Friday, June 22, 2012

రాకెట్‌ భాగాల వల్ల అపాయం లేదా?,No danger with Satalite rocket parts-Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: అంతరిక్షంలోకి రాకెట్లను పంపేప్పుడు ఇంజను భాగాలు ఒకటొకటిగా విడిపోయి సముద్రంలోకి పడిపోతాయి కదా? మరి సముద్ర జీవులకు అపాయం కలుగదా?

జవాబు: పైకి వెళ్లేప్పుడు రాకెట్టులో ఇంధనాన్ని వివిధ దశల్లో దహనం చేసే ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ఘన ఇంధనాన్ని(solid fuel) వాడే సందర్భంలో ఈ తరహా నిర్మాణాలుంటాయి. ఇవి సాధారణంగా కిందికి పడుతున్నప్పుడు వాతావరణంలోని గాలి రాపిడి వల్ల మండిపోయి బూడిదయిపోతాయి. ఇంకా కొద్దో గొప్పో మిగిలివున్న భాగాలు అతి వేగంగా సముద్రపు నీటిలో పడతాయన్నమాట నిజమే. కానీ సముద్రానికి ఉన్న అమితమైన లోతు వల్ల, లవణీయత వల్ల ఇంజను భాగాలు పడినప్పుడు కలిగే తాడన తీవ్రత(impact) త్వరితంగానే సమసిపోతుంది. అదే ప్రాంతంలో ఆ సమయానికే జలచరాలు ఉండే అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి పెద్దగా అపాయం ఉండనట్టే.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది?,How do rainbow form?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయా?

జవాబు: వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవళకాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్లేప్పుడు గాలిని, నీటిపొరను వేరుచేసే అంతరోపరితలం(interface) వద్ద వక్రీభవనం (refraction)చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగదైర్ఘ్యాల (wavelengths)కు వేర్వేరుగా ఉండడం వల్ల ధవళకాంతిలోని వివిధ కాంతి తరంగాలు ఏడు రంగులుగా విడిపోతాయి. ఇలా విసిన కర్రలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు, ఆ బిందువు అవతలివైపున ఉండే అంతరోపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం (Total Internal Reflection) చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనుస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది కానీ, ఆకాశంలో కాదు. అందుకే హరివిల్లనేది మిధ్యాబింబం(virtual image). దాని వల్ల లాభనష్టాల సమస్య లేదు. కాబట్టి ప్రకృతి కల్పించే ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా చూడ్డమే.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

అరచేయి వెలుగులో ఎర్రనేల?,palms are red in color on focus of light of torch-Why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మన అరచేతిపై, చేతివేళ్లపై టార్చిలైటు వేసినప్పుడు చేతి వేళ్లు ఎర్రగా కనిపిస్తాయెందుకు?

జవాబు: ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల మనుషుల చర్మం వివిధ వర్ణాల్లో ఉంటుంది. కొందరు కారు నలుపైతే, కొందరు చామనఛాయలోను, గోధుమరంగు, తెలుపు రంగుల్లో ఉంటారు. ఇందుకు కారణం వారి చర్మపు పొరల్లో కాంతి నుంచి, ఉష్ణం నుంచి శరీరాన్ని కాపాడే మెలనిన్‌ అనే వర్ణద్రవ్య(pigment)రేణువులు వివిధ మోతాదుల్లో ఉండడమే. అయితే చర్మం రంగు ఏదైనా అందరి అరచేతులు, అరికాళ్లు మాత్రం దాదాపు తెల్లగానే ఉంటాయి. దీనికి కారణం వాటి చర్మంలో మెలనిన్‌ రేణువులు లేకపోవడమే. అందువల్ల ఆ చర్మాలు దాదాపు పారదర్శకం (transparent)గా ఉంటాయి. ఇలా పారదర్శకంగా ఉండే అరచేతి చర్మం మీదకు టార్చిలైటు వేసినప్పుడు బలమైన కాంతి అరచేతి చర్మంగుండా ప్రసరించి చర్మం కిందున్న దట్టమైన రక్తకేశనాళికల దగ్గర పరావర్తనం చెందుతుంది. రక్తకేశనాళికలు దట్టంగా దారపు పోగుల్లాగా, ఎర్రగా ఉండడం వల్ల అక్కడ పరావర్తనం చెందిన కాంతి అరచేతి చర్మపు పైపొరకున్న గరుకుదనం (unevenness) వల్ల వివిధ దిశల్లోకి వెదజల్లబడుతుంది (scattered). అరచేతి చర్మం కిందున్న రక్తకేశనాళికలు చాలా మటుకు ఎరుపు రంగు కాంతినే ప్రతిబింబిస్తాయి కాబట్టి టార్చిలైటు వేసినప్పుడు అరచెయ్యి ఎర్రగా కనిపిస్తుంది.


- ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@Eenadu hai bujji.
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సూర్యుడు ప్రకాశవంతంగా ఎలా మెరుస్తున్నాడు?,How do Sun has that brightness?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: సూర్యుడు ప్రకాశవంతంగా ఎలా మెరుస్తున్నాడు? అందులో హైడ్రోజన్‌ నిల్వలు ఉన్నాయంటారు. అవెక్కడివి?

జవాబు: విశ్వంలోని రోదసి (space) అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించి ఉంటాయి. వీటిని 'నెబ్యులా' లంటారు. ఈ మేఘాల్లో 99 శాతం హైడ్రోజన్‌, కొద్దిపాటి ఇతర వాయువులు, సూక్ష్మహిమకణాలు, కాస్మిక్‌ ధూళి ఉంటాయి. వీటి ఉష్ణోగ్రత మైనస్‌ 263 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉంటుంది. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుంచించుకుపోతుంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రత అత్యధికంగా పెరుగుతుంది. ఈ చర్య కొనసాగడం వల్ల ఈ మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పది మిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. ఆ స్థితిలోనే హైడ్రోజన్‌ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల ఉత్పన్నమైన అత్యధిక శక్తి కాంతి రూపంలో ఉంటుంది. అదే నక్షత్రం. విశ్వంలోని కోట్లాది నక్షత్రాలలో తక్కువ కాంతి గల చిన్న నక్షత్రమే సూర్యుడు. అయితే అన్ని నక్షత్రాల కన్నా భూమికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనబడతాడు.

ఇక సూర్యకాంతి విషయానికి వస్తే, సూర్యుని అంతర్భాగం 1,50,00,000 డిగ్రీల సెల్సియస్‌. అత్యధికమైన ఈ ఉష్ణోగ్రత వల్ల అక్కడి హైడ్రోజన్‌ వాయువు కేంద్రక సంలీనం (nuclear fusion) అనే చర్య వల్ల హీలియంగా మారుతుంది. కొంత హైడ్రోజన్‌, పూర్తిగా శక్తి (energy)గా రూపాంతరం చెందుతుంది. అలా ప్రతి సెకనుకూ 40 కోట్ల టన్నుల హైడ్రోజన్‌ శక్తిగా రూపాంతరం చెంది, నెమ్మదిగా సూర్యుని ఉపరితలం చేరుతుంది. ఆ విధంగా మండుతున్న వాయువు, శక్తి మూలంగా వెలువడిన ప్రకాశవంతమైన కాంతి రోదసిలో కోట్లాది కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది. ఇక ఉపరితలంలో ఉన్న ఎక్కువ సాంద్రత గల హైడ్రోజన్‌ మళ్లీ సూర్యుని అంతర్భాగంలోకి వెళుతుంది. దాంతో ఈ ప్రక్రియంతా నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌ @Enadu hai bujji
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, June 21, 2012

గిన్నెలో నీళ్లు కాస్తే గార కడుతుందేం?,Water Boiling vessel forms scales in bottom-Why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: అల్యూమినియం గిన్నెలో వేడి నీళ్లు కాస్తుంటే కొన్నాళ్లకు గిన్నె అడుగు భాగంలో తెల్లగా గారలాగే ఏర్పడేది ఏమిటి? అది పోవాలంటే ఏం చేయాలి?

జవాబు: అల్యూమినియం గిన్నెల్లోనే కాకుండా స్టీలు గిన్నెల్లో నీళ్లను కాచినా ఇలాగే జరుగుతుంది. నీళ్లలో కాల్షియం, లవణాలు అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి గార ఏర్పడుతుంది. సాధారణంగా చల్లని నీళ్లలో కన్నా వేడి నీళ్లలోనే లవణాల ద్రావణీయత (solubility) ఎక్కువ. కానీ చల్లని నీటిలో కూడా కాల్షియం సల్ఫేటు, కాల్షియం కార్బొనేటులాంటి లవణాలు ఉంటాయి. అయితే తక్కువ ద్రావణీయత వల్ల అరకొరగా కరిగి ఉండే ఇవి నీళ్లను వేడి చేసినప్పుడు బయటపడి పాత్రల అడుగున పేరుకుపోతాయి. వీటినే స్కేళ్లు (scales)అంటారు. కఠినత్వం (hardness)లేని మంచి నీటినే పాత్రలలో వాడడం వల్ల గార ఏర్పడడాన్ని నివారించవచ్చు. గార కట్టిన పాత్రల్లో నిమ్మరసం పిండినా, Hclఆమ్లాన్ని పోసినా అది తొలగిపోతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక@Eenadu hai bujji.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

డైనోసార్ల ఉన్న సంగతి నిజమేనా?,Do Dynosars exiting?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: డైనోసార్లు నిజంగా ఉన్నాయా? అవి లేకపోతే మళ్లీ మన మధ్య ఉన్నట్టు సినిమాల్లో చూపిస్తున్నారెందుకు?

జవాబు: దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం వరకు డైనోసార్లు ఈ భూమ్మీద ఉండేవన్నది పచ్చినిజం. వివిధ ప్రజాతులకు చెందిన డైనోసార్ల శిలాజ (fossil)అవశేషాలు వాటి ఉనికికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ దశలో భూమ్మీద అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలు కూడా కలిసే ఉండేవి. కానీ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాటి దేహ నిర్మాణంలోని అసౌకర్యం వల్ల, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఇవి క్రమేపీ అంతరించాయి. ఓ సిద్ధాంతం ప్రకారం ఓ పెద్ద గ్రహశకలం భూమిపై పడిన ఆతాకిడి కలిగించిన తీవ్రమైన పరిస్థితుల వల్ల ఒక్కమారుగా డైనోసార్లు అంతరించాయని, కేవలం చిన్న జీవులే బతికాయని చెబుతారు. అయితే డైనోసార్లు ఇప్పుడు లేవు. జురాసిక్‌ పార్క్‌ లాంటి సినిమాల్లోను, కొన్ని ఛానెల్స్‌లోను చూపించే డైనోసార్లు కేవలం కల్పితం. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా యానిమేషన్‌ చేసి అవి మన మధ్యే తిరుగుతున్నట్టు చూపిస్తారంతే.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@Eenadu hai bujji .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఆ రోజుల్లో ఆటుపోట్లేల?,Sea waves more on Newmoon and Fulmoon-Why?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


పశ్న: అమావాస్య, పున్నమి రోజులకి, సముద్రంలో ఆటుపోటులకు సంబంధం ఏమిటి?

జవాబు: సముద్రంలోని ఆటుపోటులకు కారణం చంద్రుడే. సృష్టిలోని వస్తువులన్నీ ఒకదాని కొకటి ఆకర్షించుకుంటూనే ఉంటాయి. సూర్యుడి ఆకర్షణ శక్తి వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే, భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమితో పోల్చుకుంటే చంద్రుని పరిమాణం చిన్నదైనా దాని ఆకర్షణ శక్తి భూమి మీద ప్రభావం చూపుతుంది. అలా చంద్రుడు కలిగించే గురుత్వాకర్షణ శక్తికి ఉదాహరణే సముద్రంలో ఏర్పడే ఆటుపోటులు.

సముద్రతీరంలో ఉన్న వాళ్లకు ఒక రోజులో రెండు సార్లు ఆటు (Low Tide), రెండు సార్లు పోటు (High Tide) వస్తుందని తెలుస్తుంది. సముద్రపు నీరు నెమ్మదిగా ఆరు గంటల సేపు పైకి దూసుకు రావడమే 'పోటు'. తర్వాత ఆరుగంటల పాటు ఆ నీరంతా వెనక్కి తగ్గడమే 'ఆటు'. భూమిపై సూర్యచంద్రుల ఆకర్షణలు రెండూ పని చేస్తున్నప్పటికీ, భూమికి దగ్గరగా ఉన్న చంద్రుని ప్రభావమే ఎక్కువ. పౌర్ణమికి, అమావాస్యకు ఈ పరిమాణం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయాల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు ఓకే సరళరేఖలోకి వస్తారు. అందువల్ల సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలాలు రెండూ కలిసి భూమిపై పని చేస్తాయి. అప్పుడు మామూలు రోజుల కన్నా పోటు ఉధృతంగా ఉంటుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌@Eenadu hai bujji.

  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

సిమెంటును ఎలా తయారు చేస్తారు?,How cement is makeup?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: సిమెంటును ఎలా తయారు చేస్తారు? నీటితో కలిస్తే అది ఎలా గట్టి పడుతుంది?

జవాబు: సిమెంటు ఒక సంయోగ పదార్థం (compound) కాదు. ఎన్నో ఘన లవణాల సమ్మేళనం. ఇందులో ఉన్న పదార్థాల్ని సంయుక్త సమ్మేళన పదార్థాలు (composits) అంటారు. ఇవి నీటిలో కరగవు. నీటినే తమలో ఇముడ్చుకుంటాయి. సున్నపు రాయి (lime), అల్యూమినియం ఆక్సైడు, ఫెర్రిక్‌ ఆక్సైడు, ఇసుక (sand) వంటి పదార్థాల్ని బాగా చూర్ణం చేసి గుండ్రంగా తిరిగే గొట్టంలాంటి బట్టీలోకి పంపుతారు. ఇందులో ఈ పొడిని వివిధ స్థాయిల్లో అత్యధిక ఉష్ణోగ్రతకు లోను చేస్తారు. క్రమేపీ పెరిగే ఉష్ణోగ్రతల వద్ద ఈ ఘన చూర్ణాల్లో వివిధ రకాలైన నిరింద్రియ రసాయనిక ప్రక్రియలు (inorganic reactions) జరుగుతాయి. మిశ్రమ ఆక్సైడులు ఏర్పడుతాయి. చివరకి ఇవన్నీ ద్రవస్థితిలోకి వేళ్లేంతగా వేడి చేస్తారు. ఆ స్థితిలో ఏర్పడే రసాయనిక మార్పులు, వాటికి నీటిని ఆహ్వానించే లక్షణాలను చేరుస్తాయి. ఆ ద్రవ మిశ్రమాన్ని చల్లబర్చి బాగా చూర్ణం చేస్తారు. ఈ పొడి ఎంత సూక్ష్మంగా ఉంటే అంత నాణ్యతగల సిమెంటుగా భావిస్తారు. ఈ మిశ్రమానికి నీటిని కలిపినప్పుడు ప్రతి సిమెంటు రేణువుకు మధ్య నీటి అణువులు మొదట సంధాన కర్తలుగా ఏర్పడి అన్నింటినీ దగ్గర చేరుస్తాయి. ఈ దశనే సెట్టింగ్‌ అంటారు. ఘన, ద్రవ పదార్థాలతో ఏర్పడిన ఈ స్థితిని జెల్‌ అని కూడా అంటారు. క్రమేపీ నీటి అణువులతో సంధానమైన పదార్థాలు దృఢమైన బంధాలతో రాయిలాగా గట్టి పడతాయి. దీన్నే హార్డెనింగ్‌ అంటారు. ఇలా సిమెంటు నీటితో కలిసినప్పుడు గట్టిపడిపోతుంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక @Enadu hai bujji
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-