ప్రశ్న: చేపలు మూగవేకాక, వినికిడి శక్తి కూడా లేనివని అంటారు నిజమేనా?
జవాబు: చేపలు శబ్దాలు చేయలేవని, వినలేవనే విషయాలు నిజం కాదు. అవి ఒక దానితో మరొకటి క్లిక్, క్లిక్ అనే శబ్దాలతోనూ, బొంగురుపోయిన గుర్, గుర్ అనే శబ్దాలతోను సంకేతాలు పంపించుకుంటాయి. మగ చేపలు గాలిని నింపుకునే సంచుల చుట్టూ ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి. ఈ కండరాలను కుంచించడం ద్వారా అవి డ్రమ్ములను వాయించినపుడు వచ్చే శబ్దాలను అతి తక్కువ తీవ్రతలో ఉత్పన్నం చేయగలవు. చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలనుకుంటే, గాలిని పీల్చుకుని ఆ గాలిని వ్యర్థ పదార్థాలను విసర్జించే మార్గం ద్వారా వెలువరిస్తూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు 1.7 నుంచి 2.2 కిలో హెర్ట్జ్ పౌనఃపున్యం ఉండే శబ్దాలను వెలువరించగలవు. ఒక్కో శబ్దాన్ని 8 సెకండ్ల వరకు పట్టి ఉంచగలవు. అలా శబ్దాలు చేయగల శక్తి గల చేపలకు వినికిడి శక్తి ఉండటం సహజం. అవి గాలిని నింపుకొనే సంచికి అనుసంధానమై ఉండే లోపలి చెవి ద్వారా వినగలవు. ఆ చెవి శబ్దాలు వినడంలో కర్ణభేరి లాగా పనిచేస్తుంది.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...