Monday, February 28, 2011

టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?,Tomato juice is not coming out easily Why?
ప్రశ్న: టమాటా సాస్‌ సీసా నుంచి సులభంగా బయటకు రాదెందుకని?

-కె. నటరాజన్‌, ఇంటర్‌, తిరుపతి

జవాబు: టమాటా సాస్‌ అనేది టమాటాలు, సుగంధ ద్రవ్యాలు, కొన్ని మసాలా దినుసులు కలిపి తయారు చేసిన చిక్కని పదార్థం. దీనికి స్నిగ్ధత (viscosity) ఎక్కువగా ఉంటుంది. అదే నిండుగా నీరున్న సీసా నుంచి నీటిని పోయడం సులభం. ఎందుకంటే సీసాలోని నీరు కొంత వెలుపలకు రాగానే, దాని అడుగున ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించడానికి బయట ఉండే గాలి సీసా మూతి గుండా నీటిలోకి ప్రవేశించి ప్రయాణిస్తుంది. కానీ టమాటా సాస్‌ స్నిగ్ధత ఎక్కువ కావడం వల్ల గాలి బుడగలు దాని గుండా సులభంగా ప్రవేశించలేవు. అందువల్ల సీసా అడుగు భాగాన శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. తద్వారా పీడనాల తేడా ఏర్పడి, ఆ ప్రభావం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పని చేస్తుంది. దాంతో సాస్‌ బయటకు రాకపోగా సీసా అడుగు వైపునకు లాగబడుతుంది. అందువల్లనే సాస్‌ను బయటకి రప్పించడానికి సీసా అడుగుభాగాన్ని తట్టడమో, సీసాను విదిలించడమో చేయాల్సివస్తుంది. అదే ప్లాస్టిక్‌ సీసా అయితే దాని పక్క భాగాలను నొక్కి ఒత్తిడి కలిగించడం చేయవచ్చు. అలాగు సీసాలోకి ఒక స్ట్రాను నిదానంగా అడుగుభాగం వరకు గుచ్చితే, దాని గుండా బయటి గాలి అక్కడకి చేరుకుని సాస్‌ సులువుగా బయటకి వస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

రధసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఎందుకు?,Why do we take bath Gigantea leaves on head on Sun birthday?ప్ర : రధసప్తమి రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఎందుకు?
జ: జిల్లేడు ఆకులకు సూర్యరశ్మి తగలడం వల్ల ఓ అద్భుత శక్తి జనిస్తుంది . అందుకే రధసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని సూర్యదేవుని నమస్కారము చేసి మూడు సార్లు నదిలో మునిగి స్నానము చేయమని చెప్తారు . ఈ విధంగా చేయడం వల్ల శిరస్సు నుంచి శరీరానికి నూతన శక్తి ఆవహించి శరీర దోషాలనీ మటుమాయమవుతాయని నమ్మకం . ఈ స్నానము ప్రతిరోజూ చేయవచ్చును ... అలా చేయడం అందరికీ అవవు ... అందునా విసుగు పుడుతుందని సంవత్సరానికి ఒకసారైనా అదే హిందువుల పండగ రోజు అయిన రధసప్తమి నాడు ఆ నియమాన్ని పెట్టారు .

 • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మొబులా రే సంగతేమిటి ? , What about Mobula Ray ?

చాపలా వెడల్పుగా పరుచుకున్న శరీరం, సన్నని తోకతో గాలిపటంలా కనిపిస్తోంది కదూ! ఈ మొబులా రే. సముద్రంలో అంత ఎత్తున ఎగిరి మళ్లీ కిందకి దుమికే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది తెలుసా? ఇది ఎగిరినప్పుడు కొంత దూరం నుంచి చూస్తే చిన్న విమానం దూసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఆకారం కూడా విమానాన్ని పోలినట్టే ఉంటుంది. ఈ మొబులా రేలు ఎక్కువగా మెక్సికో, కాలిఫోర్నియా తీరాల్లో కనిపిస్తాయి. వీటిని చూడటానికి బోలెడు మంది పర్యాటకులు ఈ తీరప్రాంతాల్లో గుమిగూడతారు. అవి గాలిలో ఎగురుతుంటే ఫోటోలు తీసుకుని మురిసిపోతారు.

ఎగరడం అంటే పక్షుల్లా వేల కిలోమీటర్లు ఎగిరేస్తాయనుకోవద్దు. గెంతడమన్న మాట. ఇవి ఒక్కసారిగా పైకెగిరి సుమారు రెండు మీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి సముద్రంలో దబ్బున పడతాయి. ఆ సమయంలో వాటి రెక్కల్లాంటి మొప్పల్ని దగ్గరగా తీసుకుని అచ్చు పక్షిలాగా కనిపిస్తాయి. కాస్త తీరిక దొరికితే చాలు ఇవి ఇలా ఎగురుతూనే ఉంటాయి. అసలివి మాటిమాటికీ ఎందుకు ఎగురుతున్నాయో మాత్రం ఇంత వరకు తెలియలేదు. కొందరు శాస్త్రవేత్తలు అవి ఆనందం వేసినప్పుడు అలా ఆడుకుంటున్నాయని భావిస్తే, మరికొందరు ఆహారం పట్టుకోవడంలో అదో ప్రక్రియని చెపుతున్నారు. అలా ఎగిరినప్పుడు ఒంటిపై ఉన్న వివిధ పారాసైట్‌లను కిందకి రాలిపోతాయని, అవి తినడానికి వచ్చిన చేపల్ని పట్టి తింటాయని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని నీటిలో ఒకే దగ్గర గుంపులుగుంపులుగా ఉంటాయివి. అప్పుడు చూస్తే ఆ ప్రదేశమంతా నీలం దుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది.

ఈ మొబులా రేలు పదడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పున ఉంటాయి. బరువు ఒక టన్ను వరకు పెరుగుతాయి. రేల కుటుంబంలో మాంటారేల తరువాత ఇవే అతి పెద్ద రే జాతి. పరిమాణంలో పెద్దవే అయినా తినేవి మాత్రం రొయ్యల్లా కనిపించే క్రస్టసీన్స్‌, క్రిల్స్‌ చేపల్నే. వీటి సంఖ్య ఇప్పుడు ప్రమాదంలో పడింది. తీర ప్రాంతాల్లో ఇవి గుంపుగా ఉన్నప్పుడు జాలరులు వలలేసి పట్టేస్తున్నారు. అందుకే మెక్సికన్‌ ప్రభుత్వం వీటిని చంపితే పదివేల డాలర్ల జరిమానా విధిస్తోంది.

 • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, February 26, 2011

సీతారామ కళ్యాణము అనంతరము విశ్వామితృడేమయ్యాడు? , What happen to Viswamitra after Sitarama marriage?ఫ్ర : సీతాకళ్యాణము తర్వాత బ్రహ్మర్షి విశ్వామితృడు ఏమయ్యాడు ?.
జ : రామాయణము లో విశ్వామిత్ర పాత్ర తక్కువే అయినప్పటికీ కీలకమైనది . సీతారాముల కళ్యాణానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టము . రామాయణం లో ఆయన పాత్రకు అదే ప్రయోజనము ఆ తరువాత ఆయన కధ రామాయణ కవి కి అంతగా అవసరము లేదు ... రాలేదు . అలానే కొన్ని మిగిలిన పాత్రలు కూడా .

 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Why women kept outside seperatly during monthly period?,ఆడువారు నెలసరి లో ఇంటబయట ఉంటారెందుకు ?ఫ్ర : మన ఆడువారు నెలసరి అయిన 3 రోజులు ఇంటి లో సెపరేట్ గా ఉంటారెందుకు ?
జ : స్త్రీలు నెలకు మూడురోజులు ఇంట్లో కాలుపెట్టకుండా ' బైట' ఉంటారు . ఇది ఒక ఆచారము గా వస్తుంది . మన సమాజం ఎలా మారిందంటే ఏ ఆచారము ఎందుకు ? ఏ కాలములో ఏర్పడింది ? ఎవరూ ఎరుగరు . పూర్వకాలము లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వ్యవస్థ లో ఇంట ఆడువారికి రోజంతా ఇంటి పని దండి గా ఉండేది . విశ్రాంతి ఉండేది కాదు . స్త్రీలు బహిస్ట అయిన 3-4 రోజులు వరకూ బ్లీడింగ్ మూలాన నీరసం గా ఉండేవారు ... తగిన నివారణ మందులూ దొరికేవి కావు . రోజువారీ పని చేయలేని స్థితిలో ఉండేవారు . అందువలన మూడు రోజులు పూర్తి విశ్రాంతినిచ్చుటకై ముట్టు / అంటు అనే ఆచారము తో విశ్రాంతిని కలుగజేసేవారు . ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం . అంతే తప్ప కొంపలు మునిగేది కాదు . నేటి మహిళలు హాయిగా స్నానము చేసి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అభ్యంతరము లేదు . అది పాపము కాదు , నరకమూ కాదు .. ప్రకృతి సహజము . ..అంతే .

 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, February 24, 2011

శత్రువుల బారి నుంచి తేనెటీగలు ఎలా కాపాడుకుంటాయి?,How honey bee protect from others?
ప్రశ్న: శత్రువుల బారి నుంచి తేనెటీగలు తమను తాము ఎలా రక్షించుకుంటాయి?

-బి. సరోజిని, 9వ తరగతి, ఏలూరు

జవాబు: తేనెటీగ ఏ జీవినైనా కుడితే దాని కొండె ఆ జీవి దేహంలో చిక్కుకుపోతుంది. దానిని వదిలించుకునే ప్రయాసలో తేనెటీగ చనిపోతుంది. అందువల్ల శత్రువుల బారి నుంచి తప్పించుకోడానికి తేనెటీగలు మరో విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తాయి. ఉష్ణశక్తిని ఉత్పన్నం చేసే ఈ ప్రక్రియను 'థెర్మో బాలింగ్‌' అంటారు. తేనెటీగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉండగలవు. అదే వాటి శత్రువులైన కందిరీగలాంటి కీటకాలు అంతటి వేడిమిని తట్టుకోలేవు. అందువల్ల శత్రువులు వచ్చినప్పుడు తేనెటీగలు అత్యంత వేగంగా తమ రెక్కలను, కండరాలను కంపింపచేయడం మొదలెడతాయి. తద్వారా వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రత దాదాపు 47 డిగ్రీల సెంటిగ్రేడు వరకు పెరిగిపోతుంది. ఆ వేడిని తట్టుకోలేని కీటకాలు మరణిస్తాయి. ఈ విద్యతో తేనెటీగలు తమ పట్టుపై ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులు పెరగకుండా కూడా చేస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌ • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, February 21, 2011

మనుషులే వివాహము చేసుకుంటారెందుకు?, Why do human only get married?

ఈ విశ్వములో కోటానుకోట్ల జీవులు నివశిస్తూ ఉన్నాయి. డార్విన్‌ జీవపరిణామక్రమము చూసినా , వేదవ్యాసుని ఆద్యాత్మిక జీవపరిణామ క్రమము చదివినా ఒకజీవి మరియొక జీవినుండి పరివర్తనము చెంది ఉద్భవించినదని విశిదమవుతుంది . అందుకు పునరుత్పత్తి అవసరము , ఆ దిశగా ప్రకృతి లో జీవరాశి మార్పులు చెందుతూ ఆడ మగ అనే రెండు తరగతులు గా మార్పు చెందాయి. ఈ మార్పు మానవులలో స్పస్టముగా కనబడుతుంది . అన్ని జీవులలోకి మానవజీవి తెలివైనదిగాను , అర్ధము చేసుకునే జ్ఞానము కలిగేదిగాను , జంతులకు భిన్నముగాను పునరుప్తత్తి విషయములో నియమ నిబంధనలతో వాయ , వరస నైతిక విలువలు పాటిస్తూ వస్తుంది . ఈ పక్రియలోని నియమాలే రకరకాల వివాహ విధానాలు ... వివాహ వ్యవస్థ . మానవజాతి ముందు జీవరాశికి విచక్షణా జ్ఞానము లేదు కాబట్టి అనుకూల సీజన్లలో అందుకు తగ్గట్టుగా తమ పునరుత్పత్తిని సాగిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో జరుగవలసినది జరుగుతూ ఉంటుంది . ఆపడం అవదుకాని మార్పులు చేసేందుకు మానవులు ప్రయత్నిస్తూ ప్రియోగాలు చేస్తూఉన్నారు .

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.

యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము.

 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర బెల్లము పెడతారో వారిమాటే చెల్లుతుందా?, Cummin seeds and jagary importence in hindu marriageజీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. మనుష్యుల శరీరములొ విద్యుత్ దాగిఉంటుంది . అదే జీవశక్తి వివాహ సమయం లో ఎవరు ముందుగా జీలకత్త బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది . ఆ ప్రవాహశక్తి జీవితాంతం పనిచేస్తుంది అని , ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో మారిమాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం .జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయము గా అయితే పెళ్ళి కూతురు తో ముందు పెట్టిస్తారు .

మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాల ప్రధానమైన అంశము. కానీ, మనలాంటి చాలామందికి, వివాహ సమయంలో చెసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు (ఉదాహరణకు: స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర-బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి...). వివాహం చేసుకునేవాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్ధము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడంవల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము.

వేద మంత్రములతో, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా ముత్తయిదువులు మంగళ గీతములు ఆలాపన చేయగా వధువు, వరుని నెత్తిపై జీలకర్ర, బెల్లం ముద్దగా చేసినది పెడుతాడు. అట్లే వధువు నెత్తిన జిలకర్ర, బెల్లం ముద్దగా చేసి బ్రహ్మరంధ్రం వద్ద ఉంచుతారు. ఈ సందర్భంలో పెళ్లికుమారుడు ఈ మంత్రాన్ని చెబుతాడు.

అబ్రత్రుఘ్నీం వరుణ అపరిఘ్నీం బృహస్పతే ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితంస్స :

ఓ వరుణదేవా! సవిత వలన ఈమెకు కలిగిన లక్ష్మీసోదరులకు అభివృద్ధిని కలిగించాలి. నీ దయవల్ల ఓ బృహస్పతీ ఈమె భర్తకు అభివృద్ధిని కలిగించేది కావాలి. ఇంద్రా! ఈమె పుత్రసంతానం పొందునట్లు అనుగ్రహించు. • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, February 20, 2011

What is the history of visiting card, విజిటింగ్ కార్డ్ చరిత్ర ఏమిటి?ఎవరినైనా కలవడానికి ఆఫీసుల్లోకి వెళ్ళగానే గుమ్మం దగ్గరుండే వ్యక్తి వేసే ప్రశ్న ' మీ విజిటింగ్ కార్డ్ ' ఇవ్వండి అని . తన పేరు , హోదా , అడ్రసు వగైరాలు రాసి ఉండే ఆ కార్డ్ చేతిలో ఇమిడేటంత చిన్నదే అయినా విజిటింగ్ కార్డ్ కి ఉన్న ఆ శక్తి మాత్రము ప్రత్యేకమైనది .

ఈ విజిటింగ్ కార్డ్ సంప్రదాయము 15 వ శతాబ్దములో మొదలైంది అని చరిత్ర చెపుతోంది . ఆ రోజుల్లో జమిందారులు , రాజవంశస్థులు తాము ఒక ప్రదేశానికి వెళ్ళే ముందు తమ పేరు , హోదా , అడ్రసు వగైరాలు వ్రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు . అది చూసి అవతలివారు ... వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది . . . అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కింద స్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డ్ . ఎవరైతే వస్తున్నారో వారి సమాచారము తెచ్చేకార్డ్ కాబట్టే దాన్ని విజిటింగ్ కార్డ్ అన్నారు . తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది . అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి , కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రం గా మారింది . ప్రస్తుతం విజిటింగ్ కార్డ్ చిన్నాలేదు .. పెద్దాలేదు ... ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయినది . అడ్రస్ ను పోన్‌ నెంబర్ ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్క అయిపోయినది ... ఒక ఫ్యాషన్‌ గా మారిపోయినది .
విజిటింగ్ కార్డ్ లక్షణాలు :

రూపము : సాధారణము గా కార్డ్ లు దీర్ఘచతురస్రాకారము లో ఉంటాయి. ప్రత్యేకమైన రూపము అంటూ ఏమీ లేదు . ఎవరికి నచ్చిన ఆకారము లో వారు ప్రింట్ చేసుకోవచ్చును . అయితే అందరికీ అమోదయోగ్యమైన రూపముంటే బాగుంటుంది. కొంతమంచి అండాకారము , గుండ్రము గా ఉన్నవి ఇస్టపడతారు మనిషికో బుద్ధి .

పరిమాణము : చేతిలో ఇమిడి ఉండే సైజు లో ఉంటే మనసుకి ఇంపుగా ఉంటుంది . అందరూ అమోదించే సైజు 3'' * 2'' లేదా 3 1/2'' * 2 1/2'' . కార్డ్ పైన ఉండే సమాచారము క్లుప్తము గా (simple ) ఉంటే బాగుంటుంది .

రంగు : ఏ రంగు కార్డ్ స్పస్టము గా అందరినీ ఆకర్షిస్తుందో చెప్పడం కస్టము . అందుకే యూనివర్సల్ రంగైన తెలుపు ను ఎక్కువ మంది వాడుతారు .

ముద్రణ : బడ్జెట్ కి తగ్గట్టు గా అక్షరాలు పలు రకాల మెటీరియల్ తోను , డిజైన్‌ లతోను , విభిన్న మందాలతోను ముద్రించవచ్చును . ఇప్పుడిప్పుడు క్లాత్ మీద , టిన్‌ మీద ముద్రించిన కార్డులు కూడా వాడుతున్నరు . అక్షరాలు గజి బిజి గా అర్ధం కాని విదంగా ఉండకూడదు .

సమాచారము : కార్డ్ చూడగానే ఒక అంచనా ఇచ్చేది గా ఉండాలి కార్డ్ మీద సమాచారము . ఆ సమాచారము స్పస్టము గా , క్లుప్తం గా ఉండాలి . చాట భారతం అంత మేటరు ఉంటే చదివేందుకు విసుగు వస్తుంది . ఉన్నా పోన్‌ నెంబర్లూ ముద్రించకుండా ముఖ్యమైన ఒక నెంబర్ ఉంటే బాగుంతుంది . పేరు , హోదా, కంపెనీ పేరు అడ్రస్ , పోన్‌, వెబ్ సైట్ , ఇమెయిల్ ఉండాలి .

కంపెనీ చిహ్నము - ఫొటో : తక్షణ గుర్తింపుకోసం కంపెనీ లోగో , తన ఫొటో సింపుల్ గా ఉంటే ... ఎంతో బాగుంటుంది .

భాష : విజిటింగ్ కార్డులు ఫలానా భాషలో ఉండలనేదేమీ లేదు . సాదారణం గా అందిరికీ అమోదయోగ్యం , ఎక్కడికెళ్ళినా ఉపయోగపడేదిగా ఉండేందుకు ఇంగ్లిష్ లో ఉంటే బాగుంటుంది .


 • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, February 19, 2011

కాంతి సంవత్సరం అంటే ఏమిటి?, What is Light year?
కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం ఉంటుందంటే, ఒక గోళం కాంతి మరొక గోళాన్ని చేరడానికి ఏళ్ళకి ఏళ్ళే పడుతూ ఉంటుంది. అంచేత వాటి మధ్యనున్న దూరాన్ని కొలవడానికి దీన్ని వాడతారు. ఇక్కడ మరో విశేషం ఏవిటంటే, ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. అంచేత పెద్ద పెద్ద దూరాలని కొలవడానికి కాంతి సంవత్సరానికి మించిన ప్రమాణం లేదు.


కాంతి కిరణం ఒక సెకను కాలంలో మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందంటే ఆశ్చర్యం గా లేదూ? అటువంటి కాంతి కిరణం ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? అది 9.3 × 10¹⁵ మీటర్లు. ఈ దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఇది 9 లక్షల 50 వేల కోట్ల కి.మీ.(9.3 × 10¹⁵ మీటర్లు.)


 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, February 18, 2011

గోరింటాకు పెట్టుకుంటేనే చెయ్యి పండడం ఎందుకు?,Mehindi leave paste makes skin red-How?ప్రశ్న: అన్ని ఆకుల్లో క్లోరోఫిల్‌ ఉంటుంది కదా, మరి కేవలం గోరింటాకు పెట్టుకుంటేనే చెయ్యి పండడం ఎందుకు?

-ఎ. కిరణ్మయి, పిడుగురాళ్ల

జవాబు: పచ్చగా కనిపించినంత మాత్రాన ఆకులన్నింటిలో పత్రహరితం (క్లోరోఫిల్‌) ఒక్కటే ఉందనుకోకూడదు. క్లోరోఫిల్‌తో పాటు ఎన్నో రసాయనిక ధాతువులు ఆకుల్లోని పత్ర కణాల్లో ఉంటాయి. గోరింటాకు, మందారంలాంటి ఆకుల్లో ఆమ్లగుణం గల ఫినాళ్లు ఉంటాయి. ఇవి గోరు, చర్మం మీద ఉండే మెలనిన్‌ అనే ప్రొటీనుతో రసాయనిక బంధంగా ఏర్పడతాయి. అప్పుడు కలిగే అణునిర్మాణం వల్ల అంతవరకూ వేరే రంగులో ఉన్న చర్మం క్రమేపీ ఎరుపు రంగులోకి మారుతుంది. ఇతర మొక్కల ఆకుల్లో ఇలాంటి లక్షణాలున్న ఫినాళ్లు లేకపోవడం వల్ల వాటిని పూసుకున్నా పండవు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, February 16, 2011

భూమి నుంచి వేడి నీళ్లు తన్నుకుని వస్తాయెందుకు?, Why do hot water spring out in some places of Earth?
ప్రశ్న: కొన్ని చోట్ల భూమి నుంచి వేడి నీళ్లు తన్నుకుని వస్తుంటాయి కదా? దానికి కారణం ఏమిటి?

-కె. అంబిక, 10వ తరగతి, గోదావరిఖని

జవాబు: కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడినీరు ఫౌంటెయిన్స్‌లాగా బయటకి తన్నుకొచ్చే ప్రాంతాలను వేడినీటి బుగ్గలు (గీజర్లు) అంటారు. భూమి అంతర్భాగంలో అత్యధికమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలిసిందే. భూమి లోపలి పొరల్లో ఉండే భూగర్భజలాలు కొన్ని ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలకు గురవుతూ ఉంటాయి. సాధారణంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడే ప్రాంతాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. భూగర్భజలాలు వంద డిగ్రీల సెంటిగ్రేడుకు మించి వేడెక్కినప్పుడు నీరు ఆవిరై ఆయా ప్రాంతాల్లో క్రమంగా పీడనం పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి వల్ల భూమి లోపలి పొరల్లోని నీరు భూమి నెర్రల ద్వారా ఉవ్వెత్తుగా పైకి తన్నుకొచ్చేస్తుంది. ఈ పరిస్థితులు అమెరికా, రష్యా, చిలీ లాంటి కొన్ని ప్రదేశాల్లోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌(Eenadu_Hai bujji)


 • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కోకకోలా..తయారీలో వాడే పదార్ధాలేమిటి ?,What are the contents of CocoCola?

శీతల పానీయం కోకకోలాలో ఏ వదార్థాలు వాడతారన్నది ఇవ్పటి వరకూ రహస్య మే. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఒక గదిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య దీని ఫార్ములాను భద్రవరిచారు. దీని గుట్టును తాము వివ్పినట్లు thisamericanlife.org అనే వెబ్‌సైట్‌ వేర్కొంది. కోకకోలాలో వాడిన వదార్థాల జాబితాను ఒక వత్రికలో వ్రచురితమైన ఫొటో ఆధారరగా కనివెట్టామని చెవ్పింది. ఈ వెబ్‌సైట్‌ కథనము వ్రకారము .. కోకకోలా వ్యవస్థావకుడైన జాన్‌ పెంబర్టన్‌.. ఈ పానీయంలో వాడాల్సిన వదార్థాలు, మోతాదును 1886లో రూపొందిరచారు. అవ్పటి నుంచి దీన్ని గోవ్యంగా ఉంచుతున్నారు. 'అట్లాంటా జర్నల్‌ కాన్‌స్టిట్యూషన్‌' అనే వత్రికలో 1979 ఫిబ్రవరి 8న ఒక ఫొటో వ్రచురితమైంది. ఇందులో ఒక వ్యక్తి ఓ వుస్తకము తెరిచి ఉంచారు. ఈ వుస్తకంలో పెంబర్టన్‌ తయారుచేసిన చిట్టాను పోలిన ఒక రెసివీ ఉంది. కోకకోలాలో వాడే మెర్కండైజ్‌ 7ఎక్స్‌ అనే రహస్య వదార్థాన్ని తయారుచేయడానికి అవసరమైన వివిధ రకాల నూనెలు, వాటి కొలతలు ఇందులో ఉన్నాయి. నిజానికి మెర్కండైజ్‌ 7 ఎక్స్‌.. కోకకోలాలో ఒక్క శాతమే ఉంటుంది. అయినా ఈ పానీయానికి వ్రత్యేక రుచిని అందిస్తోంది. ఇందులో కోకా 3 డ్రాములు, సిట్రిక్‌ ఆమ్లం 3 ఔన్సులు, కెఫిన్‌ 1 ఔన్సు, చక్కెర 30 (ఎంత వరిమాణర అన్నది ఫొటోలో స్పష్టంగా కనిపించడంలేదు), నీరు 2.5 గ్యాలన్లు, నిమ్మరసం 1.892 లీటర్లు, వెనీలా 1 ఔన్సు, కారమెల్‌ 1.5 ఔన్సు లేదా అంతకరటే ఎక్కువ వాడాల్సి ఉంటుంది. దీనికితోడు 8 ఔన్సుల మద్యం, 20 చుక్కల ఆరంజ్‌ ఆయిల్‌, 30 చుక్కల నిమ్మ నూనె, పదేసి చుక్కల చొవ్పున నట్‌మెగ్‌ ఆయిల్‌, కోరియండర్‌, నెరోలి, సినామన్‌ కలపాలి... అని ఉన్నది .

మూలము : ఈనాడు దిన పత్రిక ...16/02/2011
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?,Why do egg float on Salt water?


ప్ర : ఉప్పునీటిలో గుడ్డు ఎందుకు తేలుతుంది ?
జ : కోడి గుడ్డు మంచినీళ్ళలో వేయగానే మునిగిపోతుంది . కారణం గుడ్డు సాంద్రత నీటిసాంద్రత కన్న అధికము . మంచినీరు గుడ్డును తేలి ఉంచే ఉత్తిడి కిందనుండి పెట్టలేదు . ఫలితం గా గుడ్డు మునిగిపోతుంది .

అదే ఉప్పునీటిలో అయితె తేలుతుంది ... ఉప్పునీటి సాంద్రత గుడ్డు సాంద్తత కన్న అధికము అవడము వల్ల అది గుడ్డును పైకి నెడుతూ లేలి ఉండేలా చేస్తుంది .


 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, February 15, 2011

వీచే గాలుల నేరుగా ఎందుకు వీచవు? , Wind flow is not in Straight direction Why?
ప్రశ్న: గాలులు అధిక పీడన ప్రదేశాల నుంచి అల్పపీడన ప్రదేశాలకు నేరుగా ఎందుకు వీచవు?

- బి. అభిషేక్‌, ఇంటర్‌, రాజమండ్రి

జవాబు:
వాయువులు, ద్రవాలు అధిక పీడనం ఉన్న పదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి సరళమార్గంలో పయనిస్తాయి. కానీ భూమిపై వీచే గాలుల విషయంలో అలా జరగదు. ఇవి తీవ్రంగా వీచేవి, బలహీనంగా వీచేవనే రెండు రకాలుగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే కొరియాలిస్‌ బలం (coriolis force), వీచే గాలులను అడ్డుకోవడంతో అవి సరళమార్గంలో వీచవు. అందుకనే భూమిపై అధిక పీడన, అల్పపీడన వ్యవస్థలలో ఉన్న గాలులు సర్పిలాకారం (spiral shape)లో తిరుగుతుంటాయి. ఉత్తర ధ్రువంలో అల్ప పీడన వ్యవస్థలో గాలులు సర్పిలాకారంలో లోపలి వైపునకు అపసవ్య దిశలో తిరుగుతూ పైకి లేస్తుంటే, అధిక పీడన వ్యవస్థలో ఉన్న గాలులు సర్పిలాకారంలో సవ్యదిశలో బయటివైపునకుసవ్యదిశలో తిరుగుతూ కిందికి వీస్తుంటాయి. అదే దక్షిణ ధ్రువంలోని గాలుల చలనం ఇందుకు వ్యతిరేక మార్గాలతో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,హైదరాబాద్‌


 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

What are Navarasaalu?,నవరసాలనగా ఏవి ?

రసం ఒక భావోద్వేగ స్థాయి (emotional state). ప్రాచీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రం లో ఎనిమిది రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో సృష్టించగలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడుకోటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని ఉపగుప్తుడు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను సాదించటాన్ని రసాభినయం అంటారు. ఈ రసాలు సాహిత్యము లోనే కాదు .. మనస్సులోనూ ఉంటాయి . ఏదైనా ఆపద కలిగితే మనము దు:ఖిస్తాము. మంచివిషయము సంభవించినపుడు సంతోషిస్తాము . . మన ముఖాలు నవ్వుతూ ఉంటాయి. ఒకపామో , మరేదైనా క్రూరమృగమో కనబడితే భయము తో వణికిపోతాం . ఏదైనా అన్యాయము గానీ , అత్యాచారము గానీ మనకళ్ళ ఎదుట జరిగితే కోపగ్రస్తులమవుతాం . ఏదైనా విచిత్రమైన అకటవికటపు దృశ్యము చూస్తే విరగబడి నవ్వుతాం . భగవంతుని దర్శించినపుడు శాంతంగా కదలక మెదలక నిలుచుంటాం . జీవతములో రసాలన్నీ అనుభవంలో ఉన్నవే .

నవరసాలు :
1.శృంగారం 2.హాస్యం 3.కరుణ 4.రౌద్రం 5.వీరం 6.భయానకం 7.భీభత్సం 8.అద్భుతం 9.శాంతం.

నవరసాలు - స్థాయీభేదాలు:

1. శృంగారం - రతి (Love),

2. హాస్యం - నవ్వు (Mirth),
3. కరుణ - దు:ఖం (Sorrow),

4. రౌద్రం - కోపం (Anger),
5. వీరం - ఆవేశం (Energy),
6. భయానకం - భయం (Terror),
7.బీభత్సం - జుగుప్స (Disgust),
8. అద్భుతం - ఆశ్చర్యం (Astonishment),
9. శాంతం - ఓర్పు(Patience, endurance)

ప్రదర్శకులు

కీర్తిశేషులు పద్మశ్రీ మణి మాధవ చక్యర్ గారిని రసాభినయంలో ప్రామాణికంగా భావిస్తారు. నవరసాల్ని వాటి అంచుల వరకూ ప్రదర్శించటంలో ఆయనది అసాధారణ సామర్ధ్యం. ఆయన
నవరసాభినయం సంగీత్ నాటక్ అకాడమీ లాంటి ఎన్నో పురావస్తు ప్రదర్శనశాలల్లో భద్రపరిచారు.

===============================================
ఆదిత్య చౌదరి. మూల్పూరి | Oct 30, 2010 | వివరణ :

1.శృంగారం: ఇది రతి అనే స్థాయీభావం నుండి పుడుతుంది.సౌందర్యం శృంగారంలో ప్రధానమైన అంశం.అందంగా ఉన్న వాటికి మనసు హత్తుకుపోతుంది. ఇవి రెండు రకాలుగా

ఉత్పన్నమవుతుంది …a.సంయోగం b.వియోగం. సంయోగం అంటే కలయిక…వియోగం అంటే ఎడబాటు…

2.హాస్యం : ఇది హాసం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది రెండు రకాలు--a.ఆత్మస్థ = తాను నవ్వటం b. పరస్థ = ఇతరులను నవ్వించటం
నవ్వు ఆరు రకాలుగా ఉంటుంది. అవి
a.స్మితము (Gentle Smile) : చెక్కిళ్లు లేతగా వికసించి పలువరుస కనబడకుండా గంభీరంగా ఉండే నవ్వు.
b.హసితము (Smile) : చెక్కిళ్లు వికసించి, పలువరుస కొంచెంగా కనిపిస్తుండే నవ్వు.
c.విహసితము (Laughter) : సమయోచితమైన నవ్వు.ముఖం ఎరుపెక్కి పలువరుస కనిపిస్తూ శిరస్సు ముడుకుని ఉంటుంది.
d.ఉపహసితము (Laughter with ridicule) : ముక్కుపుటాలు విప్పారి.చూపులు వక్రంగా ఉండే నవ్వు.
e.అపహసితము (Uprorious Laughter) : ఏడుపు వస్తున్నప్పుడు వచ్చే నవ్వు.
f.అతిహసితము (Convulsive Laughter) : నవ్వు పెద్దదయినపుడు వచ్చే ఆనందబాష్పాలు.స్వరం మారటం,చేతులు కదలడం దీనిలో గమనించవచ్చు.

3.కరుణ : ఇది శోకం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇవి మూడు రకాలు.
a.ధర్మోపగతము : కరుణ దండన నుండి పుడుతుంది
b.అర్ధోపచేయము : ధననష్టం వల్ల కలుగుతుంది.
c.శోకం : ఇష్టజనుల వియోగం వల్ల కలుతుంది.

4.రౌద్రం : క్రోధం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.రాక్షస ప్రకృతులకు సంబంధించినది.సంగ్రామం వల్ల పుడుతుంది.చేయిదాటిపోయిన వికారస్థితి ఇది.
a.క్రోధం,ఆధర్షణము(ఇతరుల భార్యలను చెరచటం వల్ల కలిగేది),b.అధిక్షేపం (దేవ,జాతి,అభిజన,,విద్య,కర్మలను నిందించటం వల్ల కలిగేది),c.అవమానం,అసత్యవచనం,ఉపఘాతం ,పనివారిని

బాధించడం వల్ల కలిగేది),d.వాక్పారుష్యం,e.అభిద్రోహం (హత్యాప్రయత్నం),f.అసూయ. వీటి వల్ల కలుతుంది.

5.వీరం : ఉత్సాహం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది మూడు రకములు.ఆలోచన ఆధిపత్యం కలిగివున్న ఉన్నత ప్రకృతికి చెందిన స్థితి ఇది.
a.దాన వీరము b.దయా వీరము c.యుద్ధ వీరం. .అసంమోహం (కలత చెందకుండటం) .అధ్యవసాయం ( పట్టుదల).నయము (సంధి,విగ్రహాల ప్రయోగం .వినయం (ఇంద్రియ జయం),.బలం

(చతురంగ బలం కలిగివుండటం) .పరాక్రమం (శతృవుల జయించటం) .శక్తి ( యుద్ధాదులయందు సామర్ధ్యం),.ప్రతాపం (శతృవులకు సంతాపం కలిగించే ప్రసిద్ధి) .ప్రభావం (అభిజన,ధన,మంత్రి

సంపద) వల్ల ఉత్సాహం కలుగుతుంది.

6.భయానకం : ఇది భయం అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.అపరాధం వల్ల,మోసం వల్ల,హింస వల్ల కలుగుతుంది.ఇవి రెండు రకములు--a.స్వభావసిద్ధమైనది b.కృత్రిమమైనది

7.భీభత్సం : జుగుప్స అనే స్థాయీభావం నుండి పుడుతుంది.కోపం,అయిష్టం,విసుగు,అసహ్యం వల్ల జుగుప్స కలుగుతుంది.

8.అద్భుతం : ఇది విస్మయం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.దైవ సంబంధిత విషయాలు,మహాత్ముల దర్శనం,ఇంద్రజాల,మహేంద్రజాలాదులను ప్రత్యక్షంగా డటంవల్ల…మనోవాంఛలు

తీరటం వల్ల ఈ రసానుభవం కలుగుతుంది.

9.శాంతం : ఇది శమము అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.తత్వఙ్ఞానం,వైరాగ్యం,ఆశయ శుద్ధి వల్ల ఇది జన్మిస్తుంది.మోక్షము పట్ల ఆసక్తి కలిగిస్తుంది.

----------------------------------------
మూలము : వివిధ రకాల వార్తా & వార పత్రికలు


 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, February 09, 2011

పుతృడిని తండ్రి ఎలా పెంచాలి ? , How do father grow his Son?


కుటుంబము అంటే తల్లి దండ్రులు పిల్లలు అనే బావన వస్తుంది . ఉమ్మడి కుటుంబము అనగా ఒక వంశానికి చెందిన పెద్దలు , పిల్లలు కలిసి మెలసి నివశించి ఉండడము . భరత ఖండములో పూర్వము అన్నీ ఉమ్మడి కుటుంబాలే . రాను రాను అన్ని ఒంటరి కుటుంబాలుగా మారిపోయాయి. . కుటుంబ కలహాలు వల్ల పెద్దలనుండి పిల్లలు దూరము గా వేరే కాపురం పెట్టినవారు కొందరు , ప్రేమ వివాహాలపేరుతో విడిపోయినవారు కొందరు , ఉద్యోగాలకోసం దూరప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కొందరు ఇలా ఉమ్మడి కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమైన నేటి సమాజము లో తండ్రి , తల్లి వారి పిల్లల బాధ్యతలు మరువరాదు . పెంచడం లో కొడుకు బాధ్యత తండ్రి , కూతురు బాధ్యత తల్లి చేపట్టాలి.

పుతృడ్ని తండ్రి ...
 • పసివానికా అయిదేళ్ళు వచ్చేవరకు రాజుగా లాలించి , ప్రేమించి పెంచాలి ,
 • పదేళ్లు వచ్చేవరకు ఆదరించి , బెదిరించి తప్పకపోతే కొట్టి సరైన మార్గములో నడిపించాలి ,
 • పదహారేళ్ళు దాటిన పుత్రుని తో స్నేహితుడు గా ఉండాలి .. చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి తేకూడదు ,
 • ఆ పై పెళ్ళి అయిన తర్వాత త్నబిడ్డగా కాక కోడలి భర్త గా మాత్రమే చూడాలి ... అప్పుడు తండ్రిని తండ్రి గా చూస్తాడు ,,, గౌరవిస్తాడా కొడుకు .

 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, February 08, 2011

కొన్ని జీవులు రంగులను చూడలేవేల? , Some animals can not see colors Why?మనం రంగుల్ని చూడగలం... కొన్ని జంతువులు చూడలేవు... షార్కులు కూడా అంతేట... కొత్త పరిశోధనలో తెలిసింది!

ఒక్కసారి సముద్రం అంతర్భాగంలోకి వెళ్లినట్టు వూహించుకోండి. నీలం రంగు నీటిలో ఈదుతున్న రంగురంగుల చేపలు, వింత మొక్కలు, పగడపు దీవులు అన్నీ అద్భుత దృశ్యాలే. అయితే ఈ అందాలన్నీ కనిపించేది మనకే. ఎందుకంటే కొన్ని జలచరాలు రంగుల్ని చూడలేవు. షార్క్‌లు కూడా అంతేనని పరిశోధకులు కొత్తగా కనుగొన్నారు. అంటే వాటికి లోకమంతా నలుపు తెలుపు సినిమాలాంటిదేనన్నమాట.

షార్క్‌లకు రంగులు కనబడవని మనకెలా తెలుసు? అవి నోరు విప్పి చెప్పలేవు కదా అనే సందేహం వచ్చిందా? మనుషులకైనా, జంతువులకైనా కళ్లలో రెటీనా ఉంటుందని, దాని మీద పడిన కాంతి కిరణాలను గ్రహించే వ్యవస్థ వల్ల దృశ్యాలు కనిపిస్తాయని చదువుకుని ఉంటారు. రెటీనాపై ప్రధానంగా కాంతిని గ్రహించే రెండు రకాల కణాలు ఉంటాయి. అవే రాడ్‌, కోన్‌ కణాలు. రాడ్‌ కణాల వల్ల వస్తువుల కదలికలు, కాంతి తీవ్రతలో తేడాలు తెలిస్తే, కోన్‌ కణాల వల్ల రకరకాల రంగులు కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు ఏ జంతువు రెటీనానైనా పరిశీలించి ఆయా కణాలు ఉన్నాయో లేవో చూసి వాటికి ప్రపంచం ఎలా కనిపిస్తుందో కనుగొంటారన్నమాట.

అలా కొందరు శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో దాదాపు 17 జాతుల షార్క్‌లపై పరిశోధన చేశారు. పది జాతుల్లో అసలు కోన్‌ కణాలే లేవు. మిగిలిన వాటిలో ఒకే రకమైన కోన్‌ కణాలు ఉన్నాయి. దీన్ని బట్టి అవి రంగుల తేడాలను గమనించలేవని తేల్చారు.

'అవెలా చూస్తే మనకేంటట?' అనుకోకండి. ప్రపంచవ్యాప్తంగా చేపల కోసం వేసే ఎరల్లో లక్షలాది షార్క్‌లు చనిపోతున్నాయి. వాటి చూపు ఎలా ఉంటుందో తెలిస్తే వాటిని ఆకర్షించని విధంగా ఎరలను, వలలను తయారు చేసే వీలుంటుంది. దాని వల్ల వాటికి ప్రమాదం తప్పుతుంది. అలాగే సముద్రంలో డైవ్‌ చేసే వారి ఈత దుస్తుల్ని కూడా వాటిని ఆకర్షించని విధంగా రూపొందించవచ్చు. అందువల్ల మనకి ప్రమాదం తప్పుతుంది.

* కుక్కలు, పిల్లులకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు కనిపించవు.
* ఆవులు, గేదెలు లాంటి పశువులకు లోకమంతా నలుపుతెలుపుల్లోనే కనిపిస్తుంది.
* చాలా రకాల చేపలు, పక్షులు రంగుల్ని చూడగలవు.
* తేనెటీగలు మనకి కూడా కనిపించని అతినీలలోహిత రంగుల్ని చూడగలవు.
* చీమలు ఎరుపు రంగును చూడలేవు.

 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ వేగుచుక్కలు ఏమిటి? , What are those bright morning stars?ప్రశ్న: తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి?
-పి. సుధాకర్‌, మదనపల్లి (చిత్తూరు)
జవాబు: తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక్షత్రంగా భావించడం వల్లనే దానిని 'వేగుచుక్క' అని వ్యవహరిస్తుంటారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నిద్ర పోవడమేల? , Why do we sleep?


 • [sleeping+child.jpg]

ప్రశ్న: మనతో సహా సాధారణంగా ప్రతి జీవీ నిద్రిస్తుంది కదా, అసలెందుకు నిద్ర వస్తుంది?
-ఎమ్‌. హరనాధ్‌, 10వ తరగతి, వెంకటగిరి (నెల్లూరు)
జవాబు: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిద్ర ఎంతో దోహద పడుతుంది. నిద్రపోతున్నప్పుడు గుండె కొట్టుకోవడం, శ్వాసించడంలాంటి ప్రక్రియలు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. మేలుకొన్నప్పుడు కోల్పోయిన శక్తిని నిద్రిస్తున్నప్పుడు శరీరం పుంజుకుంటుంది. అలాగే నిద్రస్తున్నప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తూ మెలుకొన్నప్పటి అనుభవాలను పదిలపరచడం, అనవసరమైన సమాచారాన్ని తుడిచివేయడం లాంటి చర్యల్లో నిమగ్నమవుతుంది. శరీరంలో ఉండే గడియారంలాంటి వ్యవస్థ మనకు కలిగే అలసటను, దాన్ని పోగొట్టుకోడానికి ఎంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని నియంత్రించి మెదడు, నాడీ సంబంధిత ప్రసారాలు విడుదలయ్యేటట్టు చేయడంతో నిద్ర ముంచుకువస్తుంది. అలాగే పినియల్‌ గ్రంధులు (pineal glands) రాత్రివేళల్లో ఉత్పన్నమయ్యే నిద్రసంబంధిత మెలటోనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేయడం వల్ల రాత్రివేళ చీకటిలో ఎక్కువ సమయం నిద్ర వస్తుంది. ఎవరెంతసేపు నిద్రపోతారనేది జన్యు సంబంధిత విషయం. రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యకరమైన అలవాటు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

More about sleep - > నిద్ర .
 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బంగారము సంగతులేమిటి ?,What is about Gold?


బంగారాన్ని ఇంగ్లిషులో గోల్డ్‌ అంటారని తెలుసుగా? ఈ పదం పాత ఇంగ్లిషు పదమైన 'గెలో' నుంచి పుట్టింది. అంటే పసుపు రంగు అని అర్థం. బంగారాన్ని కేరట్లలో కొలుస్తారు . దానికీ ఓ కారణం ఉంది. ఒకప్పుడు విలువైన వస్తువులను కేరోబ్‌ గింజలతో తూచేవారట. దాని నుంచే కేరట్‌ పదం పుట్టిందని చెబుతారు. 24 కేరట్ల బంగారం అంటే పూర్తిగా శుద్ధమైందన్నమాట. ఆభరణాలు మాత్రం 22, 18, 14 కేరట్లలోనే లభిస్తుంటాయి. నగల తయారీ సమయంలో బంగారానికి రాగి లేదా వెండిని కలపడం వల్ల కేరట్ల సంఖ్య తగ్గుతుంది. వీటిని కలపకపోతే నగల తయారీ సాధ్యం కాదు. ఎందుకంటే పూర్తిగా శుద్ధమైన బంగారాన్ని ఇట్టే వంచేయవచ్చు. అది అంత మెత్తన. సాగే గుణం చాలా ఎక్కువ. ఔన్సు (28.35 గ్రాములు) బంగారాన్ని సాగదీసి, ఏకంగా 80 కిలోమీటర్ల పొడవైన తీగగా మార్చవచ్చని , దానినే ఒక పొరలాగా చేస్తే వంద చదరపు అడుగుల విస్తీర్ణం దాకా పరచుకుంటుంది! బంగారాన్ని దారాలుగా మార్చి అల్లికలకు కూడా ఉపయోగించవచ్చని సంబంధిత నిపుణులు , స్వర్ణకారులు చెప్తారు . .

* బంగారం ప్రస్తావన వేదాల్లోనూ కనిపిస్తుంది. ఇక ఏ పురాణాన్ని తీసుకున్నా దేవతల నగలన్నీ బంగారంతో చేసినవేగా? సింధు నాగరికత కాలంలోనే బంగారు నగలను ధరించినట్టు ఆధారాలున్నాయి. ఆభరణాలు చేసేటప్పుడు స్వర్ణకారులు బంగారాన్ని కాజేసే విధానాలను కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు కూడా.

* ఈజిప్టులో క్రీస్తు పూర్వం 2,600లోనే బంగారాన్ని వాడేవారు. లిడియా వారైతే గ్రీకులతో బంగారు నాణాలతోనే వ్యాపారం చేసేవారు. పర్షియన్‌ రాజు లిడియాను జయించిన తర్వాత బంగారు నాణాల వాడకం మొదలైంది.

* గనుల్లో మట్టి, రాళ్ళలో చిక్కుకుపోయి ఉండే బంగారాన్ని వెలికి తీయడం చాలా కష్టం. వెయ్యి కిలోల మట్టి నుంచి అరగ్రాము బంగారం లభిస్తుందని అంచనా. బంగారం ఉత్పత్తిలో ఇప్పుడు చైనాదే అగ్రస్థానం. దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాల్లో కూడా బంగారం గనులున్నాయి. మన దేశంలో కర్ణాటకలోని కోలార్‌లో ఉన్నాయి.

* భూకేంద్రంలో 10,000 కోట్ల టన్నుల వరకు బంగారం ఉందని శాస్త్రవేత్తల నమ్మకం. మరో 1,000 కోట్ల టన్నులు సముద్రాల్లో ఉందట.

* ప్రపంచం మొత్తం మీద 2009 వరకూ సుమారు 1,60,000 టన్నుల బంగారాన్ని వెలికి తీసినట్టు అంచనా. దీనితో 20 మీటర్ల భుజం ఉండే ఘనం తయారవుతుంది.

source : Eenadu new paper .
 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

శిష్టాచారము అంటే ఏమిటి ? , What is Shistaachaaramu ?


పెద్దల పట్ల శ్రద్ధాభావము ప్రదర్శిండమే శిష్టాచారం . పాదాలు తాకి నమస్కారము చేయడం , లేదా సాధారణ నమ్రత రూపం లో చూపించవచ్చు .

తల్లి , తండ్రి , గురువు , చిన్నాన్న , పెద్దనాన్న వంటి పెద్దలకు పాదాలు తాకి నమస్కరంచాలి . వృద్ధులు , విద్యాధికులు , ఇతర పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాలి . పెద్దలకు తగిన మర్యాద ఇవ్వడం , ఎవరి గౌరవానికీ భంగం కలగని రీతిలో వ్యవహరించడమే శిష్టాచారము .

తలిసిన నియమాలను ప్రతిసారి పాటించడం , నవ్రత , గౌరవపూర్వక సభ్య్తలు పాటించడం , ఎవరికీ ఏ అసౌకర్యము , కష్టము కలిగించకుండా నడుచుకోవడం శిష్టాచార నిర్వహణ అవుతుంది .


 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, February 07, 2011

ఒంటె ఉమ్మేస్తుందా? , Camel split on others?


ఒంటె కు కోపం వస్తే ఎదుట వారి మీద ఉమ్మేస్తుందంటారు . నినమేనా?

అవును ఒంటెకు కోపము వచ్చినా , విసుగు కలిగినా ఆ విషయము తెలియజెప్పేందుకు ఎదుట వ్యక్కులపైనా , తోటి జంతువులపైనా ఉమ్మేస్తుంది . పాక్షికముగా జీర్ణమైన ఆహారము తిరిగి నోట్లోకి తెచ్చుకోగలిగిన శక్తి దీనికి ఉన్నందున ఆ ప్రక్రియ సాధ్యమవుతుంది . అయితే అది ఉమ్మి తో కలిసిన ఆహారపదార్ధము . బాగా ముద్దగా నమిలిన ఆ పదార్ధాన్ని తుమ్మినట్టుగా చేసి ఎదుటి వారిపైన పడేలా చేస్తుంది . దాని కంపుకు , అశుబ్రతకు మనిషి బాధపడవలసిందే .
 • =========================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.