ప్రశ్న: ఆకాశంలో కొన్ని విమానాల వెనుక దట్టమైన పొగ చార కనిపిస్తుంది. ఎందుకని?
జవాబు: విమానం వెనుక ఆకాశంలో పొగ చార కనిపిస్తే అది జెట్ విమానమే. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంతో బయటకు వచ్చే పొగనే జెట్ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువ వేగంతో పయనిస్తుంది. ఆ విమానానికి అంత వేగం రావడానికి కారణం దాని వెనుక నుంచి దూసుకువచ్చే జెట్.
ఇదెలా జరుగుతుందంటే న్యూటన్ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి 'చర్య'కూ, దానికి సమానమైన ప్రతిచర్య వ్యతిరేకదిశలో ఉంటుంది. ఒక రబ్బరు బెలూన్‌ను బాగా వూది ఒక్కసారిగా వదిలేస్తే అందులోని గాలి వేగంగా బయటకు దూసుకు రావడం దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్ విమానాలు, రాకెట్లు పనిచేస్తాయి.
జెట్ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అరలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంటుంది. అలా చేరిన గాలిపై ఆ అరలో అత్యధిక పీడనాన్ని కలిగిస్తారు. దాంతో ఆ గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిగాలి ఉన్న అరలో పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. అలా మండిన ఇంధనం వాయుధార రూపంలో విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో, వూదిన బెలూన్ నుంచి గాలి వచ్చినట్టుగా, బయటకు దూసుకొని వస్తుంది. వాయువు వేగం వల్ల ఏర్పడే ప్రతిచర్య వల్ల, జెట్ విమానం ముందుకు పయనిస్తుంది. జెట్ విమానం ప్రయాణించే ఎత్తులో ఉండే వాతావరణంలోని గాలి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల విమానం నుంచి వచ్చే జెట్ చిందర వందరగా చెదిరిపోదు అందుకనే విమానం వెళ్లిన తర్వాత కూడా ఆ వాయుధార కనబడుతుంది. ఆ పొగ వల్ల కాలుష్యం ఏర్పడదు.
- - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్
- ============================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...