Monday, January 10, 2011

గిలక్కొడితే చిక్కదనమేల? , Egg white become thick on churning Why?





ప్రశ్న: కోడిగుడ్డులోని తెల్లసొనను గిలక్కొడితే గట్టిపడుతుంది, ఎందుకు?

- సామా అరుణ, 10వ తరగతి, ఖమ్మం

జవాబు: కోడి గుడ్డులోని తెల్లసొనలో 90 శాతం నీరుంటుంది. నీటితోపాటు అందులో పొడవైన ప్రోటీన్‌ అణువులు కూడా ఉంటాయి. ఇవి గోళాల రూపంలో ఊలు బంతులను పోలి ఉండి తెల్లసొనలోని నీటి అణువులను వదులుగా బంధించి ఉంటాయి.

తెల్లసొనను గిలక్కొట్టినప్పుడు అందులోని నీటిలో గాలి బుడగలు ఏర్పడి నీరు, ప్రోటీన్ల మిశ్రమంలోని ప్రోటీన్లు వేరవుతాయి. ఈ స్థితిలో ప్రోటీన్లలో కొన్ని నీటి అణువుల్ని ఆకర్షిస్తే, కొన్ని వికర్షిస్తాయి. ఈ ప్రొటీన్లు నీటి అణువుల, గాలి బుడగల హద్దులకు అంటుకుని ఒక పొరలాగ ఏర్పడటంతో తెల్లసొన గట్టిపడుతుంది. గట్టిపడిన తెల్ల సొనను మరీ గిలక్కొడితే నీటి అణువులు ప్రోటీన్ల నుంచి వేరుపడి అప్పటివరకు తెల్లసొనను గట్టిపరుస్తున్న ప్రక్రియ వృధా అవుతుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌


  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...