Sunday, October 28, 2012

వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: లారీ, బస్సుల్లాంటి వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి. కానీ వాటి ముందువైపు మాత్రం కేవలం ఒక టైరు మాత్రమే ఉంటుంది. ఎందుకని?

జవాబు: బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు సాధారణంగా డీజిలు ఇంజనుతో నడుస్తాయి. పెట్రోలు ఇంజను కన్నా డీజిలు ఇంజను సామర్థ్యాన్ని భారీ వాహనాల తరలింపులో బెల్టులు, పుల్లీల ద్వారా సాధిస్తారు. భారీ వాహనాల సైజు బాగా ఎక్కువగా ఉండడం వల్ల పృచ్ఛ చోదక పద్ధతి (back wheel pushing)లో వాహనాన్ని నడుపుతారు. సాధారణ కార్లు, చిన్నపాటి వ్యాను తదితర మధ్య, కౌటుంబక(domestic)వాహనాలను ముఖచోదక పద్ధతి (front wheel pulling)లో నడుపుతారు. దీనర్థం ఏమిటంటే భారీ వాహనాలలో ఇంజనుకున్న చోదక శక్తిని వెనుక ఉన్న చక్రాల మీదకు ప్రసరింప చేస్తారు. అంటే వాహనాన్ని నెట్టే పద్ధతి ఇది. కానీ కార్లలాంటి చిన్న వాహనాలలో ఇంజను బలాన్ని ముందు చక్రాలకు సంధానిస్తారు. అంటే వాహనాన్ని లాగడం ద్వారా నడిపే పద్ధతి ఇది. వాహనం పెద్దదైనా, చిన్నదైనా యంత్రపు బలాన్ని గైకొనే చక్రాలు రోడ్డు మీద ఒత్తిడి, ఘర్షణల ద్వారా రోడ్డును వెనక్కు నెట్టేటట్టు పని చేసే బలానికి ప్రతి బలాన్ని న్యూటన్‌ మూడో సూత్రం ఆధారంగా పొందడం వల్ల స్వయం చోదకతను సాధిస్తాయి. అంటే రోడ్డు మీద ఎంత ఎక్కువ ఒత్తిడి కలిగిస్తే అంత మంచిది. రెండు చక్రాలు ఉండడం వల్ల అదనపు పట్టు(grip) వస్తుంది. ముందే రెండు చక్రాలుంటే మలుపులు తిరగడం కష్టమవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
=========================================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Polished shoes shining Why?-పాలిష్‌ చేస్తే బూట్లు మెరుపేల?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: పాలిష్‌ చేయగానే బూట్లు తళతళా మెరుస్తాయి. అంతకు ముందు అవి మెరుపులేకుండా ఉంటాయి. ఎందుకని?

జవాబు: బూట్లను తయారు చేయడానికి వాడే చర్మపు ఉపరితలం సమంగా ఉండదు. ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుడులుగా ఉండే ఆ ఉపరితలంపై పడిన కాంతి కిరణాలు వేర్వేరు దిశల్లో చెల్లాచెదరైపోతాయి. అందువల్ల బట్ల ఉపరితలం మాసినట్టుగా కనిపిస్తుంది. అదే బూటుకు పాలిష్‌ పూసి, బ్రష్‌ చేసినప్పుడు బూటు ఉపరితలంలోని ఎగుడుడిగుడులలో పాలిష్‌ పరుచుకుంటుంది. అలా చదునుగా మారిన ఉపరితలం, కాంతికిరణాలకు ఒక నునుపైన అద్దంలాగా పనిచేస్తుంది. ఆ కిరణాలు ఒక క్రమపద్ధతిలో పరావర్తనం (reflection)చెంది మన కంటికి చేరడంతో బూటు ఉపరితలం తళతళ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why donot we remember Childhood memories?- చిన్నప్పటి విషయాలు గుర్తుండవేం?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనకు బాల్యంలో జరిగిన విషయాల గురించి అంతగా జ్ఞాపకం ఉండదు. ఎందుకని?

జవాబు: బాల్యంలోని విషయాలు ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వయసు వచ్చే వరకు జరిగిన అనుభవాల గురించి జ్ఞాపకం ఉండకపోవడానికి కారణాలు రెండు.
ఒకటి, పిల్లలు పుట్టినప్పుడు వారి మెదడులోని కార్టెక్స్‌ అనే భాగం అంతగా ఏర్పడకపోవడం. ఇది మెదడుకు చేరిన సంకేతాలను ఒక క్రమపద్ధతిలో అమరుస్తుంది. ఈ పెరుగుదల ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కానీ పూర్తవదు. ఆ తర్వాతి అనుభవాలను మెదడులోని హిప్పోకాంపస్‌ అనే భాగం గ్రహించడం, ఆపై కార్టెక్స్‌ను చేరడం జరుగుతాయి. ఈ భాగాలు చిన్న పిల్లల్లో పూర్తిగా వికసించకపోవడం వల్ల వారి మెదడులో అప్పటి అనుభవాలు నమోదు కావు.

ఇక రెండో కారణం, మనకు ఏదైనా విషయం జ్ఞాపకం ఉండాలంటే దానికొక అర్థం, సందర్భం ఉండాలి. చిన్నపిల్లల్లో ఆ వయసులో తాము జీవిస్తున్న విషయాన్ని గురించిన పరిజ్ఞానం, అవగాహన అంటూ ఏమీ ఉండవు. దాంతో అపుడు జరిగిన విషయాల గురించి అంతగా ఆలోచించకపోవడంతో ఆ జ్ఞాపకాలను వారి మెదడు నిల్వ చేసుకోలేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do Earth moves if we move up or down?-ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ప్రపంచంలోని అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?

జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరగడానికి కారణం సూర్యుడు భూమిని ఆకర్షించడం, భూమికి గల ద్రవ్యవేగం (momentum). ఒక వస్తువు ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి(mass), వేగం (velocity) పై ఆధారపడి ఉంటుంది. భూమి ద్రవ్యరాశి ఎంత అధికంగా ఉంటుందంటే దానిపై ఉండే వస్తువుల ద్రవ్యరాశిలోని మార్పులు, చేర్పులు దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. అంటే దాని ద్రవ్యరాశిలో కానీ, వేగంలో కానీ ఎలాంటి మార్పులు ఏర్పడవు. అంతేకాకుండా న్యూటన్‌ మొదటి గమన సూత్రం ప్రకారం ఒక వస్తువు గమనంలో మార్పు తీసుకురావాలంటే ఆ వస్తువుపై బలాన్ని (force) ప్రయోగించాలి. ఇది బాహ్య బలమై ఉండాలి. అంటే వస్తువు వెలుపల నుండి కలగాలి. గమనంలో ఉన్న బస్సులోని ప్రయాణికులు వారి ముందుండే సీట్లను బలంగా నెట్టడం ద్వారా బస్సు వేగాన్ని పెంచలేరు కదా. అలాగే భూమి ఉపరితలం నుండి దాని గురుత్వాకర్షణ శక్తి పనిచేసే 'పై వాతావరణం' వరకు ఒక సంవృత వ్యవస్థ (closed entity) మొత్తాన్ని ఒక బస్సులాగా ఉహిస్తే, అందులోని ప్రాణుల, వస్తువుల కదలికలు భూమి గమనంలో ఏ మార్పునూ తీసుకురాలేవు. అందువల్ల భూమిపై ఉండే మనుషులందరూ ఒకేసారి పైకెగిరి దూకినా ఏమీ జరగదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Can not we survive a dead person with Oxygen?-చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: మనిషి జీవించడానికి ఆక్సిజన్‌ అవసరం కదా? మరి చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?

జవాబు: ప్రపంచంలోని మరణాలన్నీ ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే జరగడం లేదు కదా? కాబట్టి మరణానికి, ఆక్సిజన్‌ లేమి కారణం కాదు. మనిషులు కానీ, జీవులు కానీ బతికి ఉండడానికి ఆక్సిజన్‌ ఒక్కటే కారణం కాదు. మనం బతికి ఉండాలంటే మనకు ఆక్సిజన్‌తోపాటు నీరు, ఆహారం, రోగనిరోధక శక్తి, సరైన రక్తప్రసరణ, సరైన జీవభౌతిక ధర్మాలు, సరైన వాతావరణం కావాలి. ఇందులో కొన్ని బాహ్యకారకాలు కాగా, కొన్ని అంతర కారకాలు. బయట నుంచి ఎంత మంచి ఆక్సిజన్‌, ఆహారం, వాతావరణం లాంటివి కల్పించినా కాలక్రమేణా శరీరంలోనే కొన్ని కార్యకలాపాలు మందగించడం మొదలెడతాయి. ఆ స్థితినే మనం వృద్ధాప్యం లేదా అవసాన దశ అంటాము. మరికొన్ని రోజుల తర్వాత ఆ శరీర కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి. అదే మరణం. ఒకసారి మరణం సంభవించాక ఏ విధంగానూ బతికించడం సాధ్యం కాదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌ ,రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Curry leaves Tree before house is bad?-ఇంటిముందు కరివేపాకు చెట్టు దోషమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మా ఇంటి గుమ్మం ముందు కరివేపాకు చెట్టుంది. ఎవరెవరో ఏదేదో చెప్పి భయపెడుతున్నారు.అది ఉంటే తప్పా?
జ ; ఇది వాస్తుశాస్త్రం నకు సంభందినది . ఒక గృహాన్ని వాస్తుశాస్త్ర ప్రకారము నిర్మించుకోవాలని అంటారు . మనము నివసించే ఇల్లు మంచి గాలి , వెలుతురు వచ్చేదిగాను , కాలుష్యరహితం గాను ... ముఖ్యము గా శబ్ద కాలుష్యము లేనిదిగాను ఉండాలి . ఇక్కడ కరివేపాకును అందరూ కూరలలో వేసుకునే సుగంధద్రవ్యము గా వాడుతారు . ఆ ఆకులు కోసము ఇరుగు పొరుగు వారు రావడము జరుగుతుంది ... ఇది ఇంటిలో ఉన్న కుటుంబసభ్యులకు చిరాకు కలిగించేదిగా ఉంటుంది.. మరియు   గుమ్మం ముందు చెట్టుంటే నడకకి ఇబ్బంది, వస్తువుల్ని తీసుకురావడం, పోవడం కష్టం. అదీ కాక ఆ వేళ్లు ఇంటిలోనికి పాకి నేలకి పగుళ్లు తెస్తాయి. అన్నిటికీ మించి పెద్ద గాలికి విరిగి పడితే ఇంట్లో వారికి ప్రమాదమని భావించిన పెద్దలు ఇంటి గుమ్మానికి ముందు చెట్లు వద్దన్నారు. ఈ దృష్టితో ఆలోచించుకుని గుమ్మానికి బాగా దూరంగానైతే... కరివేపాకు అనేది పెద్ద చెట్టు కాదు కాబట్టి ఉంచుకోండి. శాస్తప్రరంగానైతే ఇది వనస్పతి వృక్షం (పువ్వులు, పళ్లు లేనిది) కాబట్టి దోషం లేదు ఉంచినట్లయితే...

--డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు , రామాయణ సుధానిధి
 • ============================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, October 26, 2012

What are the 14 worlds? -14 లోకాలు అనేవి ఏవి?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.

లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.--- బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు.

 • లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే--

    మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
    రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
    మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.

బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.

ఊర్ధ్వలోకాలు

 1.     భూలోకం
 2.     భువర్లోకం
 3.     సువర్లోకం
 4.     మహర్లోకం
 5.     జనలోకం
 6.     తపోలోకం
 7.     సత్యలోకం

అధోలోకాలు

 1.     అతలం=మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.
 2.     వితలం=హాఠకేశ్వరుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు.హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు.
 3.     సుతలం=బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.
 4.     రసాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు.
 5.     మహాతలం=కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.
 6.     తలాతలం=రుద్రుడి రక్షణలో ఉంటుంది.
 7.     పాతాళం=నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.

ఈ ఏడు అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు.అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.
 • లోకాల తత్వం : ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది. భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.

వనరులు---శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు @ తెలుగు వికీపిడియా.

 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, October 25, 2012

How does vacume cleaner work?-వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఇదెలా సాధ్యం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?

జవాబు: కూల్‌డ్రింక్‌ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్‌ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్‌ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్‌ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why hissing sounds at Ear?-చెవి దగ్గర ఆ హోరేమిటి?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: చెవి దగ్గర అరచేతిని దొప్పలా చేసి పెట్టినా, ఏదైనా గ్లాసును పెట్టినా సముద్రపు హోరులాగా శబ్దం వినిపిస్తుంది. ఎందుకని?

జవాబు: కాంతి ఏ యానకమూ లేకుండా ప్రయాణిస్తుంది కానీ, శబ్దానికి విధిగా యానకం కావాలి. మన భూమ్మీద ఉన్న వాతావరణంలోని గాలిలో కలిగే కంపనాల ద్వారానే మనం శబ్దాలను వినగలుగుతున్నాం. గాలి అణువులను సంపీడినీకరణం (densities),విరళీకరణం (rarification) చేసే విధంగా గాలిలో అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడతాయి. ఇవే శబ్దతరంగాలు. శబ్ద తరంగాలు గాలిలో వెళ్తున్న క్రమంలో తమ తరంగ శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందువల్లనే మనం దగ్గర శబ్దాలను స్పష్టంగాను, దూరం శబ్దాలను అస్పష్టంగాను వింటాము. దీనినే తరంగ పతనం (wave dissipation) అంటాము. సాధారణంగా గాలిలో అనేక రణగొణ ధ్వనులు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే అవి మన చెవి వినగలిగిన మోతాదులో ఉండకపోవడం వల్ల మనకు అవి అంతగా వినిపించవు. కానీ చెవి దగ్గర చెంబునో, గ్లాసునో, అరచేతి దొప్పనో పెట్టినప్పుడు ఆ లోపలి భాగంలోకి వెళ్లిన ధ్వని తరంగాలు పదేపదే అక్కడికక్కడే తిరుగాడడం వల్ల శబ్ద తీవ్రత పోగుపడి చెవిలోకి వినిపిస్తుంది. అది హోరులాగా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How does vacume cleaner work?-వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఇదెలా సాధ్యం?

 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?

జవాబు: కూల్‌డ్రింక్‌ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్‌ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్‌ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్‌ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the age of Universe?-విశ్వం వయసెంత? •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... ప్రశ్న:మొత్తం విశ్వం వయసెంత? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు ఈ విశ్వం ఉంటుంది?

జవాబు: విశ్వం ఆవిర్భావం గురించి చాలా వాదనలు ఉన్నాయి. అన్నింటికీ ఎంతో కొంత శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మూడు. అవి: 1. స్టడీ స్టేట్‌ థియరీ (Steady State Theory) 2. ఆస్లేటింగ్‌ థియరీ (Oscillating Theory) 3. బిగ్‌బ్యాంగ్‌ థియరీ(Big Bang Theory).

ఈ మూడింటిలో అత్యధిక శాస్త్రీయ రుజువులున్న మహావిస్ఫోట సిద్ధాంతం (బిగ్‌బ్యాంగ్‌) ప్రకారం మనం ఉన్న ఈ విశాల విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం కేవలం ఓ రాగిగింజ కన్నా తక్కువ పరిమాణంలో ఉండేది. అది ఒక్కపెట్టున పేలిపోయి అత్యధిక సాంద్రతర రూపం నుంచి చెల్లాచెదురై మొదట చాలా చిన్న చిన్న ప్రాథమిక కణాల (fundamental particle) వాయువుగా ఉండేది. ఆ కణాలు తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే క్రమంలో పరమాణువులు, అణువులు, ఘన, వాయు, ద్రవ రూపాలుగా ఉన్న పదార్థాల మయమైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలుగా రూపొందాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్యం వ్యాకోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అయితే హరాత్మక విశ్వ సిద్ధాంతం(oscillating universe Theory ప్రకారం విశ్వం సంకోచవ్యాకోచాల మయం. సంకోచించి చిన్న రూపమైనందువల్లే మహావిస్ఫోటం జరిగిందని దీని వాదన. కాబట్టి ఇది వ్యాకోచించి ఆ తర్వాత తిరిగి గురుత్వాకర్షణ(gravitational forces) వల్ల దగ్గరై మళ్లీ మరో విస్ఫోటానికి దారి తీస్తుంది. ఇక స్టడీ స్టేట్‌ థియరీ ప్రకారం ఈ విశ్వానికి ఆది, అంతం అంటూ ఏమీ లేవు. వివిధ గతులు, దశలు (Stages and Phases) ఉంటాయి. ఒక గతిలో కొంత కాలం ఉంటుంది. అది ఒక దశ. అది కొనసాగి మరో గతికి చేరుకుని అక్కడ మళ్లీ కొంత కాలం సాగుతుంది. ఇది మరో దశ. ఇలా పదే పదే దశలు, గతులు మార్చుకుంటూ అవిశ్రాంతంగా అనాదిగా, అనంతంగా ఈ విశ్వం కొనసాగుతుంది. అలాంటి గతి మార్పుల్లో ఒకటే మహావిస్ఫోటమనేది ఈ సిద్ధాంతం వాదన. నేడు శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఈ సిద్ధాంతానికే మద్దతు తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే మన విశ్వం ఇంకెంత కాలమైనా ఉంటుంది.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Handle in a Clock movement-గడియారంలో మూడుముళ్లు తిరగడం

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గడియారంలో మూడుముళ్లు వేర్వేరు వేగాలలో ఎలా తిరుగుతాయి?

జవాబు: ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్‌ సర్క్యూట్‌ ద్వారా క్వార్ట్‌ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.
ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్‌ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం (toothwheel). దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is that God Particle?-ఏమిటా దైవకణం?

 •  
 • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: కొన్నాళ్ల క్రితం శాస్త్రవేత్తలు దైవకణం కనుగొన్నారని విన్నాము. అసలా కణం ఏమిటి?

జవాబు: సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్‌బ్యాంగ్‌ (మహా విస్ఫోటం) వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. పీటర్‌ హిగ్స్‌ అనే బ్రిటిష్‌ కణ భౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వశక్తి స్వరూపం ఆవరించుకుని ఉంది. ఈ క్షేత్రమే విశ్వంలో ఉండే ద్రవ్యం (matter)లోని మౌలిక కణాలతో సంపర్కం చెందడంతో 'హిగ్‌ బోసాన్లు' అనే కణాలు ఏర్పడ్డాయి. ఇవే పదార్థాలలో ఉండే పరమాణువుల నిర్మాణానికి దోహదపడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశి (mass)ను సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులూ, పరమాణువులూ ఏవీ లేవు. నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏవీ ఏర్పడేవి కావు. జీవం అంటే ప్రాణికోటి మనుగడే లేదు. అసలు విశ్వమే లేదు. ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకూ నారూ నీరూ పోస్తున్న ఈ అద్భుత కణం 'హిగ్‌బోసాన్‌'ను శాస్త్రవేత్తలు దైవకణం (God Particle) అన్నారు.

గ్రాములో ఐదువేల బిలియన్‌ బిలియన్‌ బిలియన్ల వంతు ఉండే ఈ కణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ సరిహద్దులోని భూగర్భంలో పదేళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే పెద్దదైన, ఖరీదైన 'లార్జ్‌ హార్డాన్‌ కొలైడర్‌' అనే యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రంలో కాంతి వేగంతో పయనించే ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొని విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మకణాల నుంచి శాస్త్రవేత్తలు దైవకణాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ కణాన్ని ప్రతిపాదించిన పీటర్‌హిగ్స్‌ అక్కడే ఉండడం విశేషం!

ఈ ప్రయోగం ద్వారా బిగ్‌బ్యాంగ్‌ నాటి పరిస్థితులను తిరిగి ప్రయోగశాలలో సృష్టించడమే కాకుండా ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న కృష్ణద్రవ్యం (Dark matter), కృష్ణబిలాలు(Black holes) గురించి సాధ్యమైనన్ని వివరాలన్నో తెలుసుకోవచ్చు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
 • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do Earth energy diminishes?- భూమి శక్తి అయిపోతుందా?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం చేసే ప్రతి పనికీ కొంత శక్తి అవసరం. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తోంది కదా, ఆ శక్తి భూమికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వేళ ఆ శక్తి అయిపోతే భూమి తిరగడం ఆగిపోతుందా?

జవాబు: ఒక వస్తువును నిరోధ బలాన్ని (resistant force) అధిగమిస్తూ కొంత దూరం జరపవలసినప్పుడే శక్తి అవసరం అవుతుంది. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను లేదా శక్తిస్థాయి (energy level)ని తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకు చేర్చడానికీ శక్తి కావాలి. భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ (spin) ప్రక్రియలో కానీ, సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ(revolution) ప్రక్రియలో కానీ భూమి ఎదుర్కొనే ఘర్షణ (friction) లేదా అవరోధ బలం (opposing force) అంటూ ఏవీ లేవు. అంటే భూమి తన భ్రమణ, పరిభ్రమణ ప్రక్రియల్లో శక్తిని ఖర్చు పెట్టవలసిన అగత్యం ఏమీ లేదు. అంటే భూమి కదలికల వెనుక శక్తి పనిచేయడం లేదని కాదు అర్థం. భూమి కదలికలకు అవసరమైన శక్తి తన పుట్టుకతోనే విశ్వజనీనంగా లభ్యమైంది. అలా లభ్యమైన శక్తి ఎంత మాత్రం ఖర్చు కావడం లేదు. అందువల్ల భూమి శక్తి అయిపోవడమనే ప్రశ్నగాని, భూమి ఆగిపోతుందనే భయంగాని అవసరం లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

what is Chloroform?-క్లోరోఫాం అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: క్లోరోఫాం అంటే ఏమిటి? దీనిని ఎందుకు వాడతారు?

జవాబు: క్లోరోఫాం (chloroform) ఓ సేంద్రియ ద్రవ పదార్థం (Organic liquid). ఇందులో అయొడీన్‌, కర్పూరం, నాఫ్తలీన్‌, నూనె వంటి ఎన్నో సేంద్రియ ఘన, ద్రవ పదార్థాలు కరుగుతాయి. పద్దెమిది, పందొమ్మిది శతాబ్దాల కాలంలో ఈ ద్రావణి బాష్పాన్ని (vapour) మత్తుద్రవ్యం (anesthetic)గా వాడేవారు. ఒక దశలో ఐరోపాలో పారిశ్రామిక విప్లవం జరిగిన రోజుల్లో దీన్ని నీటి బాష్పీ యంత్రం (steam engine) బదులు వాడేవారు. కానీ క్రమేణా దీనికున్న మండే స్వభావం (inflammable), మత్తు స్వభావం, ఇతర ప్రమాదకర లక్షణాల వల్ల ఆ విధమైన అనువర్తనాలు తగ్గాయి. ఎక్కవ కాలం నిలవ ఉంటే ఇది మరింత ప్రమాదకరమైన పాస్జీన్‌గా మారుతుంది.అయితే నేటికీ అనేక రసాయనిక పదార్థాలతో పాటు ప్రధానమైన ద్రావణిగా దీన్ని వేర్వేరు రకాలుగా ఉపయోగిస్తున్నారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
 • ============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, October 21, 2012

మన పురాణాలలో చిరంజీవులు ఎంతమంది? ఎవరు వాళ్ళు? -who are chiranjeevulu in Hindu puranas?

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

చిరజీవులు అంటే ఎప్పటికీ మరణం లేని వారని మనకు తెలిసిన విషయమే. కానీ చిరంజీవి అంటే చాలావరకు ఒక్క హనుమంతుడే అని అనుకొంటాము. కానీ  మన పురాణాలలో చిరంజీవులుగా పేరుబడ్డవారు చాలా మంది ఉన్నారు  వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    హనుమంతుడు--    వ్యాసుడు,--    అస్వత్తామ,--    విభీషణుడు,--    బలి చక్రవర్తి,--    మార్కండేయుడు,--    కృపాచార్యుడు,--   పరుశురాముడు,--ధ్రువుడు,
--నారదుడు,--తుంబురుడు.

పుట్టిన ప్రతీ జీవి ఎంతోకొంత కాలము బ్రతికి చనిపోవడము ప్రకృతి సహజము. ఇది విజ్ఞాన శాస్త్రము చెప్పే నిజము . మరి పురాణాలలో ఈ చిరంజీవులు ఎలా బ్రతికి  ఉన్నారో... ఎక్కడ ఉన్నారో పురాణపురుషులకే తెలియాలి. ఇది ఒక నమ్మకము మాత్రమేనని నా అభిప్రాయము . 
 • =================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, October 20, 2012

Why igloo house is hot ? - ఇగ్లూ మంచు ఇళ్ళు వేడిగా ఉంటుందెకు?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ఉత్తర ధృవప్రాంతము లోని ఎస్కిమోలు మంచు ఇటుకలు వాడి నిర్మించుకునే ఇళ్ళను ఇగ్లూలంటారు . ఆ ఇంటికి మనిషి కూర్చొని లోపలికి వెళ్ళే ద్వారము ఉంటుంది . ఆ ఇంటి లోపల దీపము వెలిగిస్తారు .  ఆ దీపము తో వచ్చిన వేడిని మంచు ఇటుకలు బయటకు పోనివ్వక లోపల గదిలొ వేడిగా పడుకునేందుకు అనుకూలముగా ఉంటుంది .

ఇగ్లూ పైకప్పు  బోర్లించిన బాండీలా ఉండి దీపము నుండి వెలువడే వేడిని తిరిగి గదిలోకే పంపడము తో లోపల తగినంత వేడిగా ఉంటుంది .
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.- Dr.Seshagirirao