Saturday, August 24, 2013

Change in Eye glass color Why?- కళ్లఅద్దాల్లో ఆ మార్పులేల?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర  : Change in Eye glass color Why?- కళ్లఅద్దాల్లో ఆ మార్పులేల?

జవాబు: కళ్లకు ధరించే కొన్ని కళ్లజోళ్ల కటకాలు (lenses ) నీడలో తెల్లగా ఉండి, వెలుగులోకి రాగానే నల్లగా మారతాయి. మరలా నీడలోకి వచ్చిన కొంతసేపటికే యథాప్రకారం తెల్లగా మారతాయి. ఈ కటకాలను ఫొటోక్రోమిక్‌ లెన్సులు (photo chromic lenses) అంటారు. ఇవి మొదటిసారిగా 1960లో మార్కెట్లోకి వచ్చాయి. ఈ కటకాలను తయారుచేసే గాజులో సిల్వర్‌ హాలైడ్ల అణువులు ఉంటాయి. ఈ అణువులకు సూర్యకిరణాల్లోని అతి నీలలోహిత కాంతి సోకగానే ఒక రకమైన మార్పునకు లోనవుతాయి. సిల్వర్‌ హాలైడ్లలో ఉండే సిల్వర్‌ హాలోజన్‌ కణాలు విడివడి సిల్వర్‌ కణాలు తెల్లగా ఉండే కటకాలను నల్లగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో కంటికి కనబడే కాంతి వర్ణపటంలోని కొంత కాంతి శోషింపబడుతుంది. మరలా నీడలోకి రాగానే కటకాలపై అతి నీలలోహిత కిరణాలు పడకపోవడంతో అంతకుముందు సూర్యరశ్మిలో విడివడిన సిల్వర్‌, హాలోజన్‌ అణువులు మళ్లీ కలిసిపోతాయి. దీంతో కటకాలు మునుపటి తెల్లని కాంతిని తిరిగి పొందుతాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌

 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Can we survive on Moon by carrying Oxygen?-ఆక్సిజన్‌ తీసుకెళ్లి చంద్రుడిపై ఉండగలమా?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చంద్రుడిపై గాలి లేదు కాబట్టి, ఇక్కడ నుంచి మనం ఆక్సిజన్‌ తీసుకెళితే ఏమవుతుంది? మానవ నివాసానికి సాధ్యమవుతుందా?

జవాబు: సాధ్యపడదు . మన భూమ్మీద ఉన్న విధంగానే చంద్రుడిపైన కూడా వాయు సంఘటనం(composition of air) ఉంటేనే మానవ మనుగడ, ఇతర జీవుల మనుగడ సాధ్యం. చెట్లు ఇతర జీవ జాతులు ఉంటేనే సరైన జీవావరణ (BIO SPHERE), పర్యావరణ వ్యవస్థలు సాధ్యమవుతాయి. భూమ్మీద ఆక్సిజన్‌తోపాటు దానికన్నా సుమారు 4 రెట్లు అధికంగా నైట్రోజన్‌ ఉండేలా గాలి ఉంది. పూర్తిగా గాలే ఉంటే మన ఊపిరి తిత్తులు తట్టుకోలేవు. మనం వదిలిన కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయి అక్కడ చెట్లు లేకుంటే మెల్లమెల్లగా పేరుకుపోయి మొత్తం ఆక్సిజన్‌ స్థానాన్ని అదే ఆక్రమిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ సరఫరా అవుతుండాలి. అలాగే కార్బన్‌డై ఆక్సైడ్‌ పరిమాణం 0.5 శాతానికి మించకూడదు. భూమిపై ఉన్న గాలి ద్రవ్యరాశి సుమారు 5X1018 (లేదా 5 పక్కన 15 సున్నాలు పెట్టినంత కి.గ్రా) దీన్నే 5 ట్రిలియన్‌ టన్నులంటాము. చంద్రునిపై ఉన్న గాలి వ్యాపనం (diffusion) ద్వారా పారిపోకుండా ఉండాలంటే కనీసం 1 ట్రిలియన్‌ గాలి అక్కడుండాలి. అంటే 5 లక్షల కోట్ల టన్నులు. అంత గాలిని, అన్ని చెట్లను, అన్ని జీవుల్ని అక్కడికి మోసుకెళ్ల గలమా?

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Dreams can effect our real life?-కలలు నిజ జీవితం పై ప్రభావం చూపుతాయా?

 •  
 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : కలలు నిజ జీవితం పై ప్రభావం చూపుతాయా?
జ : కలలకు జీవితానికి ఏ సంబంధమూ లేదు. వేల, లక్షల కలల్లో ఏదో ఒకటి మాత్రమే అర్థమున్నదై ఉంటుంది. మీ జీవితాన్ని దిశమార్చగల ఆ దర్శనం మీ కలల్లో లభిస్తే, దానికి మీరు అర్థం వెతుక్కుంటూ తిరిగే పరిస్థితి ఎప్పుడూ రాదు. కల పూర్తి అయినా దాని ప్రభావం మాత్రం తప్పక అలాగే నిలిచి ఉంటుంది.

చాలా మందికి కలలో తమకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మెలకువ వచ్చేస్తుంది. తర్వాత వారు కల మధ్యలోనే మెలకువ వచ్చేసిందని బాధపడుతుంటారు. చాలా మంది ఇంతే కలలోనూ తమ గుణం మార్చుకోలేక ఊరికే ఉండిపోతారు. కలల్లో తేలిపోకుండా... నిజ జీవితంలోని తీవ్రతను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిద్దట్లో వచ్చే పిచ్చి కలల్ని నిర్లక్ష్యం చేయండి. మీ నిద్రనే పోగొట్టే గొప్ప కలల్ని మర్చి పోతూ బతకండి.

మిమ్మల్ని, మీరు బతికున్న ఈ భూమినీ గొప్పగా తీర్చిదిద్దే కలలు కనండి. అలాంటి కలలు లేని బతుకు జీవాధారంలేని జీవమైపోతుంది. కళ్ళల్లో కలలుండవచ్చు. అయితే, కాళ్ళను మాత్రం నిజంలో నిలదొక్కుకోండి. అప్పుడే అమృతాన్ని రుచి చూస్తారు.
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cause for ships drowing in Bermuda Triange-బెర్ముడా ట్రయాంగిల్‌లో నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?

జవాబు :
బెర్ముడా అనే ప్రాంతం పశ్చిమ అట్లాంటిక్‌ సముద్రంలో బెర్ముడా ద్వీపాలు, దక్షిణ ఫ్లోరిడా ప్యూర్టోరికాల మధ్య త్రిభుజాకారంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు, ఆకాశంలోని విమానాలు కొన్ని హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. ఇలా జరగడానికిగల కారణాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్ర లోతుల్లో మీధేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినపుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలం చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తటాలున ఒక నాటకీయ రూపంలో తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తి (buoyancy)ని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం, మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు (electro magnetic field) ఉహించని రీతిలో తటాలున మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురవుతాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do we measure age of Trees?-వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న :
పెద్ద పెద్ద వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?

జవాబు  : పెద్దపెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి ఆ వృక్షాల వయసును నిర్ధరిస్తారు. చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని, లవణాలను భూమినుంచే తీసుకోవాలి. ఇందుకోసం వృక్షం కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం (plant tissue) ఉంది. ఇందులో ప్రధానమైంది జైలం (xylem) కణజాలం. వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారయిన చక్కెరలను ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం ఉంది. దాని పేరు ఫ్లోయం (floyem) . ఈ జైౖలం, ఫ్లోయం కణజాలాలు చెట్టు బెరడు (bark) కిందనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక రుతువులో బాగా వర్షాలు పడ్డం వల్ల లవణాల్ని, నీటిని బాగా సరఫరా చేసేందుకు తయారైన ఆహారాన్ని రవాణా చేసేందుకు జైలం, ఫ్లోయంలు బాగా వదులుగా, పెద్దగా ఉండే కణాల సముదాయంగా ఉంటాయి. దీన్నే కేంద్రీయ పొర అంటారు. కానీ వర్షాలు ఆగిపోతే అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ కొత్త కేంద్రీయం పాత గట్టిపడ్డ పొరమీద ఏర్పడతాయి. అంటే ప్రతీ సంవత్సరం ఓ కొత్త వలయంలా కణజాలం వృద్ధి చెందుతుంది. ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత, కొత్త రింగుల స్వరూపంలో తేడా ఉండడం వల్ల మనం సులభంగా వాటిని గుర్తించగలం. ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వృక్షం కాండంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యే దాని వయసు. పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్‌ డేటింగ్‌ అనే కేంద్రక భౌతిక సాంకేతిక పద్ధతి (nuclear physical radio method) ద్వారా కనుగొంటారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక

 • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Eight types of marriages in Indian culture,భారతీయ సంప్రదాయంలో అష్టవిధ వివాహాలు

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : What are the  types of marriages in Indian culture?,భారతీయ సంప్రదాయంలో వివాహం ఎన్ని రకాలు?.

A : సాధారణంగా వివాహం అంటే యువతీ యువకుడు అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లాడటమన్నది సంప్రదాయం. అలాంటి వివాహం మన శాస్త్ర, పురాణాల్లో ఎనిమిది రకాలుగా ఉన్నాయి.

  1. బ్రహ్మం, 2.దైవం, 3.ఆర్షం, 4.ప్రాజాపత్యం, 5.అసురం, 6.గాంధర్వం, 7.రాక్షసం, 8.పైశాచం.  

1.బ్రహ్మ వివాహం :  వేదం చదివి, సదాచారము కలిగిన  సచ్ఛీలవంతునికి వస్త్ర భూషనాదులచేత అలంకరించి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.

2.దైవ వివాహం :  జ్యోతిష్టోమాదియజ్ఞాలను చెసే సందర్భములో,ఆక్రతు విధానాన్ని చేయించిన ఋత్విజుని (యజ్ఞంలో రుత్విక్‌‌కు) అలంకరించి తమ కన్యనిచ్చి  కన్యాదానం చేయుటను దైవ వివాహము అని  చెపుతారు.

3.అర్ష (అర్షం) వివాహం : గోమిధునాన్ని(రెండు గోవులను) వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు.

4.ప్రాజాపత్య వివాహం : గృహస్థాశ్రమాన్ని విడవననీ, సంతానాన్ని పొందుతాని వరునిచేత ప్రమాణము చేయించి (మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని) వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.

5.అసుర వివాహం :  వరుడు (జ్ఞానులు) .... కన్యకు , కన్యకు సంబంధిన పెద్దలకు , ఆమె తల్లిదండ్రులకు ,  శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు.

6.గాంధర్వ వివాహం : వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా పెద్దల ప్రమేయము లేకుండా  వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు.

7.రాక్షస వివాహం : బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి కన్య తల్లిదంద్రులు , బంధువుల అంగీకారము లేకుండా వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు.

8.పైశాచ వివాహం : నిద్రిస్తున్న లేదా మత్తులో ఉన్నఆత్మరక్షణచేసుకోలేని  స్త్రీని తల్లిదండ్రులకు గాని బంధువులకు కాని తెలియకుండా.. రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు.

 • ===============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, August 10, 2013

Frogs appears suddenly on raining.how?,కప్పలు హఠాత్తుగా ఎక్కడనుండి వస్తాయి?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర ; ఎండకాలము తరువాత వాన పడినవెంటనే హఠాత్తుగా కప్పలు ఎక్కడనుండి వస్తాయి.

జ : వర్షము పడి నీరు నిలవగానే అప్పటి వరకూ కనిపించని కప్పలు బెకబెక మంటూ కుప్పలు కుప్పలు గా కనిపిస్తాయి. అలా హఠాత్తుగా కనిపించేసరికి కొందరు పిల్లలు అవి వర్షము తో పడ్డాయనుకుంటారు. అలా జరుగదు . కప్పలు వేసవిలో ఎండతీవ్రతకు , నీరు ఇంకిపోవడము వలన భూమిలో బురదలోకి చొచ్చుకుపోయి నిద్రపోతాయి. అది సాదారణ నిద్రకాదు . దీనిని " సుప్తావస్థ -Hibernation" అంటారు. వేసవినుండి రక్షించుకునేందుకు కప్పలు ఏర్పాటు చేసుకున్న మార్గమిది. వర్షము తో చెరువు నిండగానే లోపల బురదలో ఉండిపోయిన కప్పలు ఆనందముగా బయటకు వచ్చి తిరగడం మొదలుపెడతాయి.
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, August 08, 2013

Toungue color change after panchewing why?,కిళ్లీ నమిలిన తర్వాత నాలుక రంగు మారడానికి కారణం ఏమిటి?

 •  ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కిళ్లీ నమిలిన తర్వాత నాలుక రంగు మారడానికి కారణం ఏమిటి?

జవాబు: కిళ్లీ అనేది ఓ మిశ్రణం (admixture). ఇందులో తమలపాకు, వక్క, సున్నం ప్రధాన దినుసులు. తమలపాకులో ఘాటు రుచికి కారణం అందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వృక్ష రసాయనాలు (herbal chemicals). ఇందులో ప్రధానమైంది నికోటిన్‌ ఆమ్లం. తమలపాకులతో పాటు కిళ్లీలో వక్క (areca nut) వేసుకుంటాము. ఇందులో ప్రధానంగా వగరు లక్షణానికి కారణం అందులో ఉన్న ఎరికోలిన్‌ (arecoline)అనే ఆల్కలాయిడ్‌ క్షార రసాయనిక ధాతువు (ingredient). ఆకు, వక్కతో పాటు మనం సున్నం కూడా కొద్దిగా కలుపుకుంటాము. సున్నం కొంత ప్రధానంగా కాల్షియం హైడ్రోజన్‌ (ca(OH)2). ఇది బలమైన క్షారం. ఇలాంటి కిళ్లీని నోట్లో వేసుకున్నపుడు నోట్లో ఉన్న క్షారగుణం (alkaline)ఉన్న లాలాజలంతో ఈ ఆల్కలాయిడ్‌లో రసాయనిక నిర్మాణ మార్పు జరిగి ఎరుపు రంగుకు కారణమైన రూపంలో రసాయన బంధాలు పునర్నిర్మించుకుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కిళ్లీలు తినడం ఆర్యోగానికి హానికరం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
 • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the size of human body cell?,మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ప్రశ్న: మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది? రక్తంలో ఎన్ని జీవకణాలు ఉంటాయి?

జవాబు: మానవుని శరీరంలో రెండు వందల రకాల జీవ కణాల కన్నా ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ వివిధ పరిమాణాలు కలిగి ఉంటాయి. చాలా వరకు వీటి వ్యాసం 20 నుండి 50 మైక్రో మీటర్ల మధ్య ఉంటుంది. (1 మైక్రో మీటరు = మిల్లీ మీటర్‌లో వెయ్యో వంతు). 120 మైక్రో మీటర్ల వద్ద ఉండే అండాశయ గుడ్ల కణాలు (ova) అతి మందమైనవైతే, వీర్య కణాల (spermatoza) వ్యాసం మూడు మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. అతి పొడవైన కణాలు వెన్నెముక సంబంధిత నరాల కణాలు. ఈ కణాలు ఒక మీటరు పొడవు ఉండే శాఖలను ఏర్పర్చగలవు. ఇక రక్తం విషయానికి వస్తే, నడివయసులో ఉండే ఒక వ్యక్తిలోని 5 లీటర్ల రక్తంలో 50 బిలియన్ల తెల్లకణాలు (1 బిలియన్‌ = వెయ్యి మిలియన్లు; 1 మిలియన్‌= 10లక్షలు) 1.5 ట్రిలియన్‌ (1ట్రిలియన్‌= 1000 బిలియన్లు) రక్తకణ పట్టికలు(blood platelets), 25 ట్రిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉండే మొత్తం జీవకణాల్లో 4వవంతు. 2 మిలియన్ల కన్నా ఎక్కువ ఎర్రరక్తకణాలు ఎముకల్లోని మూలగ (marrow)లో ప్రతిసెకనుకూ ఉత్పన్నమవుతుంటాయి. మన రక్తంలో ఉండే జీవకణాలన్నిటినీ ఒక దాని తర్వాత మరొకటి పేరిస్తే ఆ వరస పొడవు 1,92,500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి చుట్టూ 5 వరసలుగా చుట్టవచ్చని అంచనా.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు--హైదరాబాద్‌
 • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why donot we get shock in electric trains?,ఎలక్ట్రిక్‌ రైల్లో షాక్‌ రాదేం?

 •  

 •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Why donot we get shock in electric trains?,ఎలక్ట్రిక్‌ రైల్లో షాక్‌ రాదేం?

ప్రశ్న : ఎలక్ట్రిక్‌ రైల్లో ప్రయాణం చేసేప్పుడు బోగీ ఇనుము కాబట్టి మనకు షాక్‌ కొట్టాలి కదా! అలా జరగదేం?

జవాబు : మనకు షాక్‌ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు (సాధ్యమైన నిడివి దూరంలో, ఉదా: కాళ్లు ఒక చివర, చేతులు మరో చివర) వేర్వేరు విద్యుత్‌శక్మం(electrical potential) ఉన్న ధ్రువాలను (poles) తాకాలి. అపుడు శరీరం గుండా విద్యుత్‌ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్‌ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్‌ రైలులో కేవలం ఇంజన్‌ మాత్రమే ఎలక్ట్రిక్‌ వైర్లకు సంధానిస్తారు. బోగీలను కాదు. అయితే బోగీలకు, ఇంజనుకు మధ్య అనుసంధానం ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా విద్యుత్‌ ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్‌ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి (ground). ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంది. విద్యుత్‌ ఎపుడూ అత్యల్ప నిరోధం(lowest electrical resistance) ఉన్న దారిగుండా ప్రయాణిస్తుంది. మొత్తం బోగీ ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధంలేకుండా విద్యుత్‌ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నపుడు మన శరీరం ఎపుడూ ఏమాత్రం రెండు వేర్వేరు శక్మాలున్న ధృవాల మధ్య ఉండదు. కాబట్టి విద్యుత్‌ ప్రవాహం శరీరం గుండా ఉండదు. అంటే షాక్‌కు అవకాశం లేదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
 • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-