Saturday, September 13, 2014

భూమి నుంచి మార్స్‌(అంగారకుడు)కు పయనించడానికి ఎంత కాలం పడుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: భూమి నుంచి మార్స్‌కు పయనించడానికి ఎంత కాలం పడుతుంది?

జవాబు: ప్రస్తుతం మన శాస్త్రజ్ఞులు ప్రయోగిస్తున్న రాకెట్‌ల ద్వారా మనకు సమీపాన ఉన్న మార్స్‌ (అంగారకగ్రహం) చేరుకోవడానికి 6 నుంచి 7 నెలల కాలం పడుతుంది. అదీ రాకెట్‌ను ప్రయోగించేటపుడు మార్స్‌, భూమి సరైన సమలేఖనం (alignment) లో ఉంటేనే. ఈ కారణంగానే మార్స్‌కు మానవసహిత రాకెట్‌ను పంపడానికి కొంత సమస్య ఎదురవుతూ ఉంది. ఈ సమస్యను అధిగమించి మార్స్‌ను మానవుడు చేరుకున్నా, మరల తిరిగి రావడానికి ఈ సమలేఖనం మళ్లీ ఏర్పడాలంటే, ఆ గ్రహంపై మరో 18 నెలలపాటు వేచి ఉండాలి.

అంటే మార్స్‌కు మానవసహిత రాకెట్‌ను ప్రయోగించి తిరిగి భూమికి చేర్చడానికి కనీసం రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. ఈ ప్రయాణకాలాన్ని శక్తిమంతమైన న్యూక్లియర్‌ ఇంజన్‌ను వాడటం ద్వారా కొంత మేర అంటే రెండు నెలల వరకు తగ్గించవచ్చు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...