Monday, January 31, 2011

సృజనాత్మకతను పెంచుకోవడం ఎలా?, How to improve self-confidence?


మన సక్సెస్‌కే కాదు.. ఫెయిల్యూర్‌కి మనమే బాధ్యత వహించినప్పుడు మన తప్పొప్పులను, లోటుపాట్లను విశ్లేషణ చేసుకునే వీలుంటుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే ఓటమికి కుంగిపోవడమంటూ ఉండదు. గెలుపొందాలంటే మనపై మనం కంట్రోల్ సాధించాలి. అందుకు నిపుణులు అందిస్తున్న సూచనలివి..

 • -ఎదురైన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. ప్రతి అనుభవాన్ని కొత్త కోణంలో చూడాలి.
 • -ఎంతటి క్లిష్టమైన పని అయినా చేయగలనన్న కాన్ఫిడెన్స్‌ని చూపించాలి. తీసుకున్న పనిని టైమ్‌కి పూర్తి చేయడంలో నిక్కచ్చిగా ఉండాలి.
 • - పని సంబంధితమైన విషయాలు తెలుసుకోవడంలో అందరికన్నా ఎప్పుడూ ముందుండాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి.
 • - లక్ష్యం చేరుకోవడానికి సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో ఎప్పుడూ తరచి చూసుకుంటూ ఉండాలి.
 • -చేసే పనిని ఉద్యోగంలా కాకుండా ఒక సవాలుగా తీసుకోవాలి.
 • - పూర్తిచేయాల్సిన పనుల లిస్టు ప్రిపేర్ చేసుకుని కంప్లీట్ అయినవాటిని మార్క్ చేయండి. పది పనులు పూర్తయిత తరువాత మీకు మీరే రివార్డు ఇచ్చుకోండి.
 • - బలహీనతల గురించి విమర్శించుకోవద్దు. మీరింకా ఆ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పొందలేని స్థితే గానీ అది బలహీనత కాదని తెలుసుకోండి.
 • - ఏ పరిస్థితి ఎదురైనా ముఖంలో ప్రశాంతత, పెదవులపై చిరునవ్వు చెరగనీయవద్దు.
 • - గతంలో చేసిన పనుల కన్నా భిన్నంగా చేయాలని ఆలోచించండి. ఇది మీలో సృజనాత్మకతను పెంచుతుంది.

 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నాగలి చరిత్ర ఏమిటి ? , What is the history fo ploughభారతదేశం 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధార పడి జీవిస్తున్నారు. కానీ వ్యవసా యం చేయడం 12 వేల సంవత్స రాలకు ముందు ప్రారంభమైంది. అప్పుడు బండరాళ్ళు కొమ్మలు వంటి పరికరాలను నాగలిగా ఉప యోగించి స్వయంగా దున్నేవారు. కాలక్రమంలో నాగలిని జంతువుల ద్వారా ఉపయోగించడం అల వాటైంది.

మనుషులు 'వ్యవసాయం' కనిపెట్టి సుమారు 12,000 సంవత్సరాలు అవుతుంది. అయితే మొదట్లో ఏ సముహం పండించే పంట కుటుంబానికీ సరిపోయేది గాని మిగులు అనేది ఉండేది కాదు. మొక్కలు ఏపుగా పెరిగేందుకు, మంచి పంటను ఇచ్చేందుకు ఏం చెయ్యాలో మానవుడు క్రమ క్రమంగా తెలుసుకొన్నాడు. గింజలను నాటాలంటే నేలలో ఏదో ఒక సాధనంతో గుంతలు తవ్వాలి ఇందుకై మొదట్లో ఒక వైపు కొనదేలి ఉన్న కట్టెలను గాని రాళ్ళనుగాని వాడెదరు. వీటితో గుంతలు తవ్వడం సాలు తీయ్యడం చేసేవారు. ఆ తరువాత దిశలో జింక కొమ్ము లు వంటి వాటిని లేదా వంకీ తిరిగి ఉన్న చెట్టు కొమ్మలను వాడుతూ ఈ పని చెయ్యడం మొదలుపెట్టారు.

మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి నాగళ్ళు ఇవే అని చెప్పాలి. ఈ తరవాతి దిశలో ఒక పొడవాటి కలపదుంగ కొనను వంపు తిరిగి కొనదేలి ఉన్న ఒక భాగంగా మార్చి ఆ నిర్మాణం సాయంతో పొలాలు దున్నడం మొదలుపెట్టారు. మరి కొంత కాలం తరువాత ఒక పొడవాటి కలపదుంగ కు విడిగా మరో భాగాన్ని కలిపి నాగలిని నిర్మించారు. ఇది అంతకు ముందు సాధనల కన్నా చాల చక్కగా పనిచేసింది. లోహాలను ఉపయోగించడం మొదలు పెట్టాక నాగలితో దున్నే వైపు వున్న భాగాలను లోహపు పట్టిలను అమర్చడం మొదలు పెట్టారు. ఇది నాగల సమర్థనను మరింత పెరిగింది.

మొదట్లో మనుష్యులే పొలాలలను దున్నప్పటికి క్రమంగా ఎడ్ల వంటి జంతువులతో దున్నించడం మొదలు పెట్టారు. ఇలా ఎడ్లతో పొలాలను దున్నించడం అనేది కీ.పు 3000 నాటికి అమల్లోకి వచ్చింది. అయితే నాగలివల్ల జంతువులతో పొలాలను దున్నించడం వల్ల గతంలో కన్నా వ్యవసాయం చాల సులభంగా మారి, ఎక్కువ మొత్తంలో పంట దిగుబడిని పొందడానికి వీలయింది. ఆహారం పుష్కలంగా లభించడం, బోలెడంత తీరిక దొరకడం అనే ఈ పరిస్థి మానవ నాగరికతలో భాషలు, కళలు, సంస్కృతి వంటి అనేక అంశాలు వికసించడానికి దారి తీసింది. ఆ దిశలోనే ట్రాక్టర్ ని కనిపెట్టడం జరిగింది . • ====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పాముచెవులు వున్న వాళ్ళని అంటారు ఎందుకు?,Why do some one call Snake eared person


మనలో మూడు రకాల చెవులు కనబడతాయి -మనకు కనిపించే చెవినే బాహ్మచెవి అంటారు--కర్ణభేరి వెనకాల మధ్య చెవి వుంటుంది. ఇందులో మాలియస్‌, ఇన్‌కస్‌, స్టేపిస్‌ అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది.స్టేపిస్‌ వెనకాల మొత్తని మృదులాస్థితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీనినే 'త్వచా గహనము' అంటారు.దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మొదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది.ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము.

పాములకు వెలుపలి చెవులులేవు . వెలుపలి చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ రంధ్రం' అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్‌' అనబడే 'కర్ణస్తంభిక' అనే ఒక ఎముక ఉంటుంది. ఈ కర్ణస్తంభిక ఒకవైపు లోపలి చెవికి కలుపబడితే...మరో వైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది.గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు.నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా...అంటూ పడగవిప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదేముందు నేలమీద చేతితో చరుస్తాడు. నేలద్వారా శబ్దతరంగాలు అందుకున్న నాగుపాము పడగవిప్పుతుంది.దాని కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దానిని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగుపాము పడగ అటు ఊగుతుంది. అంతేకానీ... నాగ స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు.నాగస్వరం కాకుండా ఏది దానిముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. ఓ గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే వుంటుంది. నాగస్వరమే ఉండనక్కరలేదు. నాగస్వరానికి నాగుపాము తలాడించడం అంతా వట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది నిజము .

అందుకే...అతి సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన సామర్థ్యమున్న వాళ్ళని ఇప్పటికీ ''పాముచెవులు'' వున్న వాళ్ళని అంటారు. కనుకనే ''పాముచెవులు'' అనే మాట ప్రసిద్ధి చెందింది. • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, January 30, 2011

ధ్వజస్థంబము ఉపయోగాలు ఏమిటి?, What are the uses of Dhwajasthambam


ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు.
 • 1 . ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు.
 • 2. ధ్వజస్థంబము ఉన్నది , లేనిది అనే అంశము ఆధారము గా మందిరము నకు , ఆలయము నకు తేడా విశదమగును .
 • పిడుగు పడేటప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్ ను లోహాలతో తయారయిన ఈ స్థంభం ఆకర్షించి షాక్ నుండి చుట్టుప్రక్కల ప్రజల్నని , విలువైన ఇంటిలోని సామగ్రిని కాపాడుతుంది . అందు కే ఆలయం గోపురం కంటే ఎత్తులో ఉండేటట్లు దీనిని నిర్మిస్తారు .

 • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పిడుగు ప్రమాదాలు ఎలా నివావించుకోవచ్చును?, How to protect from Thunderbolt accidents


మేఘాలు ఒరిపిడివల్ల వాటిలో విద్యుదావేశం పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల వాటిమీద విద్యుత్ పీడనం బాగా పెరిగిపోతుంది. ఇది నేలమీదకు దూకాలంటే గాలి అడ్డుగా నిలుస్తుంది. ఈ విద్యుత్ పీడనం అనేక వందల కోట్ల వోల్టులకు పెరగడంతో గాలి పరమాణువుల మీది ఎలక్ట్రానులను పీకేస్తుంది. దానితో గాలి అయాన్లు తయారై తనగుండా విద్యుత్‌ను ప్రవహించేందుకు అనుకూలతను కల్గిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి గాలి సన్నని దారిని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ దారిగుండా విద్యుత్ అనేక లక్షల ఆంపియర్ల బలం గలది ప్రవహిస్తుంది. ఫలితంగా దారిలోని ఉష్ణోగ్రత 15వేల నుండి 20వేల డిగ్రీల సెలిసియస్‌కు పెరిగిపోతుంది. దీనివల్ల మెరుపులు వస్తాయి. ఈ వేడివల్ల గాలి వ్యాకోచించి బాంబు పేలినంత చప్పుడవుతుంది. ఈ వేడికి చెట్లు కాలిపోతాయి. ఇళ్లు కూలిపోతాయి. జంతువులు ఈ విద్యుత్ ప్రవాహపు షాకుకు చచ్చిపోతాయి. దీనినే మనం పిడుగు అని పిలుస్తాం.

శబ్దం నుండి రక్షణ :
ఉరుముల వల్ల, పిడుగుల వల్ల వచ్చే శబ్దం చాలా ఎక్కకువగా ఉంటుంది. ఆ శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారని తెలుసుగా! పిడుగులు పడ్డప్పుడు వచ్చే ధ్వని తీవ్రత కొన్ని లక్షల డెసిబెల్స్‌ వరకూ వుంటుంది. అంత పెద్ద పెద్ద శబ్దాల వల్ల శాశ్వతంగా చెముడు వచ్చే ప్రమాదముంది. ఆ శబ్దాలకు కర్ణభేరి బ్రద్దలయ్యే ప్రమాదముంది. దాని నుండి తప్పించుకోవాలంటే చెవులన్నా మూసుకో వాలి. లేదా...నోరన్నా తెరవాలి! నోరు తెరిస్తే...ఆ శబ్దం చెవి నుండి నోటి ద్వారా విస్తరించి ప్రమాదం తప్పుంది. కనుక కర్ణభేరి సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అందుకనే పిడుగు పడినప్పుడు ''అర్జునా... ఫల్గుణా'' అని పిలిచి పిడుగుపాటు నుండి చెవిటి వాళ్లమయ్యే అవకాశం నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.

పిడుగు ఎలా ఏర్పడుతుంది ?

''నీటితో నిండిన భారమైన రెండు మేఘాల మధ్య రాపిడి వల్ల ఏర్పడిన విద్యుత్‌ ఆవేశాన్ని మెరుపు అంటాం. ఆ మెరుపు భూమిని తాకడాన్ని 'పిడుగు' అని పిలుస్తాం. పిడుగుపాటు ఎంత తీవ్రంగా ఉంటుందంటే...దాని విద్యుత్‌ తీవ్రత వల్ల గాలిలో ఏర్పడే ఉష్ణము 54,000 డిగ్రీ ఫారెన్‌ హీట్‌ ఉష్ణోగ్రత కావచ్చు. మన శరీర ఉష్ణోగ్రతను ఫారెన్‌ హీట్‌లోనే కొలుస్తారు.మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ .అంత ఉష్ణోగ్రతతో పిడుగు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వ్యాకోచం చెందు తుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం వలన ఏర్పడే పెద్ద శబ్దమే ఉరుము. అది పిడుగుపాటును సూచి స్తుంది

1994వ సంవత్సరంలో నవంబర్‌ రెండవ తేదీన ఈజిప్ట్‌లోని డురుంకా వద్ద పెట్రోలు ఇంధనాన్ని తీసుకువెళ్తున్న రైలును పిడుగు తాకింది. రైలు పట్టాలు తప్పింది. అందులోని ఇంధనం అంటుకుని దగ్గర ఉన్న సైనిక డిపో వద్ద పేలుడు సంభవించింది. దారిలో ఉన్న ఇళ్లన్నిటినీ రెండుగా చీల్చివేసింది.''

పిడుగు పాటు షాక్ నుండి తప్పించుకునే మార్గాలేమయినా ఉన్నాయా?

పూర్వం ప్రతీ ఊరిలో ఓ దేవాలయం ఉండేది. దాని ముందు రాగి, ఇత్తడి లాంటి లోహాలతో చేసిన ధ్వజస్తంభం ఉండేది. సాధా రణంగా ఉరుములు, మెరుపులు ఏర్పడిన తరువాత ఎత్తైన ప్రదేశాలలో వున్న విద్యుత్‌ వాహనాల ద్వారా భూమిని చేరుకొని తటస్థమౌతాయి. రాగి,ఇత్తడి మొదలగు లోహాల రేకుల వల్ల ఉరుములు ఆకర్షింపబడతాయి. విద్యుదావేశం ఇళ్లపై పడకుండా ధ్వజస్తంభం ద్వారా భూమిని చేరుకుంటుంది. అందుచేతే మనకు ప్రమాదం ఉండదు కనుక ఊరిలోని ఇళ్లకు గానీ మనుషులకు గానీ ప్రమాదాలు తప్పిపోతాయి. అలాంటి ధ్వజస్తంభాలు ఊరిని పిడుగుల బారి నుండి రక్షిస్తాయి. ఇప్పుడు ఎత్తైన భవనాలలో ఇటు వంటి నిర్మాణాలే ఏర్పాటు చేస్తున్నారు. పూర్వీకులు ఏర్పాటు చేయించి ధ్వజస్తంభాలలో ఎంత మానవతా దృక్పథం వుందో మనకు తెలుస్తుంది గదూ. ఆ విధంగా పిడుగుల నుండి ఊరు రక్షింపబడు తుంది. ధ్వజస్తంభం ఉండడం నిజంగా ఊరికి మేలే!

పిడుగులు వస్తాయనే అనుమానము ఉన్నప్పుడు ఇల్లలోని కరంటు అపేయాలి . అలా చేయకపోతే ఎక్కువ ఒల్టేజ్ ఉన్న విద్యుత్ తీగల ద్వారా ప్రవహించి .ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఉదా: టి.వి , రేడియో,కంప్యూటర్లు , లైట్లు , ఫ్రిజ్ లు మునంగునవి కాలిపోతాయి . అందుకే ముందు జాగ్రత్త గా కరంటు డిపార్ట్ మెంట్ వారు లైన్‌ కరంటు ఆపేస్తారు .


 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, January 29, 2011

సాలెపురుగుకు గూడెందుకు ?, Why do spiders need nest(spiderweb)


 • [Spider+Web.jpg]

సాలెపురుగు గోడల మూలల్లో, చెట్ల కొమ్మల్లో గూళ్ళు కడతాయి . ఇవి తమ ఆహారమైన పురుగులను పట్టుకునేందుకు ఇలా గూళ్ళు కడతాయి. గూడు కట్టేందుకు అవసరమైన దారాన్ని వాటి శరీరం నుండి ఉత్పత్తి చేస్తాయి . ఆ దారపు పోగుల్లోని పొడి దారం తో గూడులో చిక్కుకున్న కీటకాలను బంధించి ఆ తరువాత ఆహారము గా తీసుకుంటుంది . తమ గూటిలో తమ కాళ్ళు మాత్రం చిక్కుకోకుండా వెళ్ళగలిగిన నేర్పు సాలెపురులకు ఉన్నది . సాలెపురుగు ద్రవరూపం లోనే తన ఆహారము తీసుకుంటుంది . వాటి లో స్రవించే ద్రవాలు వలన గూడులో చిక్కుకున్న కీటకము ద్రవరూపం లోనికి మారుతుంది . . అప్పుడు ఆ కీటకద్రవాన్ని నోటిలో పీల్చుకుంటుంది . ద్రవరూపమ్లోనికి మారని కీటక అవశేషాలు ఆ వెబ్ లోనే మచ్చలుగా కనిపిస్తాయి.
 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, January 28, 2011

గాలి వేగాన్ని కొలిచేదెలా?. How do speed of air measure?


ప్రశ్న: వాతావరణ శాస్త్రవేత్తలు గాలి వేగాన్ని ఎలా కొలుస్తారు?

-పి. రాజకుమారి, ఏలూరు

జవాబు: గాలి వేగాన్ని కొలిచే సాధనాన్ని 'ఎనిమోమీటర్‌' అంటారు. ఎనిమోస్‌ అంటే గ్రీకు భాషలో వీచేగాలి (విండ్‌) అని అర్థం. ఈ సాధనం గాలి వేగాన్ని 'మీటర్స్‌ పర్‌ సెకండ్‌' లేక 'నాట్స్‌' (నాటికల్‌ మైల్స్‌ పర్‌ సెకండ్‌)లో రికార్డు చేస్తుంది. ఈ సాధనం గిరగిర తిరిగేలా అమర్చిన ఒక ఫ్యాన్‌ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. గాలి వేగం హెచ్చే కొద్దీ ఫ్యాన్‌ బ్లేడ్లు వేగంగా తిరుగుతాయి.

అలాగే ఒక చిన్న గొట్టంలో గాలి ఏర్పరిచే పీడనాన్ని బట్టి కూడా గాలి వేగాన్ని కొలుస్తారు. గొట్టంలోకి ప్రవేశించే గాలి వేగం ఎక్కువయ్యే కొద్దీ ఆ గాలి అప్పటికే గొట్టంలో ఉన్న వాయువు లేదా ద్రవంపై ప్రయోగించే పీడనం కూడా ఎక్కువవుతుంది. ఈ సూత్రంపైనే విమానాల వేగాన్ని కొలిచే 'పిరూట్‌ ట్యూబ్‌' అనే సాధనంతో కూడా గాలి వేగాన్ని కొలుస్తారు. ఇవే కాకుండా అతిధ్వనులను (అల్ట్రాసానిక్‌) కొలిచే సాధనాలతోను, అతిగా వేడెక్కిన తీగను గాలి చల్లార్చే సమయాన్ని కొలిచే సాధనంతో కూడా కొలుస్తారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గాలి వేగాన్ని భూమి నుంచి పదిమీటర్ల ఎత్తులో అమర్చిన సాధనంతో కొలుస్తారు. కారణం నేల ఉపరితలంపై అనేక అడ్డంకులు ఉండడం వల్ల గాలి వేగాన్ని కచ్చితంగా కొలవలేరు.


 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పురాణాలలో 108 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి ? , What is the importance of 108 in Hindu epics?
భారతావని లో ఆద్యాత్మికం ఎక్కువ . 120 కోట్ల జనాభా లో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్య ఉన్నది . అదేమిటో చదవండి ....
 • ఉపనిషత్తులు 108 ,
 • అష్టోత్తర నామావళి 108 ,
 • జపమాలలో పూసలు 108 ,
 • చంద్రునికీ , భూమికి మధ్య వున్న దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి .,
 • ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది ,
 • శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి ... మొత్తం 108 ,
 • దేవభాషలో అక్షరాలు 108 ,
 • భరతుడి నాట్యశాస్త్రమ్లో తెలుపబడిన నాట్యభంగిమలు 108 ,
 • దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.,
 • 108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం ,
 • 108 సార్లు హనుమాన్‌ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ,
 • ఆంద్రప్రదేశ్ లో 108 ఫోన్‌ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది .ఆపత్భాందవి ... రోగులను సరియైన ఆసుపత్రికి తీసుకెల్తుంది .


 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సిద్ధులు -యోగులు తమని తాకనీయరు ఎందుకు?, Rishis and Sadhus will not allow to touch them Why?సిద్ధులు , యోగులు తమని తాకనివ్వరు . దేనికి ? ...

దూరమునుండే నమస్కారానికి మాత్రమే పరిమితం చేస్తారు . ఎటువంటి పరిస్థితులలోనూ పాదాభివందనం చేయనివ్వరు. అలా చేస్తే వారు సాధించిన , సంపాదించుకున్న తపశ్శక్తి అవతలవారికి చేరుతుందని . . భయం , భయము తో కూడుకున్న నమ్మకం .

తమకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇచ్చేదానినే దానగుణము అంటారు . దానగుణము లేనివారికి తపశ్శక్తి ఎలా వస్తుందో మన ఋషులకే తెలియాలి . సిద్ధులు , యోగులు , ఋషులు అనేవారికి పోతుందనే భయమే ఉండకూడదు . నీది... నాది... అనే భావన ఆ భగవంతునకు ఉండదని అంటారు . . . భగవత్ జ్ఞానము అనే తపోశక్తి పొందినవారు భగవత్సమానులు కాదా ?.


 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Advised not to take bath after coming from Temple-why?,దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక స్నానం చేయకూడదంటారు-ఎందుకు?


మనం సహజంగా స్నానము చేసేది ఉదయం . ప్రతి ఒక్కరు చేసేదే ఇది. . కొంతమంది సాయంత్రం తమ పనులనుండి తిరిగి వచ్చాక స్నానం చేస్తారు . శరీరం పై ఉన్న మురికిని , మలినాలను శుభ్రచేసుకునేందుకే స్నానము . మరికొంతమంది నిద్రకోసం వేడినీరు రాత్రి పడుకునేమందు స్నానం చేస్తారు . ఇది రోజూ జరిగే పక్రియ .

ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు , శ్మశానమునకు వెళ్ళి వచ్చాకా తప్పక స్నానము చేస్తుంటారు . ఇక్కడ బయటికి వెళ్ళిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి కి ఏధైనా అంటువ్యాధితో చనిపోతే ఆ ఇన్‌ఫెక్షన్‌ అంటుకోకుండా, వేసుకున్న బట్టలతో సహా తడిపి స్నానము చేస్తారు . పూర్వము ఏ మనిషి ఏ జబ్బుతో చనిపోయారో తెలిసేది కాదు .. అంతగా అభివృద్ధి చెందని , వైద్యవిజ్ఞానము అందని రోజులలో మన పురాణ రచయితలు ఈ నియమము పెట్టేరని భావించాలి .

అయితే దేవాలయం పవిత్రమైన ప్రదేశం . చుచి శుభ్రత అక్కడ పాటిస్తారు . అంటువ్యాధులు వచ్చే అవకాశము లేదు . పూర్వము అనాగరికులకు , పరిశుభ్రతలేనివారికి ఆలయ ప్రవేశము ఉండేదికాదు . అందుచే పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానము చేస్తే ఆ పవిత్రత , పుణ్యము పోతుందని నమ్మకం ...ఏ కారణంగానూ దేవాలయానికివెళ్ళి వచ్చి స్నానము చెయ్యకూడదు . నమ్మకం తో పుణ్యము వచ్చిందనేది మనదేహం నుండి తుడుచు పోతుందని మన మతాధికారు పెట్టిన నియమము .

పుణ్యము , పాపము ఒక మనిషి మనస్సుకు సంబంధిన విషయము . పాపము చేస్తే నరక లోకము లో శిక్షలు పొందుతావు ,, పుణ్యము చేస్తే స్వర్గము చేరుతావు అనేది ఎవరికి .... మనసు కా ? దేహానికా ? , చనిపోయాక దేహము మట్టిలో కలిసిపోతుంది కదా! కనుక చచ్చినవానికి దేహము తో సంభందము లేదు . స్వర్గమో , నరకమో అది ఆత్మకే చెందుతుంది . ఇప్పుడర్ధమైయిందికదా ఈ స్నానమనేది ఆరోగ్యము కాపాడేందుకేనని .====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గంపలో పెళ్ళికూతుర్ని ఉంచుతారెందుకు ?,Bridi is being kept in basket Whi?

వివాహ సమయం లో గంపలో పెళ్ళికూతురిని ఉంచి ఎందుకు తెస్తాతారు ?

హిందూ వివాహ తంతు ఒక విశిస్టమైన నమ్మకం లో కూడుకున్నది . దంపతులు పది కాలాలపాటు సిరి సంపద , పిల్లాపాపలలో హాయిగా బ్రతకాలని ... అలా ఎన్నో నమ్మకాలు ఈ వివాహ వ్యవస్థలో ఇమిడి ఉన్నాయి . శ్రీ మహాలక్ష్మి తామరపువ్వులో ఉంటుంది . అందుకే మా ఇంటి మహాలక్ష్మిని గంప అనే తామరపువ్వులో అపురూపంగా తెచ్చి నీకిస్తున్నామని భావము . ఈ ఆచారము కొన్ని హిందూ కుటుంబాలలోనే ఉన్నది .

 • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, January 27, 2011

గృహప్రవేశము చేసేటపుడు పాలు పొంగించడం ఎందుకు ?, Milk boiling at new house opening is why?


గతం లో కట్టెల పొయ్యి మీద వంటచేసేవారు . శుభ పర్వదినాల్లో రెండు బియ్యపు గింజలను పొయ్యిలో వేసేవారు . . అలా మాడిన బియ్యపు వాసనవల్ల వంటగదిలో అనేక క్రిమికీటకాలు దూరంగా తొలకిపోతాయి. కాలం మారుతుండడంతో బ్రతుకుతెరువు కోసం అనేక చోట్లకు జనం తరలి వెళ్తుండడం తో వెళ్ళినచోట పాటు పొంగంచి బియ్యం వేసి ఉడికించిన పొంగలిని నైవేద్యము గా భగవంతునికి సమర్పించమని పెద్దలు ఆచారము గా ఈ నియమాన్ని పెట్టేరు .

పాలు పొంగి దొర్లేటట్లు చూసారు . . . అంటే ఆ గృహము లో ప్రవేసించిన నాటినుండి తమ జీవితాలలో సుఖసంతోషాలు పాల పొంగులా ఎల్లాప్పుడు దొర్లుతూ ఉండాలి భావన . . నమ్మకం .

ఆదిపరాశక్తి ఈ చరాచర జగత్తును సృష్టించే సంకల్పంతో బ్రహ్మకు సృష్టి కార్యాన్ని, విష్ణువుకు స్థితికార్యాన్ని, శివునికి లయకార్యాన్ని అప్పగించినది. సకల జీవకోటిలో ఉత్క్రుష్టమైన జన్మ మానవజన్మ. అటువంటి మానవులకు మేధస్సును, తేజస్సును, ఓజస్సును పుష్ఠిని, పరిపుష్ఠిని కలుగజేయునది గోమాత. మానవునకు జ్ఞాన, విజ్ఞానాలను కలుగజేయుటకు సాక్షాత్‌ ఆదిపరాశక్తి గోరూపాన్ని దాల్చి దివి నుండి భువికి దిగివచ్చినది. అటుంటి గోమాతను సేవించుట కాదు, నిత్యం పూజించవలయును. ఏ పూజగాని, ఏ యజ్ఞంగాని, ఏ యాగంగాని, ఏ దేవతా ప్రతిష్టగానీ, గోపూజ లేనిదే సిద్ధించదు. గృహ్రవేశ సమయంలో ముందుగా గృహమందు ప్రవేశించునది గోమాతే! దేవతామూర్తుల చిత్రపటాలను, విగ్రహాలను ఏ విధంగా అయితే గృహమందు శాశ్వతంగా ఉంచి పూజిస్తామో, అదే విధంగా గృహంలో ఉండే సకల దోషాలు, వాస్తు దోషాలూ తన పాద స్పర్శతో పోగొట్టే గోమాతకు కూడా గృహంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలి. గోమాత , గోపాలు , ఆవుపేడ , ఆవు మూత్రము అన్నీ పవిత్రమైనవని పూర్వీకుల నమ్మకం . మానవులకు అన్నివధాల ఉపయోగపడే ఆవును ఆద్యాత్మికం గా అలా పూజించి ఆదరించి ... అంతరించిపోకుండా చూడాలనేదే మన పురోహితుల ఉద్దేశము అని అనుకోవాలి .

 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, January 26, 2011

Our Festivals do not come as per english calendar-Why?,మన పండుగలన్నీ ఇంగ్లీషు తేదీల ప్రకారం క్రమం గా రావు-ఎందుకు?


ప్ర : మన పండుగలన్నీ ఇంగ్లీషు తేదీల ప్రకారం క్రమం గా రావు . సంక్రాంతి పండుగ మాత్రం తప్పని సరిగా వస్తుంది . అదెలా?.

జ : కాలాన్ని కొలిచే పద్దతి బట్టి మన పండుగలు వస్తూ ఉంటాయి. చంద్రమానం(Lunar calendar)చంద్రగమనాన్ని బట్టి , సూర్యమానం (solar calendar)సూర్యగమన్నాన్ని బట్టి ... అనే రెండు పద్దతుల ప్రకారము మన కేలండర్లు తయారయ్యాలి . చందమానం ప్రకారం నెలకి 29 రోజులు ... సంవత్సరానికి 348 దినాలు. (నక్షత్రాలు 27+అమావాస్య +పౌర్ణమి =29 రోజులు). సూర్యమానం ప్రకారము సంవత్సరానికి 365 +1/2 రోజులు . ఈ రెండు కేలండర్లను సమానము చేయుటకు సంవత్సరము లో అధికమాసాలని కలుపుకుంటూ వస్తున్నారు .
మన పూర్వీకులు చంద్రమానం ప్రకారము పండుగన్నీ జరిపారు కాని సంక్రాంతి సూర్యమానం ప్రకారం జరుపాలసి వచ్చినది కావున ఇది డేట్స్ ప్రకారం సంక్రాంతి వస్తుంది .


==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, January 25, 2011

కొంగ ఒంటికాలుమీద ఎందుకు నిలబడుతుంది ?, Crane stands on single leg-Why?


ఒంటి కాలుమీద నిలబడిన కొంగను చూసి చాలామంది జపం చేస్తుందని అనుకుంటారు . కాని అది ఒక రకమైన రక్షణ . చల్లని నీళ్ళలో నిలబడినపుడు ఆ చల్లదనం నుండి రక్షణ కోసం కాళ్ళకు అధిక రక్తసరఫరా చేయాల్సి వస్తుంది . అది గుండెమీద ఒత్తిడి పెంచుతుంది . కాబట్టి ఒక కాలుమీద నిలబడితే ఆ ఒత్తిడి సగం తగ్గుతుంది . ఒంటికాలు మీద నిలబడితే ఆ సన్నటికాలు గడ్డిలో కలసిపోయి శత్రుజీవులకు కనిపించదు. అది కూడా ఓ రక్షణ మార్గమే . కాళ్ళు తప్ప కొంగ శరీరము నిండా వెంటుకలు , ఈకలు తో నిండి ఉండి శరీర ఉష్ణోగ్రతను హెచ్చు తగ్గులు కాకుండా కాపాడు కుంటుంది. ఒంటి కాళు తో నిలబడి శరీర ఉష్ణోగ్రత పోకుండా 50% వరకూ నియంత్రించగలుగుతుంది . ఇదీ కొంగ జపం లోని రహస్యము .

 • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Who are Seven Rishis in Hindu epics?, Sapta Rishis , హిందూ పురాణాల్లో సప్త ఋషులెవరు ?

భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.


ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.
 • 1.కశ్యపుడు,
 • 2.అత్రి,
 • 3.భరద్వాజుడు,
 • 4.విశ్వామిత్రుడు,
 • 5.గౌతముడు,
 • 6.జమదగ్ని,
 • 7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

What are Seven hills in Hindu epics?, హిందూపురాణాలలో సప్త పర్వతములు అంటే ఏవి ?

ప్రపంచము లో ఎన్నో పర్వతాలు ఉన్నాయి . హిందూ పురాణాలలో పర్వతాలకు ఒక ప్రత్యేకత ఉన్నది . పర్వత రాజ్యాలు , పర్వత రాజులు ఉన్నట్లు ఎన్నోకథలు ఉన్నాయి. ఇప్పుడున్న పర్వతాలకు వాటికి ఎటువంటి సంభందమున్నదో తెలుసుకోవడం కస్టసాధ్యమే అవుతుంది. వేదవ్యాసుడు తన శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యప్రజలకు ఆచనరణ యోగ్యము గా ఉండేవిధంగా (ఉండేందుకు) అన్నిటినీ దైవదత్తము చేసి వ్రాసాడని మనం ఇక్కడ గ్రహించాలి .

సప్త పర్వతాలు :
 • 1. మహేంద్ర పర్వతము ,
 • 2. మలయ పర్వతము ,
 • 3. సహ్యాది పర్వతము ,
 • 4. హిమాలయ పర్వతము ,
 • 5. రైవతక పర్వతము ,
 • 6. వింధ్య పర్వతము ,
 • 7. ఆరావళి పర్వతము ,

 • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, January 16, 2011

సంక్రాంతి అంటే ఏమిటి ?, What is Sankranthi?
సూర్యుడు ఒకరాశి నుండి మరొక రాశికి చేరడాన్ని సంక్రాంతి అంటారు . జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సంవత్సరములో 12 సార్లు సంభవిస్తాయి (వస్తాయి). ఈ పన్నెండే కాకుండా సంక్రమణ సమయంలో వచ్చే వారాల్ని , నక్షత్రాలను బట్టి మరో ఏడు సంక్రాంతులున్నాయి .
రాశులు : 12.=1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము .

ఏడాదిలో వచ్చే 12 సంక్రాంతులను నాలుగు భాగాలుగా విభజించవచ్చును . అవి ->
1. అయన సంక్రాంతులు , 2. విఘవ సంక్రాంతులు , 3. షడశీతి సంక్రాంతులు , 4. విష్ణుపదీ సంక్రాంతులు .

1.ఉత్తరాయణ ఆరంభంలో వచ్చే "మకర సంక్రాంతి" , దక్షిణాయణం ఆరంభం లో వచ్చే "కర్కట సంక్రాంతి " రెండింటినీ అయన సంక్రాంతులు అంటారు .

2.మేష, తులా సంక్రాంతులు విఘవ సంక్రంతులు -- అంటే ఈ కాలమ్లో రాత్రింబవళ్ళు సమానం గా ఉంటాయి కాబట్టి వాటికాపేరు వచ్చింది .

3.మెధున , కన్యా , ధనుర్మాస సంక్రాంతులు ను షడశీతి సంక్రాంతులంటారు .

4.వృషభ , సింహ , వృశ్చిక , కుంభ సంక్రాంతులను విష్నుపదీ సంక్రాంతులంటారు .

మిగతా ఏడు -- మందా , మందాకిని , ధ్వాంక్షి , హోరా, మహోదరి , రాక్షసి , విశ్రితా సంక్రాంతులుగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది .
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలొ ఉన్నట్లు కనిపించునప్పుడు --ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు -- దక్షిణాయణము అని పిలిచారు . (సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణము లో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు .మన జ్యోతిష్య్ శాస్త్రం ప్రకారము దక్షిణాయణం లో దేవతలు నిద్రించి ఉత్తరాయణమ్లో మేల్కొంటారని పురాణాలు తెలియజేయుచు్న్నాయి. మానవులు సంత్సరకాలము దేవతలకు ఒకరోజుగాను ... దక్షిణాయణం రాత్రి , ఉత్తరాయణం పగలు గా మన ఆద్యాత్మిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఉత్తరాయణం లో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని , ఈ కాలలములో మరణించినవారికి వైంకుఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి . ఈ మకర సంక్రమణము పుష్య మాసం నుండి వస్తుంది. దక్షిణాయణము లో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరి్చియున్న ద్వారాలు గుండా వైకుంఠం చేరుకుంటారని (వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ) నమ్మకం . అందుకే పెద్దలకు పూజలు , కొత్తబట్టలు , నైవేద్యాలు పెడతారు ... పూజలు జరుపుతారు . అంతా నమ్మకమే. . . ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు .
 • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, January 14, 2011

సీ అర్చిన్ సంగతేమిటి?,Waht abot Sea-archin?
కళ్లు లేవు... కాళ్లు లేవు... ఒళ్లంతా ముళ్లే... అదే 'సీ అర్చిన్‌'! దీని గురించి ఓ కొత్త సంగతి బయటపడింది!

మొదటిసారి సీ అర్చిన్‌ను చూసేవారెవరైనా అది ఒక జీవని అనుకోరు. గుండ్రంటి బంతి చుట్టూ, పదునైన ముళ్లని అతికించినట్టు ఉంటుంది. వూదా, ఆకుపచ్చ లాంటి రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది సముద్రగర్భంలో ఉండే బండరాళ్లని అతుక్కుని ఉంటుంది. చూడ్డానికి కాక్టస్‌లాంటి ముళ్లమొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఓ ఆశ్చర్యకరమైన సంగతిని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముళ్లబంతిలాంటి శరీరం అడుగున ఉండే నోటిలో అయిదు పళ్లు ఉంటాయి. త్రికోణాకారంలో ఉండే ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటిగా అతుక్కుని వలయాకారంలో ఉంటాయి. బండరాళ్లని కరుచుకుని ఉండే ఇవి ఈ పళ్లతోనే వాటిని తొలిచి రంధ్రాలు కూడా చేయగలవు. వాటిలో సురక్షితంగా కాపురముండగలవు. ఈ పళ్లతోనే అవి రాళ్లపై ఉండే నాచులాంటి ఆల్గేని గీక్కుని తింటూ ఉంటాయి. మరి ఇలా బండల్ని కూడా కొరికేసి, గీరేసి, తొలిచేస్తుంటే ఆ పళ్లెలా తట్టుకుంటున్నాయి? ఇదే సందేహం శాస్త్రవేత్తలకు కలిగింది. దాంతో వాటిని, వాటి దంతాల్ని ఆధునిక సూక్ష్మదర్శినిలు, ఎక్స్‌రే పరికరాలతో గమనించారు. అవి అరిగిపోవడం లేదు సరికదా, రాన్రాను మరింత పదునుగా తయారవుతున్నాయని కనుగొన్నారు. వీటి పళ్లు కాల్ఫియం కార్బోనేట్‌ వల్ల తయారయ్యే కాల్‌కైట్‌ (Calcite) అనే ఖనిజం వల్ల తయారవుతున్నాయని తేలింది. రాళ్లను గీరుతున్నప్పుడు ఒక అంచు అరిగిపోయినా, దాని స్థానంలో మరో అంచు వెంటనే వచ్చేలా వీటి అణువుల నిర్మాణం ఉందని కనుగొన్నారు. ఇవి ఇంత వరకు మనిషి తయారు చేసిన అన్ని పరికరాల కన్నా పదునుగా, అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. 'ఎక్కడో సముద్ర అడుగున ఉండే జీవి పళ్లు ఎలా ఉంటే మనకేం?' అనుకోకండి. ఈ పరిశోధన సాయంతో ఎప్పటికీ పదును కోల్పోని పరికరాలను తయారు చేయవచ్చనేది శాస్త్రవేత్తలు ఉద్దేశం.
* వీటికి కళ్లు ఉండవు. ఒంటిపై ఉండే ముళ్లలాంటి భాగాల చివర్లలోని కాంతి గ్రాహకాల ద్వారా పరిసరాలను గమనిస్తాయి.
* సుమారు 4 అంగుళాల పొడవు పెరిగే ఇవి ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి.
* ముళ్ల లాంటి భాగాల ఆధారంగానే ముందుకు కదులుతాయి. శత్రువుల నుంచి కాపాడే రక్షణ కవచాలు కూడా ఇవే.
* వీటిలో సుమారు 200 జాతుల్ని గుర్తించారు.
* వీటిని జపాన్‌లో ఇష్టంగా తింటారు. వీటి గుడ్లను కూడా వండి వడ్డిస్తారు.


 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, January 11, 2011

జీవం అంతరిస్తుందా?,Do life end in thd universe?

ప్రశ్న: భవిష్యత్తులో విశ్వంలోని జీవం అంతరించే అవకాశం ఉందా?


[Universe+-+Evaluations.jpg]

- సి.ఆర్‌. మూర్తి, చీమకుర్తి (ప్రకాశం)

జవాబు: 'బిగ్‌ బ్యాంగ్‌' వల్ల విశ్వం ఉత్పన్నమైనట్లే భవిష్యత్తులో 'బిగ్‌ క్రంచ్‌' ప్రక్రియ ద్వారా విశ్వంలో అన్ని రకాల జీవజాలం అంతరిస్తుందనేది శాస్త్రజ్ఞుల ఊహ. ప్రస్తుతం విశ్వం విస్తరిస్తున్నా కొంతకాలం తరువాత ద్రవ్య, శక్తుల సాంద్రత పలచబడటంతో జీవం కొనసాగడానికి అవసరమైన శక్తి లభించే అవకాశం లేకపోవచ్చు. ఈ పరిస్థితులకు తగ్గట్టు జీవ ప్రక్రియలు తొలుత అతి నెమ్మదిగా కొనసాగినా ఒక దశలో అది కూడా సాధ్యం కాకపోవచ్చు. పరిసరాల ఉష్ణోగ్రత జీవజాలాల ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకే జీవులు శక్తిని విడుదల చేయగలవు. విశ్వంలోని ఉష్ణోగ్రత ఒక కనిష్ఠ స్థాయి వరకు చేరుకోగలదు. ఆ ఉష్ణోగ్రత మైనస్‌ 273.15 సెంటీగ్రేడ్‌. విశ్వంలోని జీవం ఉష్ణోగ్రత అంతకన్నా ఏ మాత్రం తగ్గినా జీవాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గినా జీవులన్నిటితో పాటు మనమూ అసౌకర్యానికి, అనారోగ్యానికి గురవుతామనేది తెలిసిందే కదా?

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు,హైదరాబాద్‌

 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, January 10, 2011

జనవరి నెల ఎలా వచ్చింది?, How january month originated?


నెలల పేర్లు చెప్పమంటే... జనవరితోనే మొదలు పెడతాం కాని ఒకప్పుడు... ఈ నెల లేనేలేదు .

జనవరి మొదటి తేదీ రాగానే కొత్త ఏడాది వేడుకలను చేసుకుంటున్నాం. కానీ నెలలు ఏర్పడిన తర్వాత చాలా ఏళ్ల వరకు జనవరి అనే నెలే లేదు. జనవరి లేకపోతే మరి కొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభమయ్యేది? మార్చి 1న. ఆ రోజునే ప్రపంచమంతా కొత్త ఏడాదిని స్వాగతించేది. మరి జనవరి నెల ఎలా వచ్చింది? ఎవరు ప్రవేశపెట్టారు?
ఇప్పుడు మనం వాడుతున్న 12 నెలల క్యాలండర్‌ని గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అంటారు. దీనికి ముందు అనేక రకాల క్యాలెండర్లు ఉండేవి. వాటిల్లో ముఖ్యమైనది రోమన్‌ క్యాలెండర్‌. ఇందులో 10 నెలలే ఉండేవి. జనవరి, ఫిబ్రవరి ఉండేవి కావు. మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. క్రీస్తు పూర్వం 700 శతాబ్దంలో రోమ్‌ను 'నుమా పాంటిలియస్‌' అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడే ఏడాదిని 12 నెలలుగా విభజించి, జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపాడు. దాంతో కొత్త ఏడాది ప్రారంభమయ్యే తేది జనవరి 1గా మారింది. మొదటి నెలకి ఏ పేరు పెట్టాలో ఆలోచించి నుమా చక్రవర్తి 'జానస్‌' అనే రోమన్‌ దేవుడి పేరు మీద 'జానారిస్‌' అని పెట్టాడు. వాడుక భాషలో అది జనవరిగా మారింది. అయితే నుమా జనవరికి 30 రోజుల్నే కేటాయించాడు. క్రీ.పూ. 46వ శతాబ్దంలో రోమ్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ మరో రోజును కలిపి 31 రోజుల నెలగా జనవరిని మార్చాడు. తరువాత 15వ శతాబ్దంలో ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగారియన్‌ క్యాలెండర్‌ రూపొందింది. ఇది కూడా జనవరిని మొదటినెలగానే కొనసాగించింది.

ఇంతకీ జనవరికి 'జానస్‌' దేవుడి పేరునే ఎందుకు పెట్టాలి? మనకి వినాయకుడు ఎలాగో రోమన్లకు జానస్‌ అలాగ. ఏదైనా పని ప్రారంభించే ముందు వాళ్లు జానస్‌కు మొక్కేవారు. ఈ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం గతాన్ని, మరొకటి భవిష్యత్తును సూచిస్తుందని చెబుతారు. ఆరంభానికి, అంతానికి కూడా ఈయనే మూలమని నమ్ముతారు.ఓసారి రోమ్‌ను స్థాపించిన 'రోమ్యులస్‌' చక్రవర్తిని, అతని పరివారాన్ని పొరుగు రాజ్యపురాణి సబైన్‌ ఎత్తుకుపోతుంది. అప్పుడు జానస్‌ దేవుడు వారిపై అగ్నిపర్వతంలోని లావాను వెదజల్లి కాపాడాడనేది కథ.

source : Eenadu Haibujji.
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

జుట్టులో రకాలేల?, Hair grows in different kinds-Why?


ప్రశ్న: తల వెంట్రుకలు కొందరికి వంకర లేకుండా తిన్నగా ఉంటే, కొందరికి ఉంగరాలు తిరిగి ఉంటాయెందుకు?

-ఎమ్‌.ఎ. రంగనాథం, పానగల్లు (చిత్తూరు)

జవాబు: తల వెంట్రుకల రంగులాగే వాటి ఆకారం కూడా జన్యు సంబంధమైన విషయమే. తూర్పు ఆసియా ప్రాంతం వారి తలవెంట్రుకలు సాధారణంగా వంకర లేకుండా తిన్నగా ఉంటే, యూరోపియన్లవి తిన్నగానైనా, ఉంగరాలుగానైనా ఉంటాయి. ఆఫ్రికా దేశవాసుల జుట్లు ఉంగరాలు తిరిగి బిరుసుగా ఉంటుంది. తిన్నగా ఉండే వెంట్రుకల అడ్డుకోత గుండ్రంగా ఉంటే, ఉంగరాల జుట్టు అడ్డకోత అండాకార రూపంలో ఉంటుంది. వివిధ రకాల వెంట్రుకలను వాటిలో ఉండే రసాయనిక సమ్మేళనాలను బట్టి గుర్తించవచ్చు. ప్రతి వెంట్రుకలో ప్రొటీన్‌ కెరొటిన్‌ అణువులు ముఖ్యంగా ఉంటాయి. తిన్నగా ఉండే వెంట్రుకల్లో ఇవి సల్ఫర్‌ బాండ్లలో గంధక బంధనాల (సల్ఫర్‌ బాండ్ల) ద్వారా ఒకటిగా బంధింపబడి ఉండడంతో అవి సాపుగా, దృఢంగా ఎదుగుతాయి. వీటికి తోడు అదనంగా వదులుగా బంధింపబడి స్థితిస్థాపకత కలిగిన కెరొటిన్‌ కలిగి ఉండే వెంట్రుకలు వంకర తిరిగి ఉంగరాల జుట్లుగా ఏర్పడతాయి. తిన్నగా ఉండే వెంట్రుకలలోని సల్ఫర్‌బాండ్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని ఉంగరాల జుట్టుగా మార్చవచ్చు. ఈ ప్రక్రియను పెర్మింగ్‌ అంటారు.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఐస్‌ క్యూబ్‌ నీటిలో వేస్తే తేలుతుంది. ఎందుకు?,Ice cube floats on water-Why?ప్రశ్న: ఐస్‌ క్యూబ్‌ నీటిలో వేస్తే తేలుతుంది. ఎందుకు?
జవాబు: నీరు ద్రవస్థితిలో ఉండడానికి కారణం నీటి అణువుల మధ్య హైడ్రోజన్‌ బంధాలు ఉండడమేనని చదువుకుని ఉంటారు. ఈ బంధాల సామర్థ్యం ఉష్ణోగ్రతనుబట్టి మారుతుంది. సుమారు 4 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఈ సామర్థ్యం అత్యధికంగా ఉండి అణువులు బాగా దగ్గరగా ఉంటాయి. ఇంతకన్నా ఉష్ణోగ్రత పెరిగినా లేదా తగ్గినా కూడా నీటి సాంద్రత తగ్గుతుంది. ఇక సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద నీరు గడ్డ కట్టి మంచుముక్కగా మారుతుంది. ఈ దశలో దీని సాంద్రత, సుమారు 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్న నీటి కన్నా తక్కువగా ఉంటుంది.

ఏదైనా ద్రవపు సాంద్రత కన్నా అందులో వేసిన వస్తువు సాంద్రత తక్కువయితే ఆ వస్తువు తేలుతుందని, ఎక్కువయితే మునుగుతుందని, సమానంగా ఉంటే మధ్యలో వ్రేలాడు (suspended)తుందని మనం ప్లవన సూత్రాల్లో (laws of flotation) తెలుసుకున్నాం కదా! ఐసుగడ్డ సాంద్రత, ద్రవనీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి ఐసుగడ్డ తేలుతుంది.

పెద్దపెద్ద సముద్రాలలో మంచుగడ్డల రూపంలో ఉన్న హిమ శిలలు (ice bergs) తేలి ఉన్నాయి కాబట్టే సముద్రతీరాల్లో పట్టణాలు సజావుగా ఉన్నాయి. ఒకవేళ అవి మునిగే పరిస్థితి ఉంటే, తీర ప్రాంత ఆవాసాలు జలసమాధి అయ్యేవి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

గిలక్కొడితే చిక్కదనమేల? , Egg white become thick on churning Why?

ప్రశ్న: కోడిగుడ్డులోని తెల్లసొనను గిలక్కొడితే గట్టిపడుతుంది, ఎందుకు?

- సామా అరుణ, 10వ తరగతి, ఖమ్మం

జవాబు: కోడి గుడ్డులోని తెల్లసొనలో 90 శాతం నీరుంటుంది. నీటితోపాటు అందులో పొడవైన ప్రోటీన్‌ అణువులు కూడా ఉంటాయి. ఇవి గోళాల రూపంలో ఊలు బంతులను పోలి ఉండి తెల్లసొనలోని నీటి అణువులను వదులుగా బంధించి ఉంటాయి.

తెల్లసొనను గిలక్కొట్టినప్పుడు అందులోని నీటిలో గాలి బుడగలు ఏర్పడి నీరు, ప్రోటీన్ల మిశ్రమంలోని ప్రోటీన్లు వేరవుతాయి. ఈ స్థితిలో ప్రోటీన్లలో కొన్ని నీటి అణువుల్ని ఆకర్షిస్తే, కొన్ని వికర్షిస్తాయి. ఈ ప్రొటీన్లు నీటి అణువుల, గాలి బుడగల హద్దులకు అంటుకుని ఒక పొరలాగ ఏర్పడటంతో తెల్లసొన గట్టిపడుతుంది. గట్టిపడిన తెల్ల సొనను మరీ గిలక్కొడితే నీటి అణువులు ప్రోటీన్ల నుంచి వేరుపడి అప్పటివరకు తెల్లసొనను గట్టిపరుస్తున్న ప్రక్రియ వృధా అవుతుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌


 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

టీవీకి అయస్కాంతం పడదా?, Magnet is foe to TV


 • Photo Courtesy with : http://www.paikstudios.com/ప్రశ్న: టీవీ పక్కన అయస్కాంతం ఉంచినప్పుడు తెరమీద రంగులు మారతాయి ఎందుకని?

- జె. శ్రీనివాస్‌, మిర్యాలగూడ

జవాబు: టీవీ తెర వెనుక భాగంలో పూతపూసిన ఫ్లోరసెంట్‌ పదార్థంపై ఎలక్ట్రాన్ల ధార వేగంగా పడడం వల్లనే తెరపై దృశ్యాలు ఏర్పడతాయి. అయితే కలర్‌ టీవీ తెర విషయంలో ఫ్లోరసెంట్‌ పదార్థం ఒకే తీరుగా ఉండదు. ఎలక్ట్రాన్లు పడ్డప్పుడు ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెదజల్లే మూడు బొడిపెలు (RBG) పక్కపక్కనే ఉంటాయి.ఈ మూడింటి సముదాయాన్ని కలిపి ఒక Pixel (Picture Element కు పొట్టిపేరు) అంటారు. కలర్‌ టీవీలో మూడు వేర్వేరు ఎలక్ట్రాన్‌ ధారలు వీటిని విడివిడిగా తాకేలా ఏర్పాటు ఉంటుంది. ప్రతి విడివిడి ఎలక్ట్రాను ఓ చిన్నపాటి అయస్కాంతమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేరే అయస్కాంతాన్ని తెరకు దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రాన్ల ప్రవాహ మార్గాల్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడవి తాకవలసిన చుక్కల్ని కాక పక్కకి పడతాయన్నమాట. దాంతో రావలసిన రంగులకు బదులు వేరే రంగులు కనిపిస్తాయి. అయస్కాంతం తీయగానే తిరిగి దృశ్యాలు యధా ప్రకారం బాగా వస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక.
 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.