Thursday, October 30, 2014

Why do we sneez?,తుమ్ములు ఎందుకు వస్తాయి?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

  •  
ప్రశ్న: తుమ్ములు ఎందుకు వస్తాయి?

జవాబు: మనం నిరంతరం శ్వాసిస్తుంటాం. గాలిలోని ఆక్సిజన్‌ను లోనికి తీసుకుని దానితో మన ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేయగా విడుదలయ్యే శక్తితోనే మనం అనుక్షణం జీవిస్తున్నాం. ఇంతటి సునిశితమైన శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు ప్రధాన పాత్రధారులు.

ఊపిరితిత్తుల్లోకి సాధారణ గాలికి బదులు అవాంఛనీయమైన దుమ్ము, ధూళి, కారపు బిందువులు, నీటి తుంపరుల వంటివి వెళితే అవి ఊపిరితిత్తుల గోడల మీద తిష్టవేసి శ్వాసక్రియకు ఎంతో కొంత భంగం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అవాంఛనీయ పదార్థాలు ఊపిరితిత్తుల్ని చేరకుండా చేసే విధంగా మన శ్వాసనాళ నిర్మాణం అమరి ఉంటుంది. పొరపాటున ఏవైనా పదార్థాలు శ్వాస కోశంలోకి వెళ్లినా వాటిని బయటకి పంపేసే వ్యవస్థ ఉంటుంది. ముక్కు ద్వారా గాలివెళ్లే సమయంలో ముక్కు లోపల ఉండే రోమాలు చాలా మట్టుకు అవాంఛనీయమైన దుమ్ముకణాల్ని ఫిల్టర్‌ చేస్తాయి. ఇది దాటి కూడా లోపలికి వెళ్లే పదార్థాలను బయట పడేసేందుకు ఊపిరితిత్తులు బలమైన నిశ్వాసంతో ప్రయత్నిస్తాయి.అదే తుమ్ము.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, -జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =========================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...