Friday, June 28, 2013

Mangos are available only in summer Why?, మామిడి పండ్లు వేసవికాలములోనే దొరుకుతాయి ఎందుకు?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : Mangos are available only in summer Why?, మామిడి పండ్లు వేసవికాలములోనే దొరుకుతాయి ఎందుకు?

జ : ఇటువంటి రుచికరమైన పండ్లు సంవత్సరం పొడుగునా దొరికితే ఎంత బావుంటుందో! కానీ అలా దొరకవు కదా! వేసవిలోనే దొరుకుతాయి. ఉగాది వచ్చిందంటే వేపపూత పూస్తుంది. మామిడిచెట్లూ ఏపుగా పూచి, పిందెలు వేస్తాయి. అప్పటి నుండి రెండు మూడు నెలలు మాత్రమే కాయలు, పండ్లు దొరుకుతాయి. పరిశీలించి చూడండి.. రకరకాల వృక్షాలు కొన్ని ఋతువుల్లో మాత్రమే పుష్పిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందని అమెరికా దేశ శాస్త్రజ్ఞులు డబ్ల్యు. డబ్ల్యు.గార్నరు, ఎం.ఎ.అల్లార్టు అనేవారు 1918లో పరిశోధనలు జరిపారు. వృక్షాలు పుష్పించటం సూర్యరశ్మి లభించే కాలంపై ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. కొన్ని ఋతువుల్లో త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. వసంతఋతువు నుండ పగటి కాలం అధికమవుతుంది. జూన్‌ 21కి తక్కువ వస్తుంది. తరువాత పగటికాలం తగ్గుతూ, డిసెంబరు 21 నాటికి చాలా తగ్గిపోతుంది. పగటికాలం అధికంగా ఉన్నప్పుడు కొన్నిరకాల మొక్కలు పుష్పిస్తాయి. వీటినే 'దీర్ఘ దిన పుష్పితాలు' (లాంగ్‌ డే ప్లాంట్స్‌) అంటారు. మామిడి, వేప ఆ కోవకు చెందినవే. అందుకే మనకు మామిడికాయలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి.


మామిడిపండ్లు అబ్బ.. ఎన్ని రకాలని! ఒకటా రెండా - బోలెడన్ని రకాలు. ప్రపంచం మొత్తం మీద 600 రకాల పండ్లున్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన దేశంలో మామిడి పండ్లకు ఎన్నో పేర్లున్నాయి. వీటిని చూస్తేనేకాదు పేరు వింటేనే నోరూరిపోతుంది. పండునుబట్టి, రంగు, రుచిని బట్టి, గుజ్జును బట్టి రకరకాల పేర్లు వీటికి వచ్చాయి. పండు ఆకారాన్ని బట్టి స్వర్ణరేఖ, చిన్నరసం, పెద్దరసం, గుండూలడ్డూ, బాట్లి, కర్బూజా... ఇలా ఎన్నోపేర్లు.. ఇంకా అలంపూర్‌, బేనిశాన్‌, బంగినపల్లి, చెరుకురసం, హిమాయుద్దీన్‌, కోలంగోవ, ఫిరంగి, లడ్వ, కొత్తపల్లి, కొబ్బరి, రాజుమాను, నీలం, పులిహోర, రుమాని, మాల్గోవ, దశేరి, 'అల్ఫాంసో' అనే ఫ్రెంచి వ్యక్తి పేరు ఒక పండుకుంది. 'కలెక్టర్‌' (తోతాపురి), బాద్‌పాష్‌లాంటి పదవుల పేర్లు కూడా కొన్ని పళ్లకు అమరాయి.
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వేసవిలో పగటికాలం ఎక్కువ ఎందుకని?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర :  వేసవిలో పగటికాలం ఎక్కువ ఎందుకని?

జ : వేసవిలో పగటి పొద్దు ఎక్కువ ఉంటుంది , చలికాలములో రాత్రి పొద్దు ఎక్కువకాలము ఉంటుంది .. ఈ రెండింటి మధ్య వుండే తేడా భూమిమీద ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది . భూమి అక్షం 23 1/2 డిగ్రీలు వంగి ఉండడమువల్ల  , బూపరిభ్రమణం వల్ల ... ఉత్తరధృవం ధృవనక్షత్రాన్ని ఎప్పుడూ సూచిస్తున్నందున ఈ వ్యత్యాసము ఏర్పడింది. దీనివల్ల వేసవిలో ఎక్కువభాగము భూమి మీద కాంతికిరణాలు పడతాయి ... ఫలితముగా పగలు ఎక్కువవుతుంది. అక్షాంశములు పెరుగేకొద్దీ వేసవిలో పగటికాలం పెరుగును.

 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, June 27, 2013

Who are the eight types women?and their qualities?,అష్టవిధ నాయికలు అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?.


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ఫ్ర : అష్టవిధ నాయికలు అంటే ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?.

జ :
1. స్వాదీన పతిక : తానుకోరినట్లు ప్రవర్తించే స్వాధీనుదైన భర్త్ను కలిగిన నాయిక .

 • -------------------------------------------------------
2 . అభిసారిక : అలంకారము చేసుకిని నాయకుని కోసము ముందుగా నిర్ణయించుకున్న సంకేత ప్రదేశానికి వెళ్ళే నాయిక.

 • -------------------------------------------------------
3. వాసక సజ్జిక : నాయకుడు (భర్త ) రాబోతున్నాడని పడకటింటిని అలంకరించే నాయిక ,

 • -------------------------------------------------------------
4. విరహోత్కంఠిత : సంకేత స్థలానికి నాయకుడు రాకపోవడముచేత విరహం తో బాధపడే నాయిక ,

 • -----------------------------------------------------------
5 . ప్రోషిత భర్తృక : భర్త దూరదేశానికి వెళ్ళగా అనినిని గురించి చింతించే నాయిక .

 • ----------------------------------------------------------
6 . ఖండిత : నాయకుడు తన ఇంటికి రాగా అతడు తన సపత్ని (అతని మరొక భార్య) వద్దకు వెళ్ళివచ్చిన
చిహ్నాలను గుర్తించి అసూయపడే నాయిక .
 • ----------------------------------------------------------------
7 . కలహాంతరిత : నాయకుని అవమానించి , కోపం తో వెళ్ళగట్టి ... అనంతరం పశ్చాత్తాపపడే నాయిక .

 • -----------------------------------------------------------
8 . విప్రలబ్ద : అనుకున్న సమయానికి నాయకుడు రాకపోగా ... నాయకుని రమ్మని సందేశాన్ని పంపే నాయిక .

 •  source : Wikipedia.org
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, June 12, 2013

How do Dolphins sleep,డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి?

జవాబు: డాల్ఫిన్లు నిద్రపోయేప్పుడు వృత్తాకార మార్గంలో ఈదుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే అవి నిద్రపోయేప్పుడు వాటి మెదడులోని సగ భాగం మాత్రమే నిద్రావస్థను పొందుతుంది. అందువల్ల గుంపు నుంచి తప్పిపోకుండా ఉండడానికి అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్లు మేల్కొని ఉన్నప్పుడు ఈల లాంటి శబ్దం చేయడం ద్వారా ఒకదాని ఉనికిని మరొకటి సులువుగా తెలుసుకోగలుగుతాయి. కానీ నిద్రపోయేప్పుడు అలాంటి శబ్దాలు చేస్తే శత్రుజీవులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అవి గుంపుగా ఈదుతుండడంతో శత్రుజీవులు దగ్గరకు రావు.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

cheese made of Crown flower tree milk no harm?, జిల్లేడు పాలు తో చేసిన జున్ను హాని చేయదా?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: జిల్లేడు పాలు విషం అంటారు. కానీ జున్ను తయారీలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల హాని కలుగదా?

జవాబు: జిల్లేడు చెట్టును ప్రాచీన కాలం నుంచీ ఓ ఔషధ మొక్క (medicinal plant)గా వాడుతున్నారు. అతి తక్కువ మోతాదులో జిల్లేడు ఆకులు, కాండపు పొడిని ఉబ్బసం, విరేచనాలు, జ్వరం, వికారం, అజీర్తి వంటి జబ్బుల్ని నివారించేందుకు ఆయుర్వేద పద్ధతిలో వాడుతున్నారు. వాటిని ఎప్పుడూ నేరుగా ఎందులోనూ వాడరు. ఎందుకంటే ఇందులో కాలోట్రోపిన్‌ అనే విష రసాయనం ఉంటుంది. అందువల్లనే జిల్లేడు ఆకుల్ని పశువులు కూడా తినవు. జిల్లేడు పాలు కళ్లలో పడితే ప్రమాదం. చర్మం మీద పడితే కొంచెం బొబ్బలు వస్తాయి. దాన్ని జున్ను తయారీలో వాడడం మంచిది కాదు.

ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is this PRISM(USA)?,ఏమిటీ ప్రిజమ్‌?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


'ప్రిజమ్‌' అనేది అమెరికాలోని జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) చేపట్టిన అత్యంత రహస్య ఎలక్ట్రానిక్‌ నిఘా కార్యక్రమం. అధికారికంగా దీన్ని 'యూఎస్‌-984ఎక్స్‌ఎన్‌' అని పేర్కొంటారు. దీని కింద నెట్‌ ద్వారా సాగే లైవ్‌ కమ్యూనికేషన్లు, నిల్వ చేసిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తున్నారు. అమెరికా పౌరులు కాని, ఆ దేశం వెలుపల ఉండేవారిని కాని లక్ష్యంగా చేసుకొనేందుకు ఇది వీలు కల్పిస్తోంది. దీనికింద ఈ-మెయిల్‌, వీడియో, వాయిస్‌ చాట్‌, ఫొటోలు, వాయిస్‌ఓవర్‌ ఐపీ సంభాషణలు, ఫైల్‌ ట్రాన్స్‌ఫర్లు, లాగిన్‌ నోటిఫికేషన్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వివరాలను పొందడానికి వీలు కలుగుతుంది. ప్రిజమ్‌ను 2007 డిసెంబర్‌లో ప్రారంభించారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత జార్జి బుష్‌ సర్కారు తెచ్చిన 'ఉగ్రవాద నిరోధక కార్యక్రమం' స్థానంలో దీన్ని చేపట్టారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి. విదేశీ గూఢచర్య నిఘా కోర్టు(ఎఫ్‌ఐఎస్‌సీ) అనుమతి లేకుండా దీన్ని చేపట్టడమే ఇందుకు కారణం. ప్రిజమ్‌ను మాత్రం ఈ కోర్టు అనుమతించింది. 2007లో బుష్‌ ప్రవేశపెట్టిన 'ప్రొటెక్ట్‌ అమెరికా యాక్ట్‌', ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రిజమ్‌ ప్రారంభానికి వీలు కల్పించాయి. దీనివల్ల నిఘా సంస్థలతో సహకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే కంపెనీలకు చట్టబద్ధమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. 2012లో ఒబామా హయాంలో కాంగ్రెస్‌ దీన్ని ఐదేళ్ల పాటు అంటే.. 2017 డిసెంబర్‌ వరకూ పొడిగించింది. ఎఫ్‌ఐఎస్‌ఏ సవరణ చట్టం ప్రకారం- కమ్యూనికేషన్లు సాగిస్తున్న పార్టీల్లో ఒకరు అమెరికా వెలుపల ఉంటే, ఎలాంటి వారెంట్‌ లేకుండానే అమెరికా పౌరుల ఫోన్‌, ఈమెయిల్‌, ఇతర కమ్యూనికేషన్లను పర్యవేక్షించే అధికారం నిఘా సంస్థలకు ఉంటుంది. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ పథకాన్ని ఎన్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేశారు. ఎన్‌ఎస్‌ఏ చరిత్రలో ఇది పెద్ద లీకేజీగా భావిస్తున్నారు. అంతా గోప్యంగా ఉంచుతామని గొప్పలు చెప్పుకొనే ఆ సంస్థలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం. స్నోడెన్‌ లీక్‌ చేసిన పత్రాల్లో 41 పవర్‌ పాయింట్‌ స్త్లెడ్‌లు ఉన్నాయి. సిబ్బందికి శిక్షణ కోసం వీటిని రూపొందించినట్లు భావిస్తున్నారు. వీటిని లీక్‌ చేసిన స్నోడెన్‌.. అమెరికా ప్రాసిక్యూషన్‌, వేధింపుల భయంతో ప్రస్తుతం హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నారు. ఆయన్ను అప్పగించాల్సిందిగా అమెరికా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ఐస్‌ల్యాండ్‌ ఆశ్రయాన్ని ఆయన కోరుతున్నారు. ప్రిజమ్‌ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ దేశాలు అమెరికాను నిలదీస్తున్నాయి. బ్రిటన్‌లో ప్రభుత్వ కమ్యూనికేషన్ల ప్రధాన కార్యాలయం(జీసీహెచ్‌క్యూ)కు ప్రిజమ్‌ కార్యక్రమంతో యాక్సెస్‌ ఉన్నట్లు తేలింది.

ఎలా చేస్తారు?
ప్రిజమ్‌ కింద.. నెట్‌లో డేటాను ఎలా సేకరిస్తున్నారన్నది తేలలేదు. తాము నేరుగా అనుసంధానం కల్పించలేదని టెక్‌ కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో సమాచారాన్ని ఎన్‌ఎస్‌ఏ ఎలా సేకరిస్తోందన్నది అయోమయంగా ఉంది. ఆయా సంస్థలకు తెలియకుండానే ఇది జరుగుతోందని కొందరు సైబర్‌ నిపుణులు వాదిస్తుండగా.. ఇంకొందరేమో ఆ సంస్థలు దొడ్డిదారిన ఎన్‌ఎస్‌ఏకు అనుసంధానత కల్పించి ఉంటాయని భావిస్తున్నారు.
* బహిర్గతమైన ప్రిజమ్‌ స్త్లెడ్ల ప్రకారం.. అప్‌స్ట్రీమ్‌ కార్యక్రమం కింద తొలి వనరు అయిన ఇంటర్నెట్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లకు సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. రెండో వనరు అయిన ప్రధాన ఇంటర్నెట్‌ కంపెనీల సర్వర్లను ప్రిజమ్‌ పర్యవేక్షిస్తుంది. * ఎన్‌ఎస్‌ఏలోని కలెక్షన్‌ మేనేజర్లు.. కంటెంట్‌ టాస్కింగ్‌ సూచనలను నేరుగా కంపెనీ సర్వర్లకు కాకుండా కంపెనీ నియంత్రిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరికరాలకు పంపుతూ ఉండొచ్చని ఒక అంచనా. ఆ విధంగా కావాల్సిన డేటాను సేకరిస్తున్నారని భావిస్తున్నారు. * మరో విశ్లేషణ ప్రకారం.. ట్విట్టర్‌ మాత్రం ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు నిరాకరించింది. మిగతా కంపెనీలు మాత్రం సహకరించాయి. డేటాను సమర్థంగా, సురక్షితంగా అందుబాటులో ఉంచే విధానాలపై కంపెనీలు ఎన్‌ఎస్‌ఏ సిబ్బందితో చర్చలు కూడా జరిపాయి. కొన్ని సందర్భాల్లో నిఘా వర్గాలకు అనువుగా తమ సిస్టమ్స్‌కు మార్పులు చేర్పులు చేశాయి. కోర్టు ద్వారా అందే వినతులకు స్పందనగా డేటాను అందించడం చట్టబద్ధంగా తప్పనిసరే. అయితే సిస్టమ్స్‌లో మార్పులు చేర్పులు చేసి, డేటా సేకరణను ప్రభుత్వానికి సులువు చేయడం మాత్రం తప్పనిసరి కాదు. అందువల్లే మరింత మెరుగైన అనుసంధానతకు ట్విట్టర్‌ నిరాకరించి ఉంటుందని భావిస్తున్నారు. మిగతా కంపెనీలను ఒక లాక్డ్‌ మెయిల్‌ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు కోరి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన 'కీ'ని ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించి ఉంటారని భావిస్తున్నారు. * సిస్కో వంటి సంస్థలు రూపొందించిన రూటర్ల ద్వారా ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను మళ్లించి, నేరుగా ట్యాప్‌ చేసి ఉంటారని కూడా మరో విశ్లేషణ ఉంది. ఈ ట్రాఫిక్‌ అంతా ఎన్‌క్రిప్ట్‌లో ఉంటుంది. దీన్ని డీక్రిప్ట్‌ చేయాలంటే కంపెనీల వద్ద ఉండే 'మాస్టర్‌ కీ' అవసరం.

Courtesy with Eenadu news paper(5:24 AM 12-Jun-13
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, June 08, 2013

How does areoplane detect way?,విమానానికి దారెలా తెలుస్తుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: విమానం నడిపే పైలట్‌కు దారి ఎలా తెలుస్తుంది?

జవాబు:
విమానాన్ని నడిపే పైలట్‌కు ఎదురుగా టీవీలాంటి తెరలు ఉంటాయి. వాటి మీద భూమి అక్షాంశాలు, రేఖాంశాలు(altitudes and longitudes) ఉంటాయి. వీటి ద్వారా భూమి మీద ఉండే ప్రతి ప్రాంతం ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకు మన హైదరాబాద్‌ అక్షాంశం 17.366 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 78.476 డిగ్రీల తూర్పు. ఇలా ప్రతి పట్టణం, నగరం వివరాలు నిర్దేశితమై ఉంటాయి. ఉపగ్రహపు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) అనే నియంత్రణ ద్వారా విమానాన్ని పైలట్‌ నడుపుతాడు. ఏవియానిక్స్‌ అనే కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్స్‌ ద్వారా బయల్దేరిన చోటును, గమ్యాన్ని నిర్దేశిస్తే, అక్కడున్న కంప్యూటరే పైలట్లకు సూచనలు ఇస్తుంది. అలాగే విమానాశ్రయాల్లోని నియంత్రణ కేంద్రాల్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు విమానం ప్రయాణాన్ని కంప్యూటర్‌ వ్యవస్థ ద్వారా గమనిస్తూ అవసరమైన సూచనలు అందిస్తుంటారు. మైక్రోవేవ్స్‌ ద్వారా జరిగే ఈ కమ్యూనికేషన్స్‌కు అవరోధం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రయాణికులు సెల్‌ఫోన్లను వాడరాదని చెబుతారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, June 06, 2013

What are pancha yagyas?,పంచయజ్ఞాలు ఏమిటి ?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ఫ్ర : పంచయజ్ఞాలు ఏమిటి ?

జ : 1.బ్రహ్మ యజ్ఞము , 2.దేవ యజ్ఞము, 3.పితృయజ్ఞము, 4.భూత యజ్ఞము, 5.మనుష్య యజ్ఞము.

యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.

 బ్రహ్మ యజ్ఞము : ఒక ఋక్కును గాని , యజస్సును గాని , సామాన్ని గాని  శక్తి కొద్దీ నిత్యమూ అభ్యసించడం ... అనగా నిత్యవేదాధ్యయనం .

దేవ యజ్ఞమ : దేవతాతృప్తి కొరకై హవిస్సు మొదలైన దేవతా ప్రీతికరమైన పదార్ధాల్ని అగ్నిలో హోమం చేయడం .

పితృయజ్ఞము : పితృదేవతా ప్రీతికై స్వధాకారం తో తర్పణాలు ఇచ్చి విప్రులకు భోజనం పెట్టడం .

భూత యజ్ఞము: నిత్యమూ చేయవలసిన వైస్యదేవానుస్ఠానం అనంతరం ఆరుబయలు ప్రదేశములో భూతతృప్తి నిమిత్తము భూత బలిగా ఇచ్చే ఆహార సమర్పణ.

మనుష్య యజ్ఞము : యధాశక్తిగా అతిధులకు బోజనం పెట్టడం .
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

colors of clothes different in sunlight and bulblight?,బల్బులుకాంతి- సూర్యకాంతిల్లో వస్త్రాల రంగుల్లో మార్పులేల?

 •  


 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: దుకాణాల్లో చూసిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపిస్తాయి. ఎందుకు?

జవాబు : దుకాణాల్లో ప్రకాశవంతమైన వెలుగునిచ్చే బల్బులు (Incadescent Light bulbs), ఫ్లోరోసెంటు ట్యూబులు కాంతిని వెదజల్లుతుంటాయి. దుకాణాల బయట ఉండేది సూర్యకాంతి. ఈ కాంతులన్నీ మనకు తెల్లని కాంతిలాగా అనిపించినా, వాటి తరంగదైర్ఘ్యాలు (wavelengths) అంటే రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఒక కాంతి పక్కన మరొక కాంతిని ఉంచి నిశితంగా పరిశీలిస్తే గాని ఆ విషయం తెలియదు.
భౌతిక శాస్త్రవేత్తలు ఒకో కాంతికి ఒకో 'వర్ణ ఉష్ణోగ్రత' (colour temparature)ను నిర్ణయిస్తారు. ఇన్‌కాండిసెంటు బల్బులు 'వెచ్చని కాంతి'ని వెలువరిస్తే, ఫ్లోరోసెంటు ట్యూబులు 'చల్లని కాంతి'ని ఇస్తాయి. సూర్యకాంతిని 'తటస్థకాంతి'గా నిర్ధరించారు. ఈ వివిధ కాంతుల తరంగాలు వస్త్రాలపై పడినప్పుడు వాటిలో కొన్ని పరావర్తనం (reflection) చెంది మన కంటికి చేరుతాయి. కంటిని చేరుకునే కాంతి వర్ణపటం (spectrum) ఆ వస్త్రంపై పడే కాంతిజనకం (light source) యొక్క కాంతిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వివిధ రంగుల కాంతులతో చూసిన వస్త్రాల రంగులు వేర్వేరుగా ఉంటాయి. కానీ సూర్యకాంతిలో చూసిన వస్త్రాల రంగులు ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ఉంటాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why we laugh on gooseskined?,గిలిగింతలు పెట్టినప్పుడు నవ్వెందుకు వస్తుంది?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: ఎవరైనా గిలిగింతలు పెట్టినప్పుడు నవ్వెందుకు వస్తుంది?

జవాబు : మన శరీరంలో ఎన్నో అవయవాలు, అవయవ భాగాలు ఉన్నా, అందులో కొన్ని చాలా సున్నితమైనవి. ఆ భాగాల్లో ప్రాణప్రదమైనవి, జీవానికి చాలా విశిష్టమైన అంతర్భాగాలు ఉంటాయి. ఉదాహరణకు చంకల కింది భాగంలో ఉన్న ఉరఃపంజరం(chest) చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందులోనే జీవానికి అతి ముఖ్యమైన ఊపిరితిత్తులు, గుండె లాంటి భాగాలు ఉంటాయి. అలాగే మెడ భాగంలో మెదడుకు, శరీరానికి అనుసంధానమైన నాడులు, రక్తనాళాలు, శ్వాసనాళం, ఆహార వాహికలాంటి కీలక భాగాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యమైన అవయవాలుండే భాగాల్లో బయట నుంచి ఎలాంటి స్పర్శ, లేదా వత్తిడి కలిగినా దానికి వెంటనే స్పందించి, నిరోధించే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆయా భాగాల్లో నాడీతంత్రులు బాగా విస్తారంగా ఉంటాయి. అందువల్లనే ఇతరులు ముట్టుకోగానే కితకితల రూపంలో మెదడుకు సందేశాలు అందుతాయి. ఆ స్పర్శ, వత్తిడులను నివారించేందుకు మెదడు మన శరీరాన్ని పురికొల్పుతుంది. అందువల్లనే మనం చటుక్కున నవ్వుతూ తప్పించుకోడానికి ప్రయత్నిస్తాం.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Plus sign in hospitals meaning?,ఆసుపత్రుల్లో ప్లస్‌ గుర్తుకు అర్థం ఏమిటి?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న : ఆసుపత్రుల్లో కనిపించే ప్లస్‌ గుర్తుకు అర్థం ఏమిటి?

జవాబు : ఆసుపత్రుల్లో కనిపించే ప్లస్‌ గుర్తును రెడ్‌క్రాస్‌ చిహ్నం అంటారు. రెడ్‌క్రాస్‌ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీనిని ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ద రెడ్‌ క్రాస్‌ కమిటీ నిర్వహిస్తుంది. ఇది 1863లో జెనీవాలో రూపుదిద్దుకుంది. దీని కొనసాగింపుగా 1919లో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీస్‌ ఏర్పడింది. వీటి పనల్లా అంతర్జాతీయంగా యుద్ధాల్లోను, ప్రమాదాల్లోను, మహమ్మారి వ్యాధుల సమయాల్లోను బాధితుల ప్రాణాల్ని రక్షించే మానవతా సేవల్ని అందించడం. ఈ సంస్థకు మూడు సార్లు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ప్రాణాల్ని కాపాడ్డం, రక్తదానం చేయడం వంటి పలు ఆరోగ్య సంబంధ సేవల్ని అందించే సంస్థ చిహ్నాన్ని ఆసుపత్రులు తీసుకున్నాయి. ప్రజలకు సులభంగా తెలియడానికి ఈ గుర్తు ఉపయోగపడుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,  --నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.- http://dr.seshagirirao.tripod.com/

How do Water springs form?, నీటి బుగ్గలు ఎలా ఏర్పడతాయి?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: వేడి నీటి బుగ్గలు ఉంటాయని తెలుసు. మరి చల్లని నీటి బుగ్గలు కూడా ఉంటాయా? అసలివి ఎలా ఏర్పడతాయి?

జవాబు: భూమి లోతుల నుంచి భూ ఉపరితలానికి 'ఫౌంటెన్‌'లాగా వెదజల్లే చల్లని నీటి బుగ్గలు ఉంటాయి కానీ, వాటిని వేడి నీటి బుగ్గలతో పోల్చడానికి వీలు లేదు. భూమి లోపలి పొరల నుంచి వేడి నీరు హఠాత్తుగా భూమి ఉపరితలంపైకి చిమ్ముకురావడానికి కారణం ఆ నీరు అధిక ఒత్తిడికి గురి కావడమే. అయితే చల్లని నీరు పైకి చిమ్మడానికి కారణం ఒక విధమైన రసాయనిక చర్య. భూమి లోపల ఏర్పడే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది. భూగర్భంలో ఉండే గుహలలో కార్బన్‌ డయాక్సైడు విడుదలై అక్కడి నీటిలో కరిగిపోతే, వాయువుతో కూడిన కార్బానిక్‌ ద్రవం ఉత్పన్నమవుతుంది. ఈ ద్రవం భూ ఉపరితలానికి తన్నుకు వస్తుంది. చల్లని నీటి బుగ్గలు చూడడానికి వేడి నీటి బుగ్గలలాగానే ఉన్నా, కార్బన్‌డయాక్సైడు కరిగి ఉండడంతో నురగతో, తెల్లగా ఉంటుంది.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Electricity do not travel in Air?, గాలిలో విద్యుత్‌ ప్రవహించదా?


 •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: కరెంటు నీటిలో పాస్‌ అవుతుంది. మరి గాలిలో ఎందుకు పాస్‌ కాదు?

జవాబు: ఒక పదార్థం గుండా విద్యుత్‌ సరఫరా కావడం అంటే ఆ పదార్థంలో ఎలక్ట్రాన్లు లేదా విద్యుదావేశం ఉన్న కణాలు లేదా అయాన్లు ప్రవహించడమే. లోహాలు(metals), బొగ్గు, గ్రాఫైటు వంటి అలోహాల్లో (non-metals) స్వేచ్ఛగా అటూ ఇటూ కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉప్పు ద్రావణం, సముద్రపు నీరు, తాగే నీరు, గంధకామ్లం వంటి ద్రవ పదార్థాల్లో విద్యుదావేశం ఉన్న అయాన్లు ఉంటాయి. ఇలాంటి ఘన, ద్రవ పదార్థాలను విద్యుత్‌ పొటన్షియల్‌ ఉన్న రెండు బిందువుల (poles) మధ్య ఉంచినపుడు విద్యుత్‌ సరఫరా అవుతుంది. అంటే రుణధ్రువం వైపునకు ధనావేశిత (positively charged) కణాలు, ధనధ్రువం వైపు రుణావేశిత (negatively charged) కణాలు ప్రయాణిస్తాయి. ఈ స్థితినే మనం విద్యుత్‌ ప్రవహించడం అంటాం. అయితే గాలిలో అణువులు తటస్థం(neutral)గాను, దూరదూరంగాను ఉంటాయి. కాబట్టి ఇలాంటి సాధారణ వాయువులను సాధారణ పొటెన్షియల్‌ తేడా ఉన్న బిందువుల మధ్య ఉంచితే, ఆ వాయువుల్లో చలించే విద్యుదావేశిత కణాలు ఏమీ లేకపోవడం వల్ల కరెంట్‌ పాస్‌ కాదు. స్వచ్ఛమైన నీరు, బెంజీన్‌, అసిటోన్‌, ఆల్కహాలు వంటి ద్రవాల్లో కూడా కరెంటు ఏమంత గొప్పగా పాస్‌ కాదు. కానీ అధిక వోల్టేజి ఉండే బిందువుల మధ్య గాలిలో కూడా విద్యుత్‌ ప్రసరిస్తుంది. అప్పుడు వాయు అణువులు అయనీకరణం చెందుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేది
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-