ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి?
జవాబు: డాల్ఫిన్లు నిద్రపోయేప్పుడు వృత్తాకార మార్గంలో ఈదుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే అవి నిద్రపోయేప్పుడు వాటి మెదడులోని సగ భాగం మాత్రమే నిద్రావస్థను పొందుతుంది. అందువల్ల గుంపు నుంచి తప్పిపోకుండా ఉండడానికి అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్లు మేల్కొని ఉన్నప్పుడు ఈల లాంటి శబ్దం చేయడం ద్వారా ఒకదాని ఉనికిని మరొకటి సులువుగా తెలుసుకోగలుగుతాయి. కానీ నిద్రపోయేప్పుడు అలాంటి శబ్దాలు చేస్తే శత్రుజీవులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అవి గుంపుగా ఈదుతుండడంతో శత్రుజీవులు దగ్గరకు రావు.
ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...