ఫ్ర : పంచయజ్ఞాలు ఏమిటి ?
జ : 1.బ్రహ్మ యజ్ఞము , 2.దేవ యజ్ఞము, 3.పితృయజ్ఞము, 4.భూత యజ్ఞము, 5.మనుష్య యజ్ఞము.
యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
బ్రహ్మ యజ్ఞము : ఒక ఋక్కును గాని , యజస్సును గాని , సామాన్ని గాని శక్తి కొద్దీ నిత్యమూ అభ్యసించడం ... అనగా నిత్యవేదాధ్యయనం .
దేవ యజ్ఞమ : దేవతాతృప్తి కొరకై హవిస్సు మొదలైన దేవతా ప్రీతికరమైన పదార్ధాల్ని అగ్నిలో హోమం చేయడం .
పితృయజ్ఞము : పితృదేవతా ప్రీతికై స్వధాకారం తో తర్పణాలు ఇచ్చి విప్రులకు భోజనం పెట్టడం .
భూత యజ్ఞము: నిత్యమూ చేయవలసిన వైస్యదేవానుస్ఠానం అనంతరం ఆరుబయలు ప్రదేశములో భూతతృప్తి నిమిత్తము భూత బలిగా ఇచ్చే ఆహార సమర్పణ.
మనుష్య యజ్ఞము : యధాశక్తిగా అతిధులకు బోజనం పెట్టడం .
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...