Saturday, May 14, 2011

పలురకాల పత్రాలు ఉన్నాయంటారు.అవి ఏమిటి , What are the meanings of patramu in telugu?.



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పలురకాల పత్రాలు ఉన్నాయంటారు.అవి ఏమిటి , What are the meanings of patramu in telugu?.

ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా విద్య, వ్యాపారము, సినిమా, నాటకము.. ఇలా దేని గురించైనా నలుగురికి తెలియ జేయటానికి 'కరపత్రాల వాడకం విస్తృతంగా ఉంది. కరపత్రము అనేదాన్ని ఇంగ్లీషులో 'పాంఫ్లెట్‌ అంటారు.
మరి తెలుగులో 'పత్రము అనేదాని గురించి తెలుసుకుందాం.

పత్రం అంటే ఆకు, ఉత్తరం, బాణము, చురకత్తి, పక్షిరెక్క, పుస్తకంలోని కాగితం, వాహనము, వ్యవహారార్థం రాసుకున్న కాగితం వంటి అర్థాలున్నాయి. కాగా ఆకు, పట్టకము, పతనము, పత్తిరి, పర్ణము, ఛాదనము వంటి ఎన్నో పర్యాయ పదాలున్నాయి.
పత్రము అనే పదాన్ని ఆకు అనే అర్థంలో తీసుకుంటే పచ్చని ఆకును హరితపత్రము అని చిరిగిన ఆకును శీర్ణపత్రము అని అంటారు. ఎండిన ఆకును జీర్ణపత్రము అని అంటారు. ఒకప్పుడు కవిత్వాన్ని తాటాకులపై రాసేవారు.

ఆ తాటాకులను తాళ పత్రములు అనేవారు. శ్రీకృష్ణుడు పడుకున్న ఆకు వటపత్రము. అందుకే అతణ్ని వటపత్రశాయి అని అంటారు. చెవి తమ్మెను, చెవికి పెట్టుకునే ఆభరణాన్ని (నగను) కర్ణపత్రము అని అంటారు. ఎండ ాకాలంలో, వానా కాలంలో మనకు ఎంతో అవసరమైన గొడుగును ఆతపత్రము అని అంటారు. ఇంక పూలలో ఒకటయిన ప్రసిద్ధమైన తామర పూవ్ఞను సహస్రపత్రము, చిలుక, తామర, నెమలి వంటి వాటిని శతపత్రము అని అంటారు. ఎన్నో కథలకు మూలమైన బాణాన్ని కంకపత్రము అని అంటారు.

పత్రిక, మాసపత్రిక మున్నగు వాటిపైన ఉండే కాగితాన్ని (కవర్‌పేజిని) ముఖపత్రము అంటారు. ప్రభుత్వం తాము చేసే పనులు, విధానాలు, మున్నగు వాటి గురించి ప్రచురించే పత్రాన్ని శ్వేతపత్రము అంటారు. మెట్ట తామర, భూర్జవృక్షాన్ని ఛత్ర పత్రము అంటారు.
పత్రాలు రాసుకున్నారా, పత్రాల మీద సంతకాలు పెట్టారా అని అడగటం మనం వింటుంటాం. ఇక్కడ పత్రము అంటే కాగితం అని అర్థం. ఆకుల నీడ అని అనటానికి పత్రచ్ఛాయ అంటారు.
ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన భరతుడు అనే చక్రవర్తి తల్లి అయిన శకుంతల తన భర్త అయిన దుష్యంతునికి తామరాకు మీద (పత్రంమీద) ఉత్తరం రాసిందట. రుక్మిణి తన మనసులోని మాటను పత్రంమీద రాసి శ్రీకృష్ణుడికి పంపిందట. అలాటి ఉత్తరాలను వాచకపత్రాలు అంటారు. లత్తుక రసం, గోరింటాకుతో స్త్రీలు చేతులు, చెంపలు మున్నగు వాటిపై మకరికా పత్రాలను చిత్రించుకునే వారట. ఈరోజుల్లో ఉద్యోగ ప్రవేశపత్రము, ఉద్యోగ విరమణ పత్రము వంటి పదాలు వాడుకలో ఉన్నాయి.
దేవ్ఞడిపూజకు ఫలమో, పత్రమో, పుష్పమో ఉపయోగించాలని పెద్దలు చెపుతారు. వినాయక చవితినాడు చేసే పూజలో 21రకాల పత్రాలతో పూజచేస్తాం.

చూశారా పదం ఒక్కటే, దాన్ని ఎన్ని విధాలుగా, ఎన్ని అర్థాలలో ఉపయోగిస్తున్నామో మన తెలుగు పదసంపద ఎంత గొప్పదో తెలుసు కుని దాన్ని సొంతం చేసుకోవాలి. దానిలోని తీయదనాన్ని అనుభ వించాలి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...