Saturday, August 01, 2015

అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







Q: అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

జవాబు: పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డపుడు అందులో కొన్ని వర్ణాల కాంతుల్ని ఆ పదార్థాలు శోషించుకుంటాయి. మిగిలిన కాంతి పరావర్తనం, వితరణం ద్వారా వివిధ దిశల్లో వెలువడుతుంది. ఇలా వెలువడే కాంతి ఏ రంగులో ఉంటుందో అదే రంగు ఆ వస్తువుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏయే పదార్థాలు, ఏయే కాంతుల్ని శోషించుకుంటాయి, ఏయే వర్ణాల్ని త్యజిస్తాయి అన్న విషయం ఆయా పదార్థాల రసాయనిక సంఘటనం మీద ఆధారపడుతుంది. అన్ని గ్రహాల ఉపరితలాల, లేదా ఆయా గ్రహాల వాతావరణాలు ఒకే విధమైన రసాయనిక సంఘటనతో లేవు. కాబట్టి సౌర కాంతి వాటి మీద పడ్డపుడు అవి త్యజించే కాంతి ఏ వర్ణానిదన్న విషయం ఆయా గ్రహపు ఉపరితల రసాయనిక సంఘటనను బట్టి ఉంటుంది. ఆ పద్ధతిలో భూమి లేత నీలి రంగులో (మేఘాలు, సముద్రాల వల్ల), అంగారక గ్రహం నారింజ ఎరుపు రంగులో (అక్కడున్న ఐరన్‌ఆక్సైడ్‌ వల్ల), బృహస్పతి లేత పసుపు రంగులో (గంధక పదార్థం వల్ల), శని లేత నారింజ రంగులో (అమోనియా తదితర గంధక పదార్థాల వల్ల), యురేనస్‌, నెప్ట్యూన్లు లేత నీలం రంగులో (మీథేన్‌ వాయువు వల్ల) కనిపిస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)


No comments:

Post a Comment

your comment is important to improve this blog...