ప్రశ్న: చంద్రుడిపై గాలి లేదు కాబట్టి, ఇక్కడ నుంచి మనం ఆక్సిజన్ తీసుకెళితే ఏమవుతుంది? మానవ నివాసానికి సాధ్యమవుతుందా?
జవాబు: సాధ్యపడదు . మన భూమ్మీద ఉన్న విధంగానే చంద్రుడిపైన కూడా వాయు సంఘటనం(composition of air) ఉంటేనే మానవ మనుగడ, ఇతర జీవుల మనుగడ సాధ్యం. చెట్లు ఇతర జీవ జాతులు ఉంటేనే సరైన జీవావరణ (BIO SPHERE), పర్యావరణ వ్యవస్థలు సాధ్యమవుతాయి. భూమ్మీద ఆక్సిజన్‌తోపాటు దానికన్నా సుమారు 4 రెట్లు అధికంగా నైట్రోజన్ ఉండేలా గాలి ఉంది. పూర్తిగా గాలే ఉంటే మన ఊపిరి తిత్తులు తట్టుకోలేవు. మనం వదిలిన కార్బన్‌డైఆక్సైడ్ స్థాయి అక్కడ చెట్లు లేకుంటే మెల్లమెల్లగా పేరుకుపోయి మొత్తం ఆక్సిజన్ స్థానాన్ని అదే ఆక్రమిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సరఫరా అవుతుండాలి. అలాగే కార్బన్‌డై ఆక్సైడ్ పరిమాణం 0.5 శాతానికి మించకూడదు. భూమిపై ఉన్న గాలి ద్రవ్యరాశి సుమారు 5X1018 (లేదా 5 పక్కన 15 సున్నాలు పెట్టినంత కి.గ్రా) దీన్నే 5 ట్రిలియన్ టన్నులంటాము. చంద్రునిపై ఉన్న గాలి వ్యాపనం (diffusion) ద్వారా పారిపోకుండా ఉండాలంటే కనీసం 1 ట్రిలియన్ గాలి అక్కడుండాలి. అంటే 5 లక్షల కోట్ల టన్నులు. అంత గాలిని, అన్ని చెట్లను, అన్ని జీవుల్ని అక్కడికి మోసుకెళ్ల గలమా?
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...