ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: విమానాలు వెనక్కు వెళ్తాయా? విమానాలు వెనక్కు ప్రయాణించగలవా?
సా*ధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు? అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్ (పైకి ఎగరడం) కోసం ఉన్న చోటు నుంచి వెనక్కు పోలేకపోవడంతో వాటిని ట్రాక్టరు లాంటి భారీ యంత్రం వెనక్కు లాగుతుంది. విమానాలు ప్రయాణించే యంత్రాంగంలో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు.. గాలిని పీల్చుకొని దహన వాయువుల్ని అధిక పీడన వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. అయితే యుద్ధ విమానాల్లో ఇంజన్లను అటూఇటూ తిప్పే వ్యవస్థ ఉండటం వల్ల అవి ఎటైనా వెళ్లగలవు. హెలికాఫ్టర్లు కూడా ఏ వైపైనా వెళ్లగలవు. *
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, /నిట్, వరంగల్; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)
===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
your comment is important to improve this blog...