Thursday, October 25, 2012

Why hissing sounds at Ear?-చెవి దగ్గర ఆ హోరేమిటి?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: చెవి దగ్గర అరచేతిని దొప్పలా చేసి పెట్టినా, ఏదైనా గ్లాసును పెట్టినా సముద్రపు హోరులాగా శబ్దం వినిపిస్తుంది. ఎందుకని?

జవాబు: కాంతి ఏ యానకమూ లేకుండా ప్రయాణిస్తుంది కానీ, శబ్దానికి విధిగా యానకం కావాలి. మన భూమ్మీద ఉన్న వాతావరణంలోని గాలిలో కలిగే కంపనాల ద్వారానే మనం శబ్దాలను వినగలుగుతున్నాం. గాలి అణువులను సంపీడినీకరణం (densities),విరళీకరణం (rarification) చేసే విధంగా గాలిలో అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడతాయి. ఇవే శబ్దతరంగాలు. శబ్ద తరంగాలు గాలిలో వెళ్తున్న క్రమంలో తమ తరంగ శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందువల్లనే మనం దగ్గర శబ్దాలను స్పష్టంగాను, దూరం శబ్దాలను అస్పష్టంగాను వింటాము. దీనినే తరంగ పతనం (wave dissipation) అంటాము. సాధారణంగా గాలిలో అనేక రణగొణ ధ్వనులు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే అవి మన చెవి వినగలిగిన మోతాదులో ఉండకపోవడం వల్ల మనకు అవి అంతగా వినిపించవు. కానీ చెవి దగ్గర చెంబునో, గ్లాసునో, అరచేతి దొప్పనో పెట్టినప్పుడు ఆ లోపలి భాగంలోకి వెళ్లిన ధ్వని తరంగాలు పదేపదే అక్కడికక్కడే తిరుగాడడం వల్ల శబ్ద తీవ్రత పోగుపడి చెవిలోకి వినిపిస్తుంది. అది హోరులాగా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...