Thursday, October 30, 2014

కార్తీకం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  
 •  
ప్ర : కార్తీకం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు? ,స్నానాలు ఎన్ని రకాలు?.

జ : స్నానము అనేది శరీర శుభ్రతకోసము . అది ఏకాలమౌలో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయానే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో బాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం విద్యుత్తు(ఉష్ణశక్తి) ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో విద్యుచ్ఛక్తి కొత్తగా తయారౌతూ, బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ... సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను ... పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ ... సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ ... పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీకములో పుణ్యమకోసము స్నానాలు చేసే స్నాన విధాలు ;

1 . దివ్య స్నానం:-
ఉత్తరాయణం లో ఎండ తో పాటు , వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం .

2. ధ్యాన స్నానం :-
గంగ, యమున , సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం .

3. మంత్ర స్నానం :-

మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం .

4 . మాన స్నానం :-

విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు .

5.వారుణ స్నానము : గోవిందా , హర హర అనో దేవుని తలచుకొని స్నానము చేయుట .

6.కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము , పుండు ఉన్నచో ... బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి , బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము .

7.ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు .. లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు .. ఎండలో గోవిందనామము ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు ... నేను స్నానము చేస్తున్నాను అని భావించి , శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

 • మూలము : డా. మైలవరపు శ్రీనివాసరావు @ స్వాతి వారపత్రిక 31-10-2014.
ఇలా స్నానము చేస్తే పుణ్యము వస్తుందో లేదో గాని . చర్మవ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువే. 
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do we sneez?,తుమ్ములు ఎందుకు వస్తాయి?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

 •  
ప్రశ్న: తుమ్ములు ఎందుకు వస్తాయి?

జవాబు: మనం నిరంతరం శ్వాసిస్తుంటాం. గాలిలోని ఆక్సిజన్‌ను లోనికి తీసుకుని దానితో మన ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేయగా విడుదలయ్యే శక్తితోనే మనం అనుక్షణం జీవిస్తున్నాం. ఇంతటి సునిశితమైన శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు ప్రధాన పాత్రధారులు.

ఊపిరితిత్తుల్లోకి సాధారణ గాలికి బదులు అవాంఛనీయమైన దుమ్ము, ధూళి, కారపు బిందువులు, నీటి తుంపరుల వంటివి వెళితే అవి ఊపిరితిత్తుల గోడల మీద తిష్టవేసి శ్వాసక్రియకు ఎంతో కొంత భంగం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అవాంఛనీయ పదార్థాలు ఊపిరితిత్తుల్ని చేరకుండా చేసే విధంగా మన శ్వాసనాళ నిర్మాణం అమరి ఉంటుంది. పొరపాటున ఏవైనా పదార్థాలు శ్వాస కోశంలోకి వెళ్లినా వాటిని బయటకి పంపేసే వ్యవస్థ ఉంటుంది. ముక్కు ద్వారా గాలివెళ్లే సమయంలో ముక్కు లోపల ఉండే రోమాలు చాలా మట్టుకు అవాంఛనీయమైన దుమ్ముకణాల్ని ఫిల్టర్‌ చేస్తాయి. ఇది దాటి కూడా లోపలికి వెళ్లే పదార్థాలను బయట పడేసేందుకు ఊపిరితిత్తులు బలమైన నిశ్వాసంతో ప్రయత్నిస్తాయి.అదే తుమ్ము.

 • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, -జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • =========================

Tuesday, October 28, 2014

ఐస్‌వాటర్‌ గ్లాసు బయట బిందువులేల?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  

ప్రశ్న: గ్లాసులో ఐస్‌వాటర్‌ పోస్తే గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడతాయి. ఎందువల్ల?

జవాబు: అతిచల్లగా ఉండే ఐస్‌వాటర్‌ను గ్లాసులో పోసినపుడు ఆ గ్లాసు బయట కనిపించే బిందువులు గాలిలోని నీటి ఆవిరి వల్ల ఏర్పడినవి. గ్లాసులో ఉన్న ఐస్‌వాటర్‌ వల్ల గ్లాసు లోపలి భాగమే కాకుండా దాని ఉపరితలం కూడా చల్లబడుతుంది. ఆ చల్లని ఉపరితలాన్ని గ్లాసు చుట్టూ ఉన్న గాలి తాకినపుడు ఆ గాలిలో ఉండే నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటి బిందువులు గ్లాసు ఉపరితలాన్ని అంటుకొని ఉంటాయి.

కారులో వెళ్తునప్పుడు వర్షం వచ్చినా ఈ విషయం గమనించవచ్చు. మూసి ఉన్న గాజు తలుపుల మీద చల్లని వర్షం నీరు పడటంతో కారు లోపలివైపు ఉన్న గాజు తలుపుల పై కూడా నీటి బిందువులు ఏర్పడతాయి. కారులో ఉన్న గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించడమే ఇందుకు కారణం.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

 • ========================

What happen if seasand used in construction, సముద్రపు ఇసుకతో ఇల్లు కడితే ఏమవుతుంది?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 •  

ప్రశ్న:
సముద్రపు ఇసుక భవన నిర్మాణానికి పనికి రాదంటారు. ఎందుకు?

జవాబు: భవన నిర్మాణంలో ఇసుక, సిమెంటు, ఇటుకల్ని గోడల నిర్మాణానికి వాడతాం. భవనానికి నిలకడను, ఆయుర్దాయాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే చట్రంగా పిల్లర్లు, శ్లాబులు ఉపకరిస్తాయి. ఇందుకోసం ఇసుక, సిమెంటుతోపాటు కంకర, ఇనుప కడ్డీలను వాడతాం. ఇవన్నీ సరైన పద్ధతిలో, తగుపాళ్లలో కలిపితేనే భవనానికి దృఢత్వం, ఆయుష్షు సిద్ధిస్తాయి. కంకర, ఇనుప కడ్డీలు కఠినంగా ఉండటం వల్ల స్తంభాలకు, శ్లాబులకు గట్టిదనం వస్తుంది. వాటిని కలిపి బంధించే జిగురు లాంటి పదార్థమే సిమెంటు. కానీ ఇసుక లేకుండా సిమెంటును మాత్రమే వాడినట్లయితే తేలికపాటి ఉష్ణసంకోచవ్యాకోచాలు జరిగినట్లు సిమెంటులో బీటలు ఏర్పడే ప్రమాదం ఉంది.

తద్వారా భవనం కూడా కూలిపోగలదు. అంతేకాదు ఇసుక లేనట్లయితే సిమెంటును చాలా అధికంగా అదనంగా కూడా వాడవలసి ఉంటుంది. కానీ ఇసుకను కలిపినట్లయితే ఆ ఇసుక రేణువులు గట్టిపడిన సిమెంటుతోను, స్తంభాలు, శ్లాబుల్లో ఉన్న కంకర, ఇనుప రాళ్లతోను సంధానమై ఉష్ణవ్యాకోచసంకోచాలు సంభవించినపుడు షాక్‌అబ్సార్బర్స్‌లాగా కుషన్లుగా ఉపకరిస్తాయి. మరి ఆ ఇసుక రేణువుల ఉపరితలం ఎంతగరుగ్గా ఉంటే అంత సమర్థవంతంగా అవి రాడ్లను, కంకరను, సిమెంటును పట్టుకోగలవు. సముద్రపు ఇసుక సైజులో చాలా తక్కువగా ఉండటమే కాకుండా నునుపుగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా సిమెంటును సంధానించుకోవు. అందువల్ల ఆ ఇసుక భవన నిర్మాణాలకు వాడరు.

 • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,
 • =====================

Difference in tearing paper.why? పేపర్‌ చించడంలో తేడాలేల?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: న్యూస్‌ పేపర్‌ను అడ్డంగా చించడం కంటే నిలువుగా చించడం తేలిక. ఎందుకని?

జవాబు: కాగితం తయారీలో వాడే గుజ్జు రూపంలో ఉండే పీచు, నార, ఖనిజాల వడపోతను మొదటగా ఒక బల్లపై పోస్తారు. ఆ బల్ల ఉపరితలంపై కృత్రిమ పదార్థంతో తయారుచేసిన బోలగా ఉండే తీగ ఒకటుంటుంది. అది యంత్ర సహాయంతో బల్లపై అతి వేగంగా ఒక చివర నుంచి మరో చివరకు తిరుగుతూ ఉంటుంది. బల్లపై పోసిన గుజ్జు తీగ కదలిక వల్ల సన్నని పొరలాగా సమంగా పరుచుకొంటుంది. ఈ పొరపై వేడిగా ఉన్న స్తూపాకారపు రోలర్లను దొర్లించడం ద్వారా ఒత్తిడిని కలుగ జేయడంతో ఆ పొర గట్టిపడి పొడిగా ఉండే సన్నని కాగితంలా తయారవుతుంది.

గుజ్జులాంటి ద్రవాన్ని కొంత ఎత్తులో ఉన్న ఫ్లోబాక్స్‌ ద్వారా బల్లపై వేగంగా కదిలే తీగపై పోయడం వల్ల ఆ గుజ్జులో స్తూపాకారంలో ఉండే పదార్థాల పోగులు తీగ కదిలే దిశలోకే సమంగా పరుచుకొంటాయి. ఈ దిశను యంత్ర దిశ అంటారు. కాగితం పటిష్టత దాని తయారీలో వాడే పదార్థాలు అమరిన దిశపై ఆధారపడి ఉంటుంది. కాగితంలో ఉండే పదార్థాలు యంత్ర దిశలోకే అమరి ఉండడం వల్ల ఈ దిశలో కాగితాన్ని తేలికగా చించవచ్చు. ఈ దిశకు అడ్డంగా ఉండే దిశలో కాగితంలోని పదార్థాలు పక్కలకు ఉండడంతో చించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాగితం తయారీలో ఎక్కువశాతం ఖనిజాలకన్నా తేలికైన పీచు, నారను వాడడం వల్ల పుస్తకాలను ముద్రించే కాగితాలకంటే సులభంగా యంత్ర దిశలో చించవచ్చు.


 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
==================================

How do we measure purity of milk?,పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

జ :  పాల స్వచ్ఛతను కొలిచే సాధనాన్ని లాక్టో మీటర్‌ అంటారు. ఇది సిలిండర్‌ ఆకారంలో ఉంటుంది. ఒక అంచును బల్బులా ఉండే కొద్దిగా సన్నపాటి ట్యూబ్‌తో ఊదుతారు. ఈ ట్యూబ్‌ రెండో వైపు మూసి ఉంటుంది. దాని పైన ఎం, డబ్ల్యు అనే అక్షరాలు వాటి మధ్య 1, 2, 3, 4 అంకెలు ఉంటాయి. ఈ ట్యూబ్‌ను పాలు ఉన్న సీసాలో ముంచుతారు. దీని పాయింటర్‌ పైకి తేలితే స్వచ్ఛమైన పాలుగా గుర్తిస్తారు.స్వచ్ఛమైన పాలు బరువుగా ఉంటాయి. తర్వాత దీన్ని నీటిలో ముంచుతారు. అపుడు నీటిలో సమాంతరంగా ఉండకుండా డబ్ల్యూ వైపు మొగ్గితే పాలలో నీరు ఉన్నట్టు స్పష్టమవుతుంది. పాలలో పాలు, నీటిశాతం వివరంగా తెలుసుకోవడానికి ట్యూబ్‌పై ఉన్న అంకెలను పరిశీలిస్తారు. పాలలో ముంచినపుడు పాలసీసాలో ఈ ట్యూబ్‌ 'ఎం' దాటి మునిగితే .. అంటే 3 అంకె వరకూ మునిగితే పాలల్లో 75శాతం పాలు స్వచ్ఛమైనవిగా గుర్తిస్తారు. అదే 2 లేదా 1కి స్థాయి చేరితే పాలు స్వచ్ఛమైనవి కాదని నీరు కలిసినట్టుగా గుర్తిస్తారు. లాక్టో మీటర్‌ ను తరచూ ఉపయోగిస్తూ వుంటారు గానీ దీన్ని ఆధారంగా చేసుకుని పాల స్వచ్ఛతను నమ్మడం అనేది అంతగా ఉండదు. సాధారణ పాలు కంటే స్కిమ్‌డు  పాలు ఎక్కువ బరువుగా ఉంటాయి. వీటి విషయంలో స్వచ్ఛతను ఈ పరికరం స్పష్టం చేయలేదు.

 • =======================

Thursday, October 23, 2014

coconut oil solidify in winter why?,చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?

జ : ఇళ్ళ లో పలురకాల నూనెలు వాడుతుంటాం ... వీటిలో ముఖ్యమైనది తలమీద రాసుకునే కొబ్బరి నూనె , వంటలకు ఉపయోగించే శనగనూనె . వీటిలో కొబ్బరి నూనె చలికాలములో గడ్డకడుతుంది. కారణము అయా నూనెలలో ఉండే కొవ్వు ఆమ్లాలు. కొబ్బరి నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 90 శాతము వరకు ఉన్నందున ఉష్ణోగ్రత తగ్గగానే గడ్డకడుతుంది. శనగ నూనె లో అసంతృప్త కొవ్వులు అధికము కాబట్టి గడ్డకట్టవు . అసంతృప్త కొవ్వులకు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండగా సంతృప్త కొవ్వులకు ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండును . నూనెలలో ఈ తేడా కనిపిస్తుంది.
 • ============================

Tuesday, October 21, 2014

Why do we tumbling in sleep?,మనుషులు నిద్రలో దొర్లుతారెందుకు ?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మనుషులు నిద్రలో దొర్లుతారెందుకు ?

జ : ఎంత మొద్దు నిద్రలో అయినా ఒకే భంగిమలో రాత్రంతా నిద్రపోగలిగిన వారు ఉండరు. ప్రతి ఒక్కరు రాత్రి నిద్రలో నిష్టముగా 20 సార్లు గరిష్టము గా 40 సార్లు అటు - ఇటు కదులుతారు. . ఆ కదలిక  అరనిమిషము మించకపోవచ్చు . పడక గది వాతావరణము , నిద్ర ముందు తిన్న ఆహారము , అలసట అనే అంశాలమీద ఆధారపడి ఎన్నిసార్లు దొర్లుతామనేది మారుతుంది. ఒక భంగిమలో పడుకుంటే ఆ వైపు రక్త ప్రసరణలో వచ్చే మార్పుఇబ్బంది నుండి బయట పడేందుకు భంగిమ మార్చమని మెదడ సంకేతమిస్తుంది ... అప్పుడే మనం దొర్లుతాము.
 • ===========================

Monday, October 20, 2014

Blood is red why?,రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?

జ : రక్తము ద్రరూపములో ఉండే కణజాలముల సమూహము . అందులో ప్లాస్మా , ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. తెల్లరక్త కణాలు , ఎర్రరక్తకణాలు , ప్లేట్లెట్స్  అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎర్రరంగులో ఉండే రక్తకణాలు మానవ రక్తం లో ప్రతి చుక్క లో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఆ రక్త కణాలలో " హీమోగ్లోబిన్‌ " అనే వర్ణక పదార్ధమువలన రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. మనము పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ ని తమలో నింపుకొని శరీర భాగాలకు అందించేవి ఎర్రరక్తకణాలు , అయితే ఇదే రక్తము వెన్నెముకలేని జీవులలో మనలో లా ఎర్రగా ఉండదు. నీలి , తెలుపు రంగులో ఉంటుంది. రక్తము రంగులో తేడా ఆ జీవుల రక్తములోని పదార్ధము వల్లనే వస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉన్నరక్తమే ఎర్రగా ఉంటుంది.

 • ============================

Friday, October 17, 2014

Dals kept in water gives badsmell why?,పప్పుల్ని నానబెడితే వాసనేల?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: పప్పుల్ని నీళ్లలో నానబెడితే ఒక రకమైన వాసన వస్తాయి. ఎందుకు?

జవాబు: పప్పు దినుసుల్ని, తదితర పోషక విలువలున్న ఇతర ధాన్యపు గింజల్ని నీళ్లలో నానబెట్టిన చాలా సేపటికి గమనిస్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. కారణం ఆయా ఆహార విలువలున్న ధాన్యపు గింజలు, పప్పు గింజలు కుళ్లిపోవడమే.

భూమ్మీద ఉన్న జీవుల మనుగడకు శక్తి కావాలి. ఆ శక్తి వాటికి, మనకు ఆహార పదార్థాల్లోని పిండి పదార్థాల నుంచి, కొవ్వు పదార్థాల నుంచి వస్తుంది. మాంసకృత్తుల్ని ఆయా జీవులు తమ శరీర నిర్మాణానికి, జీవన కార్య కలాపాలకు అవసరమైన ఎంజైముల్ని, ప్రోటీన్లను తయారుచేసు కునేందుకు వాడుకుంటాయి.

ఇలాంటి ఎన్నో దైనందిన జీవన కార్య కలాపాలకు నీరు ఓ వేదిక లేదా మాపకం లాగా పనిచేస్తుంది. అందుకే మనలాంటి ఎన్నో జీవుల్లో 70శాతం వరకు నీరే ఉంటుంది. కుళ్లిపోవడం లేదా పులియటం అనే విధానానికి కారణం వాతావరణం, నీరు వంటి పలు ప్రదేశాల్లో ఎపుడూ అవకాశం కోసం చూస్తున్న బ్యాక్టీరియాలే. ఇందులో ఈస్ట్‌ అనే బ్యాక్టీరియా ప్రధానమైంది. ఈ కార్యకలాపాలకు కూడా నీరు అవసరం. మామూలు ఎండు ధాన్యాలు, పప్పు దినుసుల్లో నీటి శాతం బాగా తక్కువగా ఉండడం వల్ల బాక్టీరియాలు నీటిని ఆశించినా వాటిపై ప్రభావం ఉండదు. మరో మాటలో చెప్పాలంటే నీటి శాతం అల్పంగా ఉన్న పప్పు గింజల దగ్గర బ్యాక్టీరియాల పప్పులుడకవు. కానీ నానేసిన పప్పు ధాన్యాల్లో చెమ్మదనం నీటి అవకాశం బాగా ఉండడం వల్ల బ్యాక్టీరియా దాడి అధికం అవుతుంది. అవి పోషక విలువల్ని స్వాహా చేసే ప్రక్రియల్లో విడుదల చేసే గంధక తత్వం, భాస్వర లక్షణం ఉన్న పదార్థాల నుంచే ఈ దుర్గంధం వస్తుంది.

 • -ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • =======================================

Sun rays harm to body?,సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?


జవాబు: సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్‌ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా (Sun burns) ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్‌ పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్‌ పొర గాఢత చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్‌). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్‌ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్‌ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ============================

Smoke lines behind planes?,ఆకాశంలో కొన్ని విమానాల వెనుక పొగ చారలు ఎలా ఏర్పడతాయి?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆకాశంలో కొన్ని విమానాల వెనుక దట్టమైన పొగ చార కనిపిస్తుంది. ఎందుకని?

జవాబు: విమానం వెనుక ఆకాశంలో పొగ చార కనిపిస్తే అది జెట్‌ విమానమే. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంతో బయటకు వచ్చే పొగనే జెట్‌ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఆ విమానానికి అంత వేగం రావడానికి కారణం దాని వెనుక నుంచి దూసుకువచ్చే జెట్‌.

ఇదెలా జరుగుతుందంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి 'చర్య'కూ, దానికి సమానమైన ప్రతిచర్య వ్యతిరేకదిశలో ఉంటుంది. ఒక రబ్బరు బెలూన్‌ను బాగా వూది ఒక్కసారిగా వదిలేస్తే అందులోని గాలి వేగంగా బయటకు దూసుకు రావడం దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్‌ విమానాలు, రాకెట్లు పనిచేస్తాయి.

జెట్‌ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అరలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంటుంది. అలా చేరిన గాలిపై ఆ అరలో అత్యధిక పీడనాన్ని కలిగిస్తారు. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిగాలి ఉన్న అరలో పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. అలా మండిన ఇంధనం వాయుధార రూపంలో విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో, వూదిన బెలూన్‌ నుంచి గాలి వచ్చినట్టుగా, బయటకు దూసుకొని వస్తుంది. వాయువు వేగం వల్ల ఏర్పడే ప్రతిచర్య వల్ల, జెట్‌ విమానం ముందుకు పయనిస్తుంది. జెట్‌ విమానం ప్రయాణించే ఎత్తులో ఉండే వాతావరణంలోని గాలి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల విమానం నుంచి వచ్చే జెట్‌ చిందర వందరగా చెదిరిపోదు అందుకనే విమానం వెళ్లిన తర్వాత కూడా ఆ వాయుధార కనబడుతుంది. ఆ పొగ వల్ల కాలుష్యం ఏర్పడదు.

 • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
 • ============================

Sun flower turns to Sun Why?-పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునివైపే తిరగడానికి కారణమేమిటి?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి?

జవాబు: పొద్దు తిరుగుడు పువ్వు (దీనిని సూర్యకాంత పుష్పం Sun flower) అని కూడా అంటారు. సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం పడమరలో అస్తమించే వరకు అది సూర్యుని వంకే చూస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటుంది.

ఈ పువ్వు ఇలా తిరగడానికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణమే. ఫొటోట్రాపిజం అంటే, కంటికి కనిపించే సూర్యరశ్మి వలన మొక్క పెరుగుదలతోపాటు కలిగే ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్‌' అనే హార్మోన్‌ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మొక్కలు పొడవుగా, ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్‌ (amino acid) వల్లగాని, కార్బోహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్‌ ఏర్పడుతుంది. ఈ హార్మోన్‌ మొక్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

'ఫొటోట్రాపిజం' ధర్మం ఉన్న పొద్దుతిరుగుడు మొక్కపై సూర్యరశ్మి నేరుగా పడినపుడు ఆ మొక్క వెనుక భాగంలో అంటే పువ్వు వెనుక ఉన్న కాండంపై నీడ ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా సోకని ఆ చీకటి భాగాలలో 'ఆక్సిన్‌' హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఆ భాగం వేగంగా పెరుగుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్క, దానితోపాటు పొద్దుతిరుగుడు పువ్వు కదులుతాయి. నీడలో ఉండే కాండం పెరిగే కొద్దీ, ఆ పెరుగుదల మొక్కను నీడనుంచి సూర్యరశ్మి పడే దిశలోకి కదిలిస్తుంది. ఫలితంగా పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తూ ఆనందపడుతుంది.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
==========================

జంతువులకు శుభ్రత అవసరం లేదా?,మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటున్నజంతువులకు జబ్బులేమీ రావా?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: మనం భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు కదా! కానీ జంతువులు మాత్రం నేల మీద మురికిలోను, మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటుంటాయి. మరి వాటికేం కాదా?

జవాబు: ఈ భూమి ఏర్పడ్డ కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమి మీద జీవ లక్షణాలున్న కణాలు ఏర్పడ్డాయి. అవే వైరస్‌లు, బ్యాక్టీరియాలుగా రూపొందాయి. జీవ కణం ఆధారం లేకుంటే వైరస్‌లు ఏమీ వృద్ధి చెందలేవు కాబట్టి అవి బ్యాక్టీరియా కణాల్ని కూడా కబళిస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో వైరస్‌లు లేని ప్రాణి లేదు. వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పాటు మన పరిసరాలలో మనకు వ్యాధుల్ని కలిగించే ఏకకణ జీవులు, బహుకణ జీవులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధాన సమస్య బ్యాక్టీరియాలే.

భూమ్మీద ప్రతీ గ్రాము మట్టిలో సగటున నాలుగు కోట్ల బ్యాక్టీరియాలు, శుభ్రమైన తాగే నీటిలో ప్రతి పది మిల్లీ లీటర్లకు కోటి చొప్పున బ్యాక్టీరియాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతు, వృక్షజాతుల జనాభాకన్నా బ్యాక్టీరియాలే అధికం. ప్రతీ మనిషిలోనూ సుమారు 10లక్షల కోట్ల మానవజీవ కణాలు ఉండగా, ప్రతి వ్యక్తి శరీరంమీద ఉండే బ్యాక్టీరియాల సంఖ్య వాటికి పదిరెట్లు ఎక్కువ. ఇందులో కొన్ని మనకు సహకరించేవి. మరికొన్ని హాని కలిగించేవి. హాని కలిగించేవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మనం బతికున్నంత కాలం శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ వీటిమీద సైన్యంలా దాడిచేస్తూ మనల్ని కాపాడుతుంది. బ్యాక్టీరియాల సంఖ్య ఈ మోతాదుకు మించితే అనారోగ్యం కలుగుతుంది.

మనం చేతులు కడుక్కోవడం అంటే బయటి బ్యాక్టీరియాను తొలగించుకోవడమే. జంతువుల్లో కూడా వాటివాటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అవి మురికిలోనూ మలిన ప్రాంతాల్లోనూ బతికే పరిస్థితి సహజంగా ఉండడం వలన పరిణామ క్రమంలో వాటికున్న రక్షణ వ్యవస్థ మనకన్నా సమర్థంగా ఉంటుంది. పైగా వాటి శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు కూడా జంతువులకు అదనపు రక్షణ వ్యవస్థను సమకూరుస్తాయి. అయితే మురికి, మలినాలు ఎక్కువైతే జంతువులు కూడా రోగాల బారిన పడక తప్పదు.

 • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
 • =================================

Sunday, October 05, 2014

మంట ఎలా మండుతుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


 ప్రశ్న: మంట ఎలా మండుతుంది?

జవాబు: మంట లేక అగ్నిజ్వాల అంటే పదార్థాల కలయిక వల్ల జరిగే రసాయనిక, భౌతిక మార్పులు. ఈ ప్రక్రియలో పదార్థాలు ఉష్ణ, కాంతి శక్తులతోపాటు పొగ, బూడిదలు కూడా విడుదలవుతాయి. విద్యుత్‌ తీగలపై ఉండే ప్లాస్టిక్‌ తొడుగులో ఉత్పన్నమయ్యే మంటలోనైనా, నూనె లాంటి పదార్థాల్లో ఏర్పడే మంటలోనైనా, మామూలుగా ఇంట్లోని పొయ్యిలో కట్టెలు, బొగ్గులతో ఏర్పడే మంటలోనయినా వాటికి కావలసిన ముఖ్యమైన అంశాలు మండే స్వభావం గల పదార్థం, ఆక్సిజన్‌, ఉష్ణాన్ని ఉత్పన్నం చేసే మీట. వీటిలో ఏ అంశం లేక పోయినా మంట ఏర్పడదు. ఈ సూత్రం పైనే మంటలు మండకుండా ఆర్పుతారు. మంటలార్పాలంటే వాటికి అందే ఆక్సిజన్‌ను తీసివేయాలి. మండే స్వభావం గల పదార్థాన్ని తొలగించాలి.

మండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకు కొయ్య, ప్లాస్టిక్‌(ఘన), నూనె(ద్రవ), హైడ్రొజన్లు(వాయు), ఉష్ణోగ్రతల విలువలు అత్యధికంగా ఉంటే, ఇనుములాంటి లోహాలు కూడా మండుతాయి. మంటకు కావలసిన ఆక్సిజన్‌ వాతావరణంలోని గాలి అందిస్తుంది. మంటను రాజేయడానికి కావలసిన శక్తి పదార్థాల మధ్య ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యే నిప్పు కణాల నుంచి, మెరుపుల నుంచి అందించవచ్చు.

 • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ===========================

Thursday, October 02, 2014

భూమధ్య రేఖ వద్ద ఇతర భూ ప్రాంతాలలో ఉన్నట్లు రుతువులు ఉంటాయా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: భూమధ్య రేఖ వద్ద ఇతర భూ ప్రాంతాలలో ఉన్నట్లు రుతువులు ఉంటాయా?

జవాబు: భూమధ్య రేఖ అంటే భూమి ఉపరితలంపై దాని మధ్య భాగం చుట్టూ 40,075 కిలోమీటర్ల పొడవున ఉండే ఒక వూహారేఖ. ఈ ప్రాంతంలో రుతువుల మధ్య తేడాలు చాలా స్వల్పంగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగి ఉన్నా దాని ప్రభావం భూమధ్య రేఖ ప్రాంతంలో అంతగా ఉండదు. భూమిపై ఇతర ప్రాంతాల్లో రుతువులు ఏర్పడడానికి కారణం భూ కక్ష్య కొంచెంగా వంగి ఉండడమే. భూమధ్య రేఖ దరిదాపుల్లో, ఆరేఖ నుంచి దూరంగా పోయేకొలదీ ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో మాత్రమే కొంచెం తేడా ఉంటుంది.

సూర్యుని నుంచి వెలువడే వికిరణశక్తి (radiation)భూమధ్య రేఖ ఉండే ప్రాంతంలో ఎక్కువ పరిమాణంలో చేరడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు, సంవత్సరమంతా ఎక్కువగా ఉంటాయి. వేడిగా ఉండే ప్రదేశాల్లో వాతావరణ పీడనం (ఒత్తిడి) తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ పీడనం ఉండే భూమధ్యరేఖ ప్రదేశాల్లో మధ్నాహ్న వేళల్లో ఉరుములతో కూడిన తుపానులు సంభవిస్తూ ఉంటాయి. భూమి ఉత్తరార్థ భాగంలో భూద్రవ్యరాశి ఎక్కువగా కేంద్రీకృతమై ఉండడంతో ఆ భాగంలో దక్షిణార్థ భాగంలో కన్నా ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా భూమద్యరేఖ ప్రాంతంలో రుతువులు అంటూ ఏమీ ఉండవు.

 • - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

 • ===========================

భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది?

జవాబు: వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే మనం చెప్పుకోవాలి. భూమ్యాకర్షణ బలం భూమి నుంచి అనంత దూరం వరకు విస్తరించి ఉంటుంది. శాస్త్రీయంగా అది అనంత దూరం దగ్గర శూన్యం అవుతుంది. భూమ్యాకర్షణ ప్రభావాన్ని మరో ఇతర వస్తువు మీద బలం రూపేణా చూడాలి. ఆ బలాన్ని గెలీలియన్‌ గురుత్వ బలంగా పరిగణిస్తారు. ఈ బలపు విలువ భూమికి ఆయా వస్తువుకు ఉన్న దూరపు వర్గానికి విలోమాను పాతం గానూ, ఆయా వస్తువుకున్న ద్రవ్యరాశికి అనులోమాను పాతంగానూ ఉంటుంది. సుమారు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తన చుట్టూ తిప్పుకోగలిగినంత బలాన్ని ఇదే భూమి ఉపయోగిస్తుండగా, కొన్ని వేల కిలోమీటర్లు దాటిన వెంటనే వ్యోమశకటంలో ఉన్న వ్యోమగాములు గురుత్వ బలం సరిగా లేక శకటంలో దూదిపింజల్లా వేలాడుతుండటం చూస్తుంటాం. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడి విషయంలో దూరం కన్నా చంద్రుడి ద్రవ్యరాశి ప్రభావం అధికం కావడము, వ్యోమగాముల విషయంలో వారి దూరం కన్నా వారికున్న ద్రవ్యరాశి ప్రభావం తక్కువగా ఉండడం. భూమి లాంటి గ్రహం అయినా, సూర్యుడి లాంటి నక్షత్రం అయినా, చంద్రుడి లాంటి ఉపగ్రహం అయినా లేదా మరేదైనా చిన్నా చితకా ఖగోళ వస్తువు అయినా అది ఇతర వస్తువు మీద కలిగించే బలాన్ని ఆయా ఖగోళ వస్తువుకున్న గురుత్వ త్వరణం ద్వారా ఆరా తీయగలం. ఈ విలువ ఆయా ఖగోళ వస్తువు నుంచి దూరపు వర్గానికి విలోమంగా ఉంటుంది. దూరం రెట్టింపయితే బలం నాలుగురెట్లు తగ్గుతుంది. అందుకే బలాల్ని ఆయా ఖగోళ వస్తువుల ఉపరితలం మీద ఎంత ఉందన్నదే ప్రామాణికంగా చూపుతారు.

 • -ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

 •  ===============================