? ఆత్మహత్యకు పురిగొల్పే పరిస్థితులన్నీ ఆయా వ్యక్తులకు తీవ్రమైనవే! పరీక్షలో తప్పడం, ప్రేమ విఫలమవడం, అమ్మ తిట్టడం, డిప్రెషన్‌, ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఒంట్లో అనేక సమస్యలు వంటివి ఆ పరిస్థితులను భరించలేనివే. ఆ కారణాలను సాకు చేసుకుని ''భరింపరాని మానసిక బాధ ఉంది డాక్టర్‌, ఒక ఇంజెక్షన్‌ ఇచ్చి, చంపేసి పుణ్యం కట్టుకోండి'' అని ఎవరూ వెళ్లరా? ఫీజు తీసుకుని డాక్టర్లు కారుణ్య మరణాలు సునాయాసంగా ప్రసాదించవచ్చు! అందువల్ల యుథనేసియాకి వ్యతిరేకత అధికంగా ఉంది.

కానీ అందరికీ 'అందుబాటు'లో లేని వైద్యం (అధిక ఖరీదు కారణంగా) వల్ల చాలా వ్యాధులు ముదిరి దీర్ఘకాలిక పరిస్థితులుగా మారుతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గించుకునే లేదా మిగుల్చుకునే నెపంతో కూడా రోగులు మరణాన్ని కోరుతున్నారు. విశాఖపట్నంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈశ్వరరావు ఉదంతం మరో కోణాన్ని చూపుతోంది. తప్పుడు రోగ నిర్థారణ, శస్త్రచికిత్స సరిగా చేయకపోవడం వల్ల ఈశ్వరరావు ఇబ్బంది పడ్డాడు. లేని హెచ్‌ఐవి ఉన్నట్లు చూపడం వల్ల గ్రామస్థులు, బంధువులు తనని వెలివేసినట్లు చూస్తున్నారని, తన మానసిక వేదన భరించలేకపోతున్నానని, తనకు మరణం ప్రసాదించాలంటూ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటువంటి అనేకానేక విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో యుథనేసియాకి పచ్చజెండా ఊపితే ఉపద్రవమే అని భావించి కాబోలు న్యాయస్థానం అందుకు ఆమోదం తెలుపలేదు.

చట్టబద్ధమా! కాదా!

అయినా, మనకి కారుణ్య మరణం చట్టబద్ధమా కాదా అన్న సమస్య లేదు. సరైన వైద్యం సకాలంలో అందక చనిపోయేవారు కోకొల్లలు. అసమర్థ వైద్యుల కారణంగా వైద్యం వికటించి ప్రాణాలు విడిచినవారు అసంఖ్యాకులు. డబ్బిస్తే తప్ప మందివ్వననే 'జబ్బున్న' డాక్టర్ల చేతిలో హరీమన్న వాళ్లకు లెక్కలేదు. పెంపుడు జంతువులు, రేసుగుర్రాలు గాయాలతో విలవిల్లాడుతుంటే యజమానులు వాటిని చంపి వాటికి బాధావిముక్తి కలిగించేవారు. యుద్ధాల్లో తోటి సైనికులు దెబ్బలతో అల్లాడిపోతుంటే వారికి చావు ద్వారా సుఖాన్ని ఇవ్వడం మామూలే. కానీ సాధారణ పౌరుల జీవించే హక్కుకి గౌరవమివ్వాలా? వారు కోరే మరణానికి విలువ ఇవ్వాలా? అన్నది తేలని సమస్య. కరుణ చూపవలసింది జీవితం వైపా? మరణం వైపా? ఎవరి దృష్టి వారిది. అసలీ అంశాన్ని మన దేశంలో చర్చకు తెరతీసిన అరుణా శాంబాగ్‌ మానవజీవితం కాని జీవితం గడుపుతోంది. ఆమె జీవించినంత కాలం బాధ లేకుండా ఇతరులకు భారం కాకుండా జీవించి, సహజ మరణాన్నే పొందాలని కోరుకుందాం.

అత్యున్నత తీర్పు

మెర్సీ కిల్లింగ్‌ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చట్టం యొక్క అనుమతితో తీసుకోవాల్సిన చర్య. గతంలో కూడా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులివ్వడానికి నిరాకరించిన సందర్భాలున్నాయి. ''బ్రెయిన్‌ డెడ్‌'' అయితేనే ఇలాంటి చర్యలకు అనుమతినిస్తారు.

నర్స్‌ అరుణ రామచంద్ర శాన్‌బాగ్‌ గత కొన్ని సంవత్సరాలుగా మంచంపైనే పడుంది. తన పనులు తాను చేసుకోలేక స్పృహ ఉన్నా...లేకున్నా...బ్రతికుండి బాధను భరించలేకుండా ఉన్నదని శాన్‌బాగ్‌ మళ్లీ సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది. చట్టంలో మెర్సీ కిల్లింగ్‌ (కారుణ్య మరణం) అనేది ఎక్కడా ఉదహరించలేదు. కావున చట్టపరంగా అనుమతినిచ్చే ... నిరాకరించే ప్రసక్తి రాదు అని అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.మరణం సంభవించేవరకు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి అర్హత ఉంటుందనేది సారాంశం. చట్ట ప్రకారం మెడిసిన్‌ ఇవ్వకుండా పరోక్షంగా జీవితాన్ని పొడిగించకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణాన్ని కల్గించవచ్చు. కానీ మందులు ఇచ్చి చేజేతులా ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. దీనికి చట్టం అనుమతించదు అని మానవత్వం పరిఢవిల్లేలా సుప్రీం ధర్మాసనం 7-3-11న తీర్పు చెప్పింది.

జి.ఎల్‌.నరసింహారావు,హైకోర్టు అడ్వకేట్‌.
 • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, May 01, 2011

ట్యూబ్‌లైటు వెలుగులో కిరణజన్య సంయోగ క్రియ జరగదా?,Do photo-synthesis occur in Tube light rays?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.ప్రశ్న: కాంతి లేని సమయాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదెందుకు? ట్యూబ్‌లైట్‌ కాంతిలో ఈ క్రియ జరగుతుందా?

-ఎమ్‌. నిఖిల్‌, నక్కల గుట్ట (వరంగల్‌)

జవాబు: మొక్కల్లో జరిగే ఆ చర్య పేరే కిరణ జన్య సంయోగ క్రియ (Photo-synthesis). కాంతి కిరణాల సమక్షంలో జరిగేది కాబట్టే ఆ పేరు. ఈ క్రియలో పాల్గొనే నీరు,

కార్బన్‌ డయాక్సైడుల కన్నా వాటి నుంచి ఏర్పడే పిండి పదార్థాలకు శక్తి ఎక్కువ. అంటే శక్తి తక్కువ ఉన్న పదార్థాలు కలిసి శక్తి ఎక్కువగా ఉన్న పదార్థాలుగా మారాయన్నమాట. శక్తిని

సృష్టించలేమనీ, నశింపచేయ లేమని శక్తి నిత్యత్వ సూత్రం (Law of conservation of energy)లో చదువుకుని ఉంటారు. కాబట్టి కాంతిశక్తే

పిండిపదార్థాలలో నిగూఢమవుతుందన్నమాట. కాంతి లేకుండా కిరణ జన్య సంయోగ క్రియ జరగదు. ట్యూబ్‌లైటు వెలుగులో కూడా ఈ క్రియ జరుగుతుంది. అయితే ఈ కాంతి తీవ్రత తక్కువ కాబట్టి నెమ్మదిగా జరుగుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.