Sunday, February 20, 2011

What is the history of visiting card, విజిటింగ్ కార్డ్ చరిత్ర ఏమిటి?ఎవరినైనా కలవడానికి ఆఫీసుల్లోకి వెళ్ళగానే గుమ్మం దగ్గరుండే వ్యక్తి వేసే ప్రశ్న ' మీ విజిటింగ్ కార్డ్ ' ఇవ్వండి అని . తన పేరు , హోదా , అడ్రసు వగైరాలు రాసి ఉండే ఆ కార్డ్ చేతిలో ఇమిడేటంత చిన్నదే అయినా విజిటింగ్ కార్డ్ కి ఉన్న ఆ శక్తి మాత్రము ప్రత్యేకమైనది .

ఈ విజిటింగ్ కార్డ్ సంప్రదాయము 15 వ శతాబ్దములో మొదలైంది అని చరిత్ర చెపుతోంది . ఆ రోజుల్లో జమిందారులు , రాజవంశస్థులు తాము ఒక ప్రదేశానికి వెళ్ళే ముందు తమ పేరు , హోదా , అడ్రసు వగైరాలు వ్రాసి ఉన్న పత్రం ఒకటి అక్కడకి దూతకిచ్చి పంపేవారు . అది చూసి అవతలివారు ... వస్తున్న వారి హోదాకి తగిన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది . . . అంటే ఉన్నత హోదాలో ఉన్నవారు తమ కింద స్థాయి వారికి తమ రాకగురించి తెలియజెప్పేందుకు పుట్టిందీ కార్డ్ . ఎవరైతే వస్తున్నారో వారి సమాచారము తెచ్చేకార్డ్ కాబట్టే దాన్ని విజిటింగ్ కార్డ్ అన్నారు . తరువాత విజిటింగ్ కార్డ్ అందరికీ సంబంధించిన అవసర వస్తువుగా మారింది . అయితే దీనిని పెద్దలు చిన్నవారికి పంపడం ఆగిపోయి , కిందిస్థాయి వారు పైస్థాయి వారికి తాము వచ్చిన విషయం తెలియజెప్పే సందేశ సమాచార పత్రం గా మారింది . ప్రస్తుతం విజిటింగ్ కార్డ్ చిన్నాలేదు .. పెద్దాలేదు ... ఎవరిని ఎవరు సందర్శించినా ఇచ్చి పుచ్చుకునే కాగితం ముక్క అయిపోయినది . అడ్రస్ ను పోన్‌ నెంబర్ ను ఇచ్చిపుచ్చుకునే కార్డ్ ముక్క అయిపోయినది ... ఒక ఫ్యాషన్‌ గా మారిపోయినది .
విజిటింగ్ కార్డ్ లక్షణాలు :

రూపము : సాధారణము గా కార్డ్ లు దీర్ఘచతురస్రాకారము లో ఉంటాయి. ప్రత్యేకమైన రూపము అంటూ ఏమీ లేదు . ఎవరికి నచ్చిన ఆకారము లో వారు ప్రింట్ చేసుకోవచ్చును . అయితే అందరికీ అమోదయోగ్యమైన రూపముంటే బాగుంటుంది. కొంతమంచి అండాకారము , గుండ్రము గా ఉన్నవి ఇస్టపడతారు మనిషికో బుద్ధి .

పరిమాణము : చేతిలో ఇమిడి ఉండే సైజు లో ఉంటే మనసుకి ఇంపుగా ఉంటుంది . అందరూ అమోదించే సైజు 3'' * 2'' లేదా 3 1/2'' * 2 1/2'' . కార్డ్ పైన ఉండే సమాచారము క్లుప్తము గా (simple ) ఉంటే బాగుంటుంది .

రంగు : ఏ రంగు కార్డ్ స్పస్టము గా అందరినీ ఆకర్షిస్తుందో చెప్పడం కస్టము . అందుకే యూనివర్సల్ రంగైన తెలుపు ను ఎక్కువ మంది వాడుతారు .

ముద్రణ : బడ్జెట్ కి తగ్గట్టు గా అక్షరాలు పలు రకాల మెటీరియల్ తోను , డిజైన్‌ లతోను , విభిన్న మందాలతోను ముద్రించవచ్చును . ఇప్పుడిప్పుడు క్లాత్ మీద , టిన్‌ మీద ముద్రించిన కార్డులు కూడా వాడుతున్నరు . అక్షరాలు గజి బిజి గా అర్ధం కాని విదంగా ఉండకూడదు .

సమాచారము : కార్డ్ చూడగానే ఒక అంచనా ఇచ్చేది గా ఉండాలి కార్డ్ మీద సమాచారము . ఆ సమాచారము స్పస్టము గా , క్లుప్తం గా ఉండాలి . చాట భారతం అంత మేటరు ఉంటే చదివేందుకు విసుగు వస్తుంది . ఉన్నా పోన్‌ నెంబర్లూ ముద్రించకుండా ముఖ్యమైన ఒక నెంబర్ ఉంటే బాగుంతుంది . పేరు , హోదా, కంపెనీ పేరు అడ్రస్ , పోన్‌, వెబ్ సైట్ , ఇమెయిల్ ఉండాలి .

కంపెనీ చిహ్నము - ఫొటో : తక్షణ గుర్తింపుకోసం కంపెనీ లోగో , తన ఫొటో సింపుల్ గా ఉంటే ... ఎంతో బాగుంటుంది .

భాష : విజిటింగ్ కార్డులు ఫలానా భాషలో ఉండలనేదేమీ లేదు . సాదారణం గా అందిరికీ అమోదయోగ్యం , ఎక్కడికెళ్ళినా ఉపయోగపడేదిగా ఉండేందుకు ఇంగ్లిష్ లో ఉంటే బాగుంటుంది .


  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...