Monday, February 21, 2011

మనుషులే వివాహము చేసుకుంటారెందుకు?, Why do human only get married?





ఈ విశ్వములో కోటానుకోట్ల జీవులు నివశిస్తూ ఉన్నాయి. డార్విన్‌ జీవపరిణామక్రమము చూసినా , వేదవ్యాసుని ఆద్యాత్మిక జీవపరిణామ క్రమము చదివినా ఒకజీవి మరియొక జీవినుండి పరివర్తనము చెంది ఉద్భవించినదని విశిదమవుతుంది . అందుకు పునరుత్పత్తి అవసరము , ఆ దిశగా ప్రకృతి లో జీవరాశి మార్పులు చెందుతూ ఆడ మగ అనే రెండు తరగతులు గా మార్పు చెందాయి. ఈ మార్పు మానవులలో స్పస్టముగా కనబడుతుంది . అన్ని జీవులలోకి మానవజీవి తెలివైనదిగాను , అర్ధము చేసుకునే జ్ఞానము కలిగేదిగాను , జంతులకు భిన్నముగాను పునరుప్తత్తి విషయములో నియమ నిబంధనలతో వాయ , వరస నైతిక విలువలు పాటిస్తూ వస్తుంది . ఈ పక్రియలోని నియమాలే రకరకాల వివాహ విధానాలు ... వివాహ వ్యవస్థ . మానవజాతి ముందు జీవరాశికి విచక్షణా జ్ఞానము లేదు కాబట్టి అనుకూల సీజన్లలో అందుకు తగ్గట్టుగా తమ పునరుత్పత్తిని సాగిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో జరుగవలసినది జరుగుతూ ఉంటుంది . ఆపడం అవదుకాని మార్పులు చేసేందుకు మానవులు ప్రయత్నిస్తూ ప్రియోగాలు చేస్తూఉన్నారు .

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.

యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గానజాలము.

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...