Tuesday, October 28, 2014

How do we measure purity of milk?,పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

జ :  పాల స్వచ్ఛతను కొలిచే సాధనాన్ని లాక్టో మీటర్‌ అంటారు. ఇది సిలిండర్‌ ఆకారంలో ఉంటుంది. ఒక అంచును బల్బులా ఉండే కొద్దిగా సన్నపాటి ట్యూబ్‌తో ఊదుతారు. ఈ ట్యూబ్‌ రెండో వైపు మూసి ఉంటుంది. దాని పైన ఎం, డబ్ల్యు అనే అక్షరాలు వాటి మధ్య 1, 2, 3, 4 అంకెలు ఉంటాయి. ఈ ట్యూబ్‌ను పాలు ఉన్న సీసాలో ముంచుతారు. దీని పాయింటర్‌ పైకి తేలితే స్వచ్ఛమైన పాలుగా గుర్తిస్తారు.స్వచ్ఛమైన పాలు బరువుగా ఉంటాయి. తర్వాత దీన్ని నీటిలో ముంచుతారు. అపుడు నీటిలో సమాంతరంగా ఉండకుండా డబ్ల్యూ వైపు మొగ్గితే పాలలో నీరు ఉన్నట్టు స్పష్టమవుతుంది. పాలలో పాలు, నీటిశాతం వివరంగా తెలుసుకోవడానికి ట్యూబ్‌పై ఉన్న అంకెలను పరిశీలిస్తారు. పాలలో ముంచినపుడు పాలసీసాలో ఈ ట్యూబ్‌ 'ఎం' దాటి మునిగితే .. అంటే 3 అంకె వరకూ మునిగితే పాలల్లో 75శాతం పాలు స్వచ్ఛమైనవిగా గుర్తిస్తారు. అదే 2 లేదా 1కి స్థాయి చేరితే పాలు స్వచ్ఛమైనవి కాదని నీరు కలిసినట్టుగా గుర్తిస్తారు. లాక్టో మీటర్‌ ను తరచూ ఉపయోగిస్తూ వుంటారు గానీ దీన్ని ఆధారంగా చేసుకుని పాల స్వచ్ఛతను నమ్మడం అనేది అంతగా ఉండదు. సాధారణ పాలు కంటే స్కిమ్‌డు  పాలు ఎక్కువ బరువుగా ఉంటాయి. వీటి విషయంలో స్వచ్ఛతను ఈ పరికరం స్పష్టం చేయలేదు.

  • =======================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...