ప్రశ్న: గ్లాసులో ఐస్‌వాటర్ పోస్తే గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడతాయి. ఎందువల్ల?
జవాబు: అతిచల్లగా ఉండే ఐస్‌వాటర్‌ను గ్లాసులో పోసినపుడు ఆ గ్లాసు బయట కనిపించే బిందువులు గాలిలోని నీటి ఆవిరి వల్ల ఏర్పడినవి. గ్లాసులో ఉన్న ఐస్‌వాటర్ వల్ల గ్లాసు లోపలి భాగమే కాకుండా దాని ఉపరితలం కూడా చల్లబడుతుంది. ఆ చల్లని ఉపరితలాన్ని గ్లాసు చుట్టూ ఉన్న గాలి తాకినపుడు ఆ గాలిలో ఉండే నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటి బిందువులు గ్లాసు ఉపరితలాన్ని అంటుకొని ఉంటాయి.
కారులో వెళ్తునప్పుడు వర్షం వచ్చినా ఈ విషయం గమనించవచ్చు. మూసి ఉన్న గాజు తలుపుల మీద చల్లని వర్షం నీరు పడటంతో కారు లోపలివైపు ఉన్న గాజు తలుపుల పై కూడా నీటి బిందువులు ఏర్పడతాయి. కారులో ఉన్న గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించడమే ఇందుకు కారణం.
- - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...