ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మనుషులు నిద్రలో దొర్లుతారెందుకు ?
జ : ఎంత మొద్దు నిద్రలో అయినా ఒకే భంగిమలో రాత్రంతా నిద్రపోగలిగిన వారు ఉండరు. ప్రతి ఒక్కరు రాత్రి నిద్రలో నిష్టముగా 20 సార్లు గరిష్టము గా 40 సార్లు అటు - ఇటు కదులుతారు. . ఆ కదలిక అరనిమిషము మించకపోవచ్చు . పడక గది వాతావరణము , నిద్ర ముందు తిన్న ఆహారము , అలసట అనే అంశాలమీద ఆధారపడి ఎన్నిసార్లు దొర్లుతామనేది మారుతుంది. ఒక భంగిమలో పడుకుంటే ఆ వైపు రక్త ప్రసరణలో వచ్చే మార్పుఇబ్బంది నుండి బయట పడేందుకు భంగిమ మార్చమని మెదడ సంకేతమిస్తుంది ... అప్పుడే మనం దొర్లుతాము.
- ===========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...