Saturday, August 01, 2015

మనుషుల రూపు రేఖల్లో తేడాలెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...









ప్రశ్న:అందరిలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఒకే విధంగా ఉన్నా మనుషుల రూపు రేఖల్లో ఎందుకు తేడాలుంటున్నాయి?

జవాబు: మానవుడిలో 23 జతల క్రోమోజోములున్నాయి. ప్రతి క్రోమోజోములో డీఎన్‌ఏ పేలికలుంటాయి. ప్రతి డీఎన్‌ఏ పేలికలో న్యూక్లియోటైడులనే విడివిడి రసాయనిక భాగాలు దండలో పూసల్లా ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడు పూసలో ఓ నత్రజని క్షారం, ఓ చక్కెర ధాతువు, ఓ ఫాస్ఫేటు సంధానం ఉంటాయి. చక్కెర ధాతువు, ఫాస్ఫేటు భాగం ప్రతి న్యూక్లియోటైడులో ఒకే విధంగా ఉన్నా నత్రజని క్షారాల వరస క్రమం ఒకే విధంగా ఉండదు. చాలామటుకు సామ్యంగానే ఉన్నా అక్కడక్కడా తేడాలుంటాయి. ఈ తేడాలున్న భాగాలే మనుషుల్లో వ్యత్యాసాలకు ప్రధాన కారణమవుతాయి. సాధారణ వరుస క్రమం మనిషిలో సాధారణ విషయాల్ని (తల, ఆకలి, హార్మోన్లు, అవయవాలు మొదలయిన స్థూల రూపాల్ని) నిర్దేశించగా విశిష్టతను ఈ తేడా భాగాలే నిర్దేశిస్తాయి. ఇలా విడివిడి జీవుల్లో విడివిడి వరుస క్రమాలు, డీఎన్‌ఏ పేలికల సంఖ్యలుంటాయి. వీటినే జన్యువులు అంటారు. మనుషుల్లో అక్కడక్కడ జన్యువుల్లో తేడాలుండడం వల్లే రూపురేఖల్లో తేడా!

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...