Tuesday, March 31, 2015

What is Itihaasam and puraanam?-ఇతిహాసం ,పురాణం అంటే ఏమిటి ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... ్
 •  -

 •  -
ప్ర : What is Itihaasam and puraanam?-ఇతిహాసం ,పురాణం అంటే ఏమిటి ?

జ : ' ఇతి ' - ఈవిధముగా , హా+అస -జరిగిందట ; పూర్వకాలములో ఏ కధ ఎలాజరిగిందో దాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పే గ్రంధము ... ఇతిహాసము .

మహాపురుషుల చరిత్ర ఒకచోట చేర్చగా ఏర్పడే శాశ్వతకాల గ్రంధమే పురాణము . ఈరోజుల్ని  ఆ రోజుల్లోనే చూపించిన ఉత్తమ గ్రంధము .

వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంత మేర కష్టమే . శృతులు ఆధారంగా, స్మృతులను మహర్షులు మనకు అందజేశారు. ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలిక గా గ్రహించడానికి కథల రూపంలో, వివరణాత్మకంగా, ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు.

మనకు తెలిసీ తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి. ఉదాహరణకు పుణ్య తీర్థ-క్షేత్రాల మాహాత్మ్య జ్ఞానం, సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు, పండుగలు వాటి కారణాలు, మనము నిత్యమూ పఠీంచే స్తోత్రాలు-సహస్రనామాలు వంటివి. కానీ ఇక్కడ మనము గ్రహించ వలసిన విషయం ఒకటుంది. మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల వంటివి పురాణాలు కావు. “రామాయణ,” “మహాభారతాలు” ఇతిహాసాలు. కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా, ఇతిహాసాలు ఒకానొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి. ఉదాహరణకు రామాయణం సకలగుణాభిరాముడైన శ్రీరామ చంద్రుని జీవిత చరిత్ర. శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియూ విశేషాలు, రామాయణంలో ప్రస్తావించబడ్డాయి.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని. అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే!


 • 1)  పద్మపురాణం (హృదయం).
 • 2) వామన పురాణం (చర్మం ).
 • 3) భాగవత పురాణం--తొడలు .
 • 4) మత్స్యపురాణం--మెదడు .
 • 5) కూర్మపురాణం--పృష్ణభాగం .
 • 6) వరాహ పురాణం--కుడికాలు చీలమండ .
 • 7) నారదపురాణం --బొడ్డు .
 • 8. స్కందపురాణం--వెంట్రుకలు.
 • 9) శివపురాణం--ఎడమ భుజం .
 • 10) విష్ణుపురాణం--కుడి భుజం .
 • 11) అగ్నిపురాణం-- ఎడమపాదం.
 • 12) మార్కండేయ పురాణం--కుడిపాదం .
 • 13)  భవిష్య --కుడిమోకాలు,
 • 14) బ్రహ్మ పురాణం,
 • 15) బ్రహ్మవైవర్త పురాణం,
 • 16) బ్రహ్మాండ పురాణం.
 • 17) లింగ పురాణం.
 • 18) గరుడ పురాణం.
 • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do bats drink blood?- గబ్బిలాలు రక్తము పీలుస్తాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  -
-[Bats_sleeping.jpg]

 •  -
Qns : Do bats drink blood?- గబ్బిలాలు రక్తము పీలుస్తాయా?

Ans : అన్ని గబ్బిలం జాతులు రక్తాన్ని పీల్చము . . . కాని " వాంఫైర్ " జాతి గబ్బిలాలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. రాత్రివేళ పశువులమీద వాలి తమ నోటిలోని పదునైన పళ్ళతో చర్మాన్ని కొరికి గాయము చేస్తాయి. ఆ గాయము నుండి కారే రక్తాన్ని పిల్లి పాలు తాగినట్లు గా నాలుకతో నాకి తాగుతాయి. ఒక సారి మదలుపెడితే అరగంట సేపు రక్తము తాగుతాయి. సంవత్సరము లో ప్రతి వాంఫైర్ గబ్బిలము సుమారు 25-26 లీటర్ల రక్తము తాగుతాయని అంచనా.
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, March 12, 2015

Hen or Cock cannot fly why?-కోడి ఎందుకు ఎగరలేదు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : కోడి ఎందుకు ఎగరలేదు?

జ : మన ఇంటిలో వెంచుకునే కోళ్ళకు  . . ఎగిరే పక్షులకు ఉండే అవయవాలైన  రెక్కలు , ఎగిరే కండరాలు , గాలి బాగా పీల్చే ఊపిరితెత్తులు ఉన్నప్పటికీ  అవి ఎగరవు . మరీ ప్రాణహాని అనిపిస్తే మాత్రము ఒక్క సారిగా ఎగిరి ఎత్తయిన ప్రదేశాన్ని చేరతాయి. కోడి ఎగరటం మరిచిపోయేలా చేసింది మానవుడే .

ఏ జీవికైనా బతికేందుకు ఆహారము , శత్రు జీవుల నుండి రక్షణ అవసరము . . . వీటికోసమే పరుగెత్తడము , ఎగరడము . కోడి ఇప్పుడు మనిషి జీవితములో ఒక భాగమైపోయిందది. కోళ్ళను మనిషి పెంపుడు జీవిగా మార్చుకుని  వాటికి ఆహారము , భద్రత సమకూర్చాక  వాటికి ఎగరాల్చిన అవసరము లేకుండాపోయింది.


 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

We stopTV switch during thunder-ఉరుములొస్తే టీవీ కట్టేస్తారేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  

 •  

ప్రశ్న: ఆకాశంలో మెరుపులు, ఉరుములు వస్తున్నపుడు టీవీని ఆపు చేస్తుంటారు, ఎందుకు?

జవాబు: ఆకాశంలో నీటి ఆవిరి, మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఒకదానినొకటి ఒరుసుకోవడం వల్ల అధిక ఓల్టేజీ, కరెంటు విలువలతో కూడిన విద్యుచ్ఛక్తి ఉత్పన్నం అవడం వల్ల మెరుపులు, ఉరుములు వస్తాయి. వాటి నుంచి వెలువడి భూమి వైపు పయనించే విద్యుత్‌ తరంగాలు, భూమిపై మనం ఏర్పరుచుకున్న విద్యుత్‌ లైన్లను, టీవీ ఏంటినాలను తాకుతాయి. వాటి నుంచి వాటికి అనుసంధానించిన టీవీ లాంటి పరికరాల్లోకి ఎక్కువ ఓల్టేజీలో ఉండే విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే కాలం అతి తక్కువైనా, తక్కువ ఓల్టేజీ విద్యుత్‌ ప్రవహించే ఏర్పాటుతో తయారు చేసిన ఆ పరికరాల్లోని భాగాలు పాడవుతాయి. అందువల్ల మెరుపులు, ఉరుములు వచ్చేటపుడు టీవీలాంటి పరికరాల్ని కట్టేయడం మంచిది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, March 11, 2015

Mosquito repellents not good?-దోమల మందులు వాడకూడదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 •  

 •  
ప్రశ్న: దోమల్నించి కాపాడుకోవడానికి వాడే మస్కిటో కాయిల్స్‌, లిక్విడ్స్‌ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
జవాబు: దోమల్లో ఆడ దోమలే మనుషుల, ఇతర క్షీరదాల రక్తాన్ని పీలుస్తాయి. రక్తంలో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీను ఆడ దోమల్లో జరిగే అండోత్పత్తికి అవసరం. అంతేకాదు, రక్తం పీల్చడం ద్వారా ఆడ దోమ పొట్ట ఉబ్బితేనేగానీ ఆ ఒత్తిడికి అండాశయం నుంచి అండాలు ఉత్పత్తి కావు. మనుషులు, ఇతర క్షీరదాల చర్మం నుంచి చాలా స్వల్పంగా విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌, లాక్టిక్‌ ఆమ్లాలను వాసన చూడ్డం ద్వారా దోమలు మనుషుల్ని ఇతర రక్త జీవుల్ని గుర్తిస్తాయి. కాబట్టి కార్బన్‌డయాక్సైడ్‌ను, లాక్టిక్‌ ఆమ్లాలను గుర్తించే యంత్రాంగాన్ని భగ్నం చేయడం ద్వారా దోమలు మనుషుల్ని చేరుకోకుండా చేయవచ్చును. ఈ సూత్రం ఆధారంగా NN-డైయిథైల్‌ మెటాటోలమైడ్‌ (DEET)వంటి పదార్థాల్ని తేలిగ్గా ఆవిరయ్యే ద్రావణాల్లో సుమారు 8శాతం గాఢతతో ఉండేలా లిక్విడ్స్‌ సరఫరా చేస్తున్నారు. మస్కిటో రిపెల్లెంట్‌ లిక్విడ్స్‌ను ప్రత్యేక బాటిళ్లలో వేడి చేయడం ద్వారా DEETఆవిర్లు గాల్లోకలుస్తాయి. ఇవి దోమల ఘ్రాణ కణాల్ని తాకినపుడు వాటికున్న గ్రాహణశక్తి నశిస్తుంది. మస్కిటో కాయిల్స్‌లో కూడా దాదాపు ఇదే యంత్రాంగం ఉంటుంది. పైగా కొన్ని సహజ కీటక వికర్షక పదార్థాలను కూడా కాయిల్స్‌లో కలుపుతారు. సహజమైనవైనా, కృత్రిమమైనవైనా మస్కిటో కాయిల్స్‌లో, లిక్విడ్స్‌లోను ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అదే పనిగా రోజూ వాటిని వాడినట్లయితే అవాంఛనీయమైన అనారోగ్యస్థితులు రాగలవు. దోమల నివారణకు ఉత్తమ మార్గం, పరిసరాల శుభ్రత, ఆపై దోమతెరల వాడకమే!

- ప్రొ ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, March 08, 2015

How they regulate body temparature?-పక్షులు జంతువులు శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: పక్షులు, కొన్ని జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?

జవాబు: పక్షుల శరీర ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనైనా స్థిరంగా ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతలను జీవక్రియల ద్వారా ఒక పద్ధతిలో నియంత్రించుకుంటాయి. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు వాటికుండే ఈకలను శరీరానికి అతి దగ్గరగా సమతలంలో ఉండేటట్లు తెచ్చుకుంటాయి. దాంతో ఈకలకు, శరీరానికి మధ్య గాలి ఉండకపోవడంతో ఉష్ణ వికిరణం ద్వారా శరీరంలో ఎక్కువైన ఉష్ణం వెలుపలకు పోవడమేకాకుండా వెలుపలి ఉష్ణం శరీరంలోకి చొరబడదు. చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట, శరీర ఉష్ణం వల్ల ఆవిరవడంతో, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పక్షులు తమ శరీరంపై ఉన్న ఈకలను బాగా పైకి లేపి వెలుపలి గాలిని శరీరం మధ్య నింపేసుకోవడం ద్వారా శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి పోకుండా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి.

కుక్కల లాంటి జీవులు వేసవిలో వాటి నాలుకలు వెలుపలకు చాపి వగరుస్తూ ఉండటం ద్వారా నాలుకలపై ఉండే లాలాజలం, వూపిరితిత్తులలోని తేమ ఆవిరి అయ్యేలా చూసుకుంటాయి. తద్వారా ఏర్పడిన చల్లదనం వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జంతువుల శరీరంలోని ఉష్ణం వాటి శరీరానికి దగ్గరగా ఉండే గాలిని వేడి చేయడంతో, అలా ఏర్పడిన వేడి గాలి పొర, వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఒక నిరోధకం లాగా పనిచేస్తుంది. ఆ విధంగా చలికాలంలో కూడా వాటి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.


- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do vitamins good for health?-విటమిను మాత్రలు మంచివేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  

 •  
ప్రశ్న: మందుల దుకాణాల్లో దొరికే 'విటమిన్‌' మాత్రల వల్ల నిజంగానే శరీరానికి విటమిన్లు అందుతాయా?
జవాబు: మందుల దుకాణం వాళ్లు కల్తీ, నకిలీ మందులు అమ్మనంత వరకు వారిచ్చే మాత్రల్ని నమ్మవచ్చు. సాధారణంగా విటమిను మాత్రలు బహుళ విటమిను మాత్రల రూపంలో దొరుకుతాయి. ఒక్కోసారి అవసరంలేని విటమిను సంఘటనం కూడా ఆ మాత్రల్లో ఉండగలదు. గర్భిణిలు, పథ్యం లేదా నిర్ణీత ఆహార నియమాలు పాటించేవారు, వృద్ధులు, తల్లిపాలు లభించని శిశువులు మొదలయిన వారికి ప్రత్యేకంగా విటమిను సరఫరా అవసరం. అయితే మందుల రూపంలో కాకుండా శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే 'డి' విటమిను వంటి వాటిని అనవసరంగా కొని డబ్బు వృథా చేసుకోనవసరం లేదు. తగిన మోతాదులో కూరగాయలు, ఆకు కూరలు, మాంసకృత్తులు నిండిన సమతలాహారం, పండ్లు తీసుకుంటే విటమిన్ల మాత్రలు కొనవలసిన అవసరం ఉండదు.
- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌,--శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Refrigerator Switch on and off,రెఫ్రిజరేటర్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసిన వెంటనే స్విచ్‌ ఆన్‌ చేయకూడదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: రెఫ్రిజరేటర్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసిన వెంటనే స్విచ్‌ ఆన్‌ చేయకూడదంటారు. ఎందువల్ల?

జవాబు: రెఫ్రిజరేటర్‌ను, ఏదైనా కారణాల వల్ల స్విచ్‌ ఆఫ్‌ చేస్తే వెనువెంటనే మళ్లీ స్విచ్‌ ఆన్‌ చేయకూడదు. అలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో కీలక పరికరమైన సంపీడకం (కంప్రెషర్‌) పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇదెలాగో తెలియాలంటే ఫ్రిజ్‌ పనితీరును కూడా అర్థం చేసుకోవాలి. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేసే రిఫ్రిజరెంట్‌ ఉంటుంది. స్విచ్‌ ఆఫ్‌ చేయక ముందు ఎక్కువ పీడనంలో ఉండే దీన్ని తక్కువ పీడనంలోకి తెచ్చే వ్యాకోచ సాధనం ఉంటుంది. దీని ద్వారా రెఫ్రిజిరెంట్‌ నెమ్మదిగా దానిని ఆవిరిగా మార్చే భాష్పకారిణి (ఎవాపరేటర్‌)లోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌ను స్విచాఫ్‌ చేసినప్పుడు కంప్రెషర్‌ పనిచేయడం ఆగిపోతుంది. అప్పుడు రెఫ్రిజరెంట్‌ పూర్తిగా భాష్పకారిణిలోకి చేరుకుంటుంది. ఈ పరిస్థితిలో తిరిగి స్విచ్‌ ఆన్‌ చేస్తే, కంప్రెషర్‌లో ఎలాంటి రెఫ్రిజరెంట్‌ ఏమాత్రం లేని స్థితి కలుగుతుంది. దీనిని 'నో లోడ్‌ కండిషన్‌' అంటారు. దాని మూలంగా కంప్రెషర్‌ పాడవుతుంది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫ్రిజ్‌ తయారీదారులు తక్కువ సామర్థ్యం గల మోటార్లతో కూడిన కంప్రెషర్లను అమరుస్తారు. దీని వల్ల ఫ్రిజ్‌ ధరలో కూడా కొంత ఆదా అవుతుంది. no load condition ద్వారా ఫ్రిజ్‌ పాడవకుండా ఉండటానికి, ఫ్రిజ్‌ను 'ఆఫ్‌' చేసిన వెంటనే 'ఆన్‌' చేయకుండా కొన్ని సెకండ్లు వేచి ఉండటం మంచిది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, March 07, 2015

what is the cause for sputum?-కఫం ఏర్పడడానికి కారణం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  
 •  
ప్రశ్న: కఫం ఏర్పడడానికి కారణం ఏమిటి? అది ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జవాబు: కఫం (sputum)శ్వాస కోశ సంబంధిత వ్యాధికి చిహ్నం. గొంతుకు సంబంధించిన జబ్జులు, ఊపిరితిత్తుల జబ్బులు, జలుబు, క్షయ వంటి వ్యాధి గ్రస్తులలో ఆయా తీవ్రతనుబట్టి కఫం ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ భాగం చీమిడి అని పిలిచే మ్యూకస్‌లా ఉంటుంది. లేదా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చినట్లయితే అందులో చాలా మేరకు చనిపోయిన లేదా సజీవంగా ఉన్న బ్యాక్టీరియా, నిర్జీవ తెల్ల రక్తకణాలు (చీము), ధ్వంసమైన రక్త కణాలు ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే కఫాలన్నీ ఒకే రకమైనవి కావు. ఒకే లక్షణానికి చిహ్నాలుకావు. కానీ కఫం మాత్రం ఏదో ఒక అనారోగ్యానికి మాత్రం సూచిక. అందుకే డాక్టర్లు కఫ పరీక్ష చేసి దానికిగల కారణాల్ని తెలుసుకొని తగు విధమైన చికిత్స చేపడతారు. కఫం రాకుండా ఉండాలంటే ఆరోగ్య సూత్రాల్ని, ఆహార నియమాల్ని పాటించడం, కాలుష్యానికి దూరంగా ఉండడమే.

- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయి?.తీరానికి దూరంగా కన్నా తీరం చేరేటప్పటికి ఎత్తు ఎక్కువెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... ప్రశ్న:  సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయి?.తీరానికి దూరంగా కన్నా తీరం చేరేటప్పటికి ఎత్తు ఎక్కువెందుకు?

జవాబు: కొంచెం లోతైన ప్లాస్టిక్‌ ట్రేలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి వూదండి. ఆ ట్రే అంతా చిన్న తరంగాలు కదలడాన్ని చూడవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడతాయి.

సముద్రాల సగటు లోతు 3.7 కిలోమీటర్లు ఉంటుంది. సముద్రాలలో ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల అలలు ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన అల కిందికి పడినపుడు ఏర్పడే గతిజశక్తి వల్ల కూడా తిరిగి కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ, కిందికీ వూగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల కూడా వ్యాపించి అలలు నిరంతరంగా కనిపిస్తాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో అలల కదలికకు ప్లవనశక్తి కూడా తోడై మరింతగా అలలు ఏర్పడతాయి.

సముద్ర ఉపరితలంపై వీచేగాలి వేగం ఎక్కువయ్యేకొలదీ అలల ఎత్తు ఎక్కువవుతుంది. అలల ఎత్తుతోపాటు వాటి మధ్య దూరం కూడా ఎక్కువవుతుంది. ఒక దశ తర్వాత గాలి తీవ్రత ఎంతగా ఉన్నా అలల ఎత్తు కొంత గరిష్ఠ స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది. తీరానికి దూరంగా ఉన్న సముద్రంలోపలి లోతైన ప్రదేశాల్లో అలల ఎత్తు తక్కువగా ఉంటుంది.

తీరానికి చేరుకొనే కొద్దీ లోతు తక్కువ కావడంతో వాటి వేగం, వాటి మధ్యదూరం తగ్గుతాయి. వాటి ఎత్తు మాత్రం పెరుగుతుంది. చివరకు అలలు తీరం చేరేటప్పటికి వాటి ఎత్తు మరీ ఎక్కువై అలలు ఒకదానిపై ఒకటి విరిగిపోవడం వల్ల నురగ వ్యాపిస్తుంది. ఇలా నిమిషానికి పదికి మించి విరిగితే తీరంపై ఉన్న పదార్థాలను తన లోపలికి లాక్కుంటాయి. పది కన్నా తక్కువగా విరిగితే సముద్రంలోని గవ్వలు, ఆలు చిప్పలు లాంటి పదార్థాలు తీరంలోకి వచ్చిపడతాయి.

ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

If water present instead of blood-మన శరీరంలో రక్తానికి బదులు నీళ్లే ఉంటే ఏమయ్యేది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !ప్రశ్న: మన శరీరంలో రక్తానికి బదులు నీళ్లే ఉంటే ఏమయ్యేది? రక్తం ప్రత్యేకతేంటి?

జవాబు: శరీరంలో పలు జీవన కార్యకలాపాలు జరగాలంటే శక్తి కావాలి. ఓ కారు నడవడానికి పెట్రోలు యంత్రంలో మండడం వల్ల వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. ఇక్కడ గాలిలోని ఆక్సిజన్‌ పెట్రోలును మండిస్తుంది. మండటం అంటే ఇంధనంలోని అణువులను ఆక్సిజన్‌తో సంధానించి ఆక్సీకరణం చేయడమే.
మన శరీరంలోని కార్యకలాపాలు నడవాలంటే మనకూ ఓ ఇంధనం అవసరం. ఆ ఇంధనమే గ్లూకోజు. మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజు లభ్యమవుతుంది. దీనిని రక్తం శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. కానీ ఇంధనంలోని శక్తిని రాబట్టాలంటే ఆక్సిజన్‌ కూడా కావాలి. దానిని మనం శ్వాసక్రియ ద్వారా రక్తంలోకి పంపుతాం. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్‌ శ్వాసక్రియలో వూపిరితిత్తుల్లోంచి స్వీకరిస్తుంది. రక్తం బదులు మొత్తం నీరే ఉన్నట్లయితే ప్రతి కణానికి గ్లూకోజు అందుతుంది కానీ ఆక్సిజన్‌ అందదు. ఎందుకంటే నీటిలో గ్లూకోజు కరిగినంతగా ఆక్సిజన్‌ కరగదు. ఆక్సిజన్‌ను అధిక మోతాదులో మోయగల హిమోగ్లోబిన్‌ అవసరం. అలాగే శరీరానికి గాయం తగిలితే సూక్ష్మ క్రిముల బారి నుంచి శరీరాన్ని రక్షించాలన్నా, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడాలన్నా సైన్యంలాగా తెల్ల రక్త కణాలు అవసరం. ఇవి నీటిలో కరగవు. ఇలా ఎన్నో జీవ రసాయనాలు కలిసి ఉన్న నీటినే రక్తం అంటాం. రక్తంలో నీరు 70 శాతం వరకు ఉంటుంది. ఉత్త నీటి వల్ల లాభం లేదు. నీటిలో నిమగ్నమై ఉన్న పలు జీవ రసాయనాల, వర్ణ ద్రవ్యాల సమాకలనమే రక్తం. ఇది గాయం తగిలితే గడ్డ కడుతుంది. నీరు గాయం తగిలితే కారిపోతూ ఉండేది. రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ గడ్డ కట్టడంలో ఉపకరిస్తాయి.

రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి .నైట్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

 •  ============================
... visit My website > Dr.Seshagirirao - MBBS.-