ప్రశ్న: న్యూస్ పేపర్‌ను అడ్డంగా చించడం కంటే నిలువుగా చించడం తేలిక. ఎందుకని?
జవాబు: కాగితం తయారీలో వాడే గుజ్జు రూపంలో ఉండే పీచు, నార, ఖనిజాల వడపోతను మొదటగా ఒక బల్లపై పోస్తారు. ఆ బల్ల ఉపరితలంపై కృత్రిమ పదార్థంతో తయారుచేసిన బోలగా ఉండే తీగ ఒకటుంటుంది. అది యంత్ర సహాయంతో బల్లపై అతి వేగంగా ఒక చివర నుంచి మరో చివరకు తిరుగుతూ ఉంటుంది. బల్లపై పోసిన గుజ్జు తీగ కదలిక వల్ల సన్నని పొరలాగా సమంగా పరుచుకొంటుంది. ఈ పొరపై వేడిగా ఉన్న స్తూపాకారపు రోలర్లను దొర్లించడం ద్వారా ఒత్తిడిని కలుగ జేయడంతో ఆ పొర గట్టిపడి పొడిగా ఉండే సన్నని కాగితంలా తయారవుతుంది.
గుజ్జులాంటి ద్రవాన్ని కొంత ఎత్తులో ఉన్న ఫ్లోబాక్స్ ద్వారా బల్లపై వేగంగా కదిలే తీగపై పోయడం వల్ల ఆ గుజ్జులో స్తూపాకారంలో ఉండే పదార్థాల పోగులు తీగ కదిలే దిశలోకే సమంగా పరుచుకొంటాయి. ఈ దిశను యంత్ర దిశ అంటారు. కాగితం పటిష్టత దాని తయారీలో వాడే పదార్థాలు అమరిన దిశపై ఆధారపడి ఉంటుంది. కాగితంలో ఉండే పదార్థాలు యంత్ర దిశలోకే అమరి ఉండడం వల్ల ఈ దిశలో కాగితాన్ని తేలికగా చించవచ్చు. ఈ దిశకు అడ్డంగా ఉండే దిశలో కాగితంలోని పదార్థాలు పక్కలకు ఉండడంతో చించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాగితం తయారీలో ఎక్కువశాతం ఖనిజాలకన్నా తేలికైన పీచు, నారను వాడడం వల్ల పుస్తకాలను ముద్రించే కాగితాలకంటే సులభంగా యంత్ర దిశలో చించవచ్చు.
- - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...