ప్రశ్న: భూమధ్య రేఖ వద్ద ఇతర భూ ప్రాంతాలలో ఉన్నట్లు రుతువులు ఉంటాయా?
జవాబు: భూమధ్య రేఖ అంటే భూమి ఉపరితలంపై దాని మధ్య భాగం చుట్టూ 40,075 కిలోమీటర్ల పొడవున ఉండే ఒక వూహారేఖ. ఈ ప్రాంతంలో రుతువుల మధ్య తేడాలు చాలా స్వల్పంగా ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగి ఉన్నా దాని ప్రభావం భూమధ్య రేఖ ప్రాంతంలో అంతగా ఉండదు. భూమిపై ఇతర ప్రాంతాల్లో రుతువులు ఏర్పడడానికి కారణం భూ కక్ష్య కొంచెంగా వంగి ఉండడమే. భూమధ్య రేఖ దరిదాపుల్లో, ఆరేఖ నుంచి దూరంగా పోయేకొలదీ ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో మాత్రమే కొంచెం తేడా ఉంటుంది.
సూర్యుని నుంచి వెలువడే వికిరణశక్తి (radiation)భూమధ్య రేఖ ఉండే ప్రాంతంలో ఎక్కువ పరిమాణంలో చేరడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు, సంవత్సరమంతా ఎక్కువగా ఉంటాయి. వేడిగా ఉండే ప్రదేశాల్లో వాతావరణ పీడనం (ఒత్తిడి) తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ పీడనం ఉండే భూమధ్యరేఖ ప్రదేశాల్లో మధ్నాహ్న వేళల్లో ఉరుములతో కూడిన తుపానులు సంభవిస్తూ ఉంటాయి. భూమి ఉత్తరార్థ భాగంలో భూద్రవ్యరాశి ఎక్కువగా కేంద్రీకృతమై ఉండడంతో ఆ భాగంలో దక్షిణార్థ భాగంలో కన్నా ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా భూమద్యరేఖ ప్రాంతంలో రుతువులు అంటూ ఏమీ ఉండవు.
- - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...