Friday, April 27, 2012

సూర్యుని చుట్టూ భూమి ఏ శక్తితో తిరుగుతోంది?, Earth moves round the Sun by which energy?

  •  
  •  image : courtesy with Eenadu News paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సూర్యుని చుట్టూ భూమి ఏ శక్తితో తిరుగుతోంది? తిరిగే ఏ వస్తువైనా శక్తిని కోల్పోతుంది కదా? భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది?

జవాబు: సూర్యుని చుట్టూ భూమి, మిగతా గ్రహాలు తిరగడానికి కారణం సూర్యుడు వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి. న్యూటన్‌ విశ్వగురుత్వాకర్షణ సూత్రం ప్రకారం విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశులపైన, వాటి మధ్య ఉండేదూరంపైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువు తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆకర్షిస్తుంది. వాటి మధ్య దూరం ఎక్కువయ్యేకొలదీ ఆకర్షక బలం తగ్గుతుంది. సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే గ్రహాల ద్రవ్యరాశి ఎంతో తక్కువ కాబట్టి గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. సౌరకుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99 శాతం సూర్యునిదే!

తిరిగే వస్తువు శక్తిని విడుదల చేస్తున్నప్పుడే దాని శక్తి తగ్గుతుంది. సూర్యుని చుట్టూ తిరిగే భూమి ఎలాంటి శక్తిని విడుదల చేయడం లేదు కాబట్టి, అది శక్తిని కోల్పోయే ప్రమాదం లేదు. అయితే సూర్యుడు వెలువరించే కాంతి, ఉష్ణశక్తులు దాని అంతర్భాగంలో ఉండే హైడ్రోజన్‌ వాయువులో జరిగే కేంద్రక సంయోగ చర్య (nuclear fusion) ద్వారా లభించడం వల్ల కాలం గడిచేకొలదీ సూర్యుని ద్రవ్యరాశి తరిగిపోతుంది. ఇలా ప్రతి సెకనుకూ సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవితకాలంలో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో కేవలం 0.01 శాతం మాత్రమే. అలా సూర్యుని ద్రవ్యరాశిలో అంత తేడా లేకపోవడంతో సూర్యుడు, భూమి మధ్య ఉండే ఆకర్షణ బలంలో మార్పు లేదు. అందువల్ల సమీప కాలంలో భూమి తన కక్ష్య నుండి వైదొలగే ప్రమాదం లేదు. కాబట్టి అది తిరగడం మానేసే ప్రశ్న అంతకన్నా లేదు. కానీ ఇప్పటి నుంచి 5 బిలియన్‌ సంవత్సరాల తర్వాత సూర్యుని అంతర్భాగంలోని హైడ్రోజన్‌ పూర్తిగా తరిగిపోయి సూర్యుని పరిమాణం పెరిగిపోయి రెడ్‌జెయింట్‌గా మారతాడు. అప్పుడు తనకు దగ్గరగా ఉన్న బుధ, శుక్ర గ్రహాలను కబళించే ప్రమాదం ఉంది. సూర్యుడు ఇప్పటికన్నా 2300 రెట్లు అధికంగా ప్రకాశించడం వల్ల భూమిపై జీవం నశించిపోయి అదొక లావా సముద్రంలాగా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, -హైదరాబాద్‌
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, April 26, 2012

టేపు అతికించి బుగడను సూదితో గుచ్చినా పగలదేమి?, Taped ballon bursts slowly-why?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : టేపు అతికించి బుగడను సూదితో గుచ్చినా పగలదేమి?

A : బుగడను సూదితో గుచ్చినా అది పగలదు' అని మీ స్నేహితుడితో అనండి. 'లేదు పగులుతుంది' అంటాడు. అయితే పందెం కాయండి. అప్పుడు మీరో బెలూన్‌ను పెద్దగా ఊది దానిపై తెల్లటి సెల్లో టేపు అతికించి, పిన్నీసుతో ఆ టేపుపై పొడవండి. వెంటనే అది ఢాం అని పగలదు. మెల్లగా గాలి పోతుందంతే! బుడగకన్నా సెల్లోటేపు మందంగా ఉండడంతో పాటు, పిన్నుతో చేసే రంధ్రం ఒక్కసారిగా వ్యాపించకుండా టేపు బిగిసి ఉండడం వల్ల ఇలా జరుగుతుంది!
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వాహనాలు ఇసుకలో జారిపోతాయి.ఎందుకు?,Vehicles slip on the Sand-Why?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వాహనాలు ఇసుకలో జారిపోతాయి. ఎందుకు?

జవాబు: నేల మీద సంచరించే ఏ జీవి అయినా, ఏ సాధనమైనా ముందుకు కదలాలంటే భూమ్యాకర్షణ (gravitational attraction)ను అధిగమించాల్సిందే. ఇందుకు నేల మీద తగినంత పట్టు (grip) కావాలి. నేల వల్ల కలిగే ఘర్షణ (friction) వల్ల ఇది సిద్ధిస్తుంది. నేల లేదా బాట మీద ఎంత వైశాల్యం మేరకు అంటిపట్టుకుంటే అంత ఎక్కువగా ఘర్షణ లభిస్తుంది.ఈ ఘర్షణను అధిగమించే చోదక శక్తి జీవులకు కండరాల బలం ద్వారా, వాహనాలకు స్వయం చోదక యంత్రం(auto-mobile engine)ద్వారా లభిస్తుంది. ఘర్షణ కదలకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తే, చోదకశక్తి దీనికి వ్యతిరేక దిశలో ప్రతిచర్యను కలిగించుకుని చలనానికి పనిచేస్తుంది. ఘర్షణ లేనిదే ఈ అభిముఖచలనం (forward movement) సాధ్యం కాదు. సాధారణంగా రోడ్లు గట్టిగా, బిగుతుగా ఉండడం వల్ల వాహనాలకు కావలసిన ఘర్షణ లభిస్తుంది. కానీ ఇసుక చాలా వదులుగా పటుత్వం లేకుండా ఉండడం వల్ల వాహనాల చక్రాలకు తగినంత పట్టు దొరకదు. అందువల్లనే చక్రాలు ఒకే చోట తిరుగుతూనే ఉండిపోతాయి కానీ వాహనం ముందుకు కదలదు. ఇదే పరిస్థితి బురద, అతి నున్నని ప్రదేశాల్లోనూ కలుగుతుంది. అలాగే వాహనం టైర్లు అరిగిపోయినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నున్నని ప్రదేశాల్లో మనం జారిపడడానికి కూడా ఇదే కారణం.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

రిక్టర్‌ స్కేలు అంటే ఏమిటి? దీనిని ఎలా ఉపయోగిస్తారు?,What is Richer scale-how it measures?

  •  

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: రిక్టర్‌ స్కేలు అంటే ఏమిటి? దీనిని ఎలా ఉపయోగిస్తారు?.

జవాబు: భూకంపాలను సీస్మోగ్రాఫ్‌ అనే పరికరంతో కొలుస్తారు. ఈ పరికరం ద్వారా భూకంపాల తీవ్రతను తెలుసుకోడానికి ఉపయోగించే ప్రామాణికమైన స్కేలే రిక్టర్‌స్కేలు.
భూకంపాల సమయంలో భూమి కదలికలను కచ్చితంగా రికార్డు చేయడమే సీస్మోగ్రాఫ్‌ లక్ష్యం. పెద్ద పెద్ద ట్రక్కులు, రైళ్లు వేగంగా పోతున్నప్పుడు వాటి మార్గాలకు దగ్గరగా ఉండే భవనాలు కంపించడం తెలిసిందే. ఇలాంటి కంపనాలను కాకుండా అసలైన భూకంపాలను కొలవడానికి వీలుగా సీస్మోగ్రాఫ్‌ పరికరాన్ని భూమి అంతర్భాగంలోని కఠినమైన శిలలకు అనుసంధానం చేస్తారు. భూమి కంపించే పరిస్థితుల్లో కూడా ఇది స్థిరంగా ఉండడానికి దీని ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ ప్రకంపనాలను కూడా గ్రహించగలిగేంత సున్నితంగా సీస్మోగ్రాఫ్‌లు ఉంటాయి.

సీస్మోగ్రాఫ్‌లో ఉపయోగించే రిక్టర్‌స్కేలుపై నమోదయ్యే వివరాలు సంవర్తమానం (logarithms)లో ఉంటాయి. అంటే ఈ స్కేలుపై ఉన్న సంఖ్యలు పదేసి రెట్ల తీవ్రతకు సంకేతాలుగా ఉంటాయి.ఉదాహరణకు రిక్టర్‌స్కేలుపై 3గా నమోదయ్యే తీవ్రత కన్నా, 4గా నమోదయ్యే తీవ్రత పదిరెట్లు అధికమన్నమాట. అలా 4గా నమోదయ్యే తీవ్రత కన్నా 8గా నమోదయ్యే తీవ్రత 10,000 రెట్లు అధికం. ఈ స్కేలుపై 2 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు మన అనుభవంలోకి రావు. వీటిని సూక్ష్మ ప్రకంపనాలు అంటారు. ఆరు కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలే చెప్పుకోదగ్గ హాని కలిగిస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

జిరాక్స్‌ యంత్రాల పరిమాణం మారదా?,Xerox machine size is not changing-Why?

  •  
 
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

పశ్న: ఎలక్ట్రానిక్‌ పరికరాలు క్రమేపీ చిన్నగా మారిపోతున్నాయి. కానీ జిరాక్స్‌ యంత్రాలు మాత్రం ఇప్పటికీ పెద్దగానే ఉంటున్నాయి. ఎందుకు?

జవాబు: సెల్‌ఫోన్లు, మెమొరీ డిస్క్‌లు, కంప్యూటర్లు తదితర ప్రచాలక పరికరాలు (portable devices) ఎంత చిన్నగాఉంటే అంత సులువుగా వాడుకోవచ్చు. బల్లమీద స్థిరంగా ఉండే టీవీలు, మానిటర్ల పరిమాణాలను కూడా తగ్గించడం ద్వారా అవి ఆక్రమించుకునే స్థలాన్ని ఆదా చేస్తున్నారు. ఉదాహరణకు పాత సీఆర్‌టీ (కేథోడ్‌ రే ట్యూబ్‌) టీవీలు, మానిటర్ల బదులు ఎల్సీడీ (లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే), ఎల్‌ఈడీ (లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌ యారే) తెరలు రావడం తెలిసిందే. కానీ జిరాక్స్‌ యంత్రం ప్రయోజనాలు వేరే. ఇందులో కాగితాలు, వివిధ పరిమాణాల్లో ఉండే డాక్యుమెంట్లు పెట్టి, వాటి కాపీలు తీయాల్సి ఉంటుంది. జిరాక్స్‌ యంత్రంలో వాడే టోనర్‌ కాట్రిడ్జ్‌ కూడా చాలా ఎక్కువ పేజీలను జిరాక్స్‌ చేసేందుకు వీలుగా ఉండాలి. కాగితాలు, ఫైళ్లు పెట్టుకునేందుకు వీలుగా బల్లలోని సొరుగులు కూడా ఉంటాయి. ఈ కారణాల వల్ల జిరాక్స్‌ యంత్రాల పరిమాణాన్ని తగ్గించడం వల్ల అసౌకర్యమే కలుగుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

కితకితలు రావడానికి కారణం ఏమిటి?,Tickling is happening-How?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:మనకు కితకితలు రావడానికి కారణం ఏమిటి?

జవాబు : మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్‌ (somato sensory cortex). ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్‌ సింగులేట్‌ కార్టెక్స్‌ (Anterior cingulate cortex). ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మన తలలోని మెదడు వెనుకవైపు సెరిబెల్లమ్‌ (ceribellum) అనే భాగం ఉంటుంది. దీన్నే చిన్నమెదడు అంటారు. ఈ భాగం మన దేహంలోని చలనాలను నియంత్రిస్తుంటుంది. మనకై మనం చక్కిలిగింత పెట్టుకుంటే సెరిబెల్లమ్‌ ఆ చలనానికి స్పందించినా, ఆ స్పందన మెదడులోని మిగతా ప్రదేశాల్లో కలిగే ప్రతిస్పందనలను రద్దు చేయడంతో మనకు నవ్వు రాదు.

1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, April 25, 2012

డి-విటమిన్‌ ఏ ఎండలో ఉంటుంది?, Which Sun rays produce Vitamin D?

    •  

    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న:'డి' విటమిన్‌ ఉదయపు సూర్యకిరణాల్లో మాత్రమే ఉంటుందా? మధ్యాహ్నం, సాయంత్రపు కిరణాల్లో ఉండదా?

    జవాబు: పేరుకు 'డి' విటమిన్‌ అంటూ ఏకవచనంలో సంబోధించినా అది కొన్ని రసాయనాల సమ్మేళనం. విటమిన్‌ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు విభిన్న రసాయనాల సమస్తాన్ని కలగలిపి 'డి' విటమిన్‌ అంటారు. ఇందులో డి3 అనేది చాలా ముఖ్యమైనది. ఇది మాత్రమే సూర్యరశ్మి సమక్షంలో మనలోను, ఇతర క్షీరదాల (mammals) లోను తయారవుతుంది. దీన్నే రసాయన పరిభాషలో కోలికాల్సిఫెరాల్‌ అంటారు. ఇది మన చర్మంలో సూర్యరశ్మి సమక్షంలో కొలెస్టరాల్‌ నుంచి తయారవుతుంది. నిజానికి సూర్యరశ్మిలో ఉండే ఎంతో కొంత అతినీలలోహిత కాంతి (ultraviolet light) సమక్షంలోనే డి విటమిన్‌ ఏర్పడుతుంది. ఉదయం, సాయంత్రం ఎండల కన్నా మధ్యాహ్నపు ఎండలోనే ఆ కిరణాలు ఎక్కువ ఉంటాయి. కానీ మధ్యాహ్నపు ఎండను భరించడం కష్టం కాబట్టి ఉదయపు ఎండలో పిల్లల్ని తిప్పితే మంచిదంటారు. మొత్తానికి సూర్యకిరణాల్లో విటమిన్లు ఉండవని, వాటి సమక్షంలో మన చర్మంలోనే డి విటమిన్‌ తయారవుతుందని గమనించాలి.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
    • =======================
     visit My website > Dr.Seshagirirao - MBBS.-

    భూగర్భంలో వేడి తగ్గదేం?, Heat in deep Earth is not reducing-Why?

    •  
    •  
    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: ఏ వస్తువైనా మండుతూ కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ భూగర్భంలో విపరీతమైన ఉష్ణం తగ్గకుండా అలాగే ఉండడానికి కారణం ఏమిటి?

    జవాబు: ఉష్ణశక్తి ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుందని చదువుకుని ఉంటారు. వేడిగా ఉన్న వస్తువు కాసేపటికి చల్లబడడానికి కారణం, దానిలోని ఉష్ణోగ్రత పరిసరాలకు సరఫరా అవడమే. కొయ్యో, పెట్రోలు లాంటి ఇంధన పదార్థాలో మండుతున్నప్పుడు క్రమేణా మంట ఆరిపోవడానికి కారణం ఆయా ఇంధనాలు తరిగిపోవడమే.
    ఇక భూమిలోని అత్యధిక ఉష్ణానికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. భూమి ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి గ్రహశకలాలు వచ్చి ఢీకొనడం ఒక కారణం. భూగర్భంలో యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛేదనం (radioactive decay) చెందడం వల్ల భూగర్భంలో 80 శాతం ఉష్ణోగ్రత ఏర్పడుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల జనించే బలాలు (tidal-forces) మరో కారణం. భూమికి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల కొంత, ఇనుము, నికెల్‌, రాగిలాంటి ఖనిజాలు నిరంతరం భూమి అంతర్భాగం చేరుకునే క్రమంలో మరికొంత ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. ఇలాంటి కారణాల వల్ల భూమి అంతరాంతరాల్లో ఉష్ణోగ్రత 7000 డిగ్రీల కెల్విన్‌ వరకు చేరుకుంది. ముఖ్యంగా రేడియో ధార్మిక పదార్థాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రత భూమి ఉపరితలానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో భూగర్భంలో వేడి చల్లారకుండా అలాగే ఉంటుంది.

    - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
    • ========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    ఓజోన్‌ ఉపయోగమేమిటి?,What is the use of Ozone?

    •  
    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: ఓజోన్‌ ఉపయోగమేమిటి? దాన్ని కృత్రిమంగా తయారు చేయలేమా?

    జవాబు: ఆక్సిజన్‌ పరమాణువులతో ఏర్పడే ఓ త్రి పరమాణుక  అణువు(triatomic molecule) ఓజోన్‌.మనం ప్రతి క్షణం పీల్చే ఆక్సిజన్‌ఓద్విపరమాణుకఅణువు(diatomicmolecule). ఆక్సిజన్‌లో ఉండే రెండు పరమాణవులు రసాయనికంగా ఒకే తరహావి కాగా, ఓజోన్‌లో ఉన్న మూడు పరమాణువులు రసాయనికంగా ఒకే కోవకు, లక్షణానికి చెందినవి కావు. మధ్యలో ఉన్న పరమాణువుకు పాక్షిక ధనావేశిత లక్షణం ఉండగా, చివర్ల ఉన్న రెండు పరమాణువులకు పాక్షిక రుణావేశిత లక్షణాలున్నాయి. అందువల్ల ఓజోన్‌ అణువుకు క్రియాశీలత (reactivity)ఎక్కువ. అందుకనే లేత నీలి రంగులో ఉన్న ఓజోన్‌ వాయువును వివిధ రసాయనిక ప్రక్రియల్లో ఆక్సీకరణి (oxidising agent)గా వాడతారు. ముఖ్యంగా సేంద్రియ పదార్థాల నుంచి కార్బొనేట్‌ పదార్థాల్ని తీసుకురావడంలో దీని వినియోగం చాలా ఎక్కువ. నీటిని సూక్ష్మక్రిముల నుంచి రక్షితం చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. భూవాతావరణపు పైపొరలో కాంతి సమక్షంలో ఓజోన్‌ ఏర్పడుతూ జీవజాతుల్ని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతూ ఉంటుందని చదువుకుని ఉంటారు. ఓజోన్‌ను కేవలం కృత్రిమ పద్ధతుల్లోనే తయారు చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో గాలిలో ఓజోన్‌ ఉండదు.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
    • ==============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడుతారు?,How can we talk from space?

    •  
    •  image : courtesy with Eenadu News paper.
    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: అంతరిక్షంలో ఉన్నవారు భూమిపై ఉన్నవారితో ఎలా మాట్లాడుతారు?

    జవాబు: మీరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్దతరంగాలు మొదట విద్యుదయస్కాంత తరంగాలు (electromagnetic waves)గా మారతాయి. వాటిని సెల్‌ఫోన్‌ కంపెనీ వాళ్లు తమ మైక్రోవేవ్‌ కారియర్‌ తరంగానికి జోడించి టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు. అవి అవతలి వైపు సెల్‌ఫోన్‌ను చేరుకోగానే అందులో తిరిగి శబ్ద తరంగాలుగా మారతాయి. సాధారణంగా మైక్రోవేవ్‌ తరంగాలు, రేడియో తరంగాలు, తక్కువ దూరాలకు పరారుణ (infra red) తరంగాలను వాడతారు. వీటి ప్రసారానికి వాతావరణం కానీ, పదార్థాలు కానీ అవసరం లేదు. నిజానికి శూన్యంలోనే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోని వ్యోమగామికి, భూమ్మీద ఉండే కేంద్రానికి మధ్య ఇలాగే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా సమాచారం బట్వాడా అవుతుంది.

    - ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
    • =======================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    జిరాక్స్‌ యంత్రం ఎలా పనిచేస్తుంది?,How does xerox mechine work?

    •  
    •  
    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: జిరాక్స్‌ యంత్రం ఎలా పనిచేస్తుంది?.
    జవాబు: ఏ డాక్యుమెంటుకైనా నకలును సృష్టించే యంత్రాన్ని జిరాక్స్‌ (xerox)యంత్రం అంటారు. ఇందులో క్షణాల్లో జరిగే అద్భుతాన్ని తెలుసుకోవాలంటే ఒక భౌతిక శాస్త్ర సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.

    గాలి వూదిన బెలూన్‌ను రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుంది. దీనికి కారణం బెలూన్‌ ఉపరితలంపై స్థిర విద్యుత్‌ (static electricity) ఏర్పడడమే. విద్యుదావేశాలు (electric charges) రెండు రకాలు. ధనావేశం(positive charge) ఒకటైతే, రుణావేశం (negative charge) మరొకటి. భిన్న ఆవేశాలు ఆకర్షించుకుంటాయని తెలుసుకదా? ఈ సూత్రంపైనే జిరాక్స్‌ యంత్రం పనిచేస్తుంది.

    ఈ యంత్రంలోని ఓ ప్రత్యేకమైన డ్రమ్ము బెలూన్‌లాగే పనిచేస్తుంది. అంటే దానిపై స్థిరవిద్యుత్‌ను కలిగించవచ్చన్నమాట. ఇంకా ఈ యంత్రంలో ఉండే టోనర్‌లో అతి సన్నని నల్లటి పొడి ఉంటుంది. స్థిరవిద్యుత్‌ ఏర్పడిన డ్రమ్ము ఈ నల్లటి పొడిని ఆకర్షిస్తుంది. డ్రమ్ముపై అక్కడక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయవచ్చు. అప్పుడు ఆయా ప్రాంతాలు మాత్రమే నల్లటి పొడిని ఆకర్షిస్తాయి. అలా డ్రమ్ముపైన మనకు కావలసిన విధంగా స్థిరవిద్యుత్‌తో కూడిన ఒక ప్రతిబింబాన్ని ఏర్పరచే వీలుంటుంది. అంటే ఒక డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడ మాత్రమే స్థిరవిద్యుత్‌ ఏర్పడి నల్లటి పొడి అంటుకునే విధంగా డ్రమ్మును మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ డ్రమ్ము ద్వారా ముద్రితమయ్యే కాగితంపై ఆ డాక్యుమెంటు నకలు యధాతధంగా వస్తుంది. డ్రమ్ముపై మనం అనుకున్న చోటనే స్థిరవిద్యుత్‌ ఏర్పడేలా చేయడానికి కాంతి తోడ్పడుతుంది. అందుకే ఈ యంత్రాన్ని 'ఫొటో కాపీయర్‌' అని కూడా అంటారు.

    డ్రమ్ముని ఫొటోవిద్యుత్‌ వాహక (photo conductive) పదార్థం (కాడ్మియం లేదా సెలీనియం)తో నింపుతారు. కాంతి ప్రసరించినప్పుడు ఈ డ్రమ్ము ఉపరితలమంతా ధనావేశం ఏర్పడుతుంది. యంత్రంలో మనం ఒక డాక్యుమెంటును పెట్టినప్పుడు దానిపై శక్తివంతమైన కాంతి కిరణాలు ప్రసరించే ఏర్పాటు ఉంటుంది. అవి డాక్యుమెంటులోని తెల్లని ప్రాంతాల ద్వారా పరావర్తనం చెంది డ్రమ్ము మీద పడతాయి. ఆ కిరణాలు పడిన ప్రాంతాల్లో మాత్రం డ్రమ్ములోని పదార్థం నుంచి ఎలక్ట్రాన్లు వెలువడి డ్రమ్ము ఉపరితలంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ధనావేశాన్ని తటస్థపరుస్తాయి. ఫలితంగా డాక్యుమెంటులో ఎక్కడెక్కడ నల్లని అక్షరాలు, చిత్రాలు ఉన్నాయో, అక్కడక్కడ మాత్రమే డ్రమ్ముపై ధనావేశం నిలిచి ఉండి, ఆ ప్రాంతాలే టోనర్‌లోని నల్లని పొడిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆ డ్రమ్ము ఉపరితలం మీదుగా వేరే తెల్ల కాగితాన్ని ప్రయాణించేలా చేయడం వల్ల టోనర్‌ పొడి కాగితంపై అంటుకుంటుంది. కాగితం బయటకి వచ్చే మార్గంలో ఉండే ఉష్ణవిభాగం ద్వారా కలిగే అత్యధిక వేడి వల్ల ఆ పొడి కాగితానికి గాఢంగా అంటుకుపోయి నకలు కాపీ ముద్రితమై బయటకు వస్తుంది.

    - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
    • =========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Chemicals are kept in glass bottle-Why?,రసాయనాలను గాజు సీసాల్లోనే పోస్తారేం?

    •  
    •  
    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: రసాయనాలను గాజు సీసాలలో నిల్వ చేస్తారెందుకని? వాటిలో ఉంచకూడనివి కూడా ఉంటాయా? మరి వాటినెలా నిల్వ చేస్తారు?

    జవాబు: గాజు సీసాల్లో రసాయనాలను ఉంచడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రీయ పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోదేమిటంటే గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో, ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
    కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్‌ పెరాక్సైడు, అసిటోన్‌, బెంజిన్‌ వంటి ద్రవాలను గోధుమ రంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు.

    ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (HF) ను గాజు పాత్రల్లో ఉంచకూడదు. గాజులోని సిలికేట్లతో అది రసాయనిక చర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహనశీలత (imflammability) ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం కాబట్టి.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
    • ===========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    సునామీ సంగతేంటి?, What is aboutTsunami?

    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: సునామీలు అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతాయి?

    జవాబు: భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ద్రవరూపంలో ఉండేది. కాలక్రమేణా దాని ఉపరితలం గట్టిపడడంతో భూమిపై దాదాపు 30 కిలోమీటర్ల మందంగా ఉండే ఒక పొర ఏర్పడింది. ఈ పైపొర అంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ఫలకాలుగా ఉంటుంది. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న లోపలి పొర మేంటిల్‌పై తేలుతూ ఉంటాయి. ఫలకాలు కలుసుకునే సరిహద్దుల్లోనే భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి.

    సముద్రపు అడుగున ఉండే భూఫలకాలు ఒరుసుకున్నప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదలయి చాలా పెద్ద అలలు ఏర్పడుతాయి. వీటినే సునామీలు అంటారు సునామీ (Tsunami) పదం జపాను భాషలోని TSU (అంటే హార్బరు), NAMI(అంటే అలలు) అనే పదాల నుంచి ఉత్పన్నమైంది. ఈ విధగా సునామీ అంటే తీరాన్ని చేరుకునే ప్రమాదకరమైన అలలని చెప్పుకోవచ్చు.

    సముద్రగర్భాల్లో అగ్నిపర్వతాలు పేలడం వల్ల, భూకంపాల వల్ల, న్యూక్లియర్‌ బాంబు పరీక్షల వల్ల, భూఫలకాలు ఢీకొనడం వల్ల సునామీలు ఏర్పడే అవకాశం ఉంది. సునామీ అలలు జెట్‌ విమానంతో సమానమైన, అంతకుమించిన వేగంతో కూడా ప్రయాణించగలవు. దాదాపు 30 మీటర్ల ఎత్తుగా, గంటకు 160 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ఏకంగా 200 కిలోమీటర్ల పొడవైన అలలు కూడా ఏర్పడుతాయి. సముద్రంలో ఇవి ఒక మీటరు ఎత్తే ఉన్నప్పటికీ తీరాన్ని చేరేసరికి 30 మీటర్ల ఎత్తుకు చేరిపోతాయి. డిసెంబర్‌ 24, 2004లో సంభవించిన సునామీ అలల పొడవు వందలాది కిలోమీటర్లయితే, వాటి ఎత్తు 10.5 మీటర్లు. అవి తీరానికి చేరుకున్న వేగం గంటకు 480 కిలోమీటర్లు!

    • - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

    • =========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Wednesday, April 18, 2012

    పరమవీరచక్ర పుట్టింది ఎలా?,Origin of ParamaveeraChakra-how?

    •  

    •  
    •  
    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    పరమవీరచక్ర ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల. నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వస్వార్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి.... వీటన్నిటికీ చెరగని చిహ్నం పరమవీరచక్ర. మూడున్నర సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ కంచుపతకం, దానికి అల్లుకున్న 32 మి.మీ ఊదారంగు రిబ్బన్ - ఇది ఛాతీ మీద అలంకరించుకోవాలన్నదే ప్రతి వీరజవాను కల.

    అలాంటి పరమవీరచక్ర పతకానికి రూపకల్పన చేసింది ఒక విదేశీ మహిళ.  పుట్టింది ఎక్కడో స్విట్జర్లాండ్ లో అయినా కట్టుబొట్టు, జీవన వ్యవహారాలన్నిటా అణువణువునా భారతీయత నిండిన వ్యక్తి ఆమె. మరాఠీ, సంస్కృత భాషల్లో అద్భుత ప్రావీణ్యం ఆమె సొంతం. ఆమె పేరు ఇవా వాన్ మే డిమారోస్ , ఆ పేరు ఆమె పుట్టిన స్విట్జర్లాండ్ లో ఎవరికీ తెలియదు. కానీ సావిత్రీ బాయ్ ఖానోలికర్ అని అడగండి. మన దేశంలో పాతతరం వారు కొద్దిమందికి తెలుస్తుంది. ఆమె వ్రాసిన సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర అన్న పుస్తకం (భారతీయ విద్యాభవన్ ప్రచురణ) బహుళ ప్రజాదరణ పొందింది. వేలాది ప్రతులు అమ్ముడైంది.

    ఈవా జులై 20. 1913 న స్విట్జర్లాండ్ లోని న్యూ చాటెల్ లో జన్మించింది. తండ్రి హంగేరియన్. ఆయన పేరు ఆండ్రీ డీ మాడే. తల్లి రష్యన్. పేరు మార్తె హెజ్డ్ జెల్డ్. తల్లి చిన్నప్పుడే పోయింది. దానితో ఈవా మనసు ఆధ్యాత్మికం వైపు మరలింది. గంటలు గంటలు సముద్రం ఒడ్డున గడిపేది. అలలు తల్లి వక్షస్థలంగా, ఇసుక తిన్నెలు తల్లి ఒడిలా అనిపించేది. క్రమేపీ ఆమె ధ్యాస భారతీయ ఆధ్యాత్మికత వైపు మరలింది. ఈ సమయంలోనే ఇంగ్లండ్ లోని సాండ్ హర్ట్స్ లో సైనిక శిక్షణ పొందుతూ సెలవులు గడిపేందుకు వచ్చిన భారత సైనికాధికారి విక్రమ్ ఖానోలికర్ తో ఆమెకి పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. అది జరిగింది 1929లో. 1932 లో ఆమె జెనీవా వదలి భారత్ కి వచ్చేసింది. ఈవా తండ్రి దీన్ని వ్యతిరేకించాడు. కానీ ఆమె పట్టుదల ముందు ఆయన పంతం నిలబడలేదు. ఈవా, విక్రమ్ లు లక్నోలో స్థిరపడ్డారు. అక్కడే వారిద్దరికీ వివాహం అయింది. పెళ్లితో ఈవా పదహారణాల భారతీయ వనితగా మారిపోయింది. ఆమె పేరు సావిత్రిబాయి ఖానోలికర్ అయింది. ఇక్కడి భాషను, కట్టుబొట్టు, రీతి రివాజుల్ని నేర్చుకుంది. పురాణ, శాస్త్రాదులను అధ్యయనం చేసింది. మరాఠీ, సంస్కృతాలను అవుపోసన పట్టింది. శ్రీరామకృష్ణ వేదాంతాశ్రమానికి సన్నిహితురాలై పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. దేశ విభజన సమయంలో మహిళా శరణార్ధుల కోసం పలు సేవా శిబిరాలను కూడా నిర్వహించింది.
    సప్త సముద్రాలకవతల నుంచి మన దేశానికి వచ్చిన సావిత్రీబాయి పరమవీరచక్ర పతకాన్ని రూపొందించిన వైనం కూడా చాలా ఆసక్తిదాయకం.

    మేజర్ జనరల్ విక్రమ్ ఖానోలికర్ కి మేజర్ జనరల్ హీరాలాల్ అటల్ కి మంచి స్నేహం ఉండేది. 1948 ప్రాంతాల్లో భారతీయ సైన్యానికి సర్వోత్తమ పోరాటపటిమకి ప్రతీకగా ఇచ్చేందుకు పరమవీర చక్ర అన్న పతకాన్ని రూపొందించే బాధ్యత అటల్ పై బడింది. ఆ పతకం ఎలా ఉండాలన్న విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతూ ఉండేవారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతి, సభ్యత, గౌరవోజ్వల పరంపరలకు పరమవీర చక్ర ప్రతీకగా ఉండాలని ఆయన పదేపదే అంటూండేవారు. ఈ విషయంలో ఆయన విక్రమ్, సావిత్రీబాయిలతో పలుమార్లు చర్చలు జరిపేవారు.
    పురాణయుగంలో వృత్రాసురుడిని వధించేందుకు మహర్షి ధధీచి తన వెన్నెముకనే ఆయుధంగా చేసుకొమ్మని దేవతలకు తన శరీరాన్ని ఇచ్చేశాడు. ఆ వెన్నెముకే వజ్రాయుధం అయింది. అలా వజ్రాయుధం అద్భుత త్యాగానికి, అసమాన పౌరుషానికి, అజేయ శక్తికి ప్రతీక. సావిత్రీబాయి అదే విషయాన్ని హీరాలాల్ అటల్ కి చెప్పింది. అంతే కాకుండా టిబెటన్ సాహిత్యంలో లభించే వజ్రాయుధం నమూనాని కూడా ఆయనకు చూపించింది. భగవతీ ప్రసాదంగా ఛత్రపతి శివాజీకి లభించిన పవిత్ర భవానీ ఖడ్గం హైందవీ రాజ్యస్థాపనకి దోహదం చేసింది. నాలుగు వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోకచిహ్నం ఉండేలా పరమవీర చక్రను రూపొందించారు.
    ఆసక్తికరమైన విషయమేమిటంటే మొట్టమొదటి పరమవీరచక్ర సావిత్రీబాయికి వరుసకు అల్లుడయ్యే మేజర్ సోమనాథ శర్మకే దక్కింది.

    1947 లో కశ్మీర్ లో పాక్ చొరబాటుదారులను ప్రతిఘటిస్తూ పరమోన్నత త్యాగం చేసిన మేజర్ శర్మ సోదరుడు విక్రమ్, సావిత్రీబాయిల కుమార్తెను వివాహం చేసుకున్నారు.
    తరువాత కాలంలో సావిత్రీబాయి సైనికులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమంపై దృష్టి సారించింది. సైనికుల భార్యల సంక్షేమం కోసం నారీ ఉపకార్ సేన అన్న సంస్థను స్థాపించింది. దేశ రాజధానిలో సమాజసేవాకార్యక్రమాల్లో తనదైన విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది. 1952 లో విక్రమ్ చనిపోవడంతో సావిత్రీబాయి ఒంటరిదైపోయింది. ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయింది. శ్రీరామకృష్ణ పరమహంసనే తన పరమగురువుగా భావించి, నిత్యం ధ్యానంలో మునిగిపోయింది. ఒక పదిహేనేళ్ల తరువాత ఒక రోజు ఆమె కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా నిద్రలో తుది శ్వాస విడిచింది.
    • =============================
     visit My website > Dr.Seshagirirao - MBBS.-

    Wednesday, April 11, 2012

    Why not water on rotating Earth falldown?-భూమి పైన సముద్రాలు-నదుల్లోని నీరు ఎందుకు పడిపోదు?

    •  
    •  
    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: భూమి తన చుట్టూ తాను వేగంగా తిరుగుతున్నప్పుడు భూమి పైన సముద్రాలు, నదుల్లోని నీరు ఎందుకు పడిపోదు?

    జవాబు: గోళాకారంలో ఉండే ఏదైనా వస్తువు మీద ఎత్తయిన ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఏ దిశలోనైనా కదిలితే అతడు ఆ గోళం వంపు తిరిగే చోటకి వచ్చేప్పటికి జారుడుబల్ల మీంచి జారినట్టు పడిపోతాడు కదా? మరి భూమ్మీద అలా జరగదేం? గుండ్రంగా తిరిగే భూమిపై ఉండే మనుషులు, వస్తువులు ఆ వేగానికి విసిరివేసినట్టు ఎక్కడో పడిపోవాలి కదా?... ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజమే. కానీ అలా జరగకపోవడానికి కారణం భూమి పరిమాణం, ఆకర్షణ బలమే. భూమిపై ఉండే దేన్నయినా భూమి 6350 కిలోమీటర్ల లోపల ఉన్న తన కేంద్రం వైపు బలంగా ఆకర్షిస్తూ ఉంటుంది. దీన్నే గురుత్వం (gravity) అని, దాని వల్ల కలిగే శక్తిని గురుత్వాకర్షణ శక్తి (force of gravity) అని ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ తెలిపాడు. భూమ్మీద ఉండే వస్తువులతో పోలిస్తే భూమి పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి, భూమి ఎక్కడికక్కడ సమతలం (horizontal)గా, బల్లపరుపు (flat)గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక పెద్ద బంతి మీద ఉండే ఒక చీమకు ఎక్కడికక్కడ ప్రతి భాగం బల్లపరుపుగానే అనిపిస్తుంది. అలాగే మనం భూమి మీద ఏ ప్రదేశం మీద ఉన్నా, మనం కిందకు ఆనుకునే దిశే మన పాదాల నుంచి భూకేంద్రం వైపు ఉన్న దిశే అవుతుంది. ఆ దిశలోనే భూమ్యాకర్షణ శక్తి పనిచేయడం వల్ల భూమిపై ఉండే ప్రతి వస్తువూ భూమికి అంటిపెట్టుకుని ఉంటుందే తప్ప, భూమి నుంచి పడిపోదు. అందువల్లనే భూమి వేగంగా తిరుగుతున్నా దానిపై ఉన్న సముద్రాలు, నదులలోని నీరు కూడా ఎక్కడికీ జారదు. పడిపోదు.

    - ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
    • ==============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.- 

    Tuesday, April 10, 2012

    కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది. ఎలా?-How can we recognise light eyeclosed?

    •  
    •  

    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    ప్రశ్న: మనం కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ, ఎవరైనా గదిలో లైటు వేస్తే మనకు తెలుస్తుంది. ఎలా?

    జవాబు: మన కనురెప్పలు (ఐ లిడ్స్‌) పలుచగా ఉండే గోపుర పేటిక (torsal plate) లాంటి రూపంలో ఉంటాయి. ఆలుచిప్ప ఆకారంలో ఉండే ఈ కనుగవ మధ్యలో దృఢమైన బంధన కణజాలం (conjuctive tissue) ఉంటుంది. పలుచని బాహ్యచర్మ కింద రబ్బరు పొరలాగా ముడుచుకోగలిగిన పారదర్శకమైన సబ్‌క్యుటీనియస్‌ పొర ఉంటుంది. ఇలా నాలుగైదు పొరల సముదాయమే అయినా కంటి రెప్ప మందం ఒక మిల్లీమీటరుకు మించి ఉండదు. ఇందులో కాంతిని శోషించుకునే పదార్థాలు పెద్దగా ఉండవు. కాబట్టి కళ్లు మూసుకుని ఉన్నా, బయట ఉండే కాంతిలో కొంత భాగం కనురెప్పల గుండా లోనికి వెళుతుంది. రెప్పలో ఉండే సూక్ష్మమైన రక్తనాళికల గుండా కాంతి వెళ్లడం వల్ల మనకు ఆ కాంతి ఎరుపు రంగులో ద్యోతకమవుతుంది. కళ్లు బాగా అదిమిపెట్టి ఉంచినప్పుడు ముడుతలు ఎక్కువవడం వల్ల కాంతి చాలా తక్కువే వెళ్లగలగడం వల్ల మనకు నల్లగా అనిపిస్తుంది.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

    • =========================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-