Tuesday, April 15, 2014

What is Puranam and how many are they?,పురాణమంటే ఏమిటి ఎన్ని ఉన్నాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q :What is Puranam and how many are they?,పురాణమంటే ఏమిటి ఎన్ని ఉన్నాయి?

Ans : వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంత మేర కష్టమే . శృతులు ఆధారంగా, స్మృతులను మహర్షులు మనకు అందజేశారు. ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలిక గా గ్రహించడానికి కథల రూపంలో, వివరణాత్మకంగా, ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు.

మనకు తెలిసీ తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి. ఉదాహరణకు పుణ్య తీర్థ-క్షేత్రాల మాహాత్మ్య జ్ఞానం, సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు, పండుగలు వాటి కారణాలు, మనము నిత్యమూ పఠీంచే స్తోత్రాలు-సహస్రనామాలు వంటివి. కానీ ఇక్కడ మనము గ్రహించ వలసిన విషయం ఒకటుంది. మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల వంటివి పురాణాలు కావు. “రామాయణ,” “మహాభారతాలు” ఇతిహాసాలు. కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా, ఇతిహాసాలు ఒకానొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి. ఉదాహరణకు రామాయణం సకలగుణాభిరాముడైన శ్రీరామ చంద్రుని జీవిత చరిత్ర. శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియూ విశేషాలు, రామాయణంలో ప్రస్తావించబడ్డాయి.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని. అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే!

  • 1)  పద్మపురాణం (హృదయం).
  • 2) వామన పురాణం (చర్మం ).
  • 3) భాగవత పురాణం--తొడలు .
  • 4) మత్స్యపురాణం--మెదడు .
  • 5) కూర్మపురాణం--పృష్ణభాగం .
  • 6) వరాహ పురాణం--కుడికాలు చీలమండ .
  • 7) నారదపురాణం --బొడ్డు .
  • 8. స్కందపురాణం--వెంట్రుకలు.
  • 9) శివపురాణం--ఎడమ భుజం .
  • 10) విష్ణుపురాణం--కుడి భుజం .
  • 11) అగ్నిపురాణం-- ఎడమపాదం.
  • 12) మార్కండేయ పురాణం--కుడిపాదం .
  • 13)  భవిష్య --కుడిమోకాలు,
  • 14) బ్రహ్మ పురాణం,
  • 15) బ్రహ్మవైవర్త పురాణం,
  • 16) బ్రహ్మాండ పురాణం.
  • 17) లింగ పురాణం.
  • 18) గరుడ పురాణం.

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...