- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లోని వస్తువులు చల్లబడతాయి కదా. మరి రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?
జవాబు: రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్ అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజరెంట్' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్ తిరిగి ఫ్రిజ్‌లో ఉండే కండెన్సర్‌లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్‌లో గ్రహించిన వేడి ఫ్రిజ్ వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్ తలుపును తీసి ఉంచితే ఈ వేడి ఫ్రిజ్ వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...