Wednesday, August 26, 2015

Important of 12 in the Time?-కాలములో "12 " గొప్పతనము ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : కాలములో "12 " గొప్పతనము ఏమిటి? తెలుపగలరు .

జ : కాలములో 12 అంకెకు ఉన్న ప్రాధాన్యత ను పరిశీలిస్తే  చాలా వింతగాను , విచిత్రముగాను ఉంటుంది. . . అంతేకాదు అద్భుతముగానూ ఉండును.
1/2 * 12 = 6 ఋతువులు సంవత్సరములో,
1 * 12 = 12 నెలలు సంవత్సరములో ,
2 * 12 = 24 గంటలు ఒక రోజులో  ,ఉదయము నుండి అస్తమయం వరకూ ఉండే గం్టలు 12, అస్తమయం నుండి ఉదయము వరకూ ఉండే గంటలు 12 ఇలా కాలాన్ని గురించి 12 సంఖ్యావిశేషము .
3 * 12 = 36 ముఖ్య మైన పర్వ(పండుగ) దినాలు సంవత్సరములో ,
4 * 12 = 48  పవిత్ర దినాలు --12  శుద్ద ఏకాదశులు+ 12 బహుళ ఏకాదశులు + 12 పూర్ణిమలు + 12 అమావాస్యలు సంవత్సరములో ,
5 * 12 =  60 వ్యక్తి షష్టి పూర్తి చేసుకోవలసిన కాలము (మనుమడు పుట్టి ఉండాల్సిన కాలము ),
6 * 12 = 72 వ్యక్తి సప్తతి పూర్తి (70 నిండిన ) కాలము (మునిమనుమడు పుట్టి ఉండాల్సిన కాలము),
7 * 12 = 84 సహస్ర  చంద్రులని (సహస్ర చంద్ర దర్శన) చూచించినందుకు గుర్తుగా చేసుకునే ఉత్సవ కాలము ,
8 * 12 = 96 శతమానోత్సవము (నూరు సంవత్సరాలు దాదాపు గా జీవించినందుకు )చేసుకునే పండగ ,
9 * 12 = 108 ఆధ్యాత్మిక  ఉన్నతులు జీవించే కాలము ,
10 * 12 =120 వ్యక్తి ఉండే పూర్ణ ఆయుష్య కాలము జ్యోతిషం ప్రకారము నూట ఇరవై సంవత్సరాలు ,
----------మానవును జీవితం లో జ్యోతిషం ప్రకారము దశలు -- రవిదశ 6 సం.లు ,చంద్రదశ -10 సం.లు , కుజ -7, రాహు 18, గురు -16, శని -19, బుధ -17 , కేతు -7, శుక్ర -20 (మొత్తము 120 సం.లు),

  • courtesy with : Dr. Mylavarapu Srinivasarao.
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, August 03, 2015

పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

జవాబు: మనిషిలాంటి వెన్నెముక గల జీవుల శ్రవణేంద్రియంలో బాహ్య చెవి (తలకు చెరో పక్క డొప్పలా ఉండేవి), మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి. ఇందులో కర్ణభేరి అనే పలుచని పొరపై పడిన ధ్వని తరంగాలను మధ్య చెవిలో ఉండే మాలియస్‌, అంకస్‌, స్టెవీన్‌ అనే చిన్న ఎముకలు లోపలి చెవికి చేరవేస్తాయి. కొన్ని జీవులలో 'కర్ణస్తంభిక' అనే ఎముక కర్ణభేరిని లోపలి చెవితో కలుపుతుంది.

పాముల విషయానికి వస్తే, వాటికి బాహ్యచెవులు, కర్ణభేరి ఉండవు. కాని లోపల చెవి ఉంటుంది. కర్ణస్తంభిక ఒక వైపు పాము లోపలి చెవికి అనుసంధానమై ఉంటే, మరో వైపు చర్మానికి కలిపి ఉంటుంది. పాము చర్మం నేలకు తాకి ఉండటం వల్ల నేలలో పయనించే ధ్వని తరంగాలను మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి అందజేయగలుగుతుంది.

గాలిలో పయనించే ధ్వని తరంగాలు పాముకు ఏ మాత్రం వినబడవు. ఆ రకంగా అది 'పుట్టు చెవిటిదనే' చెప్పుకోవచ్చు. మరి నాగ స్వరం వూదుతుంటే పాము ఎందుకు తలాడిస్తుందంటే?నాగ స్వరం వూదే ముందు పాములవాడు చేతితో నేలను చరుస్తాడు. ఆ శబ్ద తరంగాలు పాము చర్మం ద్వారా లోపలి చెవికి చేరి పాము పడగ విప్పుతుంది. ఆ తర్వాత నాగ స్వరాన్ని వూదుతున్న బూరాని చూస్తూ దాన్ని ఎటుకేసి తిప్పితే అటు పడగ ఆడిస్తుంది. బూరాను కాటు వేయాలనే ఉద్దేశంతోనే తప్ప, సంగీతానికి మైమరచి మాత్రం కాదు. బూరా బదులు ఒక గుడ్డను చేతితో ఆడించినా పాము ఆలానే తలాడిస్తుంది.

  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, August 01, 2015

ఫ్రిజ్‌ తలుపు తెరిస్తే గది చల్లబడుతుందా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లోని వస్తువులు చల్లబడతాయి కదా. మరి రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?

జవాబు: రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లో ఉండే కండెన్సర్‌లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్‌లో గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్‌ తలుపును తీసి ఉంచితే ఈ వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

జవాబు: మనతోపాటు జీవులన్నింటిలో జీవానికి కారణమైన ఎన్నో రసాయనాలున్నాయి. అందులో ప్రోటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఎంజైములలో నత్రజని బాగా ఉంటుంది. కొన్ని ఎంజైములలో గంధకం కూడా ఉంటుంది. మనిషి తదితర జీవులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గాలిలోను, నీటిలోను, మట్టిలోను వివిధ రకాలయిన జీవులున్నాయి. అందులో బాక్టీరియాలు కూడా ఉన్నాయి. చాలా మటుకు బాక్టీరియాలు పరాన్నజీవులు. వాటికి సొంతంగా ఆహారం సముపార్జించుకొనే శక్తి లేదు. కేవలం ఇతర జీవ కణాల్లో ఉన్న పోషక పదార్థాల్ని రసాయనికంగా మార్పిడి చేసి తమకనుకూలమైన రూపంలోకి తెచ్చుకొంటాయి. ఆ క్రమంలో కొన్ని వృథారసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు మనం కలప దుంగల నుంచి డైనింగ్‌ టేబుల్‌, కుర్చీ వంటి పరికరాల్ని తయారుచేసుకునే క్రమంలో దుంగలో ఉన్న కర్ర మొత్తాన్ని వాడము కదా! కొంత వృథాగా చెక్క ముక్కల ద్వారా వెళ్లిపోతుంది కదా. అలాగే పరాన్న జీవులయిన బాక్టీరియాలు మృత దేహాల మీద దాడి చేసినపడు ఆ శరీరంలో ఉన్న వివిధ రసాయనాల్ని అవి తమకనుకూల రీతిలో మార్చుకొనే క్రమంలో దుర్గంధాన్ని ఇచ్చే గంధక పదార్థాలు, ఫాస్ఫరస్‌ పదార్థాలు, నత్రజనీ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే మనకు దుర్గంధాన్ని కల్గిస్తాయి. మన ప్రాణమున్నంత వరకు ఈ బాక్టీరియాల దాడిని అరికట్టేలా మనలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. మరణం తర్వాత రక్షణ వ్యవస్థ ఉండదు. కాబట్టి బాక్టీరియాల ఆటలకు హద్దూ పద్దూ ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • =============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-

చేపల వినలేవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చేపలు మూగవేకాక, వినికిడి శక్తి కూడా లేనివని అంటారు నిజమేనా?

జవాబు: చేపలు శబ్దాలు చేయలేవని, వినలేవనే విషయాలు నిజం కాదు. అవి ఒక దానితో మరొకటి క్లిక్‌, క్లిక్‌ అనే శబ్దాలతోనూ, బొంగురుపోయిన గుర్‌, గుర్‌ అనే శబ్దాలతోను సంకేతాలు పంపించుకుంటాయి. మగ చేపలు గాలిని నింపుకునే సంచుల చుట్టూ ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి. ఈ కండరాలను కుంచించడం ద్వారా అవి డ్రమ్ములను వాయించినపుడు వచ్చే శబ్దాలను అతి తక్కువ తీవ్రతలో ఉత్పన్నం చేయగలవు. చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలనుకుంటే, గాలిని పీల్చుకుని ఆ గాలిని వ్యర్థ పదార్థాలను విసర్జించే మార్గం ద్వారా వెలువరిస్తూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు 1.7 నుంచి 2.2 కిలో హెర్ట్జ్‌ పౌనఃపున్యం ఉండే శబ్దాలను వెలువరించగలవు. ఒక్కో శబ్దాన్ని 8 సెకండ్ల వరకు పట్టి ఉంచగలవు. అలా శబ్దాలు చేయగల శక్తి గల చేపలకు వినికిడి శక్తి ఉండటం సహజం. అవి గాలిని నింపుకొనే సంచికి అనుసంధానమై ఉండే లోపలి చెవి ద్వారా వినగలవు. ఆ చెవి శబ్దాలు వినడంలో కర్ణభేరి లాగా పనిచేస్తుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: కరెంటు బొగ్గు నుంచీ.నీటి నుంచే తయారు చేస్తారు కానీ వేరే సాధనాల నుంచి ఎందుకు తయారు చేయరు?

జవాబు: కరెంటు లేదా విద్యుచ్ఛక్తిని బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మార్చుకోవడం ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తారు. ఆనకట్టల దగ్గర ఎత్తులో నిల్వ ఉన్న నీటిలోని స్థితి శక్తిని విద్యుచ్ఛక్తిగా జల విద్యుత్‌ కేంద్రాలలో ఉత్పత్తి చేస్తారు. ఇలా శక్తిని ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడానికి వీలున్న అన్ని విధానాలలోను విద్యుచ్ఛక్తిని తయారు చేయగలం. ఉష్ణ విద్యుత్తు, జల విద్యుత్తే కాకుండా సౌర ఘటాల్లో సూర్యుని కాంతిలో ఉన్న కాంతి శక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది. పెద్ద పెద్ద పర్వత శ్రేణుల వాలు మీద అమర్చిన పంఖాల్లాంటి పరికరాల ద్వారా వీచే గాలిలో ఉన్న గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా వాయు యంత్రాలలో మారుస్తున్నాం. సముద్రపు అలలలో ఉండే గతిశక్తిని విద్యుచ్ఛక్తిగా తరంగ యంత్రాలలో ఉత్పత్తి చేస్తున్నాం. భూమి పొరల్లో వివిధ ఉష్ణోగ్రతల తేడాల వల్ల సిద్ధించిన ఉష్ణశక్తిని భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విద్యుచ్ఛక్తిగా మార్చుకొంటున్నాం. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లలో దాగున్న రసాయనిక శక్తిని ఇంధన ఘటాల్లో విద్యుచ్ఛక్తిగా మార్చుకొని వాడుకొంటున్నారు. ఇలా ఎన్నో రూపాల్లో ఉన్న శక్తిని విద్యుచ్ఛక్తిగా వాడుతూనే ఉన్నాం. అయితే మన అవసరాలను ఎక్కువగా తీర్చేది బొగ్గు, జల విద్యుత్తే.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

జవాబు: 'దానిని ఉపయోగించు, లేకపోతే అది మొద్దుబారి ఎందుకూ పనికి రాకుండా పోతుంది' అనే మాట మెదడు విషయంలో ఎంతో నిజం. మనో వైజ్ఞానికుల ప్రకారం, వయసు మళ్లే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనే విషయం నిజం కాదు. సమస్యల్లా వయసు పెరిగే కొద్దీ పెద్దలు మానసికంగా సోమరులైపోతారు. వారి రోజువారీ చర్యలు రొటీన్‌గా మారడంతో మేథా సంపత్తిని పెంచుకునే చర్యలు చేపట్టకుండా రోజంతా టీవీ చూడటం, ఒకే రకం వార్తా పత్రికలు చదవడం,

ఆరోగ్య సమస్యల గురించి అనవసరంగా దిగులు పడటం లాంటి వ్యాపకాలతో గడుపుతుంటారు. దాంతో మెదడుకు సరైన వ్యాయామం లేక మొద్దుబారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వివిధ సబ్జెక్టులలో ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనం, చదరంగం, క్యారమ్స్‌ లాంటి ఆటలు ఆడటం, క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ పూరించడం లాంటివి చేయాలి. ఇవి కూడా ఒకే విధంగా మూసగా ఉండకుండా చూసుకోవాలి. వయసు మళ్లే కొలదీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త భాషలు నేర్చుకోవడం, ఇష్టమైన సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి. దాంతో మెదడు ఉత్తేజం పొంది, ఆలోచనా శక్తి తగ్గిపోకుండా ఉంటుంది.

మన భూమి తప్ప వేరే గ్రహాల మీద చెట్లను పెంచవచ్చా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మన భూమి తప్ప వేరే గ్రహాల మీద చెట్లను పెంచవచ్చా?

జవాబు: భూమ్మీద కూడా బండరాళ్ల మీద, ఎడారుల్లో, అగ్ని పర్వతాల మీద మొక్కలను పెంచలేము. దీనర్థం ఏంటంటే చెట్లు లేదా ఏ జీవ జాతులు బతకాలన్నా తగిన విధంగా ఆ ప్రాంతాలు భౌతిక రసాయనిక పరిస్థితులు కలిగుండాలి. భూమ్మీద ఉండే ఉష్ణోగ్రత, వాతావరణం, నేల రసాయనిక సంఘటనం, సౌరకాంతి తీవ్రత అనువుగా ఉండడం వల్ల పొలాల్లో పంటలు, అడవుల్లో చెట్లు, మైదానాల్లో గడ్డి పెరుగుతున్నాయి. ఇంతగా జీవానికి, వృక్షాల పెరుగుదలకు అనువైన ప్రదేశాలు మన సౌర మండలంలో భూమి మినహా మరే చోటా లేవు. అందుకే సరాసరి ఇతర సౌరమండల గ్రహాల్లో చెట్లను పెంచలేము.

ఈ విశాల విశ్వంలో ఎక్కడోచోట తప్పకుండా భూమిలాంటి వాతావరణ పరిస్థితులు, నేల పరిస్థితులు ఉంటాయనీ అక్కడ కూడా జీవం ఉద్భవించే అవకాశాలు ఉంటాయనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి స్థావరాల ఉనికి కోసం అమెరికా వాళ్ల నాసా సంస్థ సెటి (SETI: Search for extra terrestrial intelligence) ఉపసంఘం ద్వారా అన్వేషణ సాగిస్తోంది. చంద్రోపరితలం, అంగారక ఉపరితలంపై ప్రత్యేకంగా హరిత గృహాల్ని నిర్మించి అక్కడే సరియైన పరిస్థితుల్ని కల్పిస్తే అక్కడ కొన్ని రకాల చెట్లను పెంచడం అసాధ్యం కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నల్లని తల వెంట్రుకలు తెల్లవారేటప్పటికి తెల్లబడతాయా?

జవాబు: వెంట్రుకల రంగు పెరిగే వెంట్రుకలలో, వెంట్రుకల మూలాలలోకి చొప్పించిన వర్ణకాల (పిగ్మెంట్‌ల)పై ఆధారపడి ఉంటుంది. వయసుతో పాటు వెంట్రుకలలో ఉండే 'మెలానిన్‌' అనే నల్లని పదార్థ ఉత్పత్తి నెమ్మదించడంతో, వెంట్రుకలు వాటి కుదళ్ల దగ్గర నుంచి తెల్లబడటం ఆరంభిస్తాయి. వెంట్రుకల పొడవునా వాటి మధ్య భాగంలో ఏర్పడే అతి చిన్న గాలి బుడగలు కూడా వెంట్రుకలు తెల్లగా కనిపించేటట్లు చేస్తాయి. వెంట్రుకలు వాటిలో ఉండే పిగ్మెంట్లను ఉన్నట్లుండి తటాలున కోల్పోవు కాబట్టి, అవి తెల్లవారికల్లా తెల్లబడే ప్రమాదం లేదు.

మధ్య వయసులోని వ్యక్తుల తలల్లో పిగ్మెంట్‌ కలిగి ఉండే వెంట్రుకలు, తెల్లబడి నెరిసిన వెంట్రుకలతో పాటు పెరుగుతుంటాయి. ఏదైనా వ్యాధి సోకి రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో, పిగ్మెంట్‌తో నల్లగా ఉండే తల వెంట్రుకలు అతి త్వరగా రాలిపోయి, తెల్లని వెంట్రుకలు మాత్రమే మిగులుతాయి. వారి విషయంలో తల వెంట్రుకలు ఉన్నట్లుండి తెల్లబడిపోయాయనే అపోహ కలుగుతుంది. మానసికమైన ఒత్తిళ్ల వల్ల తల వెంట్రుకలు తెల్లబడతాయనే విషయంలో శాస్త్రీయ ఆధారాలు అంతగా లేవు. నాడీ మండల, రోగ నిరోధక వ్యవస్థల మధ్య సంబంధం ఉండటంతో ఆ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు

  • =================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- /

మనుషుల రూపు రేఖల్లో తేడాలెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:అందరిలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఒకే విధంగా ఉన్నా మనుషుల రూపు రేఖల్లో ఎందుకు తేడాలుంటున్నాయి?

జవాబు: మానవుడిలో 23 జతల క్రోమోజోములున్నాయి. ప్రతి క్రోమోజోములో డీఎన్‌ఏ పేలికలుంటాయి. ప్రతి డీఎన్‌ఏ పేలికలో న్యూక్లియోటైడులనే విడివిడి రసాయనిక భాగాలు దండలో పూసల్లా ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడు పూసలో ఓ నత్రజని క్షారం, ఓ చక్కెర ధాతువు, ఓ ఫాస్ఫేటు సంధానం ఉంటాయి. చక్కెర ధాతువు, ఫాస్ఫేటు భాగం ప్రతి న్యూక్లియోటైడులో ఒకే విధంగా ఉన్నా నత్రజని క్షారాల వరస క్రమం ఒకే విధంగా ఉండదు. చాలామటుకు సామ్యంగానే ఉన్నా అక్కడక్కడా తేడాలుంటాయి. ఈ తేడాలున్న భాగాలే మనుషుల్లో వ్యత్యాసాలకు ప్రధాన కారణమవుతాయి. సాధారణ వరుస క్రమం మనిషిలో సాధారణ విషయాల్ని (తల, ఆకలి, హార్మోన్లు, అవయవాలు మొదలయిన స్థూల రూపాల్ని) నిర్దేశించగా విశిష్టతను ఈ తేడా భాగాలే నిర్దేశిస్తాయి. ఇలా విడివిడి జీవుల్లో విడివిడి వరుస క్రమాలు, డీఎన్‌ఏ పేలికల సంఖ్యలుంటాయి. వీటినే జన్యువులు అంటారు. మనుషుల్లో అక్కడక్కడ జన్యువుల్లో తేడాలుండడం వల్లే రూపురేఖల్లో తేడా!

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q: అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

జవాబు: పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డపుడు అందులో కొన్ని వర్ణాల కాంతుల్ని ఆ పదార్థాలు శోషించుకుంటాయి. మిగిలిన కాంతి పరావర్తనం, వితరణం ద్వారా వివిధ దిశల్లో వెలువడుతుంది. ఇలా వెలువడే కాంతి ఏ రంగులో ఉంటుందో అదే రంగు ఆ వస్తువుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏయే పదార్థాలు, ఏయే కాంతుల్ని శోషించుకుంటాయి, ఏయే వర్ణాల్ని త్యజిస్తాయి అన్న విషయం ఆయా పదార్థాల రసాయనిక సంఘటనం మీద ఆధారపడుతుంది. అన్ని గ్రహాల ఉపరితలాల, లేదా ఆయా గ్రహాల వాతావరణాలు ఒకే విధమైన రసాయనిక సంఘటనతో లేవు. కాబట్టి సౌర కాంతి వాటి మీద పడ్డపుడు అవి త్యజించే కాంతి ఏ వర్ణానిదన్న విషయం ఆయా గ్రహపు ఉపరితల రసాయనిక సంఘటనను బట్టి ఉంటుంది. ఆ పద్ధతిలో భూమి లేత నీలి రంగులో (మేఘాలు, సముద్రాల వల్ల), అంగారక గ్రహం నారింజ ఎరుపు రంగులో (అక్కడున్న ఐరన్‌ఆక్సైడ్‌ వల్ల), బృహస్పతి లేత పసుపు రంగులో (గంధక పదార్థం వల్ల), శని లేత నారింజ రంగులో (అమోనియా తదితర గంధక పదార్థాల వల్ల), యురేనస్‌, నెప్ట్యూన్లు లేత నీలం రంగులో (మీథేన్‌ వాయువు వల్ల) కనిపిస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)