ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ఛీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా?
డ్రింక్స్ తాగేటప్పుడు ఛీర్స్ కొట్టుకుంటారు. అయితే డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాకించి ఛీర్స్ చెప్పుకోడం ఇప్పుడైతే సెలబ్రిటీల సింబల్. కానీ అది ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా. మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు ఈ సంప్రదాయానికి ఆద్యులు. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవిపై దిగేవారు.
అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం.
అలా చేసేప్పుడు వారు ‘ఛీర్స్’ అనుకునేవారు. అంటే చావు భయం వద్దు… ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావన. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్ చెప్పుకునే సంప్రదాయం మొదట బ్రిటన్‌లోకి, ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మన దాకా చేరింది. ఇలా కొన్ని వల సంవత్సరాల నుంచి ఈ ఛీర్స్ సంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది.
Courtesy with : Andhravilas.net
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...