Thursday, March 12, 2015

We stopTV switch during thunder-ఉరుములొస్తే టీవీ కట్టేస్తారేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  

ప్రశ్న: ఆకాశంలో మెరుపులు, ఉరుములు వస్తున్నపుడు టీవీని ఆపు చేస్తుంటారు, ఎందుకు?

జవాబు: ఆకాశంలో నీటి ఆవిరి, మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఒకదానినొకటి ఒరుసుకోవడం వల్ల అధిక ఓల్టేజీ, కరెంటు విలువలతో కూడిన విద్యుచ్ఛక్తి ఉత్పన్నం అవడం వల్ల మెరుపులు, ఉరుములు వస్తాయి. వాటి నుంచి వెలువడి భూమి వైపు పయనించే విద్యుత్‌ తరంగాలు, భూమిపై మనం ఏర్పరుచుకున్న విద్యుత్‌ లైన్లను, టీవీ ఏంటినాలను తాకుతాయి. వాటి నుంచి వాటికి అనుసంధానించిన టీవీ లాంటి పరికరాల్లోకి ఎక్కువ ఓల్టేజీలో ఉండే విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే కాలం అతి తక్కువైనా, తక్కువ ఓల్టేజీ విద్యుత్‌ ప్రవహించే ఏర్పాటుతో తయారు చేసిన ఆ పరికరాల్లోని భాగాలు పాడవుతాయి. అందువల్ల మెరుపులు, ఉరుములు వచ్చేటపుడు టీవీలాంటి పరికరాల్ని కట్టేయడం మంచిది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...