Tuesday, February 15, 2011

వీచే గాలుల నేరుగా ఎందుకు వీచవు? , Wind flow is not in Straight direction Why?




ప్రశ్న: గాలులు అధిక పీడన ప్రదేశాల నుంచి అల్పపీడన ప్రదేశాలకు నేరుగా ఎందుకు వీచవు?

- బి. అభిషేక్‌, ఇంటర్‌, రాజమండ్రి

జవాబు:
వాయువులు, ద్రవాలు అధిక పీడనం ఉన్న పదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి సరళమార్గంలో పయనిస్తాయి. కానీ భూమిపై వీచే గాలుల విషయంలో అలా జరగదు. ఇవి తీవ్రంగా వీచేవి, బలహీనంగా వీచేవనే రెండు రకాలుగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే కొరియాలిస్‌ బలం (coriolis force), వీచే గాలులను అడ్డుకోవడంతో అవి సరళమార్గంలో వీచవు. అందుకనే భూమిపై అధిక పీడన, అల్పపీడన వ్యవస్థలలో ఉన్న గాలులు సర్పిలాకారం (spiral shape)లో తిరుగుతుంటాయి. ఉత్తర ధ్రువంలో అల్ప పీడన వ్యవస్థలో గాలులు సర్పిలాకారంలో లోపలి వైపునకు అపసవ్య దిశలో తిరుగుతూ పైకి లేస్తుంటే, అధిక పీడన వ్యవస్థలో ఉన్న గాలులు సర్పిలాకారంలో సవ్యదిశలో బయటివైపునకుసవ్యదిశలో తిరుగుతూ కిందికి వీస్తుంటాయి. అదే దక్షిణ ధ్రువంలోని గాలుల చలనం ఇందుకు వ్యతిరేక మార్గాలతో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,హైదరాబాద్‌


  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...