ప్రశ్న: మన దేహంలోని జీవ కణాల పరిమాణం ఎంత ఉంటుంది? రక్తంలో ఎన్ని జీవకణాలు ఉంటాయి?
జవాబు: మానవుని శరీరంలో రెండు వందల రకాల జీవ కణాల కన్నా ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ వివిధ పరిమాణాలు కలిగి ఉంటాయి. చాలా వరకు వీటి వ్యాసం 20 నుండి 50 మైక్రో మీటర్ల మధ్య ఉంటుంది. (1 మైక్రో మీటరు = మిల్లీ మీటర్‌లో వెయ్యో వంతు). 120 మైక్రో మీటర్ల వద్ద ఉండే అండాశయ గుడ్ల కణాలు (ova) అతి మందమైనవైతే, వీర్య కణాల (spermatoza) వ్యాసం మూడు మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. అతి పొడవైన కణాలు వెన్నెముక సంబంధిత నరాల కణాలు. ఈ కణాలు ఒక మీటరు పొడవు ఉండే శాఖలను ఏర్పర్చగలవు. ఇక రక్తం విషయానికి వస్తే, నడివయసులో ఉండే ఒక వ్యక్తిలోని 5 లీటర్ల రక్తంలో 50 బిలియన్ల తెల్లకణాలు (1 బిలియన్ = వెయ్యి మిలియన్లు; 1 మిలియన్= 10లక్షలు) 1.5 ట్రిలియన్ (1ట్రిలియన్= 1000 బిలియన్లు) రక్తకణ పట్టికలు(blood platelets), 25 ట్రిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉండే మొత్తం జీవకణాల్లో 4వవంతు. 2 మిలియన్ల కన్నా ఎక్కువ ఎర్రరక్తకణాలు ఎముకల్లోని మూలగ (marrow)లో ప్రతిసెకనుకూ ఉత్పన్నమవుతుంటాయి. మన రక్తంలో ఉండే జీవకణాలన్నిటినీ ఒక దాని తర్వాత మరొకటి పేరిస్తే ఆ వరస పొడవు 1,92,500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి చుట్టూ 5 వరసలుగా చుట్టవచ్చని అంచనా.
-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు--హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...