ప్రశ్న: మంట ఎలా మండుతుంది?
జవాబు: మంట లేక అగ్నిజ్వాల అంటే పదార్థాల కలయిక వల్ల జరిగే రసాయనిక, భౌతిక మార్పులు. ఈ ప్రక్రియలో పదార్థాలు ఉష్ణ, కాంతి శక్తులతోపాటు పొగ, బూడిదలు కూడా విడుదలవుతాయి. విద్యుత్ తీగలపై ఉండే ప్లాస్టిక్ తొడుగులో ఉత్పన్నమయ్యే మంటలోనైనా, నూనె లాంటి పదార్థాల్లో ఏర్పడే మంటలోనైనా, మామూలుగా ఇంట్లోని పొయ్యిలో కట్టెలు, బొగ్గులతో ఏర్పడే మంటలోనయినా వాటికి కావలసిన ముఖ్యమైన అంశాలు మండే స్వభావం గల పదార్థం, ఆక్సిజన్, ఉష్ణాన్ని ఉత్పన్నం చేసే మీట. వీటిలో ఏ అంశం లేక పోయినా మంట ఏర్పడదు. ఈ సూత్రం పైనే మంటలు మండకుండా ఆర్పుతారు. మంటలార్పాలంటే వాటికి అందే ఆక్సిజన్‌ను తీసివేయాలి. మండే స్వభావం గల పదార్థాన్ని తొలగించాలి.
మండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకు కొయ్య, ప్లాస్టిక్(ఘన), నూనె(ద్రవ), హైడ్రొజన్లు(వాయు), ఉష్ణోగ్రతల విలువలు అత్యధికంగా ఉంటే, ఇనుములాంటి లోహాలు కూడా మండుతాయి. మంటకు కావలసిన ఆక్సిజన్ వాతావరణంలోని గాలి అందిస్తుంది. మంటను రాజేయడానికి కావలసిన శక్తి పదార్థాల మధ్య ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యే నిప్పు కణాల నుంచి, మెరుపుల నుంచి అందించవచ్చు.
- - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...