Saturday, August 01, 2015

మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: మెదడును మనం సరిగా ఉపయోగించకపోతే ఆలోచనా శక్తి తగ్గిపోతుందా?

జవాబు: 'దానిని ఉపయోగించు, లేకపోతే అది మొద్దుబారి ఎందుకూ పనికి రాకుండా పోతుంది' అనే మాట మెదడు విషయంలో ఎంతో నిజం. మనో వైజ్ఞానికుల ప్రకారం, వయసు మళ్లే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనే విషయం నిజం కాదు. సమస్యల్లా వయసు పెరిగే కొద్దీ పెద్దలు మానసికంగా సోమరులైపోతారు. వారి రోజువారీ చర్యలు రొటీన్‌గా మారడంతో మేథా సంపత్తిని పెంచుకునే చర్యలు చేపట్టకుండా రోజంతా టీవీ చూడటం, ఒకే రకం వార్తా పత్రికలు చదవడం,

ఆరోగ్య సమస్యల గురించి అనవసరంగా దిగులు పడటం లాంటి వ్యాపకాలతో గడుపుతుంటారు. దాంతో మెదడుకు సరైన వ్యాయామం లేక మొద్దుబారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వివిధ సబ్జెక్టులలో ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనం, చదరంగం, క్యారమ్స్‌ లాంటి ఆటలు ఆడటం, క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ పూరించడం లాంటివి చేయాలి. ఇవి కూడా ఒకే విధంగా మూసగా ఉండకుండా చూసుకోవాలి. వయసు మళ్లే కొలదీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త భాషలు నేర్చుకోవడం, ఇష్టమైన సంగీతం వినడం అలవాటు చేసుకోవాలి. దాంతో మెదడు ఉత్తేజం పొంది, ఆలోచనా శక్తి తగ్గిపోకుండా ఉంటుంది.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...