Friday, January 28, 2011

గాలి వేగాన్ని కొలిచేదెలా?. How do speed of air measure?


ప్రశ్న: వాతావరణ శాస్త్రవేత్తలు గాలి వేగాన్ని ఎలా కొలుస్తారు?

-పి. రాజకుమారి, ఏలూరు

జవాబు: గాలి వేగాన్ని కొలిచే సాధనాన్ని 'ఎనిమోమీటర్‌' అంటారు. ఎనిమోస్‌ అంటే గ్రీకు భాషలో వీచేగాలి (విండ్‌) అని అర్థం. ఈ సాధనం గాలి వేగాన్ని 'మీటర్స్‌ పర్‌ సెకండ్‌' లేక 'నాట్స్‌' (నాటికల్‌ మైల్స్‌ పర్‌ సెకండ్‌)లో రికార్డు చేస్తుంది. ఈ సాధనం గిరగిర తిరిగేలా అమర్చిన ఒక ఫ్యాన్‌ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. గాలి వేగం హెచ్చే కొద్దీ ఫ్యాన్‌ బ్లేడ్లు వేగంగా తిరుగుతాయి.

అలాగే ఒక చిన్న గొట్టంలో గాలి ఏర్పరిచే పీడనాన్ని బట్టి కూడా గాలి వేగాన్ని కొలుస్తారు. గొట్టంలోకి ప్రవేశించే గాలి వేగం ఎక్కువయ్యే కొద్దీ ఆ గాలి అప్పటికే గొట్టంలో ఉన్న వాయువు లేదా ద్రవంపై ప్రయోగించే పీడనం కూడా ఎక్కువవుతుంది. ఈ సూత్రంపైనే విమానాల వేగాన్ని కొలిచే 'పిరూట్‌ ట్యూబ్‌' అనే సాధనంతో కూడా గాలి వేగాన్ని కొలుస్తారు. ఇవే కాకుండా అతిధ్వనులను (అల్ట్రాసానిక్‌) కొలిచే సాధనాలతోను, అతిగా వేడెక్కిన తీగను గాలి చల్లార్చే సమయాన్ని కొలిచే సాధనంతో కూడా కొలుస్తారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గాలి వేగాన్ని భూమి నుంచి పదిమీటర్ల ఎత్తులో అమర్చిన సాధనంతో కొలుస్తారు. కారణం నేల ఉపరితలంపై అనేక అడ్డంకులు ఉండడం వల్ల గాలి వేగాన్ని కచ్చితంగా కొలవలేరు.


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...