ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?
జవాబు : బెర్ముడా అనే ప్రాంతం పశ్చిమ అట్లాంటిక్ సముద్రంలో బెర్ముడా ద్వీపాలు, దక్షిణ ఫ్లోరిడా ప్యూర్టోరికాల మధ్య త్రిభుజాకారంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు, ఆకాశంలోని విమానాలు కొన్ని హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. ఇలా జరగడానికిగల కారణాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్ర లోతుల్లో మీధేన్ హైడ్రేట్ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినపుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలం చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తటాలున ఒక నాటకీయ రూపంలో తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తి (buoyancy)ని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం, మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు (electro magnetic field) ఉహించని రీతిలో తటాలున మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురవుతాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...