Tuesday, April 15, 2014

How is Oxygen formed?,ఆక్సిజన్ ఎలా ఏర్పడింది?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : How is Oxygen formed?,ఆక్సిజన్ ఎలా ఏర్పడింది?

Ans : భూమి ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ సుమారు 6,000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడిన సుమారు 3,000 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అధిక వేడి వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం వాతావరణంలోని మార్పులకు విస్ఫోటనం చెంది చల్లబడి, ఘనీభవించి భూగోళంగా ఉద్భవించింది. సముద్రంలోని అట్టడుగున ఉన్న రసాయనాలను బట్టి మొదట్లో గాలిలో రకరకాల విషపూరిత వాయువులు ఉన్నాయని ఆ వాయువులన్నీ పరస్పర చర్య జరపటం వల్ల ఆక్సిజన్ వాయువు పుట్టిందని తెలుస్తోంది.
 • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Puranam and how many are they?,పురాణమంటే ఏమిటి ఎన్ని ఉన్నాయి?

 •  
 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q :What is Puranam and how many are they?,పురాణమంటే ఏమిటి ఎన్ని ఉన్నాయి?

Ans : వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంత మేర కష్టమే . శృతులు ఆధారంగా, స్మృతులను మహర్షులు మనకు అందజేశారు. ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలిక గా గ్రహించడానికి కథల రూపంలో, వివరణాత్మకంగా, ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు.

మనకు తెలిసీ తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి. ఉదాహరణకు పుణ్య తీర్థ-క్షేత్రాల మాహాత్మ్య జ్ఞానం, సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు, పండుగలు వాటి కారణాలు, మనము నిత్యమూ పఠీంచే స్తోత్రాలు-సహస్రనామాలు వంటివి. కానీ ఇక్కడ మనము గ్రహించ వలసిన విషయం ఒకటుంది. మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల వంటివి పురాణాలు కావు. “రామాయణ,” “మహాభారతాలు” ఇతిహాసాలు. కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా, ఇతిహాసాలు ఒకానొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి. ఉదాహరణకు రామాయణం సకలగుణాభిరాముడైన శ్రీరామ చంద్రుని జీవిత చరిత్ర. శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియూ విశేషాలు, రామాయణంలో ప్రస్తావించబడ్డాయి.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని. అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే!

 • 1)  పద్మపురాణం (హృదయం).
 • 2) వామన పురాణం (చర్మం ).
 • 3) భాగవత పురాణం--తొడలు .
 • 4) మత్స్యపురాణం--మెదడు .
 • 5) కూర్మపురాణం--పృష్ణభాగం .
 • 6) వరాహ పురాణం--కుడికాలు చీలమండ .
 • 7) నారదపురాణం --బొడ్డు .
 • 8. స్కందపురాణం--వెంట్రుకలు.
 • 9) శివపురాణం--ఎడమ భుజం .
 • 10) విష్ణుపురాణం--కుడి భుజం .
 • 11) అగ్నిపురాణం-- ఎడమపాదం.
 • 12) మార్కండేయ పురాణం--కుడిపాదం .
 • 13)  భవిష్య --కుడిమోకాలు,
 • 14) బ్రహ్మ పురాణం,
 • 15) బ్రహ్మవైవర్త పురాణం,
 • 16) బ్రహ్మాండ పురాణం.
 • 17) లింగ పురాణం.
 • 18) గరుడ పురాణం.

 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, April 14, 2014

Which is the deepest place on Earth?,భూమిపైన అతి లోతైన ప్రదేశం ఏది?.
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
భూమిపైన పర్వతాలు, మైదానాలు, పీఠభూముల్లాంటి ఎన్నో భూస్వరూపాలు కలవు. ఇలాంటి వేర్వేరు భౌగోళిక స్వరూపాలు నేలపైనే కాకుండా, నీటిలోపల కూడా ఉన్నాయి. అంటే మహా సముద్రాలలో కూడా కొండలు, పర్వతాలు, మైదానాలు లాంటి వివిధ భూస్వరూపాలు ఉన్నాయి.

అతిలోతైన ప్రాంతాలలో మెరియానా ట్రెంచ్ ఒకటి. ఈ మహాసముద్రం పశ్చిమ భాగంలో మెరియానా దీవులకు తూర్పున మరొక విశాలమైన పల్లపు ప్రాంతం ఉంది. ఇది ఎంత విశాలమైనదంటే దాని పొడవు 1554 మైళ్లు, వెడల్పు 44 మైళ్లు.

సరిగ్గా ఆ పల్లపు ప్రాంతానికి నైరుతి దిశగా ప్రపంచపు అతి లోతైన ప్రదేశం ఉంది. దీనినే చాలెంజర్ డీప్ అంటారు. ఇదే మన భూగోళపు అతి లోతైన ప్రదేశం. ఇది సముద్ర ఉపరితలం నుంచి సుమారు ఏడు మైళ్లు లోతులో ఉంది.

The Challenger Deep is the deepest known point in the Earth's seabed hydrosphere, with a depth of 10,898 to 10,916 m (35,755 to 35,814 ft) by direct measurement from submersibles, and slightly more by sonar bathymetry (see below). It is in the Pacific Ocean, at the southern end of the Mariana Trench near the Mariana Islands group. The Challenger Deep is a relatively small slot-shaped depression in the bottom of a considerably larger crescent-shaped oceanic trench, which itself is an unusually deep feature in the ocean floor. Its bottom is about 11 km (7 mi) long and 1.6 km (1 mi) wide, with gently sloping sides. The closest land to the Challenger Deep is Fais Island (one of the outer islands of Yap), 287 km (178 mi) southwest, and Guam, 304 km (189 mi) to the northeast. It is located in the ocean territory of the Federated States of Micronesia, 1 mi (1.6 km) from its border with ocean territory associated with Guam.

 • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do ants sleep?,చీమలు నిద్రపోతాయా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్

ప్ర : చీమలు నిద్రపోతాయా?
జ : పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయి. రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయి. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయి.

సాధారణంగా చీమలు నిద్రపోవని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రాత్రివేళల్లో చీమలు పని చేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.

Do ants sleep?

    YES, THEY DO - but not in the sense we understand sleep. Research conducted by James and Cottell into sleep patterns of insects (1983) showed that ants have a cyclical pattern of resting periods which each nest as a group observes, lasting around six minutes in any 12-hour period. Although this means two such rest periods in any 24-hour period, only one of the rest periods bears any resemblance to what we would call sleep. Mandible and antennae activity is at a much lower level (usually up to 65 per cent lower) than during the other rest period in one 24-hour period, indicating a much deeper "resting" phase. Basing and McCluskey in 1986 used brain activity recorders on black, red, and soldier ants to determine whether the deeper resting period constituted actual "sleep". A steep decline in brain wave fluctuations supported the "sleep" hypothesis in black and red ants, but surprisingly showed a higher level of brain activity in soldier ants in a deep resting phase.
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Biggest bird on the Earth?,భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?

 •  

 •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల (రెండు అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ చాలా పొడవుగా ఉండటం వలన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆస్ట్రిచ్‌లు దాదాపు 1.8 నుంచి 2.75 మీటర్ల (ఆరు నుంచి తొమ్మిది అడుగులు) ఎత్తు, బరువు 63 నుంచి 130 కిలో గ్రాములు ఉంటుంది. కొన్ని మగ ఆస్ట్రిచ్‌లు 155కిలో గ్రాములు వరకు బరువు ఉంటాయి. ఆస్ట్రిచ్ కళ్లు పెద్దవిగా ఉండటం వలన అవి చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభముగా కనిపెట్టగలవు.

శత్రువులను చూసిన వెంటనే ఆస్ట్రిచ్‌లు నేలపై పడుకుంటాయి లేదా పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు గంటకు 60 నుండి 72.4 కిలోమీటర్ల (45 మైళ్ల ) వేగంతో పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు నిలువకుండా 30 నిమిషాలు పరుగెత్త గలవు.
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, April 13, 2014

Why do flowers have Nector ?, పూలకు మకరందం ఏల?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పూలకు మకరందం ఏల?

జ : పూలు అందమైన రంగులలో ఉంటాయి . . కాని అవి స్థిరముగా ఒకే చోట ఉంటాయి. పూలు కాయలు గా మారాలంటే ఫలదీకరణము జరగాలి. ఫలధీకరణానికి ఒక పువ్వు లోని మకరందం మరో పువ్వును చేరాలి . ఆ పనిని చేసేవి కీటకాలే . ఆ కీటకాలను పూలవైపు ఆకట్టుకునేందుకు పువ్వులోపల తయారయేదే మకరందము . ఇది తియ్యటి ద్రవము . ఆ మకరందము కొన్ని కీటకాలకు ఆహారము .
 • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, April 01, 2014

శ్రీ మహా విష్ణువు ఆయుధాలు - పేర్లు ఏమిటి?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : శ్రీ మహా విష్ణువు ఆయుధాలు - పేర్లు ఏమిటి?

జ : శ్రీ మహా విష్ణువు ధరించే ......

 • చక్రము --- సుదర్శనం ,
 • శంకము ---పాంచజన్యము , 
 • గధ పేరు ---కౌమోదకి , 
 • ధనుస్సు ---శార్జమ్‌ , 
 • ఖడ్గం పేరు ---నందకం ,


 • ==========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-