ప్రశ్న: పప్పుల్ని నీళ్లలో నానబెడితే ఒక రకమైన వాసన వస్తాయి. ఎందుకు?
జవాబు: పప్పు దినుసుల్ని, తదితర పోషక విలువలున్న ఇతర ధాన్యపు గింజల్ని నీళ్లలో నానబెట్టిన చాలా సేపటికి గమనిస్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. కారణం ఆయా ఆహార విలువలున్న ధాన్యపు గింజలు, పప్పు గింజలు కుళ్లిపోవడమే.
భూమ్మీద ఉన్న జీవుల మనుగడకు శక్తి కావాలి. ఆ శక్తి వాటికి, మనకు ఆహార పదార్థాల్లోని పిండి పదార్థాల నుంచి, కొవ్వు పదార్థాల నుంచి వస్తుంది. మాంసకృత్తుల్ని ఆయా జీవులు తమ శరీర నిర్మాణానికి, జీవన కార్య కలాపాలకు అవసరమైన ఎంజైముల్ని, ప్రోటీన్లను తయారుచేసు కునేందుకు వాడుకుంటాయి.
ఇలాంటి ఎన్నో దైనందిన జీవన కార్య కలాపాలకు నీరు ఓ వేదిక లేదా మాపకం లాగా పనిచేస్తుంది. అందుకే మనలాంటి ఎన్నో జీవుల్లో 70శాతం వరకు నీరే ఉంటుంది. కుళ్లిపోవడం లేదా పులియటం అనే విధానానికి కారణం వాతావరణం, నీరు వంటి పలు ప్రదేశాల్లో ఎపుడూ అవకాశం కోసం చూస్తున్న బ్యాక్టీరియాలే. ఇందులో ఈస్ట్ అనే బ్యాక్టీరియా ప్రధానమైంది. ఈ కార్యకలాపాలకు కూడా నీరు అవసరం. మామూలు ఎండు ధాన్యాలు, పప్పు దినుసుల్లో నీటి శాతం బాగా తక్కువగా ఉండడం వల్ల బాక్టీరియాలు నీటిని ఆశించినా వాటిపై ప్రభావం ఉండదు. మరో మాటలో చెప్పాలంటే నీటి శాతం అల్పంగా ఉన్న పప్పు గింజల దగ్గర బ్యాక్టీరియాల పప్పులుడకవు. కానీ నానేసిన పప్పు ధాన్యాల్లో చెమ్మదనం నీటి అవకాశం బాగా ఉండడం వల్ల బ్యాక్టీరియా దాడి అధికం అవుతుంది. అవి పోషక విలువల్ని స్వాహా చేసే ప్రక్రియల్లో విడుదల చేసే గంధక తత్వం, భాస్వర లక్షణం ఉన్న పదార్థాల నుంచే ఈ దుర్గంధం వస్తుంది.
- -ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =======================================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...